Tuesday, June 6, 2023

నేటి మంచి మాటలో కొన్ని ఆణిముత్యాలు

 నేటి మంచి మాటలో కొన్ని ఆణిముత్యాలు

*ఎదుగుదల అనేది నిశ్శబ్దంగా జరుగుతుంది..* *అదే వినాశనం జరిగేటప్పుడు భారీ శబ్దాలు వస్తాయి.. ఎలా అంటే విత్తనం* *మొలకేత్తేటప్పుడు నిశబ్దం గా ఉంటుంది..* *అదే చెట్టుగా మారి కూలేటప్పుడు పెద్ద శబ్దం వస్తుంది..మన ఎదుగుదల కూడా నిశ్శబ్దం గానే ఉంటుంది..*
 *అదే ఏదైనా ప్రమాదం జరిగితే జరిగే పరిణామం కూడా చాలా దారుణంగానే ఉంటుంది..
 
*మనం పనిచేస్తే తప్ప గొప్పతనాన్ని సాధించలేము.కఠోరమైన పరిశ్రమ లేకుండా కలలు ఎన్నటికీ నిజం కావు.ఒళ్ళు దగ్గర పెట్టుకుని, కష్టపడి పనిచేయడం వల్లనే పనులు జరుగుతాయి, లక్ష్యాలు సాధించబడతాయి.నిద్రపోతున్న సింహం నోటిలో జింకవచ్చి దూరదు కదా! స్వప్రయత్నం ద్వారానే మనం అనుకున్నవి సాధించగలుగుతాము.* 

 *మేధావి ఒక శాతం పుట్టుకతో వచ్చిన ప్రేరణతోనూ, తొంభైతొమ్మిది శాతం చెమటోడ్చి పని చెయ్యడం ద్వారానే తయారవుతారు కాబట్టి కష్టే ఫలిః...* 
                                      
*అర్ధం కాలేదు...అనే స్థితి నుండి.అర్ధం అయ్యింది.అనే స్థితికి ఎదగడం విజ్ఞానం.* 
*అర్ధం అయ్యింది.*అనే స్థితి నుంచి.అర్ధం కాలేదు అనే స్థితికి ఎదగడం జ్ఞానం. తెలియనితనం అనేది అజ్ఞానం కాదు. అదే శుద్ధజ్ఞానం.*

 *అక్కడ తెలియడానికి ఏమీ ఉండదు.ఆ శుద్ధ తెలియనితనమే- శిశుత్వం, ఋషిత్వం, దైవత్వం.*                            

*మీరు గతంలో జీవించ టం మరియు ఇతరులను గమనించడం ఆపేస్తే ఇక మీ ఆనందాన్ని మీ నుండి ఎవరూ వేరు చేయలేరు..* 

 అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment