Tuesday, October 31, 2023

ప్రశాంత స్థితిలో ఉన్న మనస్సు

 🌺 Amritham Gamaya 🌺

Calm down; thats the immediate need. Let all agonies settle. The mind in the state of calmness manifests the power of its potence to let things happen the way you wish things to happen. - SathChith

అమృతం గమయ

శాంతించు; అది నీ తక్షణ అవసరం. అన్ని వేదనలు ఉపశమింపచేసుకో. ప్రశాంత స్థితిలో ఉన్న మనస్సు, మీరు జరగాలని కోరుకునే విధంగా విషయాలను జరిగేలా చేయగల శక్తిని కలిగి ఉంటుంది. - సత్‌చిత్

अमृतम् गमय

शांत हो जाओ; यह तक्षण जरूरत है।  सभी आगमों को बसने दो। शांत स्थिति में मन अपने सामर्थ्य की शक्ति को प्रकट करता है कि जो चीजों को आप जिस तरह से होना चाहते हैं, उसी तरह से होने की- सतचित ।

Monday, October 30, 2023

అణుశక్తిమాన్! భారత అణు పితామహుడు.....

 💐💐అణుశక్తిమాన్!
భారత అణు పితామహుడు.....
హోమీ జహంగీర్ భాభా  గారి జయంతి సందర్భంగా💐💐

 ##జవహర్‌లాల్ నెహ్రూకు భాభా అత్యంత సన్నిహితుడు. భాభాను నెహ్రూ ‘సోదరా’ అని పిలిచేవారు##

#ముంబైలోని రెండు గంభీరమైన సంస్థలు... టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్, భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ లతో ముడివడివున్న సాధుశీల అణుభౌతిక నామం... హోమీ జహంగీర్ భాభా.
 ఈ పేరులోని ‘హోమీ’కి పార్శీ భావం ‘#కాంకరర్ ఆఫ్ ది వరల్డ్’. #జగద్విజేత!

అయితే ఆయనెప్పుడూ తన దేశాన్నే ముందు వరుసలో ఉంచాలనుకున్నారు తప్ప అణు పితామహుడిగా ఎదగాలన్న ధ్యాసతో లేరు.
 పితామహుడన్నది ఈ దేశం గౌరవసూచకంగా ఆయనకు పెట్టుకున్న పేరు.

1966 జనవరి 24న హోమీ భాభా ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం 101 ఫ్రాన్స్‌లోని మాంట్ బ్లాంక్‌లో కుప్పకూలిపోకుండా ఉన్నట్లయితే, కొద్ది గంటల తర్వాత భారతీయ అణు కార్యక్రమంపై వియన్నా సమావేశంలో అతడు సమర్పించబోతున్న కీలకమైన పత్రాలను ఆయన తీసుకు వెళ్లగలిగి ఉంటే... ఏమో, #అంతర్జాతీయ అణుశక్తి రంగంలో భారత్ జగద్విజేతగా నిలిచి ఉండేదేమో!  
దురదృష్టం. ఆ ప్రమాదంలో హోమీ భాభా మరణించారు. భాభా స్థాపించి, డెరైక్టర్‌గా ఉన్న పై రెండు సంస్థలు ప్రస్తుతం భారతీయ అణుసామర్థ్య అభివృద్ధిలో ఆయన ఆశయాలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేస్తున్నాయి. భాభా ఆశయం అణుశక్తి మాత్రమే కాదు. అణుశాంతి కూడా!
 
నేర్చుకోవడం, దేశానికి సేవ చేయడం అన్నవి పారంపర్య సంప్రదాయంగా ఉన్న సంపన్న కుటుంబంలో 1909 అక్టోబర్ 30న జన్మించారు హోమీ జహంగీర్ భాభా. తండ్రి జహంగీర్ హార్‌ముస్జీ భాభా. ప్రసిద్ధ న్యాయవాది. తల్లి మెహరిన్. ప్రాథమిక, ప్రాథమికోన్నత, కళాశాల విద్యాభ్యాసాలు ముంబైలో పూర్తయ్యాక, మెకానికల్ ఇంజినీరింగ్‌లో అధ్యయనానికి కేంబ్రిడ్జి వెళ్లారు హోమీ. సెలవులకు ఆయన ఇండియా వచ్చేనాటికి రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు దట్టంగా అలుముకుని ఉన్నాయి. ఇక ఇక్కడే ఉండిపోయి.

బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ సైన్స్‌లో ఫిజిక్స్ రీడర్‌గా చేరారు. అప్పుడా సంస్థకు నేతృత్వం వహిస్తున్నది నోబెల్ గ్రహీత సీవీ రామన్. ఆయన ఆధ్వర్యంలో హోమీ అణుశాస్త్రానికి సంబంధించి కాస్మిక్ కిరణాలపై కీలకమైన పరిశోధనలు, ప్రయోగాలు చేశారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించారు.  భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో ఉన్న సాన్నిహిత్యం వల్ల భారత అణు, అంతరిక్ష కార్యక్రమాలను రూపొందించడానికి అవసరమైన ప్రభుత్వ సహకారాన్ని తీసుకోగలిగారు.

అది 1974 మే 18. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ప్రాంతంలో శాస్త్రవేత్తలు ఓ పరీక్ష నిర్వహించారు. విజయవంతమైన ఆ ప్రయోగం, ప్రపంచంలో న్యూక్లియర్‌ పరిశోధనలు జరిపే దేశాల సరసన భారత్‌ను నిలిపింది. ఆనాటి విజయానికి ఎన్నో ఏళ్ల ముందే బాటలు పరిచిన వ్యక్తిగా, 'భారత #పరమాణు విధానానికి పితామహుడి'గా హోమీ జె. భాభా పేరొందారు. ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది

 
భాభా బ్రహ్మచారి. పెళ్లెందుకు చేసుకోలేదని చనువున్న వారెవరైనా అడిగితే ఆయన చిరునవ్వు నవ్వేవారు. ‘‘భౌతికశాస్త్రంలోని #సృజనాత్మకతతో నా వివాహం బాల్యంలోనే జరిగిపోయింది’’ అనేవారు. అణుశక్తి రంగంలో అపారమైన, అమూల్యమైన సేవలను అందించారు హోమీ భాభా.

అణు కార్యక్రమాలకు కావలసిన #యూరేనియమ్ అనే ఇంధనం భారతదేంలో అంతగా లభించదు. కాబట్టి, దానికి ప్రత్యామ్నాయంగా థోరియం అనే ఇంధనాన్ని ఉపయోగించి అణుశక్తి ద్వారా విద్యుత్పత్తి చేసే కార్యక్రమాన్ని ఆనాడే బాబా రూపకల్పన చేశాడు.
నేడు #భారతీయులందరూ గర్వించగలిగే అణుశాస్త్రవిజ్ఞానంలో ముందంజ వేయటానికి కారణం హోమీ బాబా స్ఫూర్తి అని ఆయనతో కలిసి పనిచేసిన మన మాజీరాష్ట్రపతి కలాం గారి అభిప్రాయం.

#ట్రాంబేలోని అణుశక్తి కేంద్రం పేరును అతని గౌరవార్థంగా భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌ గా మార్చారు.

 . అతని మరణం తరువాత, అతని గౌరవార్థంగా అటామిక్ ఎనర్జీ స్థాపనను #భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌గా మార్చారు. భాభా ఎలక్ట్రానిక్స్, అంతరిక్షశాస్త్రం, రేడియా ఖగోళశాస్త్రం మరియు సూక్ష్మజీవశాస్త్రంలో పరిశోధనను కూడా ప్రోత్సహించాడు. 

    ఊటీ, భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన రేడియా టెలిస్కోప్ అతని సంకల్పమే. ఇది 1970లో వాస్తవంగా ఆరంభించబడింది. భాభా అప్పటి నుంచి "భారతదేశం యెుక్క అణుశక్తి కార్యక్రమమునకు పితామహుడిగా" ఉన్నాడు. హోమీ భాభా ఫెలోషిప్ కౌన్సిల్ 1967 నుండి ఫెలోషిప్ లను అందిస్తోంది, ఇతర గుర్తింపు పొందిన సంస్థలలో డీమ్డ్ విశ్వవిద్యాలయం హోమీ భాభా నేషనల్ ఇన్స్టిట్యూట్ మరియు హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్, ముంబాయి, భారతదేశం ఉన్నాయి.

**భారత అణు కార్యక్రమ పితామహుడిగా గుర్తింపు పొందిన శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభాకు #సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, పుస్తకాలంటే కూడా ఇష్టం.
హోమీ జహంగీర్ భాభా
ఫొటో క్యాప్షన్,
పేరొందిన శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ తన సహచర శాస్త్రవేత్తల్ని ఎక్కువగా పొగిడేవారు కాదు. కానీ, హోమీ భాభాను ఆయన ‘భారత #లియోనార్డో డావిన్సీ’ అని పిలిచేవారు.

**టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ప్రతి బుధవారం అకడెమిక్ కాంగ్రెస్ జరిగేది. ఏ ఒక్క సమావేశానికీ ఆయన గైర్హాజరయ్యేవారు కాదు. ఇందులోనే చాలామందిని ఆయన కలుసుకునేవారు. ఏం జరుగుతోంది? ఏం జరగటం లేదు? అనేవి తెలుసుకునేవారు’ అని యశ్‌పాల్ చెప్పారు.

*కేవలం ఇద్దర్ని మాత్రమే #నెహ్రూ ‘సోదరా’ అని పిలిచేవారు. అందులో ఒకరు జయప్రకాశ్ నారాయణ్ కాగా మరొకరు #భాభా’ **

**టాటా ఇన్‌స్టిట్యూట్‌లో ఒక #గార్డెన్ ఉంది. దాని పేరు అమీబా గార్డెన్. దీన్ని రూపొందించింది, మొత్తం ఇన్‌స్టిట్యూట్ పచ్చగా, అందంగా ఉండేలా చేసిందీ భాభాయే.

**ఈ #ప్రపంచంలో నేను కలిసిన ముగ్గురు గొప్ప వ్యక్తుల్లో హోమీ భాభా ఒకరు. మిగతా ఇద్దరు జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ‌’ అని భాభాకు శ్రద్ధాంజలి ఘటిస్తూ #జేఆర్‌డీ టాటా అన్నారు.
🙏💐🌹🌺🌷💐🙏
Collected by
Dr.A.Srinivasa Reddy
9912731022
Zphs 75Tyalluru Pedakurapadu mandal Palanadu district.
 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *𝐈 𝐚𝐬𝐤𝐞𝐝 𝐨𝐧𝐞 𝐨𝐟 𝐦𝐲 𝐟𝐫𝐢𝐞𝐧𝐝𝐬 𝐰𝐡𝐨 𝐡𝐚𝐬 𝐜𝐫𝐨𝐬𝐬𝐞𝐝 𝟔𝟎 & 𝐢𝐬 𝐡𝐞𝐚𝐝𝐢𝐧𝐠 𝐭𝐨 𝟕𝟎*
*𝐖𝐡𝐚𝐭 𝐬𝐨𝐫𝐭 𝐨𝐟 𝐜𝐡𝐚𝐧𝐠𝐞 𝐡𝐞 𝐢𝐬 𝐟𝐞𝐞𝐥𝐢𝐧𝐠 𝐢𝐧 𝐡𝐢𝐦?*
💕 *𝐇𝐞 𝐬𝐞𝐧𝐭 𝐦𝐞 𝐭𝐡𝐞 𝐟𝐨𝐥𝐥𝐨𝐰𝐢𝐧𝐠 𝐯𝐞𝐫𝐲 𝐢𝐧𝐭𝐞𝐫𝐞𝐬𝐭𝐢𝐧𝐠 𝐥𝐢𝐧𝐞𝐬, 𝐰𝐡𝐢𝐜𝐡 𝐢 𝐰𝐨𝐮𝐥𝐝 𝐥𝐢𝐤𝐞 𝐭𝐨 𝐬𝐡𝐚𝐫𝐞 𝐰𝐢𝐭𝐡 𝐲𝐨𝐮 𝐚𝐥𝐥..*
💕 *~𝐀𝐟𝐭𝐞𝐫 𝐥𝐨𝐯𝐢𝐧𝐠 𝐦𝐲 𝐩𝐚𝐫𝐞𝐧𝐭𝐬, 𝐦𝐲 𝐬𝐢𝐛𝐥𝐢𝐧𝐠𝐬, 𝐦𝐲 𝐬𝐩𝐨𝐮𝐬𝐞, 𝐦𝐲 𝐜𝐡𝐢𝐥𝐝𝐫𝐞𝐧, 𝐦𝐲 𝐟𝐫𝐢𝐞𝐧𝐝𝐬, 𝐧𝐨𝐰 𝐈 𝐡𝐚𝐯𝐞 𝐬𝐭𝐚𝐫𝐭𝐞𝐝 𝐥𝐨𝐯𝐢𝐧𝐠  𝐦𝐲𝐬𝐞𝐥𝐟.*
💕 *~𝐈 𝐣𝐮𝐬𝐭 𝐫𝐞𝐚𝐥𝐢𝐬𝐞𝐝 𝐭𝐡𝐚𝐭 𝐈 𝐚𝐦 𝐧𝐨𝐭*
     *“𝐀𝐭𝐥𝐚𝐬”.*
     *𝐓𝐡𝐞 𝐰𝐨𝐫𝐥𝐝 𝐝𝐨𝐞𝐬 𝐧𝐨𝐭 𝐫𝐞𝐬𝐭 𝐨𝐧*
      *𝐦𝐲 𝐬𝐡𝐨𝐮𝐥𝐝𝐞𝐫𝐬.*
💕 *~𝐈 𝐧𝐨𝐰 𝐬𝐭𝐨𝐩𝐩𝐞𝐝 𝐛𝐚𝐫𝐠𝐚𝐢𝐧𝐢𝐧𝐠 𝐰𝐢𝐭𝐡 𝐯𝐞𝐠𝐞𝐭𝐚𝐛𝐥𝐞𝐬 & 𝐟𝐫𝐮𝐢𝐭𝐬 𝐯𝐞𝐧𝐝𝐨𝐫𝐬. 𝐀𝐟𝐭𝐞𝐫 𝐚𝐥𝐥, 𝐚 𝐟𝐞𝐰 𝐑𝐮𝐩𝐞𝐞𝐬 𝐦𝐨𝐫𝐞 𝐢𝐬 𝐧𝐨𝐭 𝐠𝐨𝐢𝐧𝐠 𝐭𝐨 𝐛𝐮𝐫𝐧 𝐚 𝐡𝐨𝐥𝐞 𝐢𝐧 𝐦𝐲 𝐩𝐨𝐜𝐤𝐞𝐭 𝐛𝐮𝐭 𝐢𝐭 𝐦𝐢𝐠𝐡𝐭 𝐡𝐞𝐥𝐩 𝐭𝐡𝐞 𝐩𝐨𝐨𝐫 𝐟𝐞𝐥𝐥𝐨𝐰 𝐬𝐚𝐯𝐞 𝐟𝐨𝐫 𝐡𝐢𝐬  𝐝𝐚𝐮𝐠𝐡𝐭𝐞𝐫’𝐬 𝐬𝐜𝐡𝐨𝐨𝐥 𝐟𝐞𝐞𝐬.*
💕 *~𝐈 𝐩𝐚𝐲 𝐭𝐡𝐞 𝐭𝐚𝐱𝐢 𝐝𝐫𝐢𝐯𝐞𝐫 𝐰𝐢𝐭𝐡𝐨𝐮𝐭 𝐰𝐚𝐢𝐭𝐢𝐧𝐠 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐜𝐡𝐚𝐧𝐠𝐞. 𝐓𝐡𝐞 𝐞𝐱𝐭𝐫𝐚 𝐦𝐨𝐧𝐞𝐲 𝐦𝐢𝐠𝐡𝐭 𝐛𝐫𝐢𝐧𝐠 𝐚 𝐬𝐦𝐢𝐥𝐞 𝐨𝐧 𝐡𝐢𝐬 𝐟𝐚𝐜𝐞. 𝐀𝐟𝐭𝐞𝐫 𝐚𝐥𝐥 𝐡𝐞 𝐢𝐬 𝐭𝐨𝐢𝐥𝐢𝐧𝐠 𝐦𝐮𝐜𝐡 𝐡𝐚𝐫𝐝𝐞𝐫 𝐟𝐨𝐫 𝐚 𝐥𝐢𝐯𝐢𝐧𝐠 𝐭𝐡𝐚𝐧 𝐦𝐞.*

💕 *~𝐈 𝐬𝐭𝐨𝐩𝐩𝐞𝐝 𝐭𝐞𝐥𝐥𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐞𝐥𝐝𝐞𝐫𝐥𝐲 𝐭𝐡𝐚𝐭 𝐭𝐡𝐞𝐲'𝐯𝐞 𝐚𝐥𝐫𝐞𝐚𝐝𝐲 𝐧𝐚𝐫𝐫𝐚𝐭𝐞𝐝 𝐭𝐡𝐚𝐭 𝐬𝐭𝐨𝐫𝐲 𝐦𝐚𝐧𝐲 𝐭𝐢𝐦𝐞𝐬. 𝐀𝐟𝐭𝐞𝐫 𝐚𝐥𝐥, 𝐭𝐡𝐞 𝐬𝐭𝐨𝐫𝐲 𝐦𝐚𝐤𝐞𝐬 𝐭𝐡𝐞𝐦 𝐰𝐚𝐥𝐤 𝐝𝐨𝐰𝐧 𝐭𝐡𝐞 𝐦𝐞𝐦𝐨𝐫𝐲 𝐥𝐚𝐧𝐞 & 𝐫𝐞𝐥𝐢𝐯𝐞 𝐭𝐡𝐞 𝐩𝐚𝐬𝐭.*
💕 *~𝐈 𝐡𝐚𝐯𝐞 𝐥𝐞𝐚𝐫𝐧𝐭 𝐧𝐨𝐭 𝐭𝐨 𝐜𝐨𝐫𝐫𝐞𝐜𝐭 𝐩𝐞𝐨𝐩𝐥𝐞 𝐞𝐯𝐞𝐧 𝐰𝐡𝐞𝐧 𝐈 𝐤𝐧𝐨𝐰 𝐭𝐡𝐞𝐲 𝐚𝐫𝐞 𝐰𝐫𝐨𝐧𝐠. 𝐀𝐟𝐭𝐞𝐫 𝐚𝐥𝐥, 𝐭𝐡𝐞 𝐨𝐧𝐮𝐬 𝐨𝐟 𝐦𝐚𝐤𝐢𝐧𝐠 𝐞𝐯𝐞𝐫𝐲𝐨𝐧𝐞 𝐩𝐞𝐫𝐟𝐞𝐜𝐭 𝐢𝐬 𝐧𝐨𝐭 𝐨𝐧 𝐦𝐞. 𝐏𝐞𝐚𝐜𝐞 𝐢𝐬 𝐦𝐨𝐫𝐞 𝐩𝐫𝐞𝐜𝐢𝐨𝐮𝐬 𝐭𝐡𝐚𝐧 𝐩𝐞𝐫𝐟𝐞𝐜𝐭𝐢𝐨𝐧.*
💕 *~𝐈 𝐠𝐢𝐯𝐞 𝐜𝐨𝐦𝐩𝐥𝐢𝐦𝐞𝐧𝐭𝐬 𝐟𝐫𝐞𝐞𝐥𝐲 & 𝐠𝐞𝐧𝐞𝐫𝐨𝐮𝐬𝐥𝐲. 𝐀𝐟𝐭𝐞𝐫 𝐚𝐥𝐥 𝐢𝐭'𝐬 𝐚 𝐦𝐨𝐨𝐝 𝐞𝐧𝐡𝐚𝐧𝐜𝐞𝐫 𝐧𝐨𝐭 𝐨𝐧𝐥𝐲 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐫𝐞𝐜𝐢𝐩𝐢𝐞𝐧𝐭, 𝐛𝐮𝐭 𝐚𝐥𝐬𝐨 𝐟𝐨𝐫 𝐦𝐞*
💕 *~𝐈 𝐡𝐚𝐯𝐞 𝐥𝐞𝐚𝐫𝐧𝐭 𝐧𝐨𝐭 𝐭𝐨 𝐛𝐨𝐭𝐡𝐞𝐫 𝐚𝐛𝐨𝐮𝐭 𝐚 𝐜𝐫𝐞𝐚𝐬𝐞 𝐨𝐫 𝐚 𝐬𝐩𝐨𝐭 𝐨𝐧 𝐦𝐲 𝐬𝐡𝐢𝐫𝐭. 𝐀𝐟𝐭𝐞𝐫 𝐚𝐥𝐥, 𝐩𝐞𝐫𝐬𝐨𝐧𝐚𝐥𝐢𝐭𝐲 𝐬𝐩𝐞𝐚𝐤𝐬 𝐥𝐨𝐮𝐝𝐞𝐫 𝐭𝐡𝐚𝐧 𝐚𝐩𝐩𝐞𝐚𝐫𝐚𝐧𝐜𝐞𝐬.*
💕 *~𝐈 𝐰𝐚𝐥𝐤 𝐚𝐰𝐚𝐲 𝐟𝐫𝐨𝐦 𝐩𝐞𝐨𝐩𝐥𝐞 𝐰𝐡𝐨 𝐝𝐨𝐧'𝐭 𝐯𝐚𝐥𝐮𝐞 𝐦𝐞. 𝐀𝐟𝐭𝐞𝐫 𝐚𝐥𝐥, 𝐭𝐡𝐞𝐲 𝐦𝐢𝐠𝐡𝐭 𝐧𝐨𝐭 𝐤𝐧𝐨𝐰 𝐦𝐲 𝐰𝐨𝐫𝐭𝐡, 𝐛𝐮𝐭 𝐈 𝐝𝐨.*
💕 *~𝐈 𝐫𝐞𝐦𝐚𝐢𝐧 𝐜𝐨𝐨𝐥 𝐰𝐡𝐞𝐧 𝐬𝐨𝐦𝐞𝐨𝐧𝐞 𝐩𝐥𝐚𝐲𝐬 𝐝𝐢𝐫𝐭𝐲 𝐩𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐬 𝐭𝐨 𝐨𝐮𝐭𝐫𝐮𝐧 𝐦𝐞 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐫𝐚𝐭 𝐫𝐚𝐜𝐞. 𝐀𝐟𝐭𝐞𝐫 𝐚𝐥𝐥, 𝐈 𝐚𝐦 𝐧𝐨𝐭 𝐚 𝐫𝐚𝐭 & 𝐧𝐞𝐢𝐭𝐡𝐞𝐫 𝐚𝐦 𝐈 𝐢𝐧 𝐚𝐧𝐲 𝐫𝐚𝐜𝐞.*
💕 *~𝐈 𝐚𝐦 𝐥𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐧𝐨𝐭 𝐭𝐨 𝐛𝐞  𝐞𝐦𝐛𝐚𝐫𝐫𝐚𝐬𝐬𝐞𝐝 𝐛𝐲 𝐦𝐲 𝐞𝐦𝐨𝐭𝐢𝐨𝐧𝐬. 𝐀𝐟𝐭𝐞𝐫 𝐚𝐥𝐥, 𝐢𝐭'𝐬 𝐦𝐲 𝐞𝐦𝐨𝐭𝐢𝐨𝐧𝐬 𝐭𝐡𝐚𝐭 𝐦𝐚𝐤𝐞 𝐦𝐞 𝐡𝐮𝐦𝐚𝐧.*
💕 *~𝐈 𝐡𝐚𝐯𝐞 𝐥𝐞𝐚𝐫𝐧𝐭 𝐭𝐡𝐚𝐭 𝐢𝐭’𝐬 𝐛𝐞𝐭𝐭𝐞𝐫 𝐭𝐨 𝐝𝐫𝐨𝐩 𝐭𝐡𝐞 𝐞𝐠𝐨 𝐭𝐡𝐚𝐧 𝐭𝐨 𝐛𝐫𝐞𝐚𝐤 𝐚 𝐫𝐞𝐥𝐚𝐭𝐢𝐨𝐧𝐬𝐡𝐢𝐩. 𝐀𝐟𝐭𝐞𝐫 𝐚𝐥𝐥, 𝐦𝐲 𝐞𝐠𝐨 𝐰𝐢𝐥𝐥 𝐤𝐞𝐞𝐩 𝐦𝐞 𝐚𝐥𝐨𝐨𝐟 𝐰𝐡𝐞𝐫𝐞𝐚𝐬 𝐰𝐢𝐭𝐡 𝐫𝐞𝐥𝐚𝐭𝐢𝐨𝐧𝐬𝐡𝐢𝐩𝐬 𝐈 𝐰𝐢𝐥𝐥 𝐧𝐞𝐯𝐞𝐫 𝐛𝐞 𝐚𝐥𝐨𝐧𝐞*.
💕 *~𝐈 𝐡𝐚𝐯𝐞 𝐥𝐞𝐚𝐫𝐧𝐭 𝐭𝐨 𝐥𝐢𝐯𝐞 𝐞𝐚𝐜𝐡 𝐝𝐚𝐲 𝐚𝐬 𝐢𝐟 𝐢𝐭'𝐬 𝐭𝐡𝐞 𝐥𝐚𝐬𝐭. 𝐀𝐟𝐭𝐞𝐫 𝐚𝐥𝐥, 𝐢𝐭 𝐦𝐢𝐠𝐡𝐭 𝐛𝐞 𝐭𝐡𝐞 𝐥𝐚𝐬𝐭.*
💕 *~𝐈 𝐚𝐦 𝐝𝐨𝐢𝐧𝐠 𝐰𝐡𝐚𝐭 𝐦𝐚𝐤𝐞𝐬 𝐦𝐞 𝐡𝐚𝐩𝐩𝐲. 𝐀𝐟𝐭𝐞𝐫 𝐚𝐥𝐥, 𝐈 𝐚𝐦 𝐫𝐞𝐬𝐩𝐨𝐧𝐬𝐢𝐛𝐥𝐞 𝐟𝐨𝐫 𝐦𝐲 𝐡𝐚𝐩𝐩𝐢𝐧𝐞𝐬𝐬, 𝐚𝐧𝐝 𝐈 𝐨𝐰𝐞 𝐢𝐭 𝐭𝐨 𝐦𝐞.*
💝 *~𝐈 𝐝𝐞𝐜𝐢𝐝𝐞𝐝 𝐭𝐨 𝐬𝐞𝐧𝐝 𝐭𝐡𝐢𝐬 𝐭𝐨 𝐦𝐚𝐧𝐲, 𝐛𝐞𝐜𝐚𝐮𝐬𝐞 𝐰𝐡𝐲 𝐝𝐨 𝐰𝐞 𝐡𝐚𝐯𝐞 𝐭𝐨 𝐰𝐚𝐢𝐭 𝐟𝐨𝐫 𝐬𝐨 𝐥𝐨𝐧𝐠, 𝐰𝐡𝐲 𝐜𝐚𝐧'𝐭 𝐰𝐞 𝐩𝐫𝐚𝐜𝐭𝐢𝐜𝐞 𝐭𝐡𝐢𝐬 𝐚𝐭 𝐚𝐧𝐲 𝐬𝐭𝐚𝐠𝐞 𝐚𝐧𝐝 𝐚𝐠𝐞...*
💞 *𝐁𝐞𝐬𝐭 𝐰𝐢𝐬𝐡𝐞𝐬 𝐟𝐨𝐫 𝐚𝐥𝐥 𝐦𝐲 𝐠𝐫𝐨𝐰𝐧-𝐮𝐩 𝐟𝐫𝐢𝐞𝐧𝐝𝐬 & 𝐫𝐞𝐥𝐚𝐭𝐢𝐯𝐞𝐬.*
Ⓒ ❤️ *ॐ श्री वेंकटेश्वराय नम:*
💕 *_~𝐒𝐫𝐞𝐞𝐫𝐚𝐦 𝐋𝐚𝐱𝐦𝐢𝐧𝐚𝐫𝐚𝐲𝐚𝐧𝐚 𝐌𝐮𝐫𝐭𝐡𝐲_*

𝑵𝒆𝒗𝒆𝒓 𝒆𝒗𝒆𝒓 𝑶𝒘𝒏 𝒂 𝑫𝒊𝒔𝒆𝒂𝒔𝒆.

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝*𝑵𝒆𝒗𝒆𝒓 𝒆𝒗𝒆𝒓 𝑶𝒘𝒏 𝒂 𝑫𝒊𝒔𝒆𝒂𝒔𝒆.*
💖*𝑳𝒐𝒕 𝒐𝒇 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒉𝒂𝒗𝒆 𝒂 𝑯𝒂𝒃𝒊𝒕 𝒐𝒇 𝒔𝒂𝒚𝒊𝒏𝒈, “𝑰 𝒂𝒎 𝑫𝒊𝒂𝒃𝒆𝒕𝒊𝒄” 𝒐𝒓 "𝑰'𝒎 𝑯𝒚𝒑𝒆𝒓𝒕𝒆𝒏𝒔𝒊𝒗𝒆" 𝒆𝒕𝒄.*
💕*𝑾𝒉𝒆𝒏 𝒚𝒐𝒖 𝒔𝒂𝒚 “𝑰 𝒂𝒎...” 𝒕𝒉𝒆𝒏 𝒚𝒐𝒖 𝑶𝒘𝒏 𝒕𝒉𝒆 𝑫𝒊𝒔𝒆𝒂𝒔𝒆, 𝒚𝒐𝒖 𝒎𝒂𝒌𝒆 𝒕𝒉𝒆 𝒅𝒊𝒔𝒆𝒂𝒔𝒆 𝒂 𝑷𝒂𝒓𝒕 𝒐𝒇 𝒀𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒇, 𝒊𝒕 𝒃𝒆𝒄𝒐𝒎𝒆𝒔 𝒚𝒐𝒖𝒓 𝑰𝒅𝒆𝒏𝒕𝒊𝒕𝒚 !*
❤️ *𝑨𝒏𝒐𝒕𝒉𝒆𝒓 𝑪𝒍𝒂𝒔𝒔𝒊𝒄 𝑬𝒙𝒂𝒎𝒑𝒍𝒆 𝒘𝒉𝒊𝒄𝒉 𝒎𝒐𝒔𝒕 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒉𝒂𝒗𝒆 𝒂 𝒉𝒂𝒃𝒊𝒕 𝒐𝒇 𝒔𝒂𝒚𝒊𝒏𝒈 𝒊𝒔, “𝑰 𝒂𝒎 𝑺𝒖𝒇𝒇𝒆𝒓𝒊𝒏𝒈 𝒇𝒓𝒐𝒎....”.*
💞*𝑻𝒉𝒊𝒔 𝒊𝒔 𝒂𝒏 𝒆𝒙𝒕𝒓𝒆𝒎𝒆𝒍𝒚 𝑯𝒂𝒓𝒎𝒇𝒖𝒍 𝑺𝒕𝒂𝒕𝒆𝒎𝒆𝒏𝒕. 𝒀𝒐𝒖 𝒂𝒓𝒆 𝒂𝒔𝒔𝒐𝒄𝒊𝒂𝒕𝒊𝒏𝒈 “𝑺𝒖𝒇𝒇𝒆𝒓𝒊𝒏𝒈” 𝒘𝒊𝒕𝒉 𝒚𝒐𝒖𝒓 𝒅𝒊𝒔𝒆𝒂𝒔𝒆.*
💓 *𝒀𝒐𝒖 𝒂𝒓𝒆 𝒄𝒐𝒏𝒔𝒕𝒂𝒏𝒕𝒍𝒚 𝑰𝒏𝒗𝒊𝒕𝒊𝒏𝒈 𝑴𝒊𝒔𝒆𝒓𝒚 𝒘𝒊𝒕𝒉 𝒊𝒕.*
❤️ *𝑾𝒉𝒂𝒕 𝒔𝒉𝒐𝒖𝒍𝒅 𝒚𝒐𝒖 𝒔𝒂𝒚? “𝑰 𝒂𝒎 𝑮𝒐𝒊𝒏𝒈 𝑻𝒉𝒓𝒐𝒖𝒈𝒉 𝒕𝒉𝒆 𝒄𝒐𝒏𝒅𝒊𝒕𝒊𝒐𝒏 𝒐𝒇 𝑫𝒊𝒂𝒃𝒆𝒕𝒆𝒔 𝒐𝒓 𝑯𝒚𝒑𝒆𝒓𝒕𝒆𝒏𝒔𝒊𝒐𝒏”.*

💕 *𝑾𝒉𝒆𝒏 𝒚𝒐𝒖 𝒔𝒂𝒚, “𝑮𝒐𝒊𝒏𝒈 𝑻𝒉𝒓𝒐𝒖𝒈𝒉 𝒕𝒉𝒆 𝒄𝒐𝒏𝒅𝒊𝒕𝒊𝒐𝒏...”*
*𝒊𝒕 𝒔𝒊𝒎𝒑𝒍𝒚 𝒎𝒆𝒂𝒏𝒔 𝒚𝒐𝒖 𝒂𝒓𝒆 𝒐𝒏 𝒂 𝑱𝒐𝒖𝒓𝒏𝒆𝒚, 𝒘𝒉𝒊𝒄𝒉 𝒆𝒗𝒆𝒏𝒕𝒖𝒂𝒍𝒍𝒚 𝒘𝒊𝒍𝒍 𝒄𝒐𝒎𝒆 𝒕𝒐 𝒂𝒏 𝑬𝒏𝒅.*
💞*𝑩𝒚 𝒂𝒅𝒅𝒊𝒏𝒈 “𝑪𝒐𝒏𝒅𝒊𝒕𝒊𝒐𝒏”, 𝒚𝒐𝒖 𝒂𝒓𝒆 𝒔𝒕𝒂𝒕𝒊𝒏𝒈 𝒕𝒉𝒂𝒕 𝒊𝒕 𝒘𝒊𝒍𝒍 𝑪𝒉𝒂𝒏𝒈𝒆.*
❤️ *𝑾𝒉𝒚 𝒊𝒔 𝒊𝒕 𝒊𝒎𝒑𝒐𝒓𝒕𝒂𝒏𝒕?𝑾𝒐𝒓𝒅𝒔 𝒉𝒂𝒗𝒆 𝑻𝒓𝒆𝒎𝒆𝒏𝒅𝒐𝒖𝒔 𝑷𝒐𝒘𝒆𝒓.*
💕 *𝑾𝒐𝒓𝒅𝒔 𝒄𝒂𝒓𝒓𝒚 𝑽𝒊𝒃𝒓𝒂𝒕𝒊𝒐𝒏. 𝑻𝒉𝒆𝒔𝒆 𝒗𝒊𝒃𝒓𝒂𝒕𝒊𝒐𝒏𝒔 𝒂𝒓𝒆 𝒅𝒊𝒓𝒆𝒄𝒕𝒍𝒚 𝒄𝒐𝒏𝒏𝒆𝒄𝒕𝒆𝒅 𝒘𝒊𝒕𝒉 𝒚𝒐𝒖𝒓 𝑺𝒖𝒃𝒄𝒐𝒏𝒔𝒄𝒊𝒐𝒖𝒔 𝑴𝒊𝒏𝒅.* *𝒀𝒐𝒖 𝒃𝒆𝒄𝒐𝒎𝒆 𝒘𝒉𝒂𝒕 𝒚𝒐𝒖 𝑺𝒂𝒚.  𝑻𝒉𝒆 𝑴𝒂𝒏𝒊𝒇𝒆𝒔𝒕𝒂𝒕𝒊𝒐𝒏 𝑶𝒄𝒄𝒖𝒓𝒔 𝒃𝒂𝒔𝒆𝒅 𝒐𝒏 𝒘𝒉𝒂𝒕 𝒚𝒐𝒖𝒓 𝑺𝒖𝒃𝒄𝒐𝒏𝒔𝒄𝒊𝒐𝒖𝒔 𝑴𝒊𝒏𝒅 𝒊𝒔 𝑭𝒆𝒅 𝑾𝒊𝒕𝒉..!*

❤️ *𝑾𝒉𝒆𝒏 𝑮𝒐𝒐𝒅/ 𝑷𝒐𝒔𝒊𝒕𝒊𝒗𝒆 𝒕𝒉𝒐𝒖𝒈𝒉𝒕𝒔, 𝑮𝒐𝒐𝒅/ 𝑷𝒐𝒔𝒊𝒕𝒊𝒗𝒆 𝒘𝒐𝒓𝒅𝒔 & 𝑮𝒐𝒐𝒅/ 𝑷𝒐𝒔𝒊𝒕𝒊𝒗𝒆 𝒅𝒆𝒆𝒅𝒔 𝒂𝒓𝒆 𝒇𝒆𝒅 𝒕𝒐 𝒕𝒉𝒆 𝒔𝒖𝒃𝒄𝒐𝒏𝒔𝒄𝒊𝒐𝒖𝒔  𝒎𝒊𝒏𝒅, 𝒊𝒕 𝑴𝒂𝒏𝒊𝒇𝒆𝒔𝒕𝒔 𝒊𝒏 𝑷𝒐𝒔𝒊𝒕𝒊𝒗𝒆 𝑶𝒄𝒄𝒖𝒓𝒆𝒏𝒄𝒆𝒔.*
💖 *𝑺𝒐, 𝒎𝒚 𝒅𝒆𝒂𝒓 𝒇𝒓𝒊𝒆𝒏𝒅𝒔, 𝑩𝒆 𝑴𝒊𝒏𝒅𝒇𝒖𝒍 𝒐𝒇 𝒘𝒉𝒂𝒕 𝒀𝒐𝒖 𝑻𝒉𝒊𝒏𝒌 & 𝒘𝒉𝒂𝒕 𝑾𝒐𝒓𝒅𝒔 𝒀𝒐𝒖 𝑺𝒑𝒆𝒂𝒌*
Ⓒ ❤️ *ॐ श्री वेंकटेश्वराय नम:*
💕 *_~𝑺𝒓𝒆𝒆𝒓𝒂𝒎 𝑳𝒂𝒙𝒎𝒊𝒏𝒂𝒓𝒂𝒚𝒂𝒏𝒂 𝑴𝒖𝒓𝒕𝒉𝒚_*

మీరు “వేడుకుంటే చాలు మాధవుడు ఆదుకుంటాడు”. భగవంతుణ్ని చూసే, చేరే, తెలుసుకునే, అవగాహన చేసుకునే మార్గాలను చూపుతుంది శ్రీమద్భాగవతం.

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝 *మీరు “వేడుకుంటే చాలు మాధవుడు ఆదుకుంటాడు”. భగవంతుణ్ని చూసే, చేరే, తెలుసుకునే, అవగాహన చేసుకునే మార్గాలను చూపుతుంది శ్రీమద్భాగవతం.* 
💖 *సంపూర్ణ శరణాగతి, వేడుకోలుల ప్రాధాన్యతనీ, శక్తినీ ఎరుక పరుస్తుంది భాగవతం. పోతన ప్రార్థనాపూర్వకంగా చేసిన వేడుకోలుతో భక్తి పారవశ్య విధానం ఆరంభమై భాగవతం యావత్తూ అత్యద్భుతంగా తీర్చిదిద్దబడింది.*
❤️ *’కాటుక కంటి నీరు...’ అనే పద్యంలో సరస్వతీ దేవిని వేడుకుంటూ ‘అమ్మా! నేను అనువదించే ఈ కావ్యాన్ని సామాన్యులకు అంకితమివ్వను’ అని మాటఇచ్చాడు. తన భాగవత అనువాదానికి ఆ అమ్మను అండగా ఉండమని అడిగాడు. ‘శ్రీకైవల్య పదంబు...’ అనే పద్యంలో అదే హామీని మళ్ళీ విష్ణువుకు ఇచ్చాడు.* 
💓 *‘భాగవతాన్ని ఆంధ్రీకరించి రాజులు జమీందారులు వంటి వాళ్లిచ్చే బహుమానాలతో జీవించాలనే తాపత్రయం నాకు లేదు’ అని చెబుతూ తన రచన సాఫీగా సాగేలా చేయమని శ్రీహరిని వేడుకున్నాడు.*
💕 *వేడుకోవడమెలాగో, దాని ప్రభావమెలాంటిదో అనుభవ పూర్వకంగా తెలిసినవాడు కనుకనే ఆయన వేడుకోలులో పలురకాలున్నాయని, ఎవరి స్థాయినీ, స్థితినీ బట్టి వారు త్రికరణశుద్ధితో వేడుకుంటే ముక్తి కలుగుతుందని భాగవతం ద్వారా సామాన్యులక్కూడా అర్ధమయ్యేలా అనేక కథలు ద్వారా తెలియజేశారాయన.*

💞 *శరణాగతి, ప్రార్థన లాంటి నవవిధ భక్తిమార్గాల ద్వారా వేడుకోవడాన్ని భాగవతంలో విస్తృతపరిచాడు పోతన. ప్రథమ స్కంధంలోని అశ్వత్థామ గర్వపరిహారఘట్టంలో ఉత్తర గర్భరక్షణకోసం చేసిన వేడుకోలు, శుకుణ్ని పరీక్షిత్తు మోక్షమార్గం కోరే ఘట్టం, తృతీయ స్కంధంలో దితి, కశ్యప సంవాద ఘట్టంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపుల ద్వేషంతో స్మరణ లాంటివి ప్రార్థనాపూర్వకమైనవి. యశోద వేడుకోలు ఆప్యాయతా భక్తికి అద్దంపడుతుంది.*
💓 *’మన ఇంట్లో పాలు, పెరుగులకేమి కొరత? ఇతరుల ఇళ్ళలో వాటిని దొంగిలించి నలుగురినోట్లో పడవద్దు’ అని మందలిస్తుంది యశోద. ఆ మందలింపూ వేడుకోలే మరీ…!*
💖 *రుక్మిణీదేవి వేడుకున్నతీరు, ప్రేమ, ఆత్మీయతా భక్తికి నిదర్శనం. ‘నీయందు నా మనసు ఎల్లప్పుడూ స్థిరంగా నిలిచి ఉండేటట్లు చూడు’ అని కృష్ణుణ్ని కోరుకుంది రుక్మిణి. సుదాముడి భక్తికి మెచ్చి “ఏదైనా వరం కోరుకో” అన్నాడు కృష్ణుడు. సుదాముడప్పుడు “నిరంతరం నీ పాదపద్మాల సేవ చేసుకునే భాగ్యం, అలాంటి సేవకులతోటి స్నేహం, ఎప్పటికీ తరిగిపోని భూతదయ నాకు ప్రసాదించు”అని వేడుకున్నాడు. ప్రేమానురాగపు వేడుకోలిది.*
💓 *ప్రేమతో కూడిన ఆప్యాయతానురాగాలు గోపికల వేడుకోలులో ప్రస్ఫుటమౌతాయి. నిరహంకారానికి దర్పణం గజేంద్రుడి వేడుకోలు.* *“లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్* *శ్రమంబయ్యెడిన్ నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా !!” అని వేడుకున్నాడు.*
💖 *”ధృవోపాఖ్యానం” లో ధ్రువుడి వేడుకోలు ‘నిర్వికల్ప స్థితి’కి ఉదాహరణ. ధ్రువుడి తపస్సువల్ల ఏర్పడిన అల్లకల్లోల పరిస్థితిని గమనించి విషయం తెలుసుకోవడానికి శ్రీమహావిష్ణువే స్వయంగా ఆ బాలుడి దగ్గరకి వెళ్ళగా ధ్రువుడికాయన దర్శనం వలన కలిగిన భక్తి పారవశ్యం స్తోత్రం మొదలుపెట్టేలా చేసింది. ‘ఈ శరీరం పడిపోతున్నదని మృత్యుభయం పొందకుండా చివరిశ్వాసలోనూ నిన్నే తలచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్న మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు. వాళ్ళు నీలో ఐక్యమైపోతున్నారు. అలాంటివారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రీ’ అని అడిగాడు.*
💞 *’వేడుకోవడం’ అనే ఏకైక భక్తిభావంతో సర్వాంతర్యామి కృపకు పాత్రులై ఆయనలోనే ఐక్యమైనవారి స్మరణతో మన ఈ ప్రభాతం “సుప్రభాతం”గా మన భాగ్యంగా భాసిల్లుతోంది.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

అని భ్రమించటం వల్లే సుఖాన్ని గానీ, దుఃఖాన్ని గానీ అనుభవిస్తూ ఉంటాం* అని వేదాంతం చెప్తోంది

 *సత్సంగం*

పుట్టే ప్రతి జీవి యొక్క శరీరం
 తొలి శ్వాస నుంచి ఆఖరి శ్వాస దాకా
 *ఆయుష్షు ప్రమాణం* 
*వారి ప్రార్ధ కర్మలను* *అనుసరించి* 
*ఇన్ని శ్వాసలు అని* *నిర్ణయించబడుతుంది* 
అని యోగశాస్త్రం చెబుతోంది

 దాంతో 
ఆఖరి ప్రారబ్ద కర్మ తీరటం
 ఆఖరి శ్వాసను వదలటం రెండూ ఒకేసారి జరుగుతాయి.

 శిథిల శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరించటం అని భగవద్గీతలో ఉంటుంది.

 *వాసాంసి జీర్ణాణి యధా విహాయ* 
అనే శ్లోకంలో

 జీర్ణించిన శరీరం అంటే 
*ఆ జన్మకి అనుభవించాల్సిన ప్రారబ్దం జీర్ణించటం*
 అని అర్థం చేసుకోవాలి

 అంతే తప్ప 
భౌతికంగా రోగగ్రస్తమైన శరీరం అని కానీ 
 వృద్ధాప్యంతో  శరీరం జీర్ణించడం అని కానీ 
కాదు

మన శరీరంలో 
ఒక్క రసాయనిక పదార్థం
 కొద్దిగా పని చేయకపోయినా,
 ఒక్క ఎంజైమ్
 కొద్దిగా ఎక్కువైనా
 లేదా
 కొద్దిగా తక్కువైనా 
ఒక్క గ్రంధి 
కొద్దికాలం విశ్రమించినా
 అందువల్ల కలిగే అనారోగ్యం, తద్వారా కలిగే అసౌకర్యం భరించరానిదిగా ఉంటుంది.

 అవన్నీ సమపాళ్లల్లో ఉండటం అనేదే సుఖం
 అయితే
 ఈ సుఖం వెనకే దుఃఖం దాగి ఉంటుంది

 మనకు సంబంధించిన ప్రతి వారూ 
అంటే
 కుటుంబ సభ్యులూ, బంధువులూ, మిత్రులూ,
 తోటి వారందరూ, 
ఇంకా పరిస్థితులూ
 మన కోరికకీ, మన ఇష్టానికీ అనుగుణంగా మసలు కొన్నంతవరకే మనకి సుఖం.
 వారు మన ఇఛ్ఛ కి సెంటీమీటర్ పక్కకి వెళ్లినా 
అది మనకి దుఃఖంగా పరిణమిస్తుంది 

కొడుకు ఇంజనీరింగ్ బదులు లా చదువుతానంటే దుఃఖం.

 కూతురు ఇంకో కులం లేదా మతం వారిని పెళ్లి చేసుకుంటా అంటే కష్టం

 పక్కింటి వారి ఆకులు రాల్చే చెట్టుకొమ్మలు 
మన ఇంట్లోకి వంగి ఉంటే బాధే

 మన లెటర్ ని పొరపాటున పోస్టుమాన్ ఎదురింట్లో పడేసినా శోకమే 

స్కూటర్ మొదటి కిక్ కి కాక 
ఏ పన్నెండో కిక్కు కో
 స్టార్ట్ అయితే గుండె భారం అవుతుంది 

నేతి గిన్నెకి చీమలు పడితే అదో విషాదం 

 అంతే కాదు మనం కోరనప్పుడు వాన వచ్చినా, కోరినప్పుడు వాన రాకపోయినా ట్రాజడీ నే 

మనం ఏది సుఖం అనుకుంటున్నామో 
అది మనకి అనుగుణంగా జరగబట్టే అలా తోస్తోంది 

అలా జరిగింది రేపు మనకు అయిష్టమైతే 
అంతదాకా సుఖంగా భావించింది
 అకస్మాత్తుగా మనకి దుఃఖంగా మారిపోతుంది 

అనాదిగా అలవాటైన ఈ దేహాత్మ బుద్ధి ఇది

అంటే 
*నేను ఈ పాంచ భౌతిక శరీరం*
 *అని భ్రమించటం వల్లే సుఖాన్ని గానీ, దుఃఖాన్ని గానీ అనుభవిస్తూ ఉంటాం*
 
అని వేదాంతం చెప్తోంది

కలుషితమైనారని గ్రహించాలి...

 🌺 Amritham Gamaya 🌺

If you are perturbed at any given point in time of any of your thought or action with whatever reason you may have - It is to be comprehended that your character has taken entry into it polluted with the nondesirable ego centric selfishness. There would not be a reason to cause any inner disturbance when the thought and action are not owned by you - SathChith.

అమృతం గమయ

మీరు ఏ కారణాలతోనైనా సరే, మీ ఆలోచన లేదా కర్మతో మీరు కలవరపడితే - మీరు అప్రధానమైన అహంతో కేంద్రీకృతమైన స్వార్థంతో కలుషితమైనారని గ్రహించాలి. ఆలోచన మరియు కర్మలలో మీరు మునిగిపోనప్పుడు మరియు వాటిని మీ స్వంతం చేసుకోనప్పుడు మీకు ఎటువంటి అంతర్గత కలవరం ఉండదు - సత్ చిత్.

अमृतम् गमय

यदि आप अपने किसी भी विचार या कर्म से परेशान हैं, यह माना जाना चाहिए कि आपने इसमें प्रवेश किया है जो कि गैर-वांछनीय अहं केंद्रित स्वार्थ के साथ प्रदूषित है। जब विचार और कर्म में आप लिप्त नहीं होते हैं और आपके स्वामित्व में नहीं लेते हैं, तो किसी भी आंतरिक गड़बड़ी महसूस नहीं होगा - सतचित।

అందుకే మనుషులను మనీతో కాకుండా మనసుతో చూడాలి అప్పుడే మన విలువ మరింత పెరుగుతుంది.

 కొంచెం చిరిగిన పంచ .... కాస్త చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి ...... తన 15 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కుర్చీలపై కూర్చోవడం చూసి, ఒక వెయిటర్ రెండు గ్లాసుల  చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు - మీ కోసం ఏమి తీసుకు రావాలి? అని 

ఆ వ్యక్తి ఇలా అన్నాడు- " పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే, ఈ ఊరిలోని పెద్ద హోటల్‌లో  దోశ తినిపిస్తాను అని  మా అమ్మాయికి మాటిచ్చాను  "

మా అమ్మాయి మొదటి స్థానంలో వచ్చింది కాబట్టి  తన కోసం ఒక దోశ తీసుకు రండి..... అని చెప్పగానే , 

దానికి  "వెయిటర్ అడిగాడు-" మీ కోసం ఏమి తీసుకు రావాలి? అని

"అతను అన్నాడు-" నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బే ఉంది. నాకు వొద్దు ..." అని

మొత్తం విన్న తర్వాత వెయిటర్ యజమాని వద్దకు వెళ్లి విషయం మొత్తం చెప్పాడు- 

"నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను . ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసివేయవచ్చు." అని వెయిటర్ అన్నాడు.

అప్పుడు యజమాని ఇలా అన్నాడు- 
"ఈ రోజు మనం హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వాళ్లకి పార్టీ ఇద్దాం అన్నాడు ... 

 ఇది విని వెయిటర్ చాలా ఆనంద పడ్డాడు.

హోటల్ వాళ్ళు ఒక టేబుల్‌ను చక్కగా అలంకరించారు... ఎవరైతే హోటల్లో  ఉన్నారో వారందరితో  ఆ అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు...

అ యజమాని వాళ్లకి మూడు దోశలుతో పాటు ఇరుగు పొరుగు వారికి స్వీట్స్ పంచమని  పెద్ద సంచిలో ప్యాక్ చేశాడు... 

కొద్దిసేపటికి  అతను, అతని కుమార్తె కళ్ళలో ఆనందంతో కన్నీళ్లతో తమ ఇంటికి వెళ్ళారు...

ఏళ్ళు  గడిచి పోయాయి  ......

ఒక రోజు ఆ అమ్మాయే I.A.S. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ జిల్లాకే కలెక్టర్‌గా వచ్చింది. ఆమె ముందుగా ..... ఒక అటెండర్ ని అదే హోటల్‌కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పారని తెలియ జేయమంది ... 

హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్‌ను బాగా అలంక రించాడు. ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండి పోయింది...

అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లి దండ్రులతో నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమె గౌరవార్థం నిలబడ్డారు. 

హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించి ఆర్డర్ కోసం అభ్యర్థించారు.

 ముందుకు వెళుతున్నప్పుడు, ఆమె ఇలా చెప్పింది- "మీరిద్దరూ నన్ను గుర్తించలేక పోవచ్చు. , కొన్నేళ్ల క్రిందట ఎవరి తండ్రికి అయితే మరొక దోశ తినటానికి డబ్బు లేదో నేను ఆ అమ్మాయినే. 

అప్పుడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు, నేను పాస్ అయి నందుకు ఒక అద్భుత మైన పార్టీని ఇచ్చి మాకే కాకుండా మా పొరుగు వారికి కూడా ఇవ్వమని స్వీట్లు  ప్యాక్ చేశారు..

ఈ రోజు నేను మీ ఇద్దరి మంచితనంతో  స్పూర్తి పొంది ఇప్పుడు కలెక్టర్ అయ్యాను..... మీ ఇద్దరినీ నేను ఎప్పుడూ  గుర్తుంచు కుంటాను... 

ఈ రోజు ఈ పార్టీ నా తరపున ... ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను.... అలా అని అందరి ముందు వాళ్ళని సత్కరించింది తను..

ఆ హొటల్ కు ఆ సరస్వతి పుత్రిక వున్న బంధం గురించి నలుగురికీ తెలిసింది హొటల్  వైభోగం 
పదింతలంయ్యింది.

అందుకే అంటారు చేసిన పుణ్యం, నాటిన మొక్క ఊరికే పోదు అని.

ఈ సరస్వతీ పుత్రిక కూడా పేదరికంలో ఉండి, తన చదువు సంధ్యలతో, సంస్కార గుణంతో, పేదరికాన్ని జయించడమే కాక ప్రజల అందరి మన్నన పొందగలిగింది. 

అందుకే అంటారు ..... కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ నిరుపేద పుత్రిక.

అందుకే మనుషులను మనీతో కాకుండా మనసుతో చూడాలి అప్పుడే మన విలువ మరింత పెరుగుతుంది.

సర్వేజనా సుఖినోభవంతు

అహంకారం వినాశహేతువు

 *అహంకారం వినాశహేతువు*
              

*యుద్ధాన్ని ఆపడానికి కృష్ణుడు చివరి ప్రయత్నంగా రాయబారానికి వచ్చి తను చెప్పదలచిన హితవు చెప్పాడు.* 

*అనంతరం అదే సభలో ఉన్న మహర్షి పరశురాముడు దుర్యోధనుడికి చేసిన హితబోధ సందర్భంలో వచ్చే కథ ఇది…*

*"నాయనా! దుర్యోధనా! నీకూ, నీ వారికీ సర్వప్రపంచానికీ మేలు కలిగే విషయం చెబుతున్నాను. ఆవేశపడకుండా సావధానంగా విను...*

*చాలా రోజుల క్రితం మాట. ‘దంభోద్భవుడు’ అనే పేరు గల రాజు ఉండేవాడు. ఆయన ఈ భూమండలం అంతటినీ పాలించేవాడు. భుజబలంలో, పరాక్రమంలో ఆయనకు సాటి వచ్చే వారు లేరు ఆ రోజుల్లో. అంతటి మహా యోధుడాయన.* 

*ఆయన రోజూ ఉదయం లేచి, కాలకృత్యాలు పూర్తి కాగానే బాగా అలంకరించుకుని రత్నకిరీటం ధరించి, కోడెత్రాచు వంటి కరవాలం చేతబట్టి సభాభవనానికి వచ్చి బంగారు సింహాసనాన్ని అధిష్టించేవాడు.*

*వంది మాగధులు ఆయన బల పరాక్రమాలను గానం చేస్తుంటే, కోరమీసం మెలితిప్పుతూ ఆనందించేవాడు.*

*అనంతరం, తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ ‘భూలోకంలో నాతో ఎవడైనా యుద్ధం చేయగల మహావీరుడు ఉన్నాడా? గద, ఖడ్గ, ప్రాసాది ఆయుధాలతో కానీ, ఆగ్నేయ, వారుణ, వాయవ్యాది అస్త్రాలతో కానీ నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. అంతేకాదు.. మల్లయుద్ధం చేయగల వీరుడు కూడా ఉంటే చెప్పండి. వాడినీ క్షణంలో కడతేరుస్తాను.' అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగుర వేసేవాడు.*

*ఆయన బలపరాక్రమాలు ఎరిగిన వారెవరూ ఆయనతో యుద్ధానికి దిగే వారు కాదు.*

*అలా, ఆ రాజు అహంకారం నానాటికీ పెరుగుతూ వచ్చింది. నా అంత వాడు లేడనే గర్వంతో ఆయన విర్రవీగుతూ తిరుగుతుండే వాడు. అటువంటి అహంకారం ఉన్న రాజుకు ఆయన అనుచరులు కూడా అటువంటి అవివేకులే దొరుకుతారు కదా! వారు రోజూ ఆయన బలపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు.*

*అలా ఉండగా,  ఒకనాడు, ఆయనను చూడటానికి సభా భవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు “మహారాజా! మీరు నిజంగా మహావీరులే. బలపరాక్రమ సంపన్నులే. అయితే, గంధమాదన పర్వతం మీద నర-నారాయణులని ఇద్దరు తీవ్ర నిష్టతో తపస్సు చేస్తున్నారు. వారిని జయించగల వీరులు మూడు లోకాలలో లేరని విన్నాము. తమకు కోరిక ఉంటే వారితో యుద్ధం చేయవచ్చు” అన్నారు.*

*ఆ మాట వినడంతోనే ఆయన ఆగ్రహంతో మండిపడ్డాడు. కత్తి ఝుళిపించి, నేల మీద పాదంతో గట్టినా తన్ని, 'ఎంత కావరం? నన్ను మించిన యోధులా.. వారు?' అంటూ సేనల్ని సన్నద్ధం చేసి ధనుర్బాణాలు తీసుకుని బయల్దేరాడు. అలా గంధమాదన పర్వతం చేరాడు.*

*ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూస్తూనే రాజు గారు తొడగొట్టి, యుద్ధానికి పిలిచి, నవ్వుతూ కోరమీసం మెలితిప్పాడు.*

*నర, నారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకు అతిథి సత్కారాలు జరపబోయారు. మహారాజు ఆ అతిథి సత్కారాలను తిప్పికొట్టాడు.*

*'ఇవన్నీ అనవసరం. యుద్ధం.. యుద్ధం మాత్రమే కావాలి' అని అట్టహాసం చేశాడు.*

*అప్పుడు నర-నారాయణులు, “ఎవరితోనూ సంబంధం లేకుండా కళ్లు మూసుకుని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం మేం. మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు?” అని ప్రశ్నించారు.*

*వారి మాటలు వినిపించుకోలేదు మహారాజు. “ఈ రోజు నాతో మీరు యుద్ధం చేయాల్సిందే” అని పట్టుబట్టాడు. అలా అంటూనే బాణం తొడుగుతుండగా, అది చూసిన నరుడు నవ్వుతూ, ఒక దర్బపుల్ల తీసి, “ఇదిగో! ఈ గడ్డిపరక నీ సేనను నిలువరిస్తుంది” అని                                    ఆ దర్భను వదిలాడు.*

*ఆ రాజు బాణ వర్షం కురిపించాడు. ఆ గడ్డిపరక అన్ని బాణాలనూ ముక్కలు ముక్కలు చేసింది.*

*ఈలోగా రాజు సైన్యంలోని వారందరూ ముక్కులూ, చెవులూ ఊడిపోయి రోదనలు చేయడం మొదలుపెట్టారు.* 

*రాజుకి ఇదంతా చూసి తల తిరిగిపోయింది. సేనలు పలాయనం చేస్తున్నాయి. అది చూసి రాజుకు గుండె జారింది. ఆయుధాలన్నీ కిందపెట్టి, తల వంచి నర-నారాయణుల పాదాల మీద వాలాడు రాజు. *

*“ఆర్యా!  నన్ను క్షమించి అనుగ్రహించండి. నా గర్వానికి ప్రాయశ్చిత్తం అయింది” అని దీనంగా ప్రార్థించాడు.*

*అప్పుడు, నర-నారాయణులు నవ్వుతూ, “మహారాజా! సిరిసంపదలు కలవారు పేదసాదలకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి. అలాగే, బల పరాక్రమాలు ఉన్న వారు దుర్మార్గుల బారి నుంచి సజ్జనులను రక్షించడానికి తమ శక్తియుక్తులను వినియోగించాలి. అంతేగానీ, అహంకారంతో ఇలా తిరగరాదు. ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మ వ్యర్థం” అన్నారు.*

*మహారాజు వారి బోధ విని, ఆనాటి నుంచి అహంకారం విడిచి, అందరి శ్రేయస్సునూ దృష్టిలో ఉంచుకుని తన సంపదలను బీదలకు దానం చేస్తూ, తన బలంతో దుర్మార్గులనూ, క్రూరులనూ శిక్షించి, న్యాయమార్గాన సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు.*

*కనుక దుర్యోధనా! అహంకారం, బల గర్వం ఎప్పుడూ పనికిరావు. అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి” అని చెప్పడం ముగించాడు పరశురాముడు.*
అరుణాచలశివ 🌹

నీతి:- మితిమీరిన గర్వంతో బలహీనులపై ప్రతాపం చూపించే రాజుకైనా పరాభవం, ఓటమి తప్పదు.🕉️🚩🕉️

తెలివి, ప్రతిభ అనేది ఒకరి సొత్తు కాదు.

 😄🤣😃😂

ఒక మహిళ షాపింగ్‌కు వెళ్ళింది.
🛒
అంతా పూర్తయ్యాక క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి,
బిల్లు చెల్లించడానికి తన హేండ్ బ్యాగ్ తెరిచింది.
👜
క్యాషియర్ ఆమె బ్యాగులో
ఒక టీవీ రిమోట్ గమనించాడు.
📲
అతను ఉండబట్టలేక ఆడిగేసాడు..

"మీరు ఎప్పుడూ మీ టీవీ రిమోట్‌ను మీతో తీసుకువెళతారా?" అని.

ఆమె "లేదండీ, ఎప్పుడూ ఇలా తీసుకురాను, అప్పుడప్పుడు మాత్రమే.. 
ఈరోజు మావారు క్రికెట్ 🏏మ్యాచ్ ఉందని చెప్పి నాతో పాటు షాపింగ్ కి రాలేదు అందుకే నేను రిమోట్ తీసుకుని వచ్చేసా..."
అంటూ తన క్రెడిట్ కార్డ్ ఇచ్చింది.💳

నీతి : 
*మీ భార్య మాట వినండి, ఆమెకు అవసరమైన పనుల్లో సహకారం అందించండి ..!*
💁‍♂️

*కథ ఇంతటితో అయిపోలేదు ..!*

క్యాషియర్ నవ్వుతూ ఆమె కొన్న వస్తువులన్నీ తిరిగి తీసుకున్నాడు.
👠👗👛👜👖

ఊహించని ఈ సంఘటన చూసి ఆమె నిర్ఘాంతపోయింది ..!🤔

"ఏమైంది..!!??" అని క్యాషియర్ని అడిగింది.😬

అతను చెప్పాడు, 
“మీ భర్త మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేసారు...”
🤭

నీతి : 
*మీ భర్త యెక్క అభిరుచులను ఎల్లప్పుడూ గౌరవించండి.*
🙏

*కథ కొనసాగుతుంది ..!*

భార్య ఈసారికి తన భర్త క్రెడిట్ కార్డును 💳పర్స్ నుండి తీసి స్వైప్ చేసింది. 
దురదృష్టవశాత్తు అతను తన సొంత కార్డును బ్లాక్ చేయలేదు.

 నీతి : 
*మీ భార్య యొక్క శక్తిని, జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయవద్దు!*
😝
 
*కథ ఇంకా అయి పోలేదు.!*

స్వైప్ చేసిన తర్వాత,
ఆ యంత్రం, 

"మీ మొబైల్ ఫోన్‌కు పంపిన పిన్ను నమోదు చేయండి" అని సూచించింది ..!📱

నీతి : 
ఒక్కోసారి మనిషి ఓడిపోయినప్పుడు, సాంకేతికత కూడా రక్షిస్తుంది ‌..! 😊😊

*కథ కొనసా . . . . . . . . . గుతుంది ..!*

ఆమె మరలా నవ్వి,
తన పర్సులో మెసేజ్ శబ్దంతో మోగిన మొబైల్ ను  బయటకు తీసింది.📱

అది తన భర్త ఫోన్.📵

ఆమె దానిని రిమోట్ కంట్రోల్‌తో బాటుగా తీసుకుని వచ్చేసింది.
ఎందుకంటే,
తన షాపింగ్ సమయంలో భర్త తనకు కాల్స్ చేసి విసిగించకుండా ఉండేందుకు.
చివరకు ఆమె తన షాపింగ్ పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. 😂😂😂
 
నీతి :
*ఎప్పుడూ మీ భార్యని తక్కువ అంచనా వేయవద్దు ..!*

కథ ఇంకా కొనసాగుతుంది ..!

ఆమె ఇంటికి చేరుకునేసరికి ఇంటి బయట ఆమెకు తన భర్త కారు కనిపించ లేదు.🚘

ఒక నోట్ తలుపు మీద అతికించబడి  ఉంది.
అందులో ఇలా రాసి ఉంది ..!
📒

*"రిమోట్ దొరకలేదు, మ్యాచ్ చూడటానికి ఫ్రెండ్స్ తోబాటు బయటకు వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నీకు ఏదైనా అవసరమైతే నా ఫోన్ కు కాంటాక్ట్ చెయ్యి ..!*
అని ఇంటి తాళాలు కూడా తనతో బాటే తీసుకుని పోయాడు.🔑

నీతి :
మీ భర్తను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు.
😋😂😆😉😁

*తెలివి, ప్రతిభ అనేది ఒకరి సొత్తు కాదు.*
🙈🙈🙈🙈🙈

మన జీవితంలోని చాలా నిర్ణయాలను ఎవరు తీసుకుంటారు, బయటి ప్రపంచమా లేక లోపల ఉన్న హృదయమా ?

 *మన జీవితంలోని చాలా నిర్ణయాలను ఎవరు తీసుకుంటారు, బయటి ప్రపంచమా లేక లోపల ఉన్న హృదయమా ?*

ప్రజలు ఎప్పుడూ ఏదో అంటూనేఉంటారు!

 ఒకసారి, ఒక సన్యాసి నీటి కోసం నది ఒడ్డుకు వెళ్ళాడు. నీళ్లు త్రాగి ఓ రాయిపై తల ఆనించి కాసేపు అక్కడే పడుకున్నాడు. గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు నీటిని నింపుకునేందుకు ఆ నది వద్దకు వచ్చారు. అక్కడ్నుంచి వెళ్తున్న స్త్రీలలో ఒకామె ఇలా అంది - *చూడు! ఈయన ఒక సన్యాసి అయ్యుండి కూడా నిద్రపోవడానికి దిండు ఆసరా కావలసివచ్చింది.అది రాయి అయినా దిండు చేసే పనినే చేస్తోంది కదా*

*ఋషి ఆ స్త్రీ చెప్పినది విని వెంటనే రాయిని విసిరివేసాడు*

రెండవ మహిళ ఇలా అంది - *అతను సన్యాసి అయ్యాడు, కానీ  కోపం మాత్రం విడిచిపెట్టలేదు, ఇప్పటికీ అతను క్రోధం నుండి విముక్తి పొందలేదు,  దిండు ఎలా విసిరేసాడో చూడండి*.

ఆ సన్యాసి తరువాత ఏమి చేయాలా ఆలోచించడం ప్రారంభించాడు?

*అప్పుడు అక్కడున్న మూడో మహిళ ఇలా చెప్పింది- "బాబా! ఇది నదీతీరం, స్త్రీలు ఇక్కడికి వస్తూనే ఉంటారు, మాట్లాడుకుంటూనే ఉంటారు. వారి సంభాషణను బట్టి మీరు మీ చర్యలను మార్చుకుంటూ ఉంటే, మీరు మీ ఆధ్యాత్మిక సాధన ఎప్పుడు చేస్తారు?*

కానీ నాలుగవ మహిళ చాలా అందమైన, అద్భుతమైన ఒక విషయం చెప్పింది -

*క్షమించండి, కానీ మీరు అన్నింటినీ వదులుకున్నారని మేము భావిస్తున్నాం, కానీ మీరు మీ మనస్సును విడిచిపెట్టలేదు, అది ఇప్పటికీ అక్కడే ఉంది. మీ మనస్సును బాహ్య ప్రపంచం నుండి దూరం చేసి, మీ హృదయానికి అనుసంధానం చేయండి. అప్పుడు ప్రపంచం మంచి లేదా చెడు ఏమి చెప్పినా, మీ హృదయం మీకు ఏమి చెబుతుందో మీరు దానిని అనుసరిస్తారు*

ఇది నిజం, ప్రజలు ఏదో ఒకటి అంటూంటారు లేదా మరేదో  చెబుతూంటారు. ఏదో ఒకటి అంటూ ఉండడమే ప్రపంచం యొక్క పని.

మనం పైకి చూస్తూ నడిస్తే, *నువ్వు అహంకారివి అయిపోయావు*, అంటారు.
మనం క్రిందకి చూస్తే. *నువ్వు ఎవ్వరివైపు చూడట్లేదు* అంటారు.
*మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే, అతను / ఆమె సన్యాసి అయిపోయాడని, లేదా అతనికి / ఆమెకు ఏవో కష్టాలు ఉండుంటాయని ప్రజలు అంటారు*.

చుట్టుపక్కల చూస్తే.. *ఏకాగ్రత, స్థిరత్వం లేదు, వారి దృష్టి అక్కడ, ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది*. అంటారు.

చివరగా, అన్ని వైపుల నుండి నిరాశను ఎదుర్కొన్న తర్వాత మనం నిరుత్సాహంతో ఏడుస్తుంటే, ప్రపంచం ఇలా చెబుతుంది, *మీ చర్యల ఫలితాలను, మీ కర్మ ఫలాన్ని మీరే ఎదుర్కోవలసి ఉంటుంది*.

భగవంతుడిని సంతృప్తిపరచడం చాలా సులభం, కానీ ప్రపంచాన్ని ఒప్పించడం అసాధ్యం.ఎవరో చక్కగా చెప్పారు. *అయితే ప్రపంచాన్ని సంతోషపెట్టవచ్చు, లేదా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవచ్చు!!*

 *మన హృదయంపై మనం దృష్టి పెట్టినప్పుడే మన హృదయం మనతో మాట్లాడుతుంది. హృదయంపై ఎంత ఎక్కువ శ్రద్ధ చూపితే, హృదయం మనల్ని అంత సరైన దిశలో నడిపిస్తుంది*................

దేశ ప్రగతికి దిశను నిర్ణయిద్దాం

 ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఉదయాన్నే జాగింగ్ కు బయలుదేరి దారిలో యాక్సిడెంట్ లో చనిపోయారు. చిత్రగుప్తుని సూచనల మేరకు యమభటులు ఆత్మని తీసుకుని బయలుదేరారు. దారిలో స్వర్గలోకపు సైనికులు ఇదే ఆత్మ కోసం వస్తూ కనిపించారు. అదేమని ప్రశ్నిస్తే ఇతను మరణించిన ఘడియలు మంచివి కనుక మాతో పంపమని వాదించారు. ఇలా తేలడం కష్టమని యముని వద్దకు పంచాయతీకి వెళ్ళారు. యమధర్మరాజు అంతా విని ఆ వ్యాపారవేత్తనే ఎటు వెళ్ళాలో తేల్చుకోమని అందుకుగాను ఒకరోజు అక్కడ, ఒకరోజు ఇక్కడ ఉండమని తీర్పు ఇచ్చారు. అదే తడవుగా యమభటులు ముందు మా లోకం చూడమని తీసుకుని వెళ్లారు. లోనికి వెళ్ళగానే తనకంటే ముందు చనిపోయిన పాత మిత్రులు ఎదురొచ్చి ఆహ్వానించారు. సరదా పలకరింపులు, తాను భూలోకంలో ఆడిన ఆటలు అన్నీ సరదాగా సాగుతున్నాయి. ఒకవైపు ఫాస్ట్ బీట్ పాటలతో, బిర్యానీ, మందు పార్టీలతో, ఆటపాటలతో సమయం గడిచింది కూడా తెలియకుండా రోజు పూర్తయింది.

మరుక్షణం స్వర్గలోక భటులు ప్రత్యక్షమై తమలోకానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ కూడా పరిచయం ఉన్న కొందరు మిత్రులు సాదరంగా ఆహ్వానించారు. మంద్రమైన సంగీతం హాయిగా ఉంది. భగవంతుని కీర్తనలు, సత్సంగాలు, ఆలోచింపచేసే బోధలతో నిండుగా సాగింది ఆరోజు. సాత్విక ఆహారం, అవసరమైన పోషకాలు నిండిన పానీయాలతో భోజనం పెట్టారు. మనసుకి హాయిగా ఉండగా నిద్ర పట్టేసింది. తెల్లవారుతూనే యమధర్మరాజు ముందు నిలబెట్టారు. నీ నిర్ణయం ఏమిటని అడగగానే కాస్త సందిగ్ధంలో పడి మళ్ళీ తన మిత్రులు అంతా ఉన్నారు, విలాసవంతమైన జీవితం అటే ఉందని యమలోకమని బదులిచ్చాడు. 

వెంటనే యమభటులు ఆ వ్యాపారవేత్తని తీసుకొని వెళ్ళి పోయారు. నరక ద్వారం లోకి రాగానే అంతా మురికి కూపంలా కనిపించింది. నిన్న తనను ఆహ్వానించిన మిత్రులు మురికి వస్త్రాలతో, వెట్టి చాకిరి చేస్తూ, మధ్యలో భటుల చేతిలో దెబ్బలు తింటూ కనిపించారు. వెంటనే "ఇదేమిటీ? నిన్న ఇలా లేదు కదా నరకం ఈనాడు ఇలా ఉంది" అని భటులను ప్రశ్నించాడు. 
"నిన్న మేము ప్రచారంలో భాగంగా నిన్ను ఆకర్షించేలా అన్నీ అలా చూపించాము. నిన్ను మా వైపు తిప్పుకునే ప్రయత్నం అది. నువ్వు అదే నిజమనుకుని మాకే ఓటు వేసావు. ఇక నువ్వు మా బానిసవి పద!" అంటూ చేతిలోని శూలంతో బాధించడం మొదలుపెట్టారు. 

   "అయ్యో! సాదాగా ఉన్న నిజమైన స్వర్గాన్ని వదిలి ఆర్భాటాలు అద్దిన నరకాన్ని నిజమని నమ్మి చేజేతులా వచ్చిన అవకాశం నాశనం చేసుకున్నా"నని చింతిస్తూ నరకకూపంలోకి చేరిపోయాడు.```

మిత్రులారా! ఓటన్నది మన హక్కయితే, ఈ ఆకర్షణలు, ప్రలోభాలు, ధనం ఇవన్నీ మన బలహీనతలను లొంగదీసుకోవాలనుకునే ప్రయత్నాలు. నిజంగా మనకోసం, మనకి ఉపయోగపడే నాయకులు ఎవరో ఆచి తూచి ఎన్నుకోండి. ప్రలోభాలకు లోనయితే మరో అయిదేళ్ళవరకూ వారికి మనం బానిసలమవుతాం!! 

మేలుకోండి మిత్రులారా మనకి నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది, వదులుకోవదు... నిర్ణయిద్దాం!!

 మన  దేశ ప్రగతికి దిశను నిర్ణయిద్దాం..పదండి.

మాయం.

 *మాయం.*

గుమస్తాలు మాయం.
కూలీలు మాయం.
కోడళ్ళ పనితనం మాయం.
అత్తమామల మాటసాయం మాయం.
అల్లుళ్ళ గౌరవహోదా మాయం.
పోస్టుమాన్ మాయం.
ఆసాంతం వినే వైద్యుడు మాయం.
చీర, రవిక మాయం.
పుస్తక పఠనం మాయం.
రేడియోకి శ్రోతలు మాయం.
పెరడు బావి మాయం.
సైకిలు మాయం. 
ఎండావకాయ మాయం.
కుంపటిపై దిబ్బరొట్టి మాయం.
మట్టి వాసన మాయం.
పిడతకింద పప్పు బండి మాయం.
వందరోజులాడే సినిమాలు మాయం.
అర్ధరాత్రయినా నిశ్శబ్దం లేని నిశిరాత్రులు మాయం.
ఉపాధ్యాయుడు మాయం కొంత వరకు.
కుంకుడుకాయ, సీకాకాయ మాయం.
వాకిట పూల మొక్కలు మాయం.
పిచ్చుకలు, సీతాకోకచిలుకలు మాయం. 
సత్తు గిన్నె చారు మాయం.
స్కూల్లో మైదానం మాయం.
సంఘంలో నిదానం మాయం.
వానపాము మాయం.
చెరువుల్లో ఆటలు మాయం.
కోతికొమ్మచ్చి కబడ్డీ మాయం.
అవ్వ గోచీ కూడా మాయం.
థూళి లేని గాలి మాయం.
పాళీ ఉన్న పెన్ను మాయం.
ఖాళీ ఉన్న స్నేహితుడు మాయం.
నిలకడగా కురిసే వాన మాయం.
నిర్మానుష్యమైన ఏకాంతం మాయం.
కంటికి నిద్ర మాయం.
వెన్నెల చూడాలనే కన్నులు మాయం.
పట్టుమని పదినిమిషాల ఏకాగ్రత మాయం.
హారన్ కూత లేని వీధి మాయం.
దోమలు లేని పార్కులు మాయం.
తోటమాలి కొలువే మాయం.
దాచుకుందామంటే వడ్డీరేటు మాయం.
'ఒక అల్లం పెసరె' అని కేక వేసే పాక హోటల్ మాయం.
సగం సగం పంచుకునే తేనీరు మాయం.
నిఖార్సయిన చేగోడీ, వడియం, అప్పడం మాయం.
ప్రేమ ప్రకటించే పొందిక ప్రేమ లేఖలు మాయం.
సాయంకాలం మల్లెపువ్వులు పెట్టుకుని కాటన్ చీరతో స్వాగతించే ధర్మపత్ని మాయం.
ఆఫీసు నుండి రాగానే నాన్నా నాకేమి తెచ్చావు అని ఎదురుపడే‌సంతానం మాయం.
ఏమండీ రాత్రికి ఏమి చేయమంటారు అని అడిగే ధర్మపత్ని మాయం.
ఎంతసేపు జొమేటో ప్రత్యక్షం.
ఎవరి చరవాణి లోకి వాళ్ళు మాయం.
 *అంతా సాంకేతిక మయం.*
*మనదైన సమయం కూడా మాయం.*
*అంతా అయోమాయం.*
*ఈ స్థితిని పారత్రొలుదాం.*
*ఇంట్లో పెద్దవారి మాట విందాం.*

ఎలాంటి వ్యామోహం లో చిక్కుకున్నా వివేకంగా ఆలోచిస్తే మనసు అధర్మం వైపు మొగ్గదు.

 *సత్సంగం*

*ఇవాళ నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందువల్ల
 గంట బదులు రెండు గంటలసేపు దైవధ్యానం చేస్తాను* 
అని ఓసారి మహాత్మా గాంధీ అన్నారు

 ఈ మాటను బట్టీ
 మనం చేసే దానికి దైవసహాయం అవసరం
 అని అర్థం చేసుకోవచ్చు

 మనం భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్ముకుని,
 లౌకిక విషయాల నుంచి బయటపడి,
దైవ ధ్యానంలో ఉంటే
 మనకేం కావాలో
 ఆయనే అన్నీ ఇస్తాడు.

అయితే మాయని జయించిన వాళ్ళు కూడా  ప్రాపంచిక విషయాల బంధంలో చిక్కుకుంటారు.

విష్ణువు అంశ లో పుట్టి,
నాలుగు వేదాలనీ విభజించి,
అష్టాదశ పురాణాలనూ,
భాగవతాన్నీ, భారతాన్నీ రచించి 
భగవత్ తత్వాన్నీ, మోక్షమార్గాన్నీ ఆకళింపు చేసుకున్న వ్యాసభగవానుడుని కూడా
 పుత్రవాత్సల్య  రూపంలో అజ్ఞానం వదల్లేదు.

తన కొడుకు శుకుడు పరమ విరాగియై
వివాహం చేసుకోనంటే, 
దీనుడై వ్యాసుడు శోకంలో పడ్డాడు.

సరస్సు లో స్నానం చేస్తున్న అందగత్తెలైన దేవతా స్త్రీలు శుకుడు ని చూసి సిగ్గు పడలేదు 
ఒళ్ళు కప్పుకోలేదు
 కానీ ఇంకా కోరికలు గల వ్యాసుడు ని చూసి 
సిగ్గుతో బట్టలు కప్పుకున్నారు.

ఎలాంటి వ్యామోహం లో 
చిక్కుకున్నా 
 వివేకంగా ఆలోచిస్తే 
మనసు అధర్మం వైపు మొగ్గదు.

Sunday, October 29, 2023

సమస్యల తోరణం

 🪔🪔అంతర్యామి 🪔🪔

#సమస్యల తోరణం#

🍁సృష్టిలోని జీవుల్లో సమస్యలతో సతమతమయ్యేది మానవుడు మాత్రమేననిపిస్తుంది. సమస్యల తోరణం కనపడని ఇల్లు అరుదుగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి ఆరోగ్య సమస్యల దాకా ఎన్నో. మనిషిని వేదనకు గురిచేస్తాయి. కరవుకాటకాలు, తుపాను బీభత్సాల వంటి ప్రకృతి సృష్టించే సమస్యల వల్ల ఒక ప్రాంతమో, ఒక నగరమో ప్రభావితమవుతాయి. వేల ఎకరాల్లో పంట -నష్టమై ఆహార కొరత ఏర్పడుతుంది. వేలమంది నిరాశ్రయులై జీవనోపాధిని కోల్పోతారు. ప్రకృతి విపత్తులను నిరోధించడం మానవులకు సాధ్యం కాదు. ప్రకృతి శాంతించాక ఒకరికొకరు సహాయపడుతూ జరిగిన నష్టాన్ని పూడ్చుకొనే చర్యలు చేపట్టాల్సిందే.

🍁చాలా సమస్యలు మనిషి స్వయంకృతాపరాదాలు. కొందరు తమకుతామే సమస్యలు సృష్టించుకోవడమే కాకుండా ఇతరులను ఆ వలయంలోకి లాగుతారు. మాటల మంటలు రేపి మనశ్శాంతిని దూరం చేస్తారు. ఆలుమగల మధ్య ఆలకలు సర్వసామాన్యం. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు. సంయమనం పాటించినప్పుడు సమస్యలు సమసిపోతాయి. 
కుటుంబ సభ్యుల మధ్య రగిలి కలతలు ప్రేమానుబంధాలను విచ్ఛిన్నం చేస్తాయి.

🍁మానవ స్వభావం విచిత్రంగా ఉంటుంది. ఇతరులతో
పోల్చుకుంటూ అసూయతో మనిషి కుంగిపోతాడు. 
🍁దురాశతో లోభిగా మారి వ్యధ చెందుతాడు. 
🍁అహంకారంతో ఆత్మీయులతో విరోధం పెంచుకుని చివరి దశలో ఒంటరివాడై విలపిస్తాడు. 
🍁అసత్యాలతో విజయం సాధిద్దామనుకుని భంగపడతాడు. 
🍁సంతోషమే సగం బలమని గ్రహించలేక అపార్థాలతో సమస్యలు సృష్టించుకుంటాడు. 
🍁సంకుచిత మనస్తత్వంతో తప్పులు చేస్తూ కష్టాలు. కొనితెచ్చుకుని తన గొయ్యి తానే తవ్వుకుంటాడు.

🍁 పూర్వకాలంలో ధర్మాన్ని కాపాడేందుకు, సత్యవ్రతాన్ని ఆచరించేందుకు సమస్యల వలయంలో చిక్కుకున్న ధర్మాత్ములు భగవంతుడి కృపతో కష్టాల కడలిని దాటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. నేటికాలంలో అందుకు భిన్నంగా అధర్మవర్తనులైనవారు సమస్యల వలయంలో చిక్కుకుని కాలగర్భంలో కలిసిపోతున్నారు.

🍁అనేక సమస్యలకు మూలం అంతులేని కోరికలు.
🍁 మనసు కోరికలకు నిలయం, 'ధర్మమార్గం నుంచి తప్పిన మనసుకన్నా శత్రువులుండరు. 
🍁మనసును వశం చేసుకున్న వారే విజ్ఞులు. 
🍁చిత్తానికి చిత్తం 'చిత్తం అంటూ దాస్యం చేయకూడదు.
🍁 మనసుకు ప్రియమైన మాటలు కాకుండా హితమైన మాటలు 'వినాలి' అని భాగవతం ఉద్బోధిస్తోంది. 

🍁జీవుల 'సమస్త విపత్తులు 'కృష్ణ' అనే కంటక వృక్షం నుంచి బయలుచేరుతున్నాయి. దేహమనే చెట్టుపై హృదయమనే గూటిలో జీవుడనే పక్షి ప్రవేశించి కిలకిలారావాలు చేస్తూ ప్రశాంతంగా ఉంటుంది. 
తృష్టున అనే వల కింద ఇంద్రియ విషయాలనే ధాన్యపు గింజలు జల్లి మాయ అనే వేటగాడు చాటుగా చూస్తాడు. ఈ జీవుడు అమాయకంగా ఆ వలపై వాలుతున్నాడు. మాయ అనే వేటగాడు మెడవంచి ఆ జీవుల్లో అనేకమందిని దుఃఖపరంపరలనే బుట్టలో కుకీ ఉంచుతున్నాడని యోగవాసిష్టం చెబుతోంది.

🍁 నిత్యం ఆమాయాద్వేషాలు, పగ, ప్రతీకారాలతో రగిలే మానవులకు చివరకు దుఃఖమే మిగులుతుంది. ఎల్లప్పుడూ తీయగా మాట్లాడేవారు, ఇతరుల సంపదను చూసి ఈర్ష్యపడనివారు, క్రోధాన్ని నిగ్రహించుకోగల శక్తి కలవారు, ప్రాణులందరికీ అధీశ్వరుడైన నారాయణుడిని శరణువేడిన సత్పురుషులు దుఃఖాల నుంచి విముక్తులు కాగలరని భారతం ఉద్బోధిస్తోంది. 
🍁మాట తీరును సంస్కరించుకుని ఓర్పు, సహనం అలవరచుకున్న దృఢచిత్తులకు సమస్యల చింత ఉండదు. 
🍁ఆధ్యాత్మిక చింతన సానుకూల ఆలోచనలకు ప్రేరణనిస్తుంది.. 
🍁అనుకూల ఆలోచనలతో నిండిన మనసులో వేదనకు తావుండదు.🙏


అమ్మ (చీర) కొంగు

 *మా అమ్మ (చీర) కొంగు*

ఇప్పటి పిల్లలకు చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే నేటి మమ్మీలు  చీరకట్టు తక్కువే. చీరకొంగు చీర అందానికే సొగసునుపెంచేె మకుట మాణిక్యం !
అంతేకాకుండా పొయ్యి మీద వేడి గిన్నెలను దింపడానికి పనికొచ్చేి ముఖ్య సాధనం.
పిల్లల కన్నీటిని తుడిచే ముఖ్యమైన పరికరం.
చంటిపిల్లలు పడుకోడానికి అమ్మవడి పరుపు కాగా వెచ్చటి దుప్పటి‌ చీరకొంగే.
కొత్తవారు ఇంటికొచ్చినపుడు సిగ్గు పడే పిల్లలు ముఖం  దాచుకునేది అమ్మ కొంగు వెనకే. అలాగే పిల్లలు ఈ మహా  చెడ్డ ప్రపంచంలో కొత్తగా అడుగు లేస్తున్నప్పుడు, అమ్మ కొంగేే పెద్ద దిక్సూచి, మార్గదర్శి!
అలాగే వాతావరణం చలిగా ఉంటే అమ్మ కొంగుతోనే పిల్లలని వెచ్చగా చుట్టేది.
వంటచేసే తల్లి చెమట బిందువులు తుడుచు కొనేది కొంగుతోనే. వంటకు పొయ్యిలోకి తెచ్చే కట్ట ముక్కలు సూదులు తెచ్చేది కొంగులోనే!
అలాగే పెరటి తోటలో కూరగాయలు, పువ్వులు, ఆకుకూరలు వంటింటికి తీసుకొచ్చేది కొంగులోనే.
అంతేకాదు ఇల్లు సర్దడంలో భాగంగా పిల్లల ఆట వస్తువులు పాత బట్టలు వంటివి చీర కొంగులోనే కదా మూట కట్టేది.
ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్న అమ్మ చీరకొంగు లాంటి వస్తువు మరొకటి కనిపెట్టాలంటే చాలా కష్టం.
ఇంతటి అద్భుతమైన అమ్మ కొంగులో కనిపించేది మాత్రం అమ్మ ప్రేమే.
అంకితం:చీరకట్టే అమ్మలందరికీ 
అమ్మ ఒక మధుర జ్ఞాపకం.
తనకు నా ఆకలి ఎప్పుడు చెప్పాల్సిన అవసరం రాలేదు.
కొత్త బట్టలతో బైటకు వెళ్లివస్తే వెంటనే దిష్టి తీసేది.
పరీక్షలకు బయలుదేరితే తీపి పెరుగుతో ముందు నిలిచేది.
బాల్యంలో నా పిచ్చి భాషను క్షణంలో పసికట్టేది.
ఇలా ఎన్నో ఎన్నెన్నో.
అమ్మ పాలు తాగుతూ, పలుమార్లు తన్నుతూ ఉంటాడు/ఉంటుంది.
తనను తన్నేవారి కడుపు నింపే ఔదార్యం భగవంతుడు ఒక్క అమ్మకు మాత్రమే ఇచ్చాడు.
అమ్మ ఒక వేదం...
అమ్మ ఒక భక్తిభావం...
అమ్మ ఒక ప్రేమరూపం..
అమ్మ ఒక సంవేదన...
అమ్మ ఒక భావన...
అమ్మ ఒక పుస్తకం...
అమ్మ ఒక కలం...
అమ్మ ఒక కవిత...
అమ్మ ఒక జ్ఞానం...
అమ్మ ఒక గుడిలో దీపం...
అమ్మ ఒక హారతి పళ్లెం...
అమ్మ ఒక సుకుసుమం...
అమ్మ ఒక చల్లని చిరుగాలి...
అమ్మ ఒక అన్నపూర్ణ...
అమ్మ ఒక లాలిత్యం...
అమ్మ ఒక చీరకొంగు...
అమ్మ ఒక కరుణ...
అమ్మ ఒక దీవెన...
అమ్మ ఒక అక్షిత....
అమ్మ ఒక వర్షపు బిందువు...
అమ్మ ఒక మధురగేయం...
అమ్మ ఒక శ్వాస...
అమ్మ ఒక వూపిరి...
అమ్మ ఒక మురళి గానం...
అమ్మ ఒక జోలపాట...
అమ్మ ఒక పచ్చదనం...
అమ్మ ఒక కనురెప్ప...
అమ్మ ఒక దేవత...
అమ్మ ఒక పుడమి...
అమ్మ ఒక స్వచ్ఛత...
అమ్మ ఒక ప్రవచనం...
అమ్మ ఒక వెలుగు...
అమ్మ ఒక సుగుణం...
అమ్మ ఒక నమ్మకం...
అమ్మ ఒక ఆరోగ్యం...
అమ్మ ఒక భద్రత...
అమ్మ ఎన్నో ఎన్నెన్నో...
ఇది చదివిన వారికి ఇంతమంది అమ్మలు జీవించివున్నారో, మరణించినారో తెలియదు. కాని ఒక్క మాట చెప్పగలను ఎవరు అమ్మ దగ్గర ఉంటారో వారు అతిసంపన్నులు. అమ్మ సేవ భాగ్యం కలిగివుంటారో ధన్యులు, అదృష్టవంతులు.🙏

పక్కింటి గుసగుసలు

 🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

*BeautifuL $tor¥...®️✍🏻*   

   *పక్కింటి గుసగుసలు*

      _వనజా .... భోజనమైందా ? అంటూ ఇంట్లోకివచ్చింది రమ. ఆఁ వదినా  రండి ! ఇప్పుడే తిన్నాను అంది వనజ. సరే రా ...ఇటు కూర్చో అంటూ చొరవగా సోఫాలో సెటిల్  అయ్యి.... పక్కింటి_ *"ప్రియా వాళ్ళకోడలు ఇంట్లోంచి  వెళ్ళిపోయింది తెలుసా..!*  _అంది. ఆఁ ఆఁ  ఎప్పుడు ?కళ్ళు పెద్దయి  ,చేసుకుని సగం ముందుకు వాలి , నోరు తెరిచింది వనజ._

_ఇందాకే ! నేను వంటింట్లో నుంచి చూస్తుంటే,లిఫ్ట్ లోకి 'పెద్ద సూటుకేసు  లాక్కుంటా ,కళ్ళు తుడుచుకుంటా వెళ్ళింది . గబా గబా బయటికి వచ్చి వాళ్ళింటేపు చూస్తే, వాళ్ళత్త ధడాలున  తలుపేసుకుంది . ఏమైఉంటుందంటావ్ ?మీ  పక్కనేగ వాళ్ళు ?ఆరాగా అడిగింది._

_ఏదో ఆలోచిస్తున్నట్టు మొకం పెట్టి , నిజమే!వదినా .. నిన్న రాత్రి ప్రకాష్  అరుపులు విన్పించాయి  కూడా !అంది._
 _"మరే ఏదన్నా సమస్య వచ్చినపుడు ఇరుగు పొరుగు   సాయం తీసుకోవచ్చు కదా ఎప్పుడూ తలుపులు బిగించుకొని ఉంటారు. మనతో కూడా పెద్దగా కలవరు కూడాఎందుకో ?ఏంటో"అనుమానం గా  చెప్తుంది._

_ఇంతలో కరుణ కూడా తలుపు తోసుకుని వచ్చింది._  _"ఏంటక్కా ? వనజ ఫ్లాట్ కి రమ్మని ఫోన్ చేసావ్" అంటూ,_
_"ఆఁ  రారా ...ఇక్కడైతే వాసు రాత్రి దాక రారు కదా !! ఫ్రీ గా  మాట్లాడుకోవచ్చని రా !కూర్చో" అంటూ రమ, కూర్చో కరుణా ...అంటూ ప్రియ కోడలి గురించి చెప్పుకొచ్చింది వనజ .మొన్న సాయంత్రం టెర్రస్  మీద ఒక్కటే కూర్చొని ఉంది. నేను పలకరించినా...సరిగ్గా మాట్లాడలేదు  కూడా" కరుణ కూడా మాట  చేర్చింది._

_ఇంకో నలుగురికి ఫోన్లు వెళ్ళినాయి .అందరూకలిసి "ఆ అమ్మాయి ని ,అత్తా, మామ ,మొగుడు రాచి రంపాన బెటుతుంటే , భరించలేక పిల్లాడ్ని కూడా ,వదిలేసి వెళ్ళిపోయింది" అని మేటర్ రెడీ చేసారు. ఫ్లాట్స్ మొత్తం తిరిగిందీ విషయం. అందరికీ  ఈ  విషయం తెల్సినా ,ప్రియా నెవరూ అడగరు._
_ఎందుకంటే ? ఎవరు చెప్పారంటే ...మరి ఎవరి పేరు చెప్పకూడదుకదా._

_సాయంత్రం ప్రియా,ఆమె భర్త, కొడుకు ,మనవడ్ని  తీసుకుని   లిఫ్ట్ దగ్గరకొచ్చి  నిలబడ్డారు .వీళ్ళని చూసిన  రమ"కోడలు గాని ..పోలీస్ రిపోర్ట్ పెట్టిందా ఏమిటి వీళ్ళమీద పరారవుతున్నట్టున్నారు._
_ఈమధ్య ఆడపిల్లలు , అత్తింటి మీద కేసులు  బాగానే పెడుతున్నారు."కథ  అల్లేసుకుని ,ఫోన్ చేతిలోకి తీసుకుంది._ 

_ఇంతలో "రమా గారు" ....అంటూ పిలిచింది  ప్రియ.  "ఆఁ  ఏంటండీ ప్రియా గారు అంటూ వచ్చి ఏమి తెలియనట్టు ఎక్కడికండీ  ప్రయాణం" ?అని అడిగింది._
*మా వియ్యపురాలికి హార్ట్ అటాక్* _వచ్చిందని  వాళ్లన్న  ఫోన్ చేస్తే మా కోడలు పొద్దున  హడావుడిగా వెళ్ళింది._
_నేను వీళ్లిద్దరికీ ఫోన్లు చేసి ,మనవడ్ని  స్కూల్ నుండి తీసుకు రమ్మని చెప్పిఇప్పుడెళ్తున్నాము."_
_వాళ్ళమ్మగారి  పాత  మెడికల్ రిపోర్ట్స్, అన్నీ మాఇంట్లో మర్చిపోయారు. మొన్న చెకప్ కి వచ్చినపుడు ,అవి తీసుకుని ఫ్లయిట్  కి వెళ్ళింది. మేము ఇప్పుడెళ్తున్నాము. ప్రమాదమే అంటున్నారు  పాపం" అని  బాధగా చెప్తూ లిఫ్ట్ లోకి వెళ్లిపోయారు._
 

_చూడండి మిత్రులారా..! ఇప్పుడైనా... ప్రియా గారు ఈ విషయం చెప్పకుండా వెళ్ళిపోతే  ,ఇంకెన్ని_ *పుకార్ల పొగ పెట్టేవారో* 
_కదా ! ఈనాటి కాలంలో పక్కింట్లో ఏం జరుగుతుందో ఎదురింట్లో ఏం జరుగుతుందో గమనించే ఆసక్తి మన ఇంట్లో ఏం జరుగుతుందో గమనించరు._  
*నిజం నోరు తెరిచే లోగా  అభద్ధం ఊరంతా  చుట్టేసింది"* 

_ఇలాంటి పక్కింటి వారి గుస గుసలకి_ *ఏకైక పరిష్కార మార్గం* 
_👉🏼అందరితో కలిసి నవ్వుతూ పలకరించడం..!_
_👉🏼కష్టసుఖాల్లో అండగా ఉండడం..!_ 
_👉🏼శుభ అశుభ కార్యక్రమాల్లో పాల్గొనడం.!_

మీ.....®️✍🏼

🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️

 *ॐ* _:సర్వేజనాః సుఖినోభవంతు:_ *ॐ*
        ::::::::::::::::::::::::::::::::::::::::

నేటి మంచి మాట

 ::::::::::::::::::::::::::::::::::::::::
         *☘️నేటి మంచి మాట☘️*
        :::::::::::::::::::::::::::::::::::::::::

_మనిషి అనే వాడు తాను ఎన్ని చదువులు చదివినా.. ఎంత అనుభవం గడించినా.. జీవితాన్ని ఆస్వాదించడం.. జీవించడం ఎలాగో తెలియని అమాయకత్వంతో అజ్ఞానిగా మిగిలిపోతున్నాడు.. మనిషి జ్ఞానానికి.. అజ్ఞానానికి చదువులు ఒక్కటే కారణం కాదని మహాపురుషుల జీవితాలు పరికిస్తే అర్ధమవుతుంది.. అక్షరజ్ఞానం లేకపోయినా "ఆత్మజ్ఞానం" తెలిసినవారు.. కష్టసుఖాలలో మానవత్వంతో.. సమభావంతో జీవించడం సాధ్యమని.. మహాపురుషులు జీవించిన భారతావని సంస్కృతిని పరిశీలిస్తే బోధపడుతుంది.._

_'నేను' అనగానే మనిషికి బోధపడే అంశం ఒడ్డు పొడుగు గల తన దేహపు బాహ్య దృశ్యరూపమే.. అవును కదా..! ఆ రెండక్షరాల "నేను" అనే పదం అవ్యక్తంగా హృదయస్థానంలో కొలువై ఉండే.. నేను అనే నీ ఆత్మకు ముడిపడి ఉన్నదే నీ "శరీరం" అని చెబుతారు వేదాంతులు.._

🦋☘️🍁🌷🌹🍂🍃🍀🌾🌿🎋🌱
   *🌼మహనీయుల మాట🌼*
        :::::::::::::::::::::::::::::::::::::::::

_ఓ మనిషి.. నీ జీవితం ఏ స్థాయిలో ఉన్నా ఉరుకులు పరుగులతో కూడి ఉంటుంది.. ఆదిమ మానవుడు ఎలా జీవించాడో ఏమోగానీ.. ఆధునిక మానవుడు మాత్రం బతుకు యాత్రలో ఊపిరి సలపని వేగంతో.. ఆందోళనను గుండెల నిండా నింపుకొని పయనిస్తున్నాడు.. నాటి మానవుడు పూట గడవడం కోసం.. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం.. భద్రంగా జీవించడం కోసం తపనపడి ఉంటాడు.. నేటి మానవుడు అన్ని సౌకర్యాలు అందివచ్చినా.. సరే.. మనిషి తనకు వచ్చిన ఒత్తిడిని పుణికిపుచ్చుకొని హాయిగా.. సుఖంగా.. జీవించలేకపోతున్నాడనేది.. నిజం.._

_ఈ సమాజంలో మనసుకు హత్తకునేలా మాట్లాడేవారు కొందరు ఉంటే.. మనసు నొచ్చుకొనేలా మాట్లాడేవారు కొందరు ఉంటారు.. మనస్ఫూర్తిగా మాట్లాడేవారు కూడా కొందరు ఉన్నారు.. ఈ అందరి మధ్య సాగే జీవనప్రయాణమే నీ జీవితం.._

Saturday, October 28, 2023

యేడు విడిచి వర్తించు వాడు వివేక ధనుఁడు

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *ఒకటిఁగొని, రెంటి నిశ్చల యుక్తిఁజేర్చి, మూఁటి నాల్గింటఁగడు వశ్యములుగఁజేసి, యేనిటిని గెల్చి, యాఱింటి నెఱిఁగి, యేడు విడిచి వర్తించు వాడు వివేక ధనుఁడు*
💖 *~ఈ పద్యం శ్రీమదాంధ్ర మహా భారతము ఉద్యోగ పర్వం లోనిది. తిక్కన రచన.*
💓 *సంజయ రాయబారం ముగిసింది. ఆ విశేషాలింకా ధృతరాష్ట్ర మహారాజు చెవిని పడలేదు. రాజు వ్యాకులచిత్తుడై ఉన్నాడు. ఆందోళనతో తనకి నిద్ర పట్టడంలేదని, తన మనస్తాపం ఉపశమించేలా నాలుగు మంచి మాటలు చెప్పమనీ విదురుని కోరాడు.* 
💕 *అప్పుడు విదురుడు కురు మహారాజుకి బోధించిన హిత వచనాలలో ఇదొకటి*
💞 *ఒక దానిని స్వీకరించి, రెండింటిని స్థిర పరచుకుని, మూడింటిని నాలుగింటి చేత వశపరచుకుని, ఐదింటిని జయించి, ఆరింటి గురించిన ఎఱుక గలిగి, యేడింటిని ఎవడు విడిచి పెడతాడో, అతడే వివేకధనుడని స్థూలంగా ఈ పద్యం చెబుతున్నది.*
💖*ఈ అంకెల మర్మం తెలుసుకుంటే నిగూఢమైన తాత్త్వికార్ధం సుబోధకమవుతుంది.*
❤️ *మన పెద్దలు ఈ పద్య భావాన్ని విడమరిచి చెప్పారు.*

💖 *’ప్రభుత్వాన్ని చేపట్టి, మంత్రం ( ఆలోచన), ఉత్సాహం అనే రెండింటినీ స్థిరంగా చేసుకుని, మిత్రులు, శత్రువులు, తటస్థులు అనే మూడు వర్గాల వారినీ సామ దాన భేద దండోపాయాల చేత ( ఈ నాలుగింటి చేత) పూర్తిగా వశం చేసుకుని, పంచేంద్రియాలనూ ( త్వక్కు, చక్షువు,శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణము) జయించి, సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైదీభావము, సమాశ్రయములను తెలుసుకుని, సప్తవ్యసనాలను ( స్త్రీ, జూదము, పానము, వేట, కఠినముగా మాటలాడుట, తగని వెచ్చము, కఠిన దండము ) విడిచిపెట్టి ఎవడైతే ప్రవర్తిస్తాడో, అతడు వివేకవంతుడు’ అని…!*
💖 *ఇంకా వేరే విధమైన వ్యాఖ్యానాలూ ఉన్నాయి.*

💞 *”సద్బుద్ధిని కలిగి ఉండి, వాక్కు, క్రియ అనే రెండింటినీ నిశ్చలత్వంతో ఒకటిగా చేర్చి, ధర్మార్ధ కామాలనే మూడింటినీ, బ్రహ్మచర్య, గార్హ్యస్థ వానప్రస్థ, సన్యాసములనే నాలుగింటితో వశపరచుకుని, వాక్, పాణి, పాదము, వాయువు, గుహ్యము అనే కర్మేంద్రియాలనైదింటినీ గెలిచి యజన, యాజన, అధ్యయన, ఆధ్యాపన, దాన, ప్రతిగ్రహములనే ఆరు స్మార్త కర్మలనీ తెలుసుకుని, పంచభూతాలూ, బుద్ధి, అహంకారం అనే ఏడింటినీ విడిచి ప్రవర్తించే వాడు వివేకవంతుడు” అని కూడా చెప్పారు.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~సకల జనుల శ్రేయోభిలాషి*
💕 *~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

థాయిలాండ్ లో రామరాజ్యం మీకు తెలుసా?

 *🍁థాయిలాండ్ లో రామరాజ్యం మీకు తెలుసా?🍁*
📚✍️ మురళీ మోహన్ 

👌 థాయిలాండ్ లో  రాజ్యాంగ ప్రకారం ఒక రామరాజ్యం ఉంది అని మనలో చాలామందికి తెలియదు. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్ " అనే రాజు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు. 
 
*👉సంక్షిప్తంగా ఇతిహాసాలలో శ్రీరాముని చరిత్ర.*

వాల్మీకిమహర్షి రచించిన రామాయణం మనకు మతగ్రంథమే కాదు, చారిత్రక గ్రంథం కూడా. వాల్మీకి మహర్షి బాలకాండ లోని 70,71 &73 సర్గలలో రాముని వివాహాన్ని , తమ్ముల వివాహాలను కూడా వర్ణించడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే -

మిథిలకు రాజు సీరధ్వజుడు. ఆయనకు విదేహరాజు అన్న పేరు కూడా ఉంది. ఆయన భార్య సునేత్ర లేక సునయన. ఆయన పుత్రిక అయిన జానకికి రామునితో వివాహం జరిగింది. జనకుడికి కుశధ్వజుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని రాజధాని సాంకశ్యనగరం. అది ఇక్షుమతీనది ఒడ్డున ఉంది. ఈ కుశధ్వజుడు తన పుత్రికలైన ఊర్మిళ , మాండవి , శ్రుతకీర్తులను లక్ష్మణ, భరత, శతృఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. కేశవదాసు రచించిన రామచంద్రిక అనే గ్రంథం ఆధారంగా (పేజీ 354), సీతారాములకు లవకుశులు ,   ఊర్మిళాలక్ష్మణులకు అంగద చంద్రకేతులు , మాండవీభరతులకు పుష్కరుడు - తక్షుడనే వాళ్ళు , శృతకీర్తిశతృఘ్నులకు సుబాహువు - శతృఘాతకుడనేవాళ్ళు జన్మించారు. 

*👉శ్రీరామునిసమయంలోనే రాజ్యవిభజన జరిగింది.*

పశ్చిమంలో లవునకు లవపురం ( లాహోర్ ) , తూర్పున కుశునకు కుశావతి , తక్షునకు తక్షశిల , అంగదునకు అంగదనగరం , చంద్రకేతునకు చంద్రావతి లను ఇవ్వడం జరిగింది. కుశుడు తన రాజ్యాన్ని తూర్పుదిక్కుగా విస్తరింపజేసాడు. ఒక నాగవంశపు కన్యను వివాహం చేసుకున్నాడు. థాయిలాండ్ లోని రాజులంతా ఆ కుశుని వంశంలోని వారే. ఈ వంశాన్ని #చక్రీ వంశము అంటారు. చక్రి అంటే విష్ణువనే అర్థం కదా! రాముడు విష్ణుభగవానుని అవతారం. అదీగాక, రాజు విష్ణుస్వరూపమే కదా ! అందువలన వీళ్ళు తమ పేర్లచివర #రామ్ అన్న పేరు తగిలించుకుని , వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 9వ రాముడు రాజ్యం చేస్తున్నాడు. అతని పేరే #భూమిబల్_అతుల్య_తేజ్.

*👉థాయిలాండ్ యొక్క అయోథ్య*

థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో Bangkok అని అంటున్నాము కదా ! అయితే ప్రభుత్వరికార్డులలో అధికారిక రాజధాని పేరువింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ని అన్నిదేశాల రాజధాను లలో ఇదే పొడుగైన పేరుగల రాజధాని. అంతేకాదండోయ్ , ఆ పేరు సంస్కృతంలో ఉంది. ఏమిటో మీరే చదవండి - "  క్రుంగదేవ మహానగర 
అమరరత్న కోసింద్ర మహింద్రాయుధ్యా మహా తిలక భవ నవరత్న రజధానీపురీ రమ్య ఉత్తమ రాజ నివేశన అమర విమాన అవతార స్థిత శక్రదత్తియ విష్ణుకర్మ ప్రసిద్ధి " . 

థాయిభాషలో పైపేరుని రాయడానికి 163 అక్షరాలు వాడారు. ఇంకోవిశేషమేమిటంటే వాళ్ళు రాజధాని పేరుని చెప్పమంటే పలకరు , పాటలా పాడుతారు. కొంతమంది సంక్షిప్తంగా "మహింద్ర అయోధ్య" అని అంటారు. ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్థం. థాయిలాండ్ రాజులందరూ ఈ అయోథ్యలోనే నివసిస్తారు. 

*👉 థాయిలాండ్ లో నేటికీ రామరాజ్యం ఉంది.*

థాయిలాండ్ లో 1932 లో ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలు బౌద్ధమతస్తులైనా , రామరాజ్యాన్నే అనుసరిస్తున్నారు. అక్కడి రాజవంశం వారనెవరినీ విమర్శించడం గానీ , వివాదాలలోకి లాగడంగానీ చేయరు. వారంతా పూజనీయులని విశ్వసిస్తారు. రాజవంశంవారి దగ్గర నిటారుగా నిలబడి మాట్లాడరు, వంగి మాట్లాడతారు. ప్రస్తుత రాజుకి ముగ్గురు కూతుళ్ళు. అందులో చివరి కూతురికి హిందూధర్మశాస్త్ర పరిజ్ఞానముంది.

*👉 థాయిలాండ్ జాతీయగ్రంథం రామాయణం*

థాయిలాండ్ వారు అధికశాతం బౌద్ధులైనా , వారి జాతీయగ్రంథం రామాయణము అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. థాయిభాషలో దానిని "రామ్ కియేన్ " అని పిలుస్తారు. మన వాల్మీకిరామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి. ఒకసారి 1767లో  రామ్ కియేన్ పాడైపోయినదట. అపుడు రాజైన రామ-1 (1736 -1809) తన స్మరణశక్తితో తిరిగి రామాయణమంతా రచించినాడట. రామాయణం జాతీయగ్రంథంగా వారు ప్రకటించుకున్నారు. మనదేశంలోలాగా దిక్కుమాలిన సెక్యులరిజం లేకపోవటం వారి అదృష్టం. 

థాయిలాండ్ లో రామ్ కియేన్ ( రామాయణం) ని అనుసరించి నాటకాలు , తోలుబొమ్మలాటలు ఉన్నాయి. వారి నాటకాలలోని పాత్రలు చూద్దాం - 
1. రామ్ ( రాముడు )
2. లక్ ( లక్ష్మణుడు )
3. పాలీ ( వాలి )
4. సుక్రీప్ (సుగ్రీవుడు )
5. ఓన్కోట్ ( అంగదుడు )
6. ఖోంపూన్ ( జాంబవంతుడు )
7. బిపేక్ ( విభీషణుడు )
8. తోతస్ కన్ ( దశకంఠ ) రావణుడు 
9. సదాయు ( జటాయు )
10. సుపన్ మచ్ఛా (శూర్పణఖ )
11. మారిత్ ( మారీచుడు )
12. ఇంద్రచిత్ (ఇంద్రజిత్ ) మేఘనాదుడు.

*👉 థాయిలాండ్ లో హిందూదేవీదేవతలు* 

ఇక్కడ బౌద్ధులు అధికసంఖ్యాకులు. హిందువులు అల్పసంఖ్యలో ఉన్నారు. ఇక్కడ బౌద్ధులు కూడా ఈ హిందూ దేవీ దేవతలను పూజిస్తారు.
1. ఈసుఅన్ ( ఈశ్వర్ ) శివుడు
2. నారాయి (నారాయణ్ ) విష్ణువు 
3. ఫ్రామ్ ( బ్రహ్మా )
4. ఇన్ ( ఇంద్రుడు )
5. ఆథిత్ ( ఆదిత్య ) సూర్యుడు
6. పాయ్ ( వాయు ) 

*👉 థాయిలాండ్ జాతీయపక్షి గరుత్మంతుడు*

గరుడపక్షి చాలా పెద్ద ఆకారంతో ఉంటుంది. ప్రస్తుతం ఈజాతి లుప్తమైపోయిందని భావిస్తున్నారు. ఇంగ్లీషులో ఆశ్చర్యంగా దీనిని బ్రాహ్మణపక్షి ( The Brahmany Kite )  అని పిలుస్తారు. దీని సైంటిఫిక్ నామధేయం "Haliastur Indus". ఫ్రెంచ్ పక్షిశాస్త్రజ్ఞుడు మాథురిన్ జాక్స్ బ్రిసన్ 1760 లో దీనిని చూసి Falco Indus అన్న పేరు పెట్టాడు. ఈయన దక్షిణభారత్ లోని పాండిచెరీ పట్టణం వద్ద కొండలలో దీనిని చూసానని తెలిపాడు. అందువల్ల ఈ పక్షి కల్పన కాదు అని అవగతమౌతోంది. మన పురాణాలలో ఈపక్షిని విష్ణుభగవానుని వాహనంగా పేర్కొన్నారు. థాయిలాండ్ ప్రజలు ఎంతో గౌరవంతో తమ రాజు రాముని అవతారం కనుక , ఆ రాముడు విష్ణువు అవతారమనీ , ఆ విష్ణువు వాహనం కనుక గరుడపక్షిని తమ జాతీయపక్షిగా చేసుకున్నారు. అంతేకాదు థాయిలాండ్ పార్లమెంటు ఎదురుగా గరుడుని బొమ్మ కూడా పెట్టుకున్నారు. 

*👉 థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ పేరు సువర్ణభూమి* 

మన దౌర్భాగ్యం కొద్దీ మనదేశంలో ముస్లిం ఆక్రమణదారులు మన సంస్కృతిని నాశనం చేసి ముస్లింపేర్లతో మన పట్టణాలనూ , పట్టణాలలోని వీథులనూ మార్చివేసారు. స్వాతంత్రానంతరం పాలకులు సెక్యులరిజం పేరుతో హిందువులతోనూ , హిందూసంస్కృతితోనూ ఆటలాడుకున్నారు. కానీ , థాయిలాండ్ లోని రాజధాని లోని ఎయిర్ పోర్ట్ కు చక్కని సంస్కృతంలోని పేరు "సువర్ణభూమి" అని పెట్టుకున్నారు. వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఎయిర్ పోర్టు ఇదే. దీని వైశాల్యం 563,000 sq.mt. ఎయిర్ పోర్టు ముందు "సముద్రమంథనం " ని ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు , రాక్షసులు చేసే క్షీరసాగరమథనాన్ని చూపిస్తుంది.

*👉 ఈ వ్యాసం ఉద్దేశ్యం*

_*అసలైన సెక్యులరిజం అంటే ఏమిటో మనం థాయిలాండ్ ని చూసైనా నేర్చుకోవాలి. మనసంస్కృతిని మనమే మర్చిపోతే జాతికి మనుగడ ఉండదు అని గ్రహించాలి. మన పిల్లలకు , రాబోయేతరాలకు మనసంస్కృతిని వారసత్వ సంపదగా మనమే అందించాలి 🙏*_

అమ్మాయిలూ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో మీ ఫోటోలు పెడుతున్నారా.? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే

 Andhra Pradesh  Visakha Police Arrested A Man Who Blackmailed Young Woman That He Would Post Morphing Photos On Social Media
Andhra Pradesh: అమ్మాయిలూ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో మీ ఫోటోలు పెడుతున్నారా.? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే
సైబర్‌ క్రైమ్‌ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. చాలామంది ఆర్థికంగా చితికిపోతే.. మరికొందరు వ్యక్తిగత జీవితాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల ఎమోషన్స్ తో నేరగాళ్లు ఆటలాడుకుంటున్నారు. స్నేహం చేసి వాళ్ల ఫోటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. దీంతో కక్కలేక మింగలేక లోలోన మదన పడిపోతూ ఆత్మహత్యాయత్నాలకు వెళ్లే పరిస్థితిలు కూడా దారితీస్తున్నాయి...

Andhra Pradesh: అమ్మాయిలూ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో మీ ఫోటోలు పెడుతున్నారా.? అయితే మీరు చిక్కలో పడినట్లే 
సోషల్ మీడియా ద్వారా ఎంత లాభాలు ఉన్నాయో.. అప్రమత్తత లేకుంటే అన్నే అనర్ధాలు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. టెక్నాలజీతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. ఒకప్పుడు భౌతికంగా బెదిరించి, దాడులు చేసి దోచుకునే వారు ఇప్పుడు ఆన్‌లైన్‌లో బెదిరింపులకు దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.


సైబర్‌ క్రైమ్‌ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. చాలామంది ఆర్థికంగా చితికిపోతే.. మరికొందరు వ్యక్తిగత జీవితాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల ఎమోషన్స్ తో నేరగాళ్లు ఆటలాడుకుంటున్నారు. స్నేహం చేసి వాళ్ల ఫోటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. దీంతో కక్కలేక మింగలేక లోలోన మదన పడిపోతూ ఆత్మహత్యాయత్నాలకు వెళ్లే పరిస్థితిలు కూడా దారితీస్తున్నాయి. తాజాగా విశాఖలో ఓ యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసి డబ్బులు కోసం వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. విశాఖకు కు చెందిన ఓ యువతి కి అజ్ఞాత వాట్స్అప్ ఎకౌంటు ద్వారా మెసేజ్ వచ్చింది. అది ఫేక్ ఎకౌంటు. తనకు వ్యక్తిగత ఫోటోలను మార్ఫింగ్‌ వాట్సాప్ లో పంపించాడు అజ్ఞాతకుడు. సాధారణ ఫోటోలను బూతు ఫోటోలుగా మార్చి పంపించాడు. ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టాడు. నగదు పంపాలని బెదిరింపులకు దిగాడు. లేకుంటే.. ఫోటోలను మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో ఒక్కసారిగా షాకైన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. సాంకేతిక సహాయంతో నిందితుడిని ట్రాక్ చేశారు. బర్మా క్యాంప్ కు చెందిన 19 ఏళ్ల బొడ్డేటి ఢిల్లీష్ గా గుర్తించి అరెస్టు చేశారు.


జాగ్రత్తగా ఉండాల్సిందే..
సోషల్ మీడియా.. ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ లో రిక్వెస్ట్ వచ్చినా అజ్ఞాత వ్యక్తులను యాక్సెప్ట్ చేయవద్దని అంటున్నారు పోలీసులు. అపరిచిత వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలియని లినక్స్ క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కి. భవాని ప్రసాద్ సూచించారు.

చేసిన ఆచారాలు ఏదైనా....

 *అమృతం గమయ*

*అమృత సత్యం*

*మనఃశుద్ధేన శుద్ధస్స్యాత్*
*దేహినాం నాత్ర సంశయః |*
*వృథా తద్వ్యతిరేకేణ*
*కాయస్యైవ కదర్థనమ్ |*
(జ్ఞానార్ణవం)

మనము శుద్ధి అయ్యేది మనఃశుద్ధి ఉంటే మాత్రమే. మనసులో కాలుష్యం నింపుకొని చేసిన  ఆచారాలు ఏదైనా వట్టి దేహదండనయే!

ఇదే జీవన లక్ష్యం

 🌸 Amritham Gamaya 🌸

All mundane vocations terminate in desolation. This is the law of the nature which is inexorable and ineluctable. Possession cease in relinquishing, assets in destruction, unions in disunions, births in death. You shall know this immediately and renounce undue accretion and accumulation to start walking towards realizing the absolute truth that results in bliss, the objective of life - SathChith

అమృతం గమయ

అన్ని ప్రాపంచిక వృత్తులు నిర్జనమైపోతాయి. ఇది ప్రకృతి నియమం, ఇది వర్ణించలేనిది మరియు మనం ఇష్టపడనిది. పొందినవి విడిచిపెట్టబడడం, ఆస్తులు నశించిపోవడం, కలయికలు విడిపోవడం, జననాలు మరణాలవడం. మీరు దీన్ని వెంటనే తెలుసుకోవాలి మరియు సంపూర్ణ ఆనందానికి దారితీసే సంపూర్ణ సత్యాన్ని గ్రహించడం వైపు నడవడం ప్రారంభించడానికి అనవసరమైన కూడికలను మరియు సంచితాలను త్యజించాలి, ఇదే జీవన లక్ష్యం - సత్ చిత్.

अमृतम् गमय

सभी सांसारिक वृत्तियों  उजाड़ जाएगा। यह प्रकृति का नियम है, जो अवर्णनीय और अप्रिय है।  छुटते जो  पाते, संपत्ति - विनाश होने में, मिलन - विघटन होने में , जन्म - मृत्यु में। आपको इसे तुरंत जानने और अनावश्यक अधिग्रहण और संचय से बचने की आवश्यकता है, जिससे पूर्ण सत्य को प्राप्त करने की दिशा में चलना शुरू हो सके जो परम आनंद की ओर ले जाए, ओर यही जीवन का लक्ष्य - सतचित।

మీరు ఎప్పటికీ ఆనందకరమైన స్థితి గురించి ఆలోచించలేరు మరియు పొందలేరు

 🌸 Amritham Gamaya 🌸

If you ill-treat yourself or ill-treat others or if you enjoy ill-treating, you would never get to a state of blissfulness - SathChith.

🌸 అమృతం గమయ 🌸

మీరు మీ పట్ల చెడుగా ప్రవర్తించినా లేదా ఇతరులతో చెడుగా ప్రవర్తించినా  లేదా మీరు చెడుగా వ్యవహరించడం ఆనందించినా, మీరు ఎప్పటికీ ఆనందకరమైన స్థితి గురించి ఆలోచించలేరు మరియు పొందలేరు - సత్ చిత్.

🌸 अमृतं गमय 🌸

यदि आप स्वयं के साथ बुरा व्यवहार करते हैं या दूसरों के साथ बुरा व्यवहार करते हैं  या तो आपको बुरा व्यवहार करने में आनंद आता है, तो आप कभी भी सुखी स्थिति के बारे में सोच नहीं पाएंगे और सुखी स्थिति में नहीं जा पाएंगे - सत चित।

***** నీతికథలు-172* 👈 *ఒకమంచి అబ్బాయికథ

 👉 *నీతికథలు-172* 👈

 *ఒకమంచి అబ్బాయికథ* 

అది 1997 సంవత్సరం, ఉత్తరప్రదేశ్ లోని ఆలిఘడ్ (Alighar) కి చెందిన ఒక యువకుడు ఢిల్లీ యూనివర్సిటీ లో డిగ్రీ పూర్తి చేశాడు. అతనిది మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబం. తండ్రి ప్రకాష్ శర్మ ఒక సాధారణ స్కూల్ టీచర్. ఆస్తిపాస్తులు ఏమీ లేవు, చిన్న ఇల్లు తప్ప. డిగ్రీ పూర్తి చేయగానే అతను ఒక చిన్న Software కంపెనీలో ఉద్యోగం లో చేరాడు. అందరి తల్లితండ్రులలా అతని తల్లితండ్రులు కూడా ఉద్యోగం వచ్చిన వెంటనే సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అక్కడి నుండీ  మొదలయ్యాయి అతని తిప్పలు. ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో సంబంధాలు పోయాయి. ఆడపిల్లల తల్లితండ్రులు ఒకపట్టాన పెళ్లికి ఒప్పుకునేవారు కాదు. జాతకాలు కలవలేదు, గ్రహాలు కలవలేదు, సస్టాష్టకాలు అడ్డంకి, దోషాలు, శాఖా బేదం, అబ్బాయి తల్లితండ్రులు పెద్దవాళ్ళు, అబ్బాయి తల్లితండ్రలు ఇంట్లో ఉంటే రేపు పెళ్లయ్యాక మా అమ్మాయి మీదనే చాకిరీ అంతా పడుతుంది, జీతం తక్కువ, ఆస్తులు పెద్దగా లేవు అని, ఇలా ఏవేవో కారణాలు చెప్పి No అనేవారు. కొంతమంది అమ్మాయిలు అయితే పెళ్లి చూపుల సమయం లో direct గా అతని మొహం మీదనే నువ్వు handsome గా లేవు, బండగా ఉన్నావు, పొట్ట ఉంది, మాకు అందంగా ఉన్న అబ్బాయి కావాలి, Sixpack body ఉండాలి, నెలకి ఆరంకెల జీతం ఉండాలి, ఖరీదైన కార్లు ఉండాలి, అమెరికా లో settle అవ్వాలి, ఇవన్నీ నీలో లేవు అంటూ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇలాగే ఏదో ఒక కారణం తో ఎన్నో సంబంధాలు పోయేవి. వెతకని సంబంధం లేదు, చూడని పిల్ల లేదు. తల్లితండ్రులు అతని పెళ్లి గురించి చేయని ప్రయత్నం లేదు, మొక్కని దేవుడూ లేడు. ఇదిలా ఉండగా అతను 2000వ సంవత్సరం లో One97 Communications పేరుతో సొంతంగా ఒక కంపెనీ ప్రారంభించాడు. అప్పటికి ఇంకా అతనికి తల్లితండ్రులు సంబంధాలు వెతుకుతూనే ఉన్నారు. ఈసారి ఇంకొక వింత పరిస్థితి ఎదురైంది. మీ అబ్బాయి సొంతగా కంపెనీ పెట్టుకున్నాడు, రేపు అది దివాళా తీస్తే మా అమ్మాయి చాలా ఇబ్బందులు పడాలి అంటూ మళ్ళీ ఆడపిల్లల తల్లితండ్రుల వింత ప్రశ్నలు వేయటం మొదలు పెట్టారు. నీ కంపెనీ మూసేసి ఏదైనా software ఉద్యోగం కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ చూసుకుంటే ఆలోచిస్తాము అనేవారు మరికొందరు. ఇలా ఎంతోమంది అతనితో పెళ్లికి ఒప్పుకోలేదు. పదుల సంఖ్యలో సంబంధాలు పోయేవి. ఎవరు ఎన్ని మాటలు అన్నా, తన తల్లితండ్రులు దిగులు చెందినా అతనిలోని ఆత్మస్థైర్యం మాత్రం సడలలేదు. నీ requirements ఏంటి బాబు అని ఎవరైనా అడిగితే, మా తల్లితండ్రులని బాగా చూస్కునే అమ్మాయితే చాలు అని అతను వినయంగా బదులిచ్చేవాడు. అంతకుమించి అతనికి వేరే ఆశలు లేవు. ఎంత ప్రయత్నించినా సంబంధం కుదరలేదు. కాలం గడుస్తూ ఉండగా, దాదాపు 8ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత 2005వ సంవత్సరం చివరి నాటికి అతనికి మృదుల పరాశారన్ అనే అమ్మాయితో పెళ్లి కుదిరింది. 

ఎన్ని కష్టాలు ఎదురైన, ఎన్ని అవమానాలు ఎదురైన అతనిలోని ప్రతిభ, పట్టుదల, కార్యదీక్షత ముందు విధి ఓడిపోయింది. 2012 లో అతను PAYTM పేరుతో స్థాపించిన ఒక కంపెనీ అతని జీవితాన్నే మలుపు తిప్పింది.అక్కడితో అతని విజయాల పరంపర మొదలైంది. సంస్థ ఎంత ఎత్తుకు ఎదిగింది అంటే అతని సంస్థలో అనీల్ అంబానీ(Reliance Capital), వారెన్ బఫెట్(ప్రపంచ కోటీశ్వరుడు) Berkshire Hathaway కంపెనీ, చైనా బాంకు(ANT Corporation), కెనడా ప్రభుత్వం, Soft Bank వంటి ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేంతగా. అతని సంస్థలో ప్రస్థుతం 10 మంది CEO లు, 18000 మంది ఉద్యోగస్తులు, 10 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. అతని ఆస్తి ప్రస్తుతం 20,000 వేల కోట్లు దాటింది అని ఒక అంచనా. FORBES పత్రిక అత్యంత ప్రతిభావంతమైన వ్యాపారవేత్తలలో జాబితాలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ  ల సరసన అతని పేరు కూడా ఉంది. అతనే "విజయ్ శేఖర్ శర్మ" , Paytm Group Founder & CEO. విచిత్రం ఏంటంటే అతనీతో పెళ్లి ఇష్టం లేదని, అందంగా లేడనీ, ఆస్తులు లేవనీ ఛీత్కరించిన ప్రతి అమ్మాయి కూడా తర్వాత విజయ్ శేఖర్ శర్మ ఫోటోని Forbes పత్రిక front పేజీ లో చూసుకుంటూ అతనిని మిస్ అయ్యామే అని బాధపడ్డవారే.ఎంతోమంది అమ్మాయిలు  ఒకప్పుడు అతని ఫోటో ని చెత్తబుట్టలో పడేసారు. కానీ ఇప్పుడు అతనితో ఒక చిన్న selfie కోసం ఎగబడేవారు ఎందరో !!  HCL సంస్థ వ్యవస్థాపకుడు శివ నాడార్, మిట్టల్ స్టీల్ కంపెనీ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ కధలు కూడా ఇంచుమించు ఇలాంటివే.

ఇందులలో చెప్పవల్సింది ఏంటంటే (ముఖ్యంగా ఆడపిల్లల తల్లితండ్రులకు) ఒక అబ్బాయి జాతకం బాగలేదనో, అతనికి జీతం తక్కువనో, అతని తల్లితండ్రులు పెద్దవాళ్ళు అనో, అందంగా లేడనో, Sixpack లేదనో, America H1B వీసా లేదనో అబ్బాయిలని కాదనకండి. ఒకరి జాతకం ఇలాగే ఎల్లకాలం ఉంటుందని, మధ్యతరగతి అబ్బాయికి ఇస్తే మన అమ్మాయి అత్తారింట్లోకి వెళ్ళాక కష్టాలు  పడుతుందనీ అన్నీ ముందే వూహించుకుని పెళ్లిళ్లు కాదనటం సరికాదు. అన్నిటికీ మించి మా అమ్మాయి ఫలానా డిగ్రీలు చదివింది, అంతకంటే ఎక్కువ చదివిన అబ్బాయి మాత్రమే కావాలి లేదా ఫలానా యూనివర్సిటీలలో చదివిన వారు మాత్రమే కావాలి అంటే ఎలా ??  ఎంతసేపూ ఈ సంబంధం కంటే ఇంకా మంచి option వస్తుందేమో, అదీ కాకపోతే ఇంకా ఇంకా better option వస్తుందేమో అని ఎదురు  చూస్తూనే ఉంటే ఈ మధ్యలో మీరు విజయ్ శేఖర్ శర్మ లాంటి వారిని ఎందరినో మిస్ కావచ్చు. ఒకరి తలరాత ఇంతే అని నిర్ణయించటానికి మనమెవ్వరం, భగవంతునికంటే గొప్పవారమేమీ కాదుగా. ఏదో ఒకనాటికి ఎంతో గొప్ప సంబంధం వస్తుందని ఎదురుచూస్తూ వచ్చిన మంచి అబ్బాయిలందరినీ కాదంటే ఎలా ?? అన్నిటికీ మించి మధ్యతరగతి  అబ్బాయిలంటే ఈ మధ్య ఆడపిల్లల తల్లితండ్రులకు చులకన మరీ  ఎకువైపోయింది. ఏమి !! వారి జీవితం అంటే మరీ అంత చిన్నచూపా ?? పుట్టుకతోనే ఎవరూ కోటీశ్వరులు కాలేరు కదా. ఇవాళ జీవితం లో అత్యంత ఎత్తుకు ఎదిగిన గొప్పవారందరు ఒకప్పుడు దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి  వచ్చినవారే కదా!! దానికి నేను చెప్పిన కుర్రాడి కధ ఒక ఉదాహరణ కాదా ? ఈరోజున దేశం మొత్తం Paytm products వాడుతున్నారు అంటే విజయ్ శేఖర్ శర్మ లాంటి వారు ఎంత ఎత్తుకు ఎదిగి ఉంటారో వేరే చెప్పాలా ?? ఒకరి అదృష్టాన్ని ముందే ఎలా అంచనా వేయగలం అని అడగకండి!!  ఆత్మవిశ్వాసాన్ని, కష్టాన్నీ, తెలివిని నమ్ముకున్న ప్రతీ కుర్రాడు  జీవితంలో ఏదైనా సాధించగలడు. అది అర్ధం చేసుకోండి అంటున్నాను నేను. కష్టపడి చదివి, ఉద్యోగం చేస్తూ, తల్లితండ్రుల విలువ, కుటుంబ విలువలు తెలిసిన ప్రతీ కుర్రాడు మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూస్కోగలడు. అందులో అనుమానమే లేదు. 
Middle class boys are the best material in the world. There is no doubt about it.

కాదంటారా !!

🙌సర్వేజనాః సుఖినోభవంతు 🙌

స్నేహితుడంటే…?

 *స్నేహితుడంటే…?*

*అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం.* 

*స్నేహం అనేది  ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మనల్నే ఎంచుకోమన్నాడు.* 

*అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది.* 

*తెలుగు కవి ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి "సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ" అన్నారు.* 

*మంచి స్నేహాన్ని సంపాదించుకోవడం అంత సులభం కాదు.*
 
*స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు.* 

*మనలా ఆలోచించే, మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు.* 

*మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు.* 

*కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం.*
 
*స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయస్సుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలోను స్నేహ భావం ఉంటుంది. స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఈ ఆత్మీయ స్నేహితులతో నిర్మొహమాటంగా చర్చించవచ్చు.* 

*స్నేహంగా ఉన్నప్పుడు అనుమానం, కోపం, ద్వేషం కూడా దరిదాపులకు రావడానికి జంకుతాయి. స్నేహం అద్భుతమైంది. స్నేహానికి ఎల్లలు లేవు. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు.*
 
*మంచి స్నేహం… వ్యక్తి వికాసానికి బాటలు వేస్తుంది. మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలోను విలువైన స్నేహాన్ని జీవితాంతం నిలుపుకునే ప్రయత్నం చేయాలి.* 

*’స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా...’ అన్నట్లు ఆ విలువైన బంధాన్ని అపురూపంగా కాపాడుకోవాలి.*✍️

                     

   లోకా సమస్తా సుఖినోభవన్తు!

భగవంతుని దృష్టి

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

             *భగవంతుని దృష్టి*
                 ➖➖➖✍️
             

*”మనం చేసే ప్రతి పని భగవంతుని దృష్టిలో పడుతుంది అంటారు ... అదెలా సాధ్యం? ఎవరేం చేస్తున్నారో  గమనించడం తప్ప వేరే కార్యకలాపాలు వుండవా ?  దేవుడు మనలనే చూస్తున్నాడని మనకి ఎలా తెలుస్తుంది ?” అని ఒక శిష్యుడు తన గురువుగారిని అడిగాడు.* 

*అందుకు గురువుగారు ఇలా చెప్పాడు... “కళ్ళుమూసుకొని పాలు త్రాగే పిల్లి తనను ఎవరూ గమనించడం లేదని భ్రమ పడుతూంటుంటుంది. కాని అది వాస్తవం కాదు. దానిని ఎవరో గమనించి తరిమి కొడుతూనేవుంటారు. అలాగే , తప్పుడు పనులు చేస్తూ దేవుడికేం తెలుస్తుంది అని భావించడం శుద్ధ అవివేకం. భగవంతుడు సర్వాంతర్యామి. లోకంలో జరిగే ప్రతీ మంచి చెడ్డలు ఆయన దృష్టిని దాటిపోలేవు.*

*"కుచేలుడు కృష్ణపరమాత్మని  చూడడానికి వెళ్ళిన సమయాన  తన నడుముకి చిరిగిన వస్త్రంలో   కొంచెం అటుకులు మూటకట్టుకుని వెళ్ళాడు. కుచేలుడు తను తీసుకుని వచ్చిన అటుకులను గురించి కృష్ణునికి చెప్పనే లేదు. కాని కృష్ణుడు ఆ అటుకులను చూసి ఆతృతగా నోటిలో వేసుకున్నాడు. కుచేలుడి అదృష్టమే మారిపోయింది.”*

*దుర్యోధనుని సభలో అవమానాల పాలైన ద్రౌపది  తపించినది, దుఃఖించినది.  సభలోని మహాత్ములు, కులగురువులు,  పరాక్రమశాలురు ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అయినా అక్కడికి చాలా దూరాన వున్న ద్వారక లో వున్న కృష్ణ పరమాత్మ అక్కడనుండే  ద్రౌపదికి మాన సంరక్షణ చేశాడు.*

*’తిరునిన్డ్రయూరు పూసలార్’ అనే పరమ భక్తుడు  శివునికి బ్రహ్మాండమైన దేవాలయం నిర్మించాలని ఆశించాడు.  అయితే అతను నిరుపేద. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆలయం కోసం ధనం సేకరించాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు.*

*ఆఖరికి  బాహ్యంగా రాళ్ళతో ఆలయం కట్టేకంటే, నిర్మలమైన భక్తితో మనసులోనే ఆలయం నిర్మించ దలచుకున్నాడు.  ఆవిధంగానే మనసులోదేవుడికి ఒక పెద్ద ఆలయం నిర్మించాడు. ఈ విషయం ఎవరికీ తెలియదు. మనసు లోపలికి చూసే శక్తి ఏ మనిషికి లేదు. అయినా మహేశ్వరుడు చూశాడు.  తన పరమ భక్తుని మనోదేవాలయం గురించి పల్లవ రాజు కి తెలియచేశాడు. ఆ  పల్లవ మహారాజు ద్వారా పూసలారు నిర్మల భక్తి గురించి ప్రజలందరికి తెలిసింది.*

*కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయంలో దుర్యోధనుడు ఎవరికీ కనిపించకూడదని ఒక మడుగులో దాక్కున్నాడు. కానీ కృష్ణుని దృష్టిలో పడకుండా పోయాడా !*

*మారు రూపంలో వుంటే ఎవరూ తనను కనుగొనలేరని శూరపద్ముడనే అసురుడు అనేక రూపాలు మార్చు కున్నాడు.  అయినా కుమారస్వామి వదలలేదు. పట్టుకు వధించాడు.*

*ఈవిధంగా భగవంతుడు అందరిని సదా గమనిస్తూనే వుంటాడు. అందుచేత సదా మనసా,వాచా,కర్మణా  మంచినే తలవండి, మంచినే చేయండి" అని గురువు గారు తన  శిష్యులకు బోధించారు.*

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సమయాలు

 సమయాలు
   ~~~~~

||బ్రాహ్మీముహుర్తం లేదా బ్రహ్మముహుర్తం||
-- సుర్యోదయానికి 2 గంటల 24 నిమిషాల ముందు నుంచీ ఉషఃకాలం వఱకు.

||ఉషఃకాలం లేదా తొలి సంధ్యాకాలం లేదా అరుణోదయం లేదా ప్రభాతకాలం||
-- సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాల ముందు నుంచీ సూర్యోదయం వఱకు (సూర్యోదయానికి 96 నిమిషాల ముందు).

||అభిజిత్ ముహుర్తం||
-- సూర్యోదయం అయ్యాక 5 గంటల 36 నిమిషాల తరువాత 48 నిమిషాల కాలం.

||గోధూళివేళ||
-- సూర్యోదయం నుంచీ 27 నిమిషాల కాలం. ఆ తరువాత సూర్యాస్తమన కాలానికి ముందు 27 నిమిషాల కాలం. ప్రతిదినమూ ఈ గోధూళి వేళ అన్నది రెండుసార్లు ఉంటుంది.

||మలి సంధ్యాకాలం||
-- సూర్యాస్తమనం‌ తరువాత 72 నిమిషాల‌ కాలం.

అభిజిత్ ముహుర్తం, గోధూళి వేళ ఏ దోషమూ లేని సమయాలు. 

రోచిష్మాన్

మనసు పలికే ముత్యాలు

 🙏 *మనసు పలికే ముత్యాలు* 🙏

 *ప్రపంచంలో అన్నింటికంటే అమూల్యమైనది నమ్మకం, అది కలగడానికి ఏళ్లు పడితే, కోల్పోవడానికి క్షణం చాలు.🙏*

 _*ఉన్న వాడైనా లేని వాడైనా చివరికి మట్టి కే పరిమితం.*_
_*బ్రతికి ఉన్నంతకాలం ఎదో లేదని ఆరాటపడుతూ బతకటం కంటే నీకు ఉన్నదానితో తృప్తిగా జీవించు*_🌹

 స్నేహితుని అతిగా నమ్మకు రేపు అతనే మనకే శత్రువు కావచ్చు...
శత్రువుని అతిగా ద్వేషించకు రేపు  తానే మనకు నేస్తం కావచ్చు...
స్నేహమైనా...ద్వేషమైనా..
మితిమీరకూడదు...

 *జీవితం ఎప్పుడూ నేర్పిస్తూనే ఉంటుంది బలపంతోనో గునపంతోనో...* 

 *నేర్చుకునేది పాఠమో గుణపాఠమో నీ చేతుల్లోనే ఉంటుంది...*

 *ఇతరుల వస్తువులను ధనమును మట్టి వలెను* 
 *సర్వప్రాణులను తన దేహం వలెను* 
 *చూసేవాడు మహా పురుషుడు.*

*నీకు సంతోషాన్ని ఇచ్చే వాళ్ళందరూ నీ మిత్రులు అనుకోవద్దు...* 

  *"మంగళకరమైన మాటతీరు మనిషి సంస్కారానికి గీటురాయి."*

 *"సమస్యలన్నిటికీ మూలం మనిషిలో పరిపూర్ణత్వం లేకపోవడం. అహంకారం మెండుగా ఉండడం. "*

 *"పలికే మాటలు స్పష్టంగా ఉండాలి. అవి వినడానికి మధురంగా ఉండాలి. అలాంటి పలుకులే మనిషికి వెలుగులు. "*

 *"తీపిగా మాట్లాడి మోసం చేసే వారిని అందరూ అభిమానిస్తారు.*

*కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉంటే వారిని అందరూ ద్వేషిస్తారు.*

*అది సమాజం తీరు. మనం పట్టించుకోకూడదు."*

కొందరికి తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు...

🏵️కొందరికి తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు...🏵️
♻️♻️♻️♻️♻️♻️♻️

*పూజ* :-పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణ ఫలాన్నిచ్చేది.

*అర్చన*:- అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయ మైనది, దేవతలను సంతోషపెట్టేది.

*జపం*:- అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం. ఇది జివుణ్ణి , దేవుణ్ణి చేస్తుంది.

*స్తోత్రం*:- నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.

*ధ్యానం*:- ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది.

*దీక్ష*:- దివ్యభావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది.సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.

*అభిషేకం* :- అభిషేకం చేస్తే , చేయిస్తే సకల శుభాలు కలుగు తాయి. అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరా తత్వాన్ని అందిస్తుంది.

*మంత్రం*:- తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం. అఖండ శక్తి నీ ఇస్తుంది.

*ఆసనం*:- ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.

*తర్పణం*:- పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.

*గంధం*:- గంధంలో  సర్వ దేవత కొలువై ఉన్నారు. మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లీ అని దేవతలంతో అమ్మవారిని కోరారు. 

అప్పుడు అమ్మవారు మీరు గంధంలో కొలువై ఉందురుగాక అని వరం ఇచ్చారు. అప్పటినుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది.

*అక్షతలు*:- కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి. పసుపు, కుంకుమ,నూకలు (విరిగిన బియ్యం) లేని మంచి బియ్యం కలిపి చేయాలి.

*పుష్పం*:- పుణ్యాన్ని వృద్ధిచేసి, పాపాన్ని పోగొట్టేది. మంచి బుద్ధిని ఇచ్చేది.అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి.
మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది.

(ఈమధ్య పుష్పాలను చించి రేకలను విడదీసి వాడుతున్నారు. అలా చేయవద్దు. కాగాతొడిమలను తప్పకుండా తుంచివేశాకే పుష్పాలను పూజలో వినియోగించాలి.

*ధూపం:*- చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ప్రేత , పిశాచాలు పారిపోతాయి.

*దీపం*:- సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది. ఈ దీపం జ్ఞానానికి సంకేతం. 

పూజగదిలో దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న దుష్ట ప్రభావం దగ్గరికి రాదు. అగ్నిశివుడి కుమారుడైన కుమార స్వామికి ప్రతీక.

*నైవేద్యం:- మధుర పదార్థాలను నివేదన చేయుటయే నైవేద్యం.*

*ప్రసాదం*:-భగవంతుడికి నివేదించిన నైవేద్యమే ప్రసాదం. ప్రకాశానందాల నిచ్చేది. సామ రస్యాన్ని కల్గించేది. పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం. ప్రసాదం భగవదనుగ్రహ సంకేతం. అత్యంత పవిత్రమైన పదార్థం.ఏ రూపంలోని ప్రసాదాన్నైనా ప్రసాదం అని మాత్రమే వ్యవహరించాలి.ఇటీవల అందరూ ‘పులిహోర’, ‘కొబ్బరి’ అని అనడానికి అలవాటు పడ్డారు.అలా అనకూడదు. పులిహోర ప్రసాదం, కొబ్బరి ప్రసాదం అనవచ్చు.

*వందనం*:- అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం. చేతులు జోడించి కూడా వందనం చేయ వచ్చు. సాష్టాంగ ప్రణామం అంటే వక్షస్థలం,శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకు తాకించి చేసే వందనం. ఈ సాష్టాంగ ప్రణామం పురుషులు మాత్రమే చేయాలి. ఇది స్త్రీలు చేయరాదు. స్త్రీలు మోకాళ్ళ పై భగవంతుడికి వందనం చేయొచ్చు.

*ఉద్వాసన*:- ఆవరణ దేవతలను పూజించి, పూజను ముగించడాన్ని  ఉద్వాసనమని అంటారు. చివర్లో  ప్రార్థన , దోష  క్షమాపణ చెప్పి తీర్థ , ప్రసాదాలు స్వీకరించి స్వస్తి చెప్పి ఉద్వాసన చేయాలి.🔔

పురాణాలలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి అని చెప్తారు కదా. అవి ఏమిటి? వాటి పేర్లు, వాటి విశిష్టతలు

 *పురాణాలలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి అని చెప్తారు కదా. అవి ఏమిటి? వాటి పేర్లు, వాటి విశిష్టతలు.*

*భూలోకంతో కలిపి భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు.*

*1) భూలోకం - ఇచ్చట స్వేదం (చెమట నుండి ఉద్భవించు పేళ్ళు (పేనులు), నల్లులు మొ॥), ఉద్భిజాలు (గ్రుడ్డు నుండి ఉద్భవించు పక్షులు), జరాయుజాలు (స్త్రీ, పశువుల గర్భం నుండి ఉద్భవించు మానవులు పశువులు) అని నాలుగు విధాలైన జీవరాసులు.*

*2) భువర్లోకము (భూలోకము పైన) - ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సద్రుప్యాలైన గ్రహరాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర, కింపురుష, విద్యాధరులు కలరు.*

*3) సువఃలోకము లేక సువర్లోకము లేక స్వర్గలోకము (భువర్లోకము పైన) - ఇక్కడ అధిష్ఠాన దేవతలు అగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్ష, వాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితోపాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కలరు. వీరు కామరూపులై భోగాలను అనుభవింతురు. వీరికి వ్రుద్ధ్యాం, శరీర దుర్గందాధులుండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున, మాత్రు గర్భ వాసం లేదు.*

*4) మహర్లోకము (సువర్లోకము పైన) - ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు. ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో, అవిన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు.*

*5) జనోలోకము (మహర్లోకము పైన) - దీనిని కొందరు సత్యలోకం అని కూడా అంటారు. ఏ స్త్రీ భర్త మరణానంతరం సహగమనం చేస్తారో, ఆమె పవిత్ర శీలప్రభావంతో ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పిటికినీ, జన్మరాహిత్యం కలిగి, సతిపతులిరువు ఈ జనలోకంలో సుఖసాంతులతో వర్ధిల్లుదురు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తుంటారు.*

*6) తపోలోకము (జనోలోకము పైన) - ఇక్కడ అయోనిజ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కంధలోకం ఇచ్చటనే కలవు. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో, శాంతియుతంగా, సాంద్రానందంతో కూడి ఉంటుంది. భూలోకంలో ఎవరెవరు, ఏయే దేవతాముర్తులను ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలతో ఇక్కడ తపం ఆచరిస్తున్నారు. ఈ రీతిగా వారు కల్పాంత కాలం అక్కడనే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి, మరల పవిత్ర తపాలు ఆచరించి, ఎప్పుడు మహాప్రళయంలో సర్వం లయమగునో అప్పుడు వీరు కూడ జన్మరాహిత్యం పొందుదురు.*

*7) సత్యలోకం (తపోలోకము పైన) - ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు, బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు ఆ పదవిని అనేకానేక కల్పానంతరం ఒక్కక్కరు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మంలో లయమవుతారు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్థభాగం తీరినది. భావిబ్రహ్మ శ్రీ ఆంజనేయస్వామి. ఈ లోకంలో కూడ అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంత విచారకులు, భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు, అసంఖ్యాకులగు మహర్షులు వేదాంత విచారణలు గావిస్తుంటారు.*

*భూలోకానికి కింద ఉండేవి అధలోకాలు (7)*

*1) అతల లోకం - ఇందులో అసురులు నివసిస్తుంటారు. వీరు సూక్ష్మ శరీరులు. భౌతిక సుఖలాలసులు కావున అధిక మద సంపన్నులు.*

*2) వితల లోకం (అతలలోకం కింద) - ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల వీర్యం ‘ఆఢకం‘ అనే నది సువర్ణ జల ప్రవాహాంతో నిండి ఉండును. అనేక భౌతిక సుఖాలతో పాటు ఈ నదీ ప్రవాహంతో స్వర్ణాభరణాలు చేసుకొని ధరించెదరు.*

*3) సుతల లోకము (వితల లోకం కింద) - సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు బలి చక్రవర్తి ఇక్కడే ఉన్నాడు. అయన సర్వదా విష్ణుధ్యాన పరాయణుడై, శ్రీమహావిష్ణువు ద్వారపాలకుడై కాపలాకాస్తున్నాడు.*

*4) తలాతల లోకం (సుతల లోకం కింద) - ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దానవేంద్రులయిన త్రిపురాసురులు, దానవ శిల్పి అయిన మయుడు, మాయావిద్యలో నేర్పరులైన అసురులు, రాక్షసులు నివసిస్తారు.*

*5) మహాతలము (తలాతలలోకము కింద) - ఇక్కడ క్రదుపుత్రులైన (వినత క్రదువలు) కాద్రవేయులు (సర్పాలు), సహస్రాది శిరస్సులతో కూడినవారై మహా బలవంతులై కామరూపధారులై తమ పత్నులతో కూడి ఉన్నారు.*

*6) రసాతలము (మహాతలం కింద) - ఇక్కడ అసుర రాక్షస శ్రేష్ఠులు, నివాత కావచులు, కాలకేయాదులు, సురారులైన అనేక రాక్షసులు కలరు.*

*7) పాతాళము (రసాతలం కింద) - ఇక్కడ నాగలోకాధిపతియైన వాసుకి మొదలు సర్ప సమూహములన్ని కామరూపధారులై సుఖసంతోషాలతో ఉన్నారు. మహా ప్రళయ కాలంలో ఈ చతుర్ధశ భువనాలు పరబ్రహ్మంలో లీనమగును.*

ప్రపంచపు మొదటి బ్యాంకింగ్ వ్యవస్థ గురించి

 *Bank Training Centre*

ప్రపంచపు మొదటి బ్యాంకింగ్ వ్యవస్థ గురించి విద్యార్థులకు క్లాసు పూర్తి చేసిన తర్వాత ఒకసారి శర్మగారు బ్యాంకింగ్ సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే అడగమని చెప్పారు.
ఒక విద్యార్థి లేచి ప్రపంచంలో పురాతనమైన బ్యాంకింగ్ వ్యవస్థ బ్రిటిష్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏనా అని అడుగుతాడు.

దానికి చిరునవ్వుతో శర్మగారు ఇలా సమాధానం చెప్పారు.

ప్రపంచపు తొలి బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశం లోనే ఉంది.

*ఆంధ్రప్రదేశ్లో మన తిరుపతి నగరమే దానికి మూలస్థానం*

The First Banking Transaction :
కలియుగ ప్రారంభంలో వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు.సుమారు 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ప్రపంచ మొదటి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ గా చెప్పుకోవచ్చు.

The First Banker:
శ్రీనివాసడికి అప్పిచ్చిన కుబేరుడిని మించిన బ్యాంకర్ ఎవరున్నారు.

The First Promissory Note :
కుబేరుడికి శ్రీనివాసుడు రాసిన ప్రామిసరీ నోట్ ప్రపంచంలోని

The First Bill of Exchange:
మొట్టమొదటి బిల్ ఆఫ్ ఎక్సేంజ్ అని చెప్పుకోవచ్చు.

The Good loan repayment
శ్రీనివాసునికి ఉన్న వడ్డీ కాసులవాడు అనే పేరు అప్పటికే ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థని ఋజువు చేస్తుంది.

తను సంపాదించి క్రమం తప్పకుండా *లోన్ రిపేమెంట్* చేస్తున్న ఆ వెంకటేశ్వర స్వామి అప్పు తీసుకున్న వారందరికీ ఆదర్శవంతుడు.

ఇలా ఈనాడు మనం చెప్పుకుంటున్న చెలామణి లో ఉన్న ఎన్నో పథకాలు ఆ కాలంలోనే అమలు జరిగాయి.

The First lease Agreement:
వరాహ స్వామి దగ్గర స్థలం లీజుకి తీసుకుని

The First Mortgage:
ఆ లీజ్ హోల్డ్ రైట్స్ మీద శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు.

The First Income source certificate:
తనకి రాబోయే ఆదాయం హామీగా చూపించాడు. అంటే అసైన్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్కమ్ అన్నమాట.

కుబేరుడిని మించిన బ్యాంకరు, శ్రీనివాసుని మించిన హై క్రెడిట్ రేటింగ్ బారోయరు ప్రపంచంలో ఎక్కడ ఉంటారు?

ఇలా బ్యాంకింగ్ సంబంధించిన ఎన్నో విషయాలు మనకి తెలియజేసే తిరుపతిని ప్రతి బ్యాంకు ఉద్యోగి తప్పకుండా తెలుసుకోవాలి అని శర్మ గారు తన సమాధానం పూర్తి చేయగానే విద్యార్థులందరూ ఆశ్చర్యంగా, వేద కాలం నాటి బ్యాంకింగ్ వ్యవస్థ - ఈనాటి బ్యాంకింగ్ వ్యవస్థ ఒకటే కదా అని గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణ చేశారు.

గోవింద నామస్మరణతో క్లాస్ అంతా ప్రతిధ్వనించింది.
🙏🙏🙏
ఓం నమో శ్రీ వెంకటేశాయ 🙏



🙏🏻🙏🏻🙏🏻💐💐💐🙏🏻🙏🏻🙏🏻
 *లక్ష్మీదేవి : ఖాళీగా ఉన్నారేమిటి బ్రహ్మదేవా*
*బ్రహ్మ : ఏమి చెయ్యను తల్లి భూలోకంలో బ్రాహ్మణ అమ్మాయిలు అబ్బాయిలు ఎంత వయస్సొచ్చినా వివాహం చేసుకోవటం లేదు ఇంక వివాహము చేసుకోకపోతే నాకు భార్యాభర్తలకు పిల్లలను ప్రసాదించే పనిలేదుకదా అందుకే నాకు ఖాళీ దొరికినది. మున్ముందు ఇలాగే కొనసాగితే ఇంక న అవసరం భులోకవాసులకు ఉండదు. అయినా నువ్వు మరోలా అనుకోకపోతే దీనికి కారణం నువ్వే అనిపిస్తోంది* 
*లక్ష్మి:నేనా* 
*బ్రహ్మ : అవును అటు అమ్మాయిలకి అబ్బాయిలకి దేశ విదేశాల్లో లక్షల్లో కోట్లలో జీతాలొచ్చే ఉద్యోగాలొస్తున్నాయి వాళ్ళు నీవిచ్చే సంపదతో ఆనందడోలికల్లో ములిగి తేలి ఆడుతున్నారు వీళ్ళే కాదు వాళ్ళ తల్లితండ్రులు కూడా అలాగే తయారయ్యి పిల్లల పెళ్లిళ్లు మాటే మర్చిపోయారు. పెళ్లి చేసుకుంటే లాభమేమిటి అని ప్రశ్నించే స్థాయికి వచ్చారు* 
*లక్ష్మి : ఏదో డబ్బులు బాగా ఇస్తే యుక్త వయస్సులో పెళ్లి చేసుకుని భార్యాభర్తలు వాళ్ళ తల్లితండ్రులు డబ్బుకి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉంటారని అనుకున్నాను* *ఐనా ఆకలేస్తే అన్నం తింటారు కానీ నోట్ల కట్టలు తింటారా? ఎంత డబ్బున్నా ఒక మొగుడు లేక పెళ్ళానికి సమానమవుతుందా? ప్రేమ కంటే విలువైనదా డబ్బు. నా దగ్గర ఇంత డబ్బున్నా మా శ్రీవారిని వదిలి ఒక్క క్షణమైనా ఉండగలనా* *ఆలుమగలన్నాక చిన్న చిన్న గొడవలు తగవులు మాములే* *ఆ మాటకోస్తే మా మధ్య లేవా? మీ మధ్య లేవా? అయినా తల్లితండ్రులు హాయిగా సంసారం చేసుకుంటూ పిల్లల పెళ్ళికి ప్రోత్సహించకపోవడం నేరం కదూ!*
*బ్రహ్మ : అవునమ్మా నువ్వు చెప్పింది అక్షర సత్యం 35 సంవత్సరాలకి 40 ఏళ్ళకి పెళ్లి చేసుకుని పిల్లలను కనాలనుకుంటే నేను ఎక్కడ సృష్టించేది? ఆడవాళ్లకు 28 లేదా 30 సంవత్సరల లోపు అయితేనే పిల్లలను సునాయాసంగా కనేటట్లు ఆడదాని శరీరాన్ని నేను సృష్టించాను. ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తే పెళ్లిళ్లు చేసుకుంటే సహజీవనం చేస్తే వాళ్ళ కర్మకు వాళ్లేభాద్యులు* 
*ఇప్పటికైనా గ్రహించి పెళ్లిచేసుకోండి వయస్సు మీరకుండా*     అడపా.శ్రీనివాసరావు. ఊటసముద్రం

ఒక సెక్యూలర్ హిందూ, ఒక BBC రిపోర్టర్ మరియు ఒక భారతీయ కమెండో తాలిబాన్ టెర్రరిస్టుల చేత పట్టుబడ్డారు.

 ఒక సెక్యూలర్ హిందూ, ఒక BBC రిపోర్టర్ మరియు ఒక భారతీయ కమెండో తాలిబాన్ టెర్రరిస్టుల చేత పట్టుబడ్డారు.

వారిని తుపాకీతో కాల్చి చంపే ముందు చివరిగా ఒక్కొక్క కోరిక తీరుస్తాను కోరుకోండి అని తీవ్రవాదుల నాయకుడు వారికి చెప్పాడు.

సెక్యూలర్ హిందూ ఇలా అన్నాడు, మీరు అమెరికా వల్ల ఇలా తయారు అయ్యారు. స్వతహాగా మీరు అహింసా వాదులు. అయినా మీరు అమెరికా మీద కోపం కొద్దీ నన్ను చంపుదాం అనుకుంటున్నారు కాబట్టి, చంపండి, కానీ మీ ముక్తి కోసం ప్రార్ధన చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు.

టెర్రరిస్టు నాయకుడు సరే అని చెప్పడం తో ఆ హిందూ సెక్యూలర్ ప్రార్ధన చేసేసి“ఇప్పుడు నేను  చనిపోడానికి రెడీ"  అన్నాడు.

బిబిసి రిపోర్టర్ మాట్లాడుతూ "నేను చివరి వరకు రిపోర్టర్‌ని. విడియో కామ్ ఇస్తే ఇక్కడ ఏం జరుగుతోందో షూట్ చేసి నా వ్యాఖ్యలు జోడించి ఉంచుతాను.  ఏదో ఒక రోజు ఎవరైనా ఆ విడియో చూసి ఇక్కడ జరిగిన దాని గురించి తెలుసుకుని నా ఉద్యోగ నిబద్ధత గుర్తిస్తారు" అని చెప్పాడు.

దానికి టెర్రరిస్టు నాయకుడు స్పందిస్తూ మా గురించి నువ్వు అంతా గొప్పగా చెప్పాలి, అమెరికా చెడ్డ తనం వల్లే మేం టెర్రరిస్టు లుగా మారాం, మిమ్మల్ని చివర వరకూ మేం చక్కగా చూసుకున్నాం, అమెరికాకు పాఠం చెప్పడానికే మిమ్మల్ని చంపుతున్నాం అని నీ వీడియోలో చెప్పాలి. అలా చెప్తాను అంటేనే నీకు విడియో కామ్ ఇస్తాను అని చెప్పాడు. దానికి బిబిసి రిపోర్టర్  మా బిబిసి చేసేది ఇలా తప్పుడు రిపోర్టు లు ఇవ్వడమే కాబట్టి , నాకు ఇబ్బంది ఏం లేదు నువ్వు ఎలా కావాలంటే అలా చెప్తాను,   కాబట్టి విడియో కామ్ ఇవ్వమని అడిగాడు. దాంతో ఆ బిబిసి విలేకరి కి విడియో కామ్ ఇవ్వమని టెర్రరిస్టు నాయకుడు ఆదేశించాడు. ఆ విలేఖరి టెర్రరిస్టు నాయకుడు ముందు చెప్పినట్లుగానే అంతా చెప్పి రికార్డ్ చేసి కామ్ వాడికి తిరిగి ఇచ్చి, ఇప్పుడు నేను చనిపోడానికి రెడీ అన్నాడు.

చివరిగా ఆ టెర్రరిస్టు నాయకుడు భారతీయ కమెండో కమాండో వైపు తిరిగి, ఇప్పుడు, నీ చివరి కోరిక ఏమిటో చెప్పు అన్నాడు.

దానికి భారతీయ కమెండో స్పందిస్తూ నన్ను తుపాకీతో కాల్చి చంపే ముందు నా కడుపులో కత్తి తో పొడవమని కోరాడు.

" అది ఏంటి?"అని  నాయకుడు ఆశ్చర్యం గా అడిగాడు.  

“లేదు, నేను తమాషాగా అడగడం లేదు. మీరు నన్ను కత్తితో పొడవాలని నేను కోరుకుంటున్నాను" అన్నాడు కమెండో.

ఎందుకు అని నాయకుడు అడిగాడు.

కమెండో పోరాడుతూ చనిపోవాలి కానీ,  పిరికివాడిలాగా చనిపోకూడదు. అందుకే, నా మీద కత్తి గాయాలు చూసి పోరాడుతూ చనిపోయాను అని అంతా అనుకుంటారు.
అందుకే ఈ కోరిక అని అన్నాడు.

ఎలాగూ చావబోతున్నాడు కదా అని తీవ్రవాద నాయకుడు కమెండో దగ్గరకు వెళ్లి అతన్ని కత్తితో పొడిచాడు. వెంటనే ఆ కమెండో ఆ నాయకుడి భుజాన ఉన్న AK 47 రైఫైల్ తీసుకుని వాడిని కాల్చి, ఏం జరిగిందో అని తేరుకునే లోపే మెరుపు వేగంతో మిగతా టెర్రరిస్టులను కూడా లేపేసాడు.

“ముందుగా నువ్వే నాయకుడిపై దాడి చేసి వాడి తుపాకీ లాక్కొని వాడిని ఎందుకు కాల్చలేదు? ముందు నిన్ను కడుపులో పొడవమని ఎందుకు అడిగావు?” అని కమెండో ని అడిగారు సెక్యులర్ హిందూ మరియు బిబిసి రిపోర్టర్.

దానికి కమెండో ఇలా జవాబిచ్చాడు, 

రెండు కారణాలు ఉన్నాయి. 

మొదటిది, ఆ నాయకుడు దూరంగా వున్నాడు. దగ్గరికి వస్తే కానీ వాడి తుపాకీ లాక్కోవడం నాకు కుదరదు.

రెండోది, అన్నిటి కంటే ముఖ్యమైనది ఏమిటంటే నేనే ముందు దాడి చేసి ఉంటే హింస కు పాలు పడ్డానని సెక్యులర్ హిందూ,  వాళ్ళు ఎటువంటి దాడి చేయకుండానే అమాయక టెర్రరిస్టుపై నేను దాడి చేసాను అని బిబిసి వారు ప్రచారం చేసేవారు అని అని ఆ భారతీయ కమెండో చెప్పాడు.

....శాస్త్రి.....

నమ్మకం__విశ్వాసం

 నమ్మకం__విశ్వాసం 

ఎత్తు అయిన  రెండు భవనాల మధ్య ఒక తాడు కట్టబడి ఉంది. దాని మీద ఒక వ్యక్తి నడవసాగాడు. వందల అడుగుల ఎత్తున అత్యంత జాగ్రత్తగా అతను నడవసాగాడు..
 
చేతిలో పొడవయిన కర్ర ఉంది... భుజాలపై అతని కొడుకు ఉన్నాడు, అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.... అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రెండో భవనం వైపు వచ్చాడు..,

అందరూ చప్పట్లు కొట్టారు... కేరింతలతో ఆహ్వానం పలికారు...చేతులు కలిపారు.
ఫోటోలు తీసుకున్నారు.,

నేను ఈ తాడు మీద తిరిగి అవతలికి వెళ్లాలనుకుంటున్నాను.. వెళ్లగలనా? అని అతను ప్రశ్నించాడు..
వెళ్లగలవు.., వెళ్లగలవు జనం సమాదానం..
నా మీద నమ్మకం ఉందా?..
ఉంది..,ఉంది. కావాలంటే మేం పందానికి అయినా సిద్దం..!

అయితే మీలో ఎవరయినా నా భుజం మీద ఎక్కండి.., అవతలకి తీసుకు పోతాను..! అన్నాడు... అక్కడంతా నిశబ్దం.. 
జనం మాటలు ఆగి పోయాయి...
ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు..,
ఉలుకు లేదు.., పలుకు లేదు..,

నమ్మకం వేరు.., విశ్వాసం వేరు...
విశ్వాసానికి సర్వస్వ సమర్పణ భావం కావాలి. 

ఈ రోజుల్లో దైవభక్తిలో మనం కోల్పోతున్నది ఇదే....

దేవుడు_అంటే_నమ్మకమే___కానీ_విశ్వాసం_లేదు...

భగవంతునిపై మనకు పూర్తి విశ్వాసం వచ్చినప్పుడే దేవుడు మనల్ని నిరంతరం కాపాడుతుంటాడు..... 

    

🙏🏻🙏🏻🙏🏻💐💐💐🙏🏻🙏🏻🙏🏻

నీరా ఆర్య

 *నీరా ఆర్య* 
*ఈమె గొప్ప దేశభక్తురాలు, ధైర్యవంతురాలు మరియు స్వావలంబన కలిగిన మహిళ, ఈమెను గర్వంగా మరియు గౌరవంగా గుర్తుంచుకుంటారు.* 
*నీరా ఆర్య 5 మార్చి 1902*
*ఖేక్రా, యునైటెడ్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియాప్రస్తుతం, ఖేక్రా  (భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ జిల్లాలో ఉన్న ఒక నగరం ఖేక్రా ). జన్మించింది.*
*నీరా ఆర్య భారతీయ విప్లవకారురాలు మరియు ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ)INA  లో సైనికురాలు , రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో పనిచేసారు.* *ఆమె సర్వీసులో ఉన్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను గూఢచారి అని ఆరోపించింది .ఆమె తండ్రి, సేథ్ ఛజ్జుమల్,  ప్రముఖ వ్యాపారవేత్త దేశమంతా వ్యాపారంతో కలకత్తాలో వ్యవహారాలు చేసేవారు.*
*ఆమె విద్యాభ్యాసం కోల్‌కతా నగరంలో కొనసాగింది. నీరా ఆర్య హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ మరియు అనేక ఇతర భాషలలో ప్రావీణ్యం సంపాదించింది. బ్రిటిష్ ఇండియాలో బ్రిటీష్ అనుకూల అధికారి అయిన శ్రీకాంత్ జయరంజన్ దాస్‌ను ఆమె వివాహం చేసుకుంది.  నీరాఆర్యభర్త కు బ్రిటిష్ ప్రభుత్వం  సుభాష్ చంద్రబోస్ పై గూఢచర్యం మరియు అతనిని చంపే బాధ్యత అప్పగించారు.*  
*శ్రీకాంత్ జయరంజన్ దాస్‌ నేతాజీ ని చంపేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో  నీరాఆర్య  అజాద్ హింద్ ఫౌజ్ యెక్కNIA లో  మొట్టమొదటి మహిళా గూడాఛారి అనే బాధ్యతను సుబాస్ చంద్రబోస్ అప్పగించారు.* 
*ఆమె తన భర్తనుకూడా లెక్కచేయకుండా నేతాజీని కాపాడాలనే సంకల్పంతో దేశభక్తితో తన భర్తను చంపింది. తర్వాత ఈమె మరియు ఈమె సహచరరాలు సరస్వతి రాజమణి ఇద్దరూ మారువేషంలో బ్రిటిష్ అధికారుల గూఢచర్యం  చేపట్టారు.*
*ఆజాద్ హింద్ ఫౌజ్ లొంగిపోయిన తరువాత, ఆమె భర్తను హత్య చేసినందుకు ఆమెకి జీవిత ఖైదు విధించబడింది మరియు తీవ్రమైన హింసకు గురయ్యంది.అరెస్టు చేసిన తర్వాత నీరాఆర్యను మొదట కోల్‌కతా జైలుకు పంపారు. తర్వాత అండమాన్ జైలులో ఆమె కాళ్ళు చేతులకు సంకెళ్లుతో బంధించి ఉన్నాయి.కమ్మరి తన సంకెళ్లును విడదీసే సమయంలో సుత్తితో కొట్టగా కాళ్ళు విరిగినంత పనై ఆకమ్మరిని తిట్టడం జరిగింది. అతనిపై ఉమ్మి స్తీలను గౌరవించడం నేర్చుకో అంటూ అక్కడ ఉన్న జైలర్కు చెప్పింది.* *ఆ జైలర్ ఆమెను  మీ నాయకుడు సుభాష్ చంద్రభోస్ ఎక్కడ ఉన్నాడో చెబితే నిన్ను వదిలి పెట్టేస్తాము అని చెప్పగా...* *ఆయన విమాన ప్రమాదంలో చనిపోయాడని  ప్రపంచానికి అంతా తెలుసు అని చెప్పింది.*
*నేతాజీ బ్రతికే ఉన్నారు. మీరు చనిపోయారంటే మేము నమ్మం అని జైలర్ గట్టిగా గర్జించారు. వెంటనే  నీరాఆర్య కోపంగా అవును బ్రతికే ఉన్నారు. నాగుండెల్లో ఉన్నారు అని పలికింది. జైలర్ కోపంతో మీ గుండెల్లో నుంచి నేతాజీని విడుదల చేయాలి అంటూ కమ్మరి తెచ్చిన కట్టర్ లతో తన చనులను గట్టిగా నలిపేస్తూ   తన చనులను  కట్టర్ తో నొక్కి పూర్తిగా ఇబ్బంది పెడుతూ ఈ కట్టర్ నిప్పులో పెట్టి ఉండాల్సింది నీ స్థనాలు మొత్తం కాలిపోయేవి అంటూ హింసించడం చేశారు.* 
*స్వాతంత్ర్య పోరాటానికి ఆమె చేసిన కృషిని వివరించింది. ది ఫస్ట్ ఫిమేల్ స్పై ఆఫ్ ఫ్రీ ఇండియా.సుభాష్ చంద్రబోస్ నాగిని అన్నారు.నేతాజీ ఈమె ధైర్య సాహసాలు చూసి భారత జాతీయ సైన్యం యొక్క రాణి ఝాన్సీ బ్రిగేడ్‌లో కెప్టెన్ గా నియమించారు.*
*తన చివరి రోజుల్లో, ఆమె తన సమయాన్ని హైదరాబాద్ లో పూలు అమ్ముతూ గడిపింది మరియు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాలో ఒక గుడిసెలో నివసించింది . ఆమె గుడిసెను ప్రభుత్వ భూమిలో నిర్మించడం వల్ల చివరకు కూల్చివేయబడింది. వృద్ధాప్యంలో, ఆరోగ్యం బాగోలేక 1998, జూలై 26న ఆదివారం నాడు చార్మినార్ సమీపంలోని ఉస్మానియా ఆసుపత్రిలో నిస్సహాయంగా  వృద్ధురాలిగా కన్నుమూసింది.*
*ఇలాంటి ఎంతోమంది దేశభక్తులు ముందు మనం ఏమిచేశామో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుంటే మనం చేసింది ఏమీ ఉండదు. ఇప్పటికైనా పర్వాలేదు మనం మన దేశ గొప్పతనాన్ని తెలుసుకుని దేశ సేవలో ప్రతీఒక్కరూ మమేకం అవుదాం.*

*భారత్ మాతాకీ జై*🙏