Friday, May 1, 2026

🚨 Girl Trapped In City | Girls Alert | Fake Love Trap | Viral Caution Story | Present Love Trend |

🚨 Girl Trapped In City | Girls Alert | Fake Love Trap | Viral Caution Story | Present Love Trend |

Author Name:News Bowl

Youtube Channel Url:https://www.youtube.com/@BiggBossTeluguReview

Youtube Video URL:https://www.youtube.com/watch?v=UXML97yNR3w



Transcript:
(00:00) మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. మీ కుటుంబాన్ని మీ ఆడబిడ్డలను కాపాడుకోవాలంటే కేవలం 10 నిమిషాలు ఉండే ఈ వీడియో 100% మీరు చూసి తీరాల్సిందే. ఎందుకంటే మీ పిల్లల కోసం మీరు అవసరమైతే ప్రాణాలు పనంగా పెడతారు ఆపద వస్తే అడ్డంగా నిలబడిపోతారు వాళ్ళ కోసం ఎంతవరకైనా పోరాడుతారు కానీ మీ అపారమైన ప్రేమ మీ పిల్లలకు కన్వే చేయడంలో మీరు విఫలం అవుతున్నారు.
(00:26) తప్పు చేస్తే తిడతారు అనే భయపెట్టే పేరెంట్స్ గా మీరు మిగిలిపోతున్నారు. అదే ఆ భయమే వాళ్ళ ప్రాణాల మీదకు తెస్తుంది. మీకు కనిపించని నరకంలోకి మీ పిల్లలను నెట్టేస్తుంది. ఆడపిల్లలు తెలుసో తెలియకో తప్పు చేస్తే మీకు భయపడే పేరెంట్స్ గా కాకుండా నేను ఉన్నాను నీకేం కాదు ఎవ్వడు వచ్చినా ఏమైనా నేను చూసుకుంటాను అనే భరోసా ఇచ్చే పేరెంట్స్ గా మీరు ఉండాలి.
(00:47) అలా లేకపోతే వాళ్ళ మీద మీకు ఎంత ప్రేమ ఉన్నా మీరు ఎన్ని ఆస్తులు కూడబెట్టినా స్థలాలు కొన్నా ఫ్లాట్లు వెనకేసినా కోట్లు పోగేసిన శుద్ధ దండగ ఎందుకంటే మీ ఆడపిల్లల చుట్టూ కాల నాగులు బుసలలుగొడుతున్నాయి. అవకాశం దొరకగానే కుబుసం విడిచిన విష సర్పాల్ల తమ ఒరిజినాలిటీ బయటపెట్టి మీ పిల్లలను భయపెట్టి ఇంతకంటే నరకం ఈ భూమి మీద ఇంకొకటి ఉండదు అనే స్థాయికి తీసుకెళ్ళిపోతాయి.
(01:12) మీ ఇంటి ఆడబిడ్డలు ఆ విష కోరల్లో చిక్కుకోకూడదు అనుకుంటే మీ కుటుంబాలు చితికిపోకూడదు అనుకుంటే ఈ వీడియో మీరు చూడండి. మీ ఆడపిల్లలకు చూపండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ గ్రూప్స్ లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే దారుణంగా వేధిస్తూ హింసిస్తూ మీ ఆడపిల్లలకు నరకం చూపించే మృగాళ్లుు మీ అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నారు.
(01:32) వాళ్ళు మీ అమ్మాయిలకు దగ్గర అవ్వడానికి మీరు కొనిస్తున్న ఫోనే ముఖ్య కారణం అవసరం ఉన్నా లేకపోయినా స్మార్ట్ ఫోన్లు కొనివ్వడం వల్ల వాళ్ళు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. ముక్కు ముఖం తెలియని వాళ్ళతో అన్ని విషయాలు పంచుకుంటున్నారు. చాలా తక్కువ టైంలోనే ఎక్కువ దగ్గరైపోతున్నారు. తర్వాత భారీ మూల్యమే చెల్లిస్తున్నారు. కొన్ని రియల్ లైఫ్ లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పి మరి అసలు ఏం జరుగుతుందో చెబుతా నెంబర్ వన్ లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే వైజాగ్ విశాలాక్షి నగర్ లో ఫ్రెండ్ బర్త్ డే అని చెప్పి వెళ్లి ఆ ఫ్రెండ్స్ చేతిలోనే చావు దెబ్బలు తినే అనుమానస్పదంగా చనిపోయింది 28 ఏళ్ల
(02:04) శాంతకుమారి ఈమెది హత్యనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ శాంత కుమారికి ఆ ఆరుగురు ఫ్రెండ్స్ కేవలం సోషల్ మీడియాలో పరిచయమైన వాళ్లే. వీళ్ళందరిదీ ఒక ప్రాంతం కాదు ఒక కాలేజ్ కాదు ఒక వీధి కాదు ఎక్కడెక్కడో పని పాటా లేకుండా జులాయిగా తిరిగే బ్యాచ్ సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అయ్యారు. చివరికి ఆమె హతమయింది వాళ్ళు జైలు పాలయ్యారు.
(02:26) రెండో లైవ్ ఎగ్జాంపుల్ డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లోనే ఆడపిల్లలు. అది మైనర్లనే టార్గెట్ చేశాడు మరో మోసగాడు కోడూరు చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్. ఆంధ్రాలోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చామల్లమూడి గ్రామానికి చెందిన వీడి వయసు కేవలం 23 ఏళ్ళు. కానీ ఇన్స్టా, Facebook ఇతర సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఇంతవరకు 20 మందికి పైగా ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడు.
(02:48) ప్రేమ పేరుతో వలవేస్తాడు. అది కూడా బాగా డబ్బున్న వాళ్ళ ఇల్లు చుట్టూ తిరుగుతాడు. ఆ ఇళ్లల్లో పని చేసే వాచ్మెన్ దోబివాల ఇంటి పని వంటపని తోట పని చేసే వాళ్ళకు డబ్బులు ఎరగా వేసి ఆ ఇంట్లో ఉండే అమ్మాయిల వివరాలు తెలుసుకుంటాడు. వాళ్ళకు సోషల్ మీడియా ద్వారా గాలం వేసి ప్రేమ పేరుతో దగ్గరవుతాడు. ఖరీదైన కార్లు పబ్లిక్ లోని ఫోటోలు షేర్ చేసి తను రిచ్ కిడ్ అనే కలరింగ్ ఇస్తాడు.
(03:12) వీడి మాయ మాటలకు ప్రేమ అనుకని నమ్మి వచ్చిన యువతలను లోబరుచుకుంటాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా తీసిన ఫోటోలు వీడియోలు చూపించి డబ్బు డిమాండ్ చేసేవాడు. తాను చెప్పినప్పుడల్లా చెప్పినట్లు చేయాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు. డబ్బు, బంగారం ఇతర వాల్యబుల్ థింగ్స్ తీసుకునేవాడు. వాడు చెప్పినట్లు చేయకపోతే ఆ ఫోటోలు వీడియోలు పేరెంట్స్ కి పంపిస్తానని నెట్ లో పెడతానని వేధించి నరకం చూపించేవాడు.
(03:34) అలా ఈ కేటు గాడి భారిన కేవలం రెండేళ్లలోనే 20 మంది అమ్మాయిలు మోసపోయారు. అందులో మైనర్లే ఎక్కువ మంది ఉండడం అత్యంత బాధాకరం. సోషల్ మీడియా అనే శాలె గూడు ద్వారా ఈ నయవంచకుడికి తన కూతురు చిక్కి శర్లమైపోతుందని ఆలస్యంగా ఒక బాధితురాలు తల్లి గుర్తించి పోలీసులను ఆశ్రయించింది వీడు ఆట కట్టించింది. మూడో లైవ్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలోని పరాత్వాడ నగరానికి చెందిన 19 ఏళ్ల మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ కూడా నరరూప రాక్షసుడే.
(04:02) వాట్ WhatsApp, snapప్చాట్,ఇస్టా, Facebook ఇలా ఇతర సోషల్ మీడియాల ద్వారా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 180 మంది ఆడపిల్లలను ప్రేమ పేరుతో మోసం చేశాడు. అందులో కూడా ఎక్కువమంది మైనర్లే కావడం అత్యంత విషాదకరం. వాళ్ళను ట్రాప్ చేసి ముంబై పూణే తీసుకెళ్లి ఏకాంతంగా గడిపేవాడు. అక్కడ అశ్లీల వీడియోలు తీసేవాడనే ఆరోపణలు ఉన్నాయి. వాటితో వాళ్ళకు పదే పదే బ్లాక్ మెయిల్ చేయడం కొందరివి ఆన్లైన్ లో షేర్ చేయడం చేసి వేధించేవాడు.
(04:29) రాజ్యసభ ఎంపి అనిల్ బోండేకు వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వీడిని అరెస్ట్ చేశారు. వాడి ఫోన్లో వందల కొద్ది అశ్లీల వీడియోలు చూసి షాక్ అయ్యారు. అమ్మాయిలకు సంబంధించిన నగ్న శరీరాలు వాటితో ఆడుకున్న వికృత క్రీడల గురించి తెలిసాక పోలీసులే నిర్ఘాంతపోతున్నారు. వాటిని ఎవరికి షేర్ చేశాడు ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేశారో తెలుసుకొని వాటిని తొలగించే పనిలో పోలీసులు ఉన్నారు.
(04:51) ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మృగాలను ఉన్నారు. మేకవన్నే పురుల అతను చూసి పంజా విసరుతారు. అందుకే మీ ఆడపిల్లలు సేఫ్ గా లేరు. మీ పిల్లలను కాపాడుకోవాలంటే మీరు మరికొంత జాగ్రత్తగా ఉండాలి. తాజాగా దేశంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జరిగిన వ్యవహారం బయటకు వచ్చాక అసలు ఈ రోజుల్లో ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అది బయట వ్యక్తి రూపంలో కాదు మొదట మంచి మనిషిలా కనిపించే వ్యక్తి నుంచే వస్తుంది.
(05:18) ఫ్రెండ్ గా వస్తుంది నమ్మకంగా వస్తుంది. మీ ఇంటి పక్కనే ఉండే వ్యక్తి ఇతనిని నమ్మొచ్చు అని మీరు బాగా అనుకున్నాకే అతడే ఓ దారుణమైన మృగం అని తెలిసేసరికి జరగరాని గోరం జరిగిపోతుంది. ఇప్పుడు ఈ నేను చెప్పబోయేది రియల్ లైఫ్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఇది ఒక అమ్మాయి కథ కాదు. దేశంలో ఎన్నో చోట్ల జరుగుతున్న నిజ జీవిత సంఘటనల యదార్థ గాధలు కన్నీటి వ్యధలు.
(05:39) ఇక్కడ నేను పేరు ప్రస్తావించడం లేదు బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది యదార్థంగా జరిగింది. ఒక అమ్మాయి ఇంట్లో ఎంతో అమాయకంగా పెరిగింది. స్కూల్ డేస్ పూర్తఅయ్యాక ఇంటర్లో చేరింది. కొత్త కాలేజ్ కొత్త ఫ్రెండ్స్ కొత్త ప్రపంచం అక్కడ ఒక అబ్బాయి పరిచయమయ్యాడు. మొదట హాయ్ అన్నాడు తర్వాత నోట్స్ కావాలా అని అడిగాడు మళ్ళీ బస్ వచ్చేదాకా వెయిట్ చేస్తాను అని చెప్పాడు.
(06:00) ఆమెకి ఏదైనా అవసరమైతే అడగకుండానే వచ్చి హెల్ప్ చేసేవాడు. చిన్న చిన్న గిఫ్ట్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రతిరోజు గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవెనింగ్లు హాయ్ బాయ్ మెసేజ్లు ప్రతి సమస్యకి నేను ఉన్నాను అంటూ సపోర్ట్ గా నిలిచేవాడు ఆమెకి నమ్మకం కలిగింది. ఇతను చాలా మంచోడు అని ఇంట్లో అమ్మ నాన్న మందలిస్తే అతనే ఓదార్చేవాడు వాళ్ళకంటే నేనే నిన్ను ఎక్కువగా ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటా నేనే నీకు బెస్ట్ కేర్ టేకర్ అంటూ చాలా హడావిడి చేసి నమ్మించాడు.
(06:27) నిన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు నేనే నీకు తోడు అని చెప్పేవాడు. కానీ ఇదంతా పక్కా ప్లాన్ అని అక్కడి నుంచే మొదలైంది అసలు ప్లాన్ అనే విషయం ఆ అమ్మాయికి తెలియదు. నెమ్మదిగా ఆమెను ఇంటిలో వాళ్ళకి దూరం చేసేసాడు. ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా వినకూడదు అనే స్టేజ్ కి తీసుకొచ్చేసాడు. ఫ్రెండ్స్ తో కూడా దూరం పెంచేసాడు. అన్నీ నీకు నేనే అని భ్రమ కలిగించాడు.
(06:47) దీంతో స్వతహాగానే ఇంట్లో వాళ్ళు మందలించడం పెరిగింది. ఫ్రెండ్స్ కూడా అయితే నీతో మాకేం పని అన్నట్టు దూరంగా జరిగిపోయారు. అంతే నీకు వాళ్ళ అవసరం లేదు నేను ఉన్నాను నేను చూసుకుంటాను అని పూర్తిగా చెప్పేవాడు నమ్మించేవాడు. ఒకరోజు సినిమా మరోరోజు పార్క్ ఇంకోరోజు కఫే ఇట్లా ఆమెను తిప్పుతూ డబ్బులను మంచి నేలలా ఖర్చు చేశాడు. ఆమెకు ఇదే ప్రేమ అనిపించింది. అతనిని పూర్తిగా నమ్మేసింది.
(07:07) ఇంకా అతనే తన సర్వస్వంగా మారిపోయాడు. సరిగ్గా అప్పుడే ఒకరోజు ప్లాన్ అమలు చేశాడు. కాస్త బయట టెన్షన్ ఉంది హడావిడి ఉంది డిస్టర్బెన్స్ గా ఉంది నా రూమ్ కి వచ్చేసి మాట్లాడదాం అన్నాడు. ఆమె ఫస్ట్ అయితే వద్దంది కానీ అతను నమ్మకం కలిగించాడు. ఏమీ కాదు కాస్త టైం స్పెండ్ చేద్దాం అన్నాడు. ఆమె వెళ్ళింది. అంతే అదే ఆమె జీవితానికి మరణ శాసనంగా మారిపోతుందని ఊహించలేకపోయింది.
(07:29) అక్కడికి వెళ్ళాక డీసెంట్ రూమ్ అన్ని పద్ధతిగా చూడగానే హాయి గొలిపించే వాతావరణం సెట్ చేసి ఆయన పకడ్బందీగా ఏర్పాటు చేశాడు. దీంతో అన్ని సాధారణంగానే అనిపించాయి. ఆ తర్వాత జ్యూస్ ఇచ్చాడు. ఫుడ్ తీసుకొచ్చి పెట్టాడు. కొంతసేపటికి ఆమెకు తల తిరిగింది శరీరం బలహీనమైంది మాట రావడం ఆగిపోయింది. కళ్ళ ముందు అన్ని మసగబారిపోయాయి. లేచేసరికి ఆమె ఒంటరిగా లేదు. గదిలో మరికొందరు ఉన్నారు.
(07:52) ఫోన్ కెమెరా ఆన్ లో ఉంది. ఆమె నగ్న జీవితం రికార్డు అయిపోయింది. ఆ క్షణం నుంచి ఆమె బతుకు నరకమైంది. ఇది ఎవరికైనా చెబితే వీడియో పంపేస్తాం మా మాట వినాలి డబ్బు తెచ్చి ఇవ్వాలి మళ్ళీ మళ్ళీ రావాలి అంటూ బెదిరింపులు మొదలయ్యాయి. ఆమె భయపడింది. దారుణంగా మోసం చేశారని కుంగిపోయింది. ఏడ్చింది కాళ్ళ వేలా పడి బతిమిలాడింది. కానీ ఎవ్వరికీ చెప్పలేకపోయింది.
(08:15) అప్పటివరకు నమ్మకం ఇచ్చిన వాడే రాక్షసుడై వేధిస్తుంటే ఆ గుండె తట్టుకోలేకపోయింది. అయినా ఇంట్లో వాళ్ళు స్నేహితులకు చెప్పుకోలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళను హీనంగా చూసింది. వాళ్ళ మాటలు వినలేదు. ఒకవేళ చెప్పినా వాళ్ళు కూడా ఈ నరకం అనుభవించాల్సి వస్తుందని భయపడింది. అదే నేరగాళ్ళ బలం బాధితురాలి మౌనమే వాళ్ళ ఆయుధంగా మారింది.
(08:38) కొన్నాళ్ళు రోజు ఎక్కడెక్కడికో తీసుకెళ్లి ఏదేదో చేసేవాళ్ళు. రోజులు గడుస్తున్న కొద్దీ బ్లాక్ మెయిల్ పెరిగింది. వేదింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆ యువత పడే నరక యాతనను ఒకరోజు ఆమె తల్లి గమనించింది. ముందులా నవ్వడం లేదు ఫోన్ చూసి భయపడుతుంది. ఫంక్షన్ల కూడా రానంటుంది. సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు. గదిలో ఒంటరిగా ఏడుస్తుంది అసలు ఏం జరిగింది అంటూ బలవంతంగా అడిగింది గట్టిగా దబాయించమని అడిగింది.
(09:03) అప్పుడు ఆ అమ్మాయి కూలిపోయి అన్ని చెప్పేసింది. తన గుండెలో బాధ అంతా ఊబరయ్యి బయట పెట్టేసింది. ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. ఇంట్లో వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు కంప్లైంట్ చేశారు. దర్యాప్తులో బయటపడింది ఏంటంటే ఇది ఒక్క వ్యక్తి పని కాదు ఇది ఒక గ్రూప్ పని. ఇలానే అమాయక అమ్మాయిలను టార్గెట్ చేసి నమ్మకం పెంచి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న నెట్వర్క్ పని.
(09:25) ఆ గ్రూప్ కి ఇదే పని అయినా సరే చాలా మంది అమ్మాయిలు వీటిని భరిస్తూ భయంతో మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకు పోలీసులకు చెప్పడం లేదు. చెబితే వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో అండగా నిలుస్తారో లేదో పైగా మనల్లే తిడతారో అనే భయంతో చెప్పట్లేదు. అందుకే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు మీ పిల్లల దగ్గర మీరు ఆ ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు కాస్త చనువు ఇవ్వండి.
(09:45) ఏ సమస్య వచ్చినా నీకు వెల్ విషర్స్ మేమే అనే విషయాన్ని వాళ్ళకు భరోసాగా చెప్పడం ద్వారా వాళ్ళను సమస్యల నుంచి కాపాడిన వాళ్ళు అవుతారు. చివరికి ఒక్క ఫిర్యాదు ఎంతో మందిని కాపాడింది ఈ అమ్మాయి విషయంలో అందుకే పిల్లల ప్రతి కదలికలను గమనించండి. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తున్న తల్లిదండ్రులకు వాళ్ళ కదలికలను గమనించడం ఏదో తేడా జరిగిందని గుర్తించడం పెద్ద విషయం కాదు బట్ చాలా మంది నిర్లక్ష్యంగా ఉండిపోతున్నారు.
(10:12) వాళ్ళ ఫోన్లు పనులు గోలలో పడి పిల్లలను పట్టించుకోవడం లేదు. ఇదే వాళ్ళ జీవితాలను ఈ సోషల్ మీడియా ద్వారా బలి తీసుకుంటుంది. సో తల్లిదండ్రులారా పిల్లలకు ఫోన్ కొనివ్వడం మాత్రమే కాదు ఆ ఫోన్ తో వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి. వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ మనసు తెలుసుకోండి. తప్పు చేస్తే తిట్టే తల్లిదండ్రులు కాకండి ఏం జరిగినా ముందుగా చెప్పుకునే తల్లిదండ్రులు అవ్వండి.
(10:33) ఆ చనువు ఇవ్వండి. పిల్లలు మీరు కూడా ఎవ్వరిని త్వరగా నమ్మొద్దు. సీక్రెట్ రిలేషన్షిప్ జోలికి అస్సలు వెళ్లొద్దు. అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే మీ తల్లిదండ్రులకు చెప్పండి. ఈ ప్రపంచంలో మీకు వాళ్ళ తర్వాతే ఎవరైనా సరే మీకు ఫస్ట్ బెస్ట్ వెల్ విషర్స్ ఎవరైనా ఉన్నారంటే మీ పేరెంట్సే ఈ విషయం గుర్తుపెట్టుకోండి నేరగాళ్ళు బలవంతులు కాదు మన అమాయకత్వాన్ని వాడుకుంటారు అంతే ఒకసారి వాళ్ళ గుట్టు విడి సమాజంలో వాళ్ళ ఆకృత్యం బయటపడితే వాళ్ళ సంగతి సమాజమే చూసుకుంటుంది అందుకే ఏదైనా జరగరానిది జరిగితే మౌనంగా ఉంటే అది మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. అదే
(11:06) ధైర్యంగా తల్లిదండ్రులు పోలీసులకు చెబితే అక్కడితో ఆ రాక్షసుల ఆట కట్టేస్తుంది.

No comments:

Post a Comment