అవసరమా? కోరికా? మీ మనశ్శాంతిని దెబ్బతీస్తున్న 'బంగారు లేడి' ఏది? | Need vs Desire | SEETAKANTHTALKIE
Author Name:SEETAKANTH TALKIE
Youtube Channel Url:https://www.youtube.com/@SEETAKANTHTALKIE
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4jZFzJiZk9E
Transcript:
(00:00) గడ్డగట్టించే చలి సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వతాలు అక్కడున్న ఒక చిన్న ఆశ్రమంలో ఒంటి నిండా ఒక సాధారణ కంబళీ కప్పుకొని మంచులో వణుకుతూ కూర్చున్నాడు డాక్టర్ దేవ్ ఏ చేతులైతే గత 20 ఏళ్లుగా వేలాది మంది గుండెల్లో ఆగిపోతున్న ప్రాణాల్ని తిరిగి నిలబెట్టాయో ఈరోజు అదే చేతులు నిస్సహాయంగా ప్రాణభయంతో వణకుతూ ఉన్నాయి.
(00:23) ఆయన కళ్ళలో నుంచి కారుతున్న కన్నీళ్లు అక్కడున్న చలికి గడ్డగట్టుకపోతున్నాయి. డాక్టర్ దేవ్ ఏమీ లేనివాడో ఏ అనాధో కాదు వారం రోజుల క్రితం వరకు ఆయన ఒ పెద్ద సిటీలో ఫేమస్ డాక్టర్ వందల కోట్ల ఆస్తి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే భార్య తనని హీరోలా చూసుకునే అద్భుతమైన పిల్లలు కానీ ఈరోజు తన ఆస్తుల్ని కట్టుకున్న భార్యని కన్న పిల్లల్ని వదిలేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ప్రాణాలు అరచేతులో పెట్టుకొని హిమాలయాలకు ఒక పిచ్చివాడిలా పారిపోయి వచ్చాడు.
(00:52) డాక్టర్ దేవ్ ఎవరికీ ద్రోహం చేయలేదు ఒక్క పేషెంట్ కూడా అన్యాయం చేయలేదు తన జీవితంఅంతా ఒక యజ్ఞంల ధర్మంగా తన వృత్తిని చేసుకుంటూ వచ్చాడు కానీ గత కొద్ది రోజులుగా జీవితం నరకం అయిపోయింది. తనను దేవుడు అన్నవాళ్లే ఈరోజు మీడియా ముందుకు వచ్చి దోషిని చేసి మాట్లాడుతున్నారు ఎటు చూసినా కోర్టు కేసులు ఎక్కడ జైలుకి వెళ్ళాల్సి వస్తుందో ఎక్కడ తన ఫ్యామిలీ రోడ్డును పడుతుందో అన్న భయం తనకి మనశశాంతిని దూరం చేస్తుంది.
(01:16) నిద్ర మాత్రలు వేసుకున్న సరే రాత్రులు నిద్ర పట్టని పరిస్థితి నేను ఎవరికీ అన్యాయం చేయలేదు ఇంతమందికి ప్రాణం పోశాను కదా ఎందుకు దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేశడు అన్న ప్రశ్న ఆయన బుర్రను తొలిచేస్తుంది. ఎక్కడో చోట ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకపోతుందా నా మనశశాంతి నాకు తిరిగి రాకపోతుందా అన్న ఆశతో ఏడుస్తూ అన్ని వదిలేసి హిమాలయాల్లోని ఒక వృద్ధ సాధువు పాదాల దగ్గర పడిపోయాడు.
(01:43) అప్పుడు ఆ సాధువు డాక్టర్ దేవు కళ్ళల్లోకి ఎంతో ప్రశాంతంగా ఒక తండ్రిలా దయతో చూసి చిరునవ్వు నవ్వాడు. నాయనా దేవ్ ఎంతో పుణ్యం చేస్తే తప్ప డాక్టర్ వృత్తి దొరకదు అలాంటిది నువ్వు వేల మందికి ఉచితంగా ఆపరేషన్లు చేశవు నువ్వు పుణ్యాత్ముడివి నిస్వార్ధపరుడివి కానీ ఒకే ఒక అసంబద్ధమైన కోరిక ఒక అసహజమైన కోరిక ఒక చిన్న మాయ నీ మనసును చెలింపచేసి అబద్ధాన్ని నిజమని నమ్మేలా చేసి ఈరోజు నిన్ను ఈ నరకంలోకి నెట్టింది అన్నాడు దేవుకి ఏమీ అర్థం కాలేదు కోరిక మాయ నేనేం తప్పు చేశను స్వామి అని ఏడుస్తూనే అడిగాడు అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు. నాయనా
(02:24) అవసరం వేరు కోరిక వేరు మనం ఎంత గొప్పవాళ్ళం అయినా ఎంత మంచివాళ్ళం అయినా సరే ఒక అవసరం లేని ఒక అసంబద్ధమైన కోరికను పట్టుకొని వేలాడితే ఆ మాయలో పడితే ఊహించని సమస్యల వలయంలో చిక్కుకొని అశోక వనంలో పడక తప్పదు ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రురాలైన సీతమ్మ తల్లికే ఆ మాయ నుంచి ఆ అశోక వనం నుంచి కష్టాలు తప్పలేదు ఇంక నీకుఎలా తప్పుతుంది అన్నాడు ఒక్కసారి రామాయణంలో సీతమ్మ తల్లిని తలుచుకో ఆమె ఎవరనుకున్నావ్ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం పతివ్రత శిరోమణి భర్తనే దైవంగా కొలిచే అంతటి గొప్ప నిష్కల్మషమైన ఇల్లాలు సృష్టిలో ఇంకెవరైనా ఉన్నారా ఒక మహారాజుకి
(03:05) ముద్దులు కూతురిగా పెరిగింది ఇంకో మహారాజును పెళ్లి చేసుకుంది ఆమె కాలు కింద పెడితే కడిగే దాసీలు వేల మంది ఉన్నారు రాజభవనాల్లో పూల పాన్పుల మీద పడుకున్న తల్లి ఆమె అలాంటి తల్లి తన భర్త 14 ఏళ్ళు అడవులకు వెళ్ళాలి అని అనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు తను అనుభవిస్తున్న రాజభోగాలు ఆ సుఖ సంతోషాలు అంతులేని ఆభరణాలు అన్ని సెకండ్లు వదిలేసింది ఒక మహారాణి ఒంటి మీద ఉన్న పొట్టు వస్త్రాలు వదిలేసి ఒక నారచీర కట్టుకొని పట్టు కుచ్చులులాంటి తన పాదాలతో రాళ్ళు రప్పలు గుచ్చుకుంటున్న లెక్క చేయకుండా కష్టమైనా నష్టమైనా నా భర్తే నాకు సర్వస్వం ఆయన
(03:42) తోడుంటే నాకు అదే అయోధ్య అని ఆ రాముడి వెంట చిరునవ్వుతో అరణ్యానికి నడిచింది ఆ అరణ్యంలో రాముడికి తోడుగా ఎన్నో ఏళ్ళు ఎలాంటి కోరిక లేకుండా అత్యంత సంతోషంగా గడిపింది సీతమ్మ కానీ ఒక్కరోజు వాళ్ళు ఉండే పన్నశాల ముందు ఒక బంగారపు లేడీ అటుగా గెంతుకుంటూ వెళ్ళింది. సరిగ్గా అక్కడే మొదలైంది మాయ సీతమ్మ తల్లి సామాన్యురాలు కాదు ఆమె ఒక దేవత సృష్టిలో బంగారు లేడి అనేది ఉండదు ఎముకలు మాంసం మీద బంగారం మొలవదు అదొక అబద్ధం అన్న విషయం సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమైన సీతమ్మ తల్లికి తెలియదా ఖచ్చితంగా తెలుసు పైగా ఇన్ని రాజ్యాలు వందల కిలోల బంగారం ఆభరణాలు
(04:21) వదిలేసి రాముడి వెంట వచ్చిన ఆ సీతమ్మకి ఆ ఒక్క బంగారు లేడీ లేకపోతే ఆమె బతకలేదా అస్సలు కాదు ఆమెకు ఆ బంగారపు లేడీ అవసరం అసలు అసలే కాదు కానీ దేవ్ మాయ ఎంత పవర్ఫుల్ అంటే అది ఎంతటి పుణ్యాత్ముల మనసులోనైనా ఒక అవసరం లేని కోరికను పుట్టిస్తుంది. ఆ క్షణంలో అబద్ధాన్ని కూడా నిజమని నమ్మేలా చేస్తుంది ఎంతటి మాయనైనా నిజమని భ్రమింప చేస్తుంది ఎంతటి గొప్పవారి మనసునైనా చెలింపజేస్తుంది.
(04:50) సీతమ్మ తల్లి మనసు కూడా ఆ బంగారపు లేడిని చూడగానే ఆ క్షణంలో మురిసిపోయింది. ఆ మాయ ఆమెను చెలింపచేసింది. సాక్షాత్తు రాముడు చెప్పాడు సీత సృష్టిలో బంగారు లేడి ఉండదు అదిఒక మాయ అని అయినా సరే సీతమ్మ మనసుని ఆ కోరిక వదలలేదు. ఆ మాయ లేడి కోసం రాముడు రాముడి కోసం లక్ష్మణుడు అడవిలోకి వెళ్ళాల్సి వచ్చింది. సీతమ్మ తల్లి తన జీవితంలో దేని మీద ఆశపడలేదు ధర్మంగా బతికింది కానీ ఆవిడ మనసులో పుట్టిన ఒక అసహజమైన కోరిక ఆవిడని కమ్మేసిన ఆ మాయ రావణాసుడు తనని అపహరించేలా చేసింది భర్తకు దూరంగా రాక్షసుల మధ్యలో భయంకరమైన అడవిలో బందీగా ఉండాల్సి వచ్చింది. ఆ వృద్ధ సాధువు
(05:29) డాక్టర్ దేవుతో ఇంకా ఇలా అన్నాడు చూసావా దేవ్ సీతమ్మ తల్లి ఏ పాపం చేయలేదు కీర్తి కోసం వెంపర్లాడలేదు ధర్మాన్ని పక్కన పెట్టలేదు కానీ తనకు ఏమాత్రం అవసరం లేని ఒక అసహజమైన కోరికను పట్టుకొని వేలాడటం వల్ల ఊహించని కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ బంగారపు లేడీ రాక్షసుడైన మారీచుడి మాయా స్వరూపం నువ్వు కోరుకునే ఒక అసహజమైన కోరిక కూడా ఎప్పుడు బంగారపు లేడీ వేషం వేసుకొని వచ్చే ఒక రాక్షసుడే ఆ సాధువు మాటలు వింటున్న డాక్టర్ దేవు కన్నీళ్ళతో స్వామి మీరు చెప్పింది అక్షర సత్యం సీతమ్మ తల్లి మనసును ఆ బంగారపు లేడి చెలింపజేసింది కానీ నా జీవితంలో నేను ఏ
(06:06) బంగారపు లేడి కోసం ఆశపడ్డాను ఏమి ఆశించకుండా సేవ చేసే నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి అని అడిగాడు. అప్పుడు సాధువు డాక్టర్ దేవ్ భుజం మీద చెయ్యి వేసి చాలా సున్నితంగా ఇలా అన్నాడు దేవ్ 10 ఏళ్ల క్రితం నీ జీవితంలో ఎంత ప్రశాంతంగా ఉండేవాడివో ఒకసారి గుర్తుకు తెచ్చుకో ఒక చిన్న 50 పడకల హాస్పిటల్ పెట్టుకున్నావ్ నీ దగ్గరికి వచ్చే పేదలకు నీ చేతులతో ఉచితంగా ఆపరేషన్లు చేశవ్ ధర్మంగా పేషెంట్ల ప్రాణాలు కాపాడినప్పుడు నీకు కలిగే ఆ సంతృప్తి రాత్రిపూట ఎంతో ప్రశాంతమైన నిద్రను ఇచ్చేది నీకు కానీ ఒకరోజు నీ మనసులోక ఒక కోరిక ప్రవేశించింది. నేను ఇంత
(06:39) గొప్ప వైద్యం చేస్తున్నాను కదా ఆసియాలోని అతి పెద్ద 3000 పడకల హాస్పిటల్లో నా పేరు మీద ఉండాలి నా పేరు చరిత్రలో నిలిచిపోవాలి నన్ను ప్రపంచంఅంతా దేవుడిలా చూడాలి అని ఆశపడ్డావు దేవ్ ఏమీ ఆశించకుండా నువ్వు పేదలకు వైద్యం చేస్తూ పోతే ఆ కీర్తి ఆ పేరు వాటంతట అవే నిన్ను వెతుక్కుంటూ వచ్చేవి కదా 50 పడకల హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అయి ఉండేది 100 పడకలు 1000 అయి ఉండేవి 1000 పడకల హాస్పిటల్ 3000 పడకల హాస్పిటల్ అయి ఉండేది అది సహజంగా జరిగిపోయేదేమో ఎప్పుడైతే 3000 పడకల హాస్పిటల్ కోసం ఆ కీర్తి కోసం నువ్వు వెంపర్లాడావో అక్కడే మాయ మొదలైంది ఆ 3000
(07:15) పడకల హాస్పిటల్ నీకు అవసరం కాదు అదిఒక కోరిక మాత్రమే ఆ అసహజమైన కోరిక నీ జీవితంలోకి వచ్చిన ఒక బంగారపు లేడీ ఆ మాయ ఎంత పవర్ఫుల్ అంటే నేను అబద్ధాన్ని నిజమని నమ్మేలా చేసింది ఆ 3వేల పడకల హాస్పిటల్ కట్టడం కోసం నువ్వు స్వార్ధపరులైన కార్పొరేట్ ఇన్వెస్టర్స్ తో చేతులు కలపాల్సి వచ్చింది వాళ్ళు వచ్చి దేవుగారు మీరు దేవుడు మేము వందల కోట్లు పెడతాం ఆసుపత్రి మీరే నడపండి పేదలకు సేవ చేద్దాం అని మాయ మాటలు చెప్తే ఆ మాయలో పడి వాళ్ళ అబద్ధాలని నిజమని భ్రమించావ్ వాళ్ళతో అగ్రీమెంట్లు చేసుకున్నావ్ సృష్టిలో బంగారపు లేడు ఎలాగైతే ఉండదో లాభాలు
(07:51) ఆశించకుండా వందల కోట్లు ఇచ్చే కార్పొరేట్ సంస్థలు కూడా ఉండవు అదొక మాయ సరిగ్గా ఆ అగ్రీమెంట్లు చేసుకున్న క్షణంలో ఏ నిస్వార్థ సేవ అయితే ఇన్నాళ్ళు ఒక దేవుడిలా నిన్ను కాపాడుతూ వచ్చిందో ఆ లైన్ నువ్వు దాటేసావు కేవలం పేరు ప్రఖ్యాతల కోసం నీ జీవితంలోకి కార్పొరేట్ అనే రాక్షసుడిని ఆహ్వానించావు నువ్వు ఆ లైన్ ని దాటిన మరోక్షణమే ఆ మాయ లేడీ తన రాక్షస రూపాన్ని బయట పెట్టింది.
(08:14) నిన్ను ఫ్రీ వైద్యం ఆపేయమన్నారు అవసరం లేని టెస్ట్లు ఆపరేషన్లు చేసి పేషెంట్లని దోచుకోమన్నారు కానీ ఒక నిజాయితి గల డాక్టర్ గా నీ మనస్సాక్షి దానికి ఒప్పుకోలేదు నేను డబ్బు కోసం పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడను అని వాళ్ళకి ఎదురు తిరిగావు. అప్పుడు ఆ కార్పొరేట్ వాళ్ళు ఏం చేశారు నిన్ను నీ సొంత హాస్పిటల్ నుంచే బయటక గెంటేశరు నువ్వు బయటక వస్తే వాళ్ళ బండారం బయట పడుతుందని ముందే నీ మీద అక్రమ మెడికల్ కేసులు పెట్టారు మీడియాలో నిన్ను ఒక ఫ్రాడ్ గా బద్నాం చేశారు.
(08:42) ఇదంతా ఎందుకు జరిగింది దేవ్ ఆ 3000 పడకల హాస్పిటల్ అనే ఒక మాయ లేడీని చూసి నీ మనసు చెలించి వాళ్ళ అబద్ధాలని నిజమని నమ్మటం వల్లే కదా అన్నాడు సాధు అప్పుడు దేవు ఏడుస్తూ నిజమే స్వామి ఆ మాయలో పడి నేను అబద్ధాన్ని నిజమని నమ్మాను నా ప్రశాంతతను నేనే చేజేతులా పాడు చేసుకున్నాను కానీ స్వామి నాదొక భయం ఆ కార్పొరేట్ వాళ్ళు నా మీద అక్రమ కేసులు పెట్టారు హాస్పిటల్ పోయింది పొరువు పోయింది నిజంగా రేపు ఆ కేసుల్లో నాకు జైలు శిక్ష పడితే నా భార్యా పిల్లలు రోడ్డును పెడతారన్న భయం దయ్యం నేను ఇక్కడికి పారిపోయి వచ్చేలా చేసింది ఇప్పుడు నేను తిరిగి వెళ్తే వాళ్ళని ఎలా
(09:16) ఎదుర్కోగలను అని భయంగా అడిగాడు. ఆ మాట వినగానే సాధువు ఒక అద్భుతమైన నిజం చెప్పాడు. నువ్వు జైలుకు భయపడడం లేదు దేవ్ ఇంకా అయ్యో నా కల నాశనం అయిపోయిందే నా జీవితం పతనం అయిపోయిందే నా పరువు పోయిందే నా వెయ్యి పడకల ఆసుపత్రి చేజారిపోయిందే అన్న మాయలోనే ఉన్నావు ఆ భ్రమలోనే ఉన్నావ్ ఒక్కసారి ఆ మాయ పొరను తీసేసి చూడు దేవు పోయింది నీకు అవసరం లేని మాయ లేడి మాత్రమే ఒక్కసారి ఆలోచించు దేవు నువ్వు వాళ్ళతో చేయి కలిపి పేషెంట్లని మోసం చేసి ఉంటే ఈరోజు ఆ 3000 పడకల ఆసుపత్రి నీదే అయి ఉండేది నీకు అవార్డులు కూడా వచ్చి ఉండేవి కానీ నువ్వు ఆ తప్పు చేయలేదు నీ ధర్మాన్ని
(09:51) నిలబెట్టుకున్నావ్ అలాంటప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి జైలుకు దొంగలు భయపడాలి అంతేగానీ ప్రాణాలు నిలబెట్టే డాక్టర్ కాదు నీకు నిజంగా అవసరమైన నీ భార్య పిల్లలు నీకోసం ఎదురు చూస్తున్నారు. నీ 50 పడకల ఆసుపత్రి నీకోసం ఎదురు చూస్తుంది. ఇకనైనా ఆ మాయ లేడి మీద ఆశ వదిలేసి తిరిగి వెళ్ళుదేవు ధైర్యంగా కోర్టు మెట్లు ఎక్కు నేను డబ్బు కోసం పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడను అని ఎదురు తిరిగాను కాబట్టే నా మీద అక్రమ కేసులు పెట్టారు అని న్యాయస్థానంలో స్వయంగా వెళ్లి చెప్పు కోరికలు వదిలేసుకున్న వాడిని ఈ ప్రపంచంలో ఏ కోర్టు కేసులు భయపెట్టలేవు దేవు ఒకవేళ
(10:23) నువ్వు జైలుకి వెళ్ళాల్సి వస్తుందేమో అన్న భయం నీలో ఇంకా ఉంటే ఒక్కసారి సీతమ్మ తల్లిని తలుచుకో ఆమె ఎంతటి పుణ్యాత్మురాలైనా ఆ బంగారపు లేడీ అనే ఒక అవసరం లేని కోరికను కోరిన ందుకు తన భర్తకి దూరంగా రాక్షసుల మధ్యలో అశోకవనంలో బందీగా ఉండాల్సి వచ్చింది. జీవితమంతా ఏమి ఆశించకుండా ధర్మంగా బతికి ఒక్కసారి ఒక్క చిన్న కోరిక ఒక చిన్న మాయలో పడినందుకే ఆ మహా తల్లికే శిక్ష తప్పలేదు ఇప్పుడు నీకు ఆ జైలు కూడా అశోక వనం లాంటిదే దేవ్ నువ్వు కోరుకున్న ఆ మాయ లేడి తెచ్చిన కష్టం అది దాన్ని ధైర్యంగా అనుభవించు సీతమ్మ తల్లి అశోక వనంలో ఉన్న ఆమె పవిత్రత ఏ మాత్రం
(11:00) తగ్గలేదు అలాగే నిజాయితీ కోసం నువ్వు ఏ జైలుకి వెళ్ళినా నీ మనస్సాక్షికి ఏ మచ్చ అంటదు ఒకవేళ ధర్మం గెలవడానికి కొన్నాళ్ళు జైల్లో ఉండాల్సి వచ్చినా నువ్వు నువ్వు తలఎత్తుకొని వెళ్ళు ఎందుకంటే తప్పు చేయన వాడికి జైలు కూడా అశోకవనం లాంటి ఆశ్రమమే ఆ తర్వాత ప్రశాంతంగా వెళ్లి నీ క్లినిక్ లో అడుగు పెట్టు అప్పుడు చూడు ధర్మంగా ఒక పేషెంట్ కి వైద్యం చేస్తే నీకు ఎంత మనశశాంతి దొరుకుతుందో అన్నాడు సాధు ఆ మాట వినగానే డాక్టర్ దేవు కళ్ళలో ఉన్న భయం పూర్తిగా పోయింది.
(11:30) తాను కోల్పోయింది తనకు ఎంత మాత్రం అవసరం లేని ఒక మాయ లేడీని మాత్రమే అని అర్థమయింది. వెంటనే సాధు పాదాలకు నమస్కరించి ఏమాత్రం భయం లేకుండా తన మీద ఉన్న కేసులను ఎదుర్కోవడానికి ఒక యోధుడిలా తన నగరానికి బయలుదేరాడు డాక్టర్ దేవ్ ఇప్పుడు చెప్పండి డాక్టర్ దేవ్ కథ విన్నాక మనందరికీ ఒక అద్భుతమైన క్లారిటీ వచ్చి ఉంటుంది. మనం జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడని ఒక భయంకరమైన సత్యం ఉంది.
(11:52) అదేంటంటే సంతోషంగా జీవిస్తున్న ఒక పుణ్యాత్ముడి జీవితానికి అతని పతనానికి మధ్య ఒక చిన్న లైన్ ఉంది. ఆ లైన్ ని దాటించేది మనకి అనవసరమైన ఒక అసహజమైన కోరిక. ఆ కోరిక కోసం ఆ మాయ కోసం ఆ గీత దాటిన మరుక్షణం నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే అశోకవనం లాంటి నరకాన్ని అనుభవించక తప్పదు. ఒక మనిషికి గాలి, నీరు, నిద్ర, తిండి, గూడు అవసరం వాటి కోసం ఎంత కష్టపడినా పర్లేదు ఆ కష్టపడే ప్రాసెస్ లో మనకి కీర్తి రావచ్చు ఆస్తి రావచ్చు వాటి వల్ల ప్రమాదం లేదు కానీ అసహజంగా వెంటనే కీర్తి వచ్చేయాలి విచ్చలవెడిగా మనీ వచ్చేయాలి అనే ఎయిమ్ తో సొసైటీలోకి పరిగెట్టి ఏది పడితే అది చేస్తే డాక్టర్
(12:32) దేవులాగా జైలుకి వెళ్ళాల్సి రాకపోవచ్చు చట్టం నుంచి తప్పించుకోవచ్చు కానీ రేపువచ్చే ఆ కీర్తి ఆ డబ్బు అనే చీకటి గదుల్లో బందీ అయిపోతాం ఊపిరాడక అల్లాడిపోతాం ఎర్త్ ప్రవైడ్స్ ఎనఫ్ ట satిస్ఫైఎవరీ మన్స్ నీడ్స్ బట్ నాట్ఎవరీ మన్స్ గ్రీడ్ భూమ్మీద ప్రతి మనిషి అవసరాన్ని తీర్చడానికి సరిపడా సంపద ఉంది కానీ ఒక్క మనిషి దురాశను తీర్చడానికి మాత్రం ఈ భూమి కూడా సరిపోదు అలాగే ఇంగ్లీష్లో ఇంకొక పవర్ఫుల్ కొటేషన్ ఉంది డిజైర్ ఇస్ ఏ కాంట్రాక్ట్ యు మేక్ విత్ యువర్సెల్ఫ్ టు బి అన్హ్యాపీ అంటిల్ యు గెట్ వాట్ యు వాంట్ కోరిక అనేది అది తీరేవరకు నువ్వు జీవితంలో సంతోషంగా
(13:09) ఉండకూడదని నీకు నువ్వే రాసుకునే ఒక భయంకరమైన ైన అగ్రీమెంట్ లాంటిది ఈరోజు జీవితంలో మనం అనుభవిస్తున్న కష్టాలకి మనం అనుభవిస్తున్న స్ట్రెస్ కి కారణం ఎవరో కాదు మనం వెంటపడుతున్న బంగారు లేడీలు మాత్రమే ఒకసారి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించండి మీరు దేనికోసం అయితే రాత్రింబోళ్ళు నిద్ర లేకుండా పరిగెడుతున్నారో అది మీ కుటుంబానికి అవసరమా లేక మీ బుర్రలో పుట్టిన ఒక అసంబద్ధమైన కోరిక దయచేసి ఆలోచించండి ఆ కోరిక కోసం అబద్ధాన్ని నిజమని నమ్మి మీ ప్రశాంతతని దూరం చేసుకోకండి చంపేసుకోకండి ఈ ఎపిసోడ్ మీ గుండెని తాకి ఉంటే మీ జీవి జీవితంలో మీరు వెంటపడుతున్న ఆ బంగారపు
(13:43) లేడీ ఏంటో దాన్ని వదిలేయడం ద్వారా మీ మనశశాంతిని ఎలా కాపాడుకోవాలని డిసైడ్ అయ్యారో కింద కామెంట్స్ లో గర్వంగా పంచుకోండి అనవసరమైన కోరికల వెంటపడి మనశశాంతిని పాడు చేసుకుంటున్న మీ ప్రతి స్నేహితుడికి ఈ పాడ్కాస్ట్ ని షేర్ చేసి ఒక రియాలిటీ చెక్ ఇవ్వండి మరొక అద్భుతమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుస్తాను మర్చిపోకండి మీ అవసరాలని మాత్రమే ప్రేమించండి మాయ లేడీల్ని వదిలేయండి బీ పీస్ఫుల్ నమస్కారం గారు
No comments:
Post a Comment