యండమూరి వీరేంద్రనాథ్ ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషణ
“భవిష్యత్తులో అసెంబ్లీలు, ఆఫీసులూ, సినిమా హల్సూ ఉండవు. పెట్రోల్ రేషన్ అవటంతో సూపర్ మర్కెట్లూ, మాల్సూ పోయి ఆన్-లైన్ అమ్మకాలే ఉంటాయి” అని పాతిక సంవత్సరాల క్రితం వ్రాసినప్పుడు అవన్నీ అభూత కల్పనలని కొంతమంది కొట్టివేశారు. నా నవల పేరేదో నాకు గుర్తులేదు గానీ రెండు రోజుల క్రితం... ఉగాండా దేశపు ప్రెసిడెంట్ ఇచ్చిన ఉపన్యాసం ఇది. పండగ పేరు చెప్పి వీధుల్లో రికామీగా తిరుగుతున్న తన మనుషులని ఉద్దేశించి దేశాధ్యక్షుడు ‘ముసెవెనీ’ ఇచ్చిన ఉపన్యాసపు సారాంశానికి స్వేచ్చానువాదం చదవండి:
"భగవంతుడికి చాలా పనులున్నాయి. ప్రపంచాన్నంతా ఆయనే చూసుకోవాలి. మీలాంటి రెక్-లెస్ ఉగాండా ఇడియట్స్ కోసం స్పెండ్ చేసేటంత టైమ్ ఆయనకి లేదు. మెడకి తాడు వేసి ‘నాతో ఉందూ గానీ రా’ అని తీసుకుపోతాడు. మీ ఇష్టం వచ్చినట్టు బతుకుతారా? బతుకుoటే చాలు అనుకుంటారా?... మీ ఇష్టం.
యుద్ధకాలంలో ఎవరూ ఎవరినీ ఇళ్ళల్లో ఉండమని అడగరు. మీరే రోజుల తరబడి ఫ్లాట్స్ క్రింద బేస్మెంట్లో బిక్కుబిక్కుమంటూ దాక్కుంటారు. పిజ్జాల కోసం, సుగంధ ద్రవ్యాల కోసం రోడ్ల మీద పడరు. రొట్టె దొరికితే చాలనుకుంటారు. అర్ధరాత్రి దూరంగా వినిపించే బాంబుల శబ్దాన్ని వింటూ నిద్రకి దూరమైన మీరు, మరుసటి రోజు సూర్యోదయాన్ని చూసి, ఆ రాత్రి బ్రతికున్నందుకు భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటారు తప్ప, నిద్ర లేదని కంప్లయింట్ చెయ్యరు. పిల్లలకి కాలేజీ పోతోందని బాధపడరు. సైన్యంలో చేర్పించటానికి ప్రభుత్వం మీ పిల్బల్ని బలవంతంగా తీసుకెళ్ళలేదని సంతోషిస్తారు.
కాళ్ళు చేతులు తెగిన జనం అర్ధరాత్రి ఆర్తనాదాల మధ్య... భూకంపానికి కూలిపోయిన మీ భవంతి ముందు... ఎముకలు కొరికే చలిలో పిల్లల్ని వేసుకుని రాత్రంతా కూర్చునే స్థితి రానందుకు సంతోషించండి. చెట్టు కొమ్మని పట్టుకుని వేలాడుతూ ఉదృతంగా వస్తూన్న నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చే పాములు కాళ్ళకి చుట్టుకుంటాయేమోనని భయపడేటంత భయంకరమైన స్థితి కాదిది. రెండు రోజులుగా ఆహారం లేక ఏడ్చే పసిపిల్లలతో ఇంటి పైకప్పు మీద నిలబడిె, హేలికాప్టర్ విసిరే అన్నం పొట్లం మీ ఇంటి మీద పడాలని, ఆకాశం వైపు ఆశగా చూసేటంత దురవస్థ లేదు. అందుకు సంతోషించండి.
‘మేము దీనికి అతీతులం’ అని తిరుగుతున్న కొందరు నా దేశపు ప్రజలారా..మీరు తప్ప, ప్రపంచం మొత్తం శత్రువుతో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో బాంబులు లేవు. సైనికులు లేరు. సరిహద్దులు లేవు. శాంతి ఒప్పందాలు లేవు. దయాదాక్షిణ్యాలు లేవు. మతం, దేశం, ఆడ. మగ, పసిపిల్లలు, వృద్ధులు తేడా లేదు. శత్రువు గమ్యం ఒకటే. మానవాళిని నాశనంచేసి ప్రపంచాన్ని స్మశానం చేయటం..! దాని పేరే కోవిడ్ - 19.
అయితే మన శత్రువు మనం అనుకునేటంత బలమైనది కాదు. ఒక బలహీనత ఉంది. ఎదుర్కొoటే విజృంభిస్తుంది. దూరంగా ఉంటే కరిగిపోతుంది. చాలా సులభంగా ఓడించవచ్చు. కావలసింది క్రమశిక్షణ.
వాస్తవాన్ని అర్థం చేసుకోండి. మరో సంవత్సరం వరకూ వ్యాక్సిన్ కనుక్కోబడదు. వ్యాక్సిన్ కనుక్కునేవరకూ ఏ దేశం కూడా పరాయి దేశస్థుడిని తన దేశం రావటానికి ఒప్పుకోదు. ఒకసారి విదేశాలలో ఉన్నవారు మన దేశం వస్తే తిరిగి వెళ్ళటం కూడా కష్టమే. 2021 జూన్ వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఓడలూ, విమాన యానాలూ సాధ్యం కావు. పక్క సీటు ఖాళీ పెడితే తప్ప విమానయానం కుదరదు. అలా చేస్తే కమర్షియల్గా సక్సెస్ అవదు. కాబట్టి దాని గురించి మర్చిపోండి. విదేశాలలో ఉన్న మీ పిల్లలూ, బంధువులూ చాలా కాలంపాటూ మీకు కనపడక పోవచ్చు. లాక్-డవున్ తీసేయగానే ఆల్ఫ్స్ మంచు కొండల మీద స్కేటింగ్ గురించి మొన్న నా స్నేహితుడు మాట్లాడాడు. నవ్వొచ్చింది. హొటల్స్, మాల్స్, సినిమాలు వీటన్నిటి గురించి మర్చిపోండి. పుష్కర స్నానాలు, పుణ్య క్షేత్ర దర్శనాలు ఉండవు. భగవంతుడిని ఎక్కడి నుంచి ప్రార్ధించినా ఒకటే అని తెలుసుకోండి. ఒక గొప్ప పరిణామానికి ఈ సమస్యని ఆధారభూతంగా చేసుకుందాం. ఆల్ ది బెస్ట్...”
సేకరణ రచన
య౦డముారి వీరేంద్రనాథ్ గారు*

No comments:
Post a Comment