Saturday, January 2, 2021

*"AIA" "శ్వాస - రూపం"* (Breath - Form)

🟢 పితామహ పత్రీజీ 25-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢

🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 25-09-2020🔸

Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.

"AIA" "శ్వాస - రూపం" (Breath - Form)

"మనిషికి, AIA అనేది రూపానికి సంబంధించిన సూత్రం. ఇది తటస్థ స్థితిలో ఉన్న పదార్థం, ఇది ఇకపై ప్రకృతి పదార్థం కాదు, ఇంకా మేధస్సుకు సంబంధించిన పదార్థం కూడా కాదు మరియు అదే విధంగా, భూతలానికి చెందిన నాలుగు ప్రపంచాలకు సంబంధించినది కూడా కాదు."

" AIA కొలవదగిన పరిమాణం లేనటువంటిది, అది రూపం కాదు; అది నాలుగు ఇంద్రియాలతో తెలుసుకోగలిగేది కాదు."

" AIA అనేది పదార్థం నుండి ఒక అగ్ని శకలంగా వచ్చింది, AIA గా మారేంత వరకు ప్రకృతి - పదార్థంగా ఎన్నో దశలలో అభివృద్ధి చెంది, ఆ తరువాత త్రితత్వ- నేనుగా మారటమే దాని యొక్క విధి."

"మానవుల కంటే క్రింది స్థితులలో AIA లు అనేవి ఉండవు."

" AIA పుట్టుక సమయంలోనే రూపం మరియు పరిమాణం లేనందువలన శ్వాస - రూపం (breath - form) గా పునరుద్ధరింపబడుతుంది; దీనిని మనిషి యొక్క కాంతి లేక సూక్ష్మ శరీరానికి భిన్నంగా గుర్తించాలి."

" శ్వాస - రూపం యొక్క క్రియాశీల - భాగం (active side) అది భౌతిక శ్వాస. శరీరి- నేను ఆలోచించేటప్పుడు మరియు ఇంద్రియాల ద్వారా చెరగని ముద్రలను నాటుతుంది, అదే నిష్క్రియాశీల భాగం, దాని రూపము."

"AIA, జనన మరణ సమయాలలో శ్వాస - రూపం వెనుక ఉంటుంది, శ్వాస - రూపం లోని శ్వాస, రూపాన్ని వదిలేంతవరకు ఉంటుంది."

" శ్వాస - రూపం అనేది స్వయంచాలకం ; ఇది ప్రకృతికి మరియు శరీరి - నేను కు వ్యభిచారిగా మరియు దేవదూతగా వ్యవహరిస్తుంది."

" మార్పుకు లోనయ్యే ఈ ప్రపంచంలో, రూపం ఉన్న జీవులన్నీ, చిన్న దోమ వంటి పురుగు నుండి ఏనుగు వరకు, పుట్టగొడుగు నుండి ఒక నక్షత్రం వరకు, ఒక దెయ్యం నుండి దేవుని వరకు, ఈ రూపాలన్నీ, మానవులు చనిపోయాక, వారి శ్వాస - రూపం నుంచి వస్తాయి."

"మానవులు శ్వాస -రూపాలు, శాశ్వత రూపంలో లిఖించబడి, మనిషి ఆలోచనా క్రమం మరియు ఆలోచనల యొక్క గుర్తులను ప్రకృతిలో గాఢ ముద్రలుగా వ్యక్తపరుస్తాయి. ఈ ముద్రలు ప్రకృతి రూపాలుగా వ్యక్తీకరణ చెందటం స్వయంచాలకమైనది; కారణ, ప్రవేశ మరియు నిర్మాణ అంశాల యొక్క ధాతువులు వాటి ఆజ్ఞానుసారం, శ్వాస - రూపం పై వాటి గుర్తులను నిలిపి శరీర-పరం చేయాలి."

"ప్రతి శ్వాస -రూపం కూడా మిలియన్ల కొద్దీ రూపాలని ప్రకృతి కోసం, ప్రకృతి లోనికి విడుదల చేయడం జరిగింది మరియు ఈ విడుదల చేయటం అనేది కొనసాగుతుంది."

" శ్వాస - రూపాన్ని దివ్యదృష్టితో చూసేందుకు వీలుపడదు. కొన్నిసార్లు ఏదయితే ప్రకాశం కలిగి నక్షత్రం వలె ఉంటుందో ఇది సూక్ష్మ లేక కాంతి శరీరం ; దీనిని శ్వాస - రూపం గా పొరపాటు పడకూడదు."

💖 ఎస్. పత్రి 💖

తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)

లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004

👍 VicTorY oF Light 🎇

💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment