Friday, January 1, 2021

"ఆలోచనను సమత్వపరచటం" "మరణానంతర స్థితులు"

🟢 పితామహ పత్రీజీ 07-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢

🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 07-09-2020🔸

Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.

"ఆలోచనను సమత్వపరచటం"
"మరణానంతర స్థితులు"

" ఆలోచనను సమతుల్యపరచటం, ఆ ఆలోచనను చేసిన వ్యక్తి యొక్క బాధ్యత."

" ఆ వ్యక్తి యొక్క ప్రామాణికాన్ని అనుసరించి, అది సరి అయినదా, కాదా అనే నిర్ణయం తీసుకునే బాధ్యత ఆ వ్యక్తి పైనే ఉంటుంది. ఈ బాధ్యత తర్కం ద్వారా అతనికి తెలియబడదు కాని అది మనస్సాక్షి నుంచి హెచ్చరికగా వస్తుంది, మనసు (the thinker) యొక్క నైతికత నుంచి ఇవ్వబడుతుంది."

"అన్ని జన్మలలో, అన్ని అనుభవాల ద్వారా నేర్చుకున్న శరీర- నేను యొక్క బాధ్యత, అతను పొందిన జ్ఞానము."

"జ్ఞానమనేది నైరూప్యమైనది ; కాని అది ఏ సమయంలోనైనా అతని విధుల నిర్వహణలో నిశ్చయంగా వెల్లడి అవుతుంది."

"ఒకసారి విడుదల అయిన ఆలోచన శక్తివంతం కావటానికి నిరంతరం అదే సారూప్య రీతిలో కొనసాగే ధోరణి కలిగి ఉంటుంది."

"శరీర- నేను (the doer) , తన బాహ్యీకరణల యొక్క అనుభవాల ద్వారా నేర్చుకునేంత వరకు ఒక ఆలోచనా క్రమం కొనసాగుతుంది."

"శరీర- నేను నేర్చుకున్న తరువాత, తను ఏదయితే చెయ్యాలో అది ఇష్టపూర్వకంగా చెయ్యటానికి సంసిద్ధత ఉన్నప్పుడు జ్ఞాన, మానసిక, సైకిక్ (శారీరక + మానసిక) పరమైన ఒప్పందం వలన జ్ఞానం, మనస్సాక్షి, కోరికలు, చర్యలు లేక ఆ ఆలోచన యొక్క బాహ్యీకరణల పట్ల బాధ ఉంటాయి మరియు ఆ ఆలోచనల యొక్క పునరావృత ప్రసరణలు అంతమవుతాయి - అంటే మానసిక ఆవరణలో ఆ ఆలోచన సమత్వం పొందుతుంది."

"ఒక ఆలోచన విడుదల అయినప్పుడు, కొంత భాగం బాహ్యీకరణ చెందిన తర్వాత, ఆ వ్యక్తి మరణానంతరం ఆ ఆలోచన పునరావృత మార్గాల ద్వారా కొనసాగుతుంది."

"అది శరీర- నేను తో వెళుతుంది మరియు మనిషి యొక్క మానసిక ఆవరణలో ఉంటుంది. అది రకరకాల మరణానంతర స్థితులలో ఒక చక్ర భ్రమణంలో శరీర-నేను యొక్క ఒక భాగంలో ఉంటుంది."

"ఆలోచనలే దానిని నిరశిస్తూ మరియు సాక్షిగా, శరీర- నేనుకు అనుకూలంగా లేక వ్యతిరేకంగా తీర్పు చెప్పే సభా మందిరంలో ఇంకా ప్రాయశ్చిత్తం మరియు శుద్ధీకరణ స్థితులలో ఉంటుంది."

"కేవలం ఉత్తమ ఆలోచనల యొక్క కొన్ని భాగాలే శరీర- నేను తో స్వర్గానికి వెళ్ళి, దానితో కలిసి ఉంటాయి."

"ఎప్పుడయితే శరీర- నేను అనే భాగం (doer portion) భౌతిక జీవితానికి తిరిగి వచ్చి మానవ శరీరంలో ప్రవేశిస్తుందో, అప్పుడు గతంలోని పూర్వపు ఆలోచనలు పునరావృత ప్రసరణలుగా మనిషి చుట్టూ కొనసాగటం జరుగుతుంది. జీవితం యొక్క ప్రారంభ దశలలో మానవుడు పునరావృత ఆలోచనల యొక్క ఎరుకలో ఉండడు. పునరావృత భ్రమణంలో, శరీర- నేను కు వచ్చే ఈ ఆలోచనలు, దాని యొక్క పూర్వపు ఆలోచనలు."

"మానవులందరూ కూడా ఆలోచనలు చేస్తారు. ఒక వ్యక్తి ఆలోచనలకు మల్లె వీరి ఆలోచనలు
ఘనీకృతం చెంది క్రమంగా బాహ్యంగా ప్రకటితమవుతాయి."

"మానవులందరూ ఆలోచనలను విడుదల చేస్తున్నారు."

"తెలియని అంశాలను పరిగణలోనికి తీసుకోలేని కారణంగా, సాధారణంగా ఒక మనిషి యొక్క ఆలోచనలు తను కోరుకున్న విధంగా బాహ్యీకరణ చెందవు."

"ఈ అంశాలు కనిపించని కారణంగా మరియు వెంటనే న్యాయబద్ధంగా శిక్షింపబడని కారణంగా నైతిక చర్యలకు తగిన ప్రతిఫలం అందటం లేనట్లుగా అనిపిస్తుంది. ఉత్తమమైన మరియు ప్రశంసనీయమైన పనులకు సరి అయిన ప్రతిఫలం దక్కనట్లు కనబడుతుంది, ఇంకా సరికాని, అన్యాయాలు, అక్రమాల వంటి చర్యలకు పాల్పడిన వారికి ప్రపంచంలో పట్టం కట్టపెడుతున్నట్లుగా తోస్తుంది."

💖 ఎస్ పత్రి 💖

తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)

లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004

👍 VicTorY oF Light 🎇

💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment