Sunday, January 10, 2021

"నామ రూప సృష్టి" నుండి,
బయటపడి, ఇష్ట అయిష్టము లను లేదా రాగద్వేషాలని వదిలేస్తే కానీ, మనలో "సత్యోదయం" కాదు.

🌞 సత్యోదయం🌞

"🌞అస్తి" అంటే "ఉంది" అని అర్థం.

"ఏది ఉంది అన్నావుగా చూపించు",
"చుపిస్తే నమ్ముతా"
అంటే కుదరదు.
కొన్ని చూపించాడానికి కుదరవు.

ముఖ్యంగా మార్పుకు లోను అయ్యివి ఏవి మనకి కనబడవు,

మార్పు లేనిది,
మనకి అనుభవం లోకి రాదు,
ఎందుకంటే
దాని మీద మనకి విశ్వాసము లేదు.

"అస్తి" నే "సత్" అంటాము.

ఎందుకంటే అసలు నిజంగా ఉన్నదేదో,
అది ఎప్పుడు మారకుండా ఉంది,
ఎక్కడైనా అలానే మారకుండా ఉంది.
ఈ "సత్" ని అర్థం చేసుకోవాలి.

ఎందుకంటే ఈ "సత్" "బ్రహ్మము".

ఏదైతే శాశ్వతమో,
ఏదైతే నిత్యమో,
అదే బ్రహ్మము.

ఈ బ్రహ్మం ని తెలుసుకోవడం బ్రహ్మ జ్ఞానం.
ఈ "సత్" మనలో ఆత్మ రూపంలో ఉంది అని తెలుసు కోవడం ఆత్మ జ్ఞానం.
ఈ "సత్" పై "ఆసక్తి" ("అసక్తి" కి ఇంకో పదం "సంగం") "సత్సంగం".

"అసత్" అంటే "సత్" కానిది "మారేది",
అన్ని చోట్లా ఉండకుండా ఒకెచోట పరిమితమైనది. గాలి అన్ని చోట్లా ఉంది,
బుడగోలో కూడా ఉంది.
బుడగలో ఉన్నది పరిమితత్వం,
బయట ఉన్నది ఆపరిమితత్వం.
"ఆత్మ" "సత్" లాగా ఆపరిమితత్వము.
దానిని "దేహనికి" పరిమితి చేయడం అంటే
దానిని జీవాత్మ గా మార్చడం.
జీవం అంటే లైఫ్,
చిరంజీవి గా ఉన్న ఆత్మకి,
పుట్టుక చావు ఉన్నట్లు భావించి,
వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేయడము.
ఆ పుట్టినరోజు ఆధారంగా మన వయస్సు నిర్ణయంచడం.
ఇవన్నీ మనని మనం జీవాత్మగా మారి చేసే అజ్ఞానవు చేష్టలు.

ఇక "చిత్" అంటే "జ్ఞానం", "సత్" ని తెలుసుకునే "జ్ఞానం". "సత్" ని కాకుండా,
వేరేది తెలుసుకోవడం కూడా జ్ఞానమే కానీ,
అది "అపరా జ్ఞానం" ఆంటే "సత్" గురించి తప్ప మిగిలినది చెప్పది,
అదే సర్వస్వము అని నమ్మించేది.
"సత్" గురించి మాత్రమే చెప్పే జ్ఞానం "పరా జ్ఞానం".
ఈ "పరా జ్ఞానము" ని "బ్రహ్మ జ్ఞానం" అంటారు,

ఈ జ్ఞానం వల్ల కలిగేది ఆనందము.
ఈ ఆనందము, సుఖం లాంటిది కాదు, ఎందుకంటే సుఖం వెంబడి కష్టం ఉంది.

ఈ ఆనందం సంతోషం కాదు, ఎందుకంటే సంతోషంతో పాటు దుఃఖం లేదా విచారం ఉంది.

ఈ ఆనందము వెంబడి ఏది లేదు, ఉన్నది ఆనందమే.

ఈ ఆనందము "సత్" వల్ల కలిగితే అది "సదానందం". (సత్+ఆనందము)

ఈ ఆనందము "పరా జ్ఞానం" వల్ల కలిగితే ("జ్ఞానం" అంటే "చిత్") అది "చిదానందము".(చిత్+ఆనందము)

ఈ ఆనందము రెంటివల్ల అంటే సత్ వల్ల చిత్ వల్ల
కలిగితే అది "సచ్చిదానందము" (సత్+చిత్+ఆనందం).

మరి వాస్తవం ఇలా ఉంటే మన బ్రతుకులు ఇలా తగలడ్డాయి అంటే

మనం "సత్" కి ఒక "రూప" సృష్టి చేశాము.

ఆ "రూపానికి" ఒక "నామము" ఇచ్చాము.

ఇదే నామ రూప సృష్టి. మన.ధ్యాస.కూడా ఈ నామ

ఈ నామ రూప సృష్టి బాహ్యా ఆధారము గా.చేశాము, అలాంటి సృష్టి పట్ల మనకి ఒక ఇష్టము అయిష్టము ఆంటే "రాగా ద్వేషాలని" ఏర్పర్చాము.

ప్రతిదీ ఈ ఇష్ట అయిష్ట ఆధారము గా నిర్ణయాలు చేసుకుంటు, వాటిని మన జ్ఞాపకాలు గా మార్చేసాము. ఆ జ్ఞాపకాలలో మునిగి తెలుతున్నాము

ఈ "నామ రూప సృష్టి" నుండి,
బయటపడి, ఇష్ట అయిష్టము లను లేదా రాగద్వేషాలని వదిలేస్తే కానీ, మనలో "సత్యోదయం" కాదు.

🌞🔥🌞🔥🌞🔥🌞🔥🌞

Source - Whatsapp Message

No comments:

Post a Comment