Sunday, January 10, 2021

*"క్రియాశీల ఆలోచన"* (Active thinking) *"జ్ఞానము"* (Knowledge)

🟢 పితామహ పత్రీజీ 08-01-2021 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢

🔹 Calangute, Goa🔹

"క్రియాశీల ఆలోచన" (Active thinking)
"జ్ఞానము" (Knowledge)

Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.

▪️ " ఆలోచనాసరళి, గతంలోని తప్పిదాల నుండి నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే కాంతిని తిరిగి పొందాలనుకుంటుంది. ఇది సాధారణమైన , అస్పష్టమైన మరియు నిష్క్రియాశీల ఆలోచనలకు భిన్నంగా ఉంటుంది."

▪️ "అమరత్వం, శరీరంలో ఉన్నవాడు, సత్యసంధత, శుద్ధమైన అంతఃకరణము, న్యాయబుద్ధి, జీవిత లక్ష్యం లేదా సేవ మరియు సద్భావన వంటి అంశాలపై క్రియాశీల ఆలోచనల పరిమితులలో ఉండటమే దాని ఉద్ధేశ్యం. ఇది వ్యక్తిగత, నైతిక మరియు మానసిక పురోభివృద్ధి కోసం నేర్చుకోవాలనే ఖచ్చితమైన లక్ష్యం కలిగిన క్రియాశీల ఆలోచన. ఇది కోరికలు, ఆకర్షణలు మరియు బలహీనతల యొక్క అన్ని అడ్డంకులను అధిగమిస్తుంది."

▪️ "మానవుడు తన ఆలోచనల ద్వారా వచ్చే ఫలితాల యొక్క ఎరుకలో ఉండడు కాని కాంతి యొక్క పునరుద్ధరణ కారణంగా కలిగిన ప్రభావాలను తన శరీరంలో ప్రకాశంగా, తేలియాడుతున్న భావనగా మరియు చేతనత్వంగా మరియు మానసిక ప్రశాంతత, ఇంకా విషయాలను స్పష్టంగా చూడగలిగే సామర్థ్యంగా అనుభూతి చెందుతాడు."

▪️ "ఆలోచనను విడుదల చేసిన తరువాత, అది బాహ్యీకరణ చెందక పూర్వం, ఆ ఆలోచన నుండి కాంతిని వెనుకకు తీసుకొని రావడం సాధ్యమే. ఆలోచనాసరళి కాంతిని కోరిక నుండి వేరు చేసి, ఆ కాంతిని మానసిక ఆవరణకు మరియు కోరికను అతీంద్రియ ఆవరణకు పంపుతుంది."

▪️"భావనలు మరియు కోరికలు ఒకదానితో ఒకటి ఏకీభవించినప్పుడు, ఈ రెండూ కూడా ధర్మబద్ధమైన దానితో ఏకీభవించినప్పుడు మరియు సర్వాత్మ సాక్షిగా నిలిచియుండగా ఆత్మపరంగా చర్యలు, వస్తువిషయాలు, సంఘటనలకు సంబంధించి తర్కము మరియు ధర్మబధ్ధమైన దానితో ఏకీభవించినప్పుడు, ఆలోచించడం ద్వారా ఒక ఆలోచన సమతుల్యత చెందుతుంది."

▪️"ప్రకృతి నుండి శరీరంలోకి వచ్చిన కాంతి పునరుద్ధరణ యొక్క మూడవ దశ మునుపటి రెండు దశలలో పొందిన జ్ఞానం కారణంగా తిరిగి పొందిన కాంతి."

▪️ "ఈ జ్ఞానం యొక్క సారాంశం ఏమిటంటే ఆలోచన ద్వారా తాను దేనికీ బంధింపబడకుండా ఉండడం అదే విధంగా ఇతరమైన వాటి యొక్క బంధంలో చిక్కుకోకుండా ఉండగలగడం."

▪️ "మానవుడు ఈ జ్ఞానాన్ని తన జీవితంలో అన్వయించుకున్నప్పుడు మూడవ దశకు చేరుకుంటాడు. ఈ మార్గంలో కొనసాగుతున్నప్పుడు చిక్కులు, జంజాటములు మరియు అడ్డంకులు క్రమంగా సమసిపోతాయి. ఈ క్రమంలో ఆత్మవిశ్వాసంతో చర్యలను చేపడతాడు, లక్ష్యాన్ని చేరడంలో విశ్వాసం కలిగి ఉంటాడు మరియు ఒక విషయం లేదా పరిస్థితిని లోతుగా అవగాహన చేసుకోగలుగుతాడు. ఇకపై స్నేహితులు లేదా అపరిచితులు అతనిని ప్రభావితం చేయలేరు. ధనము, సంపద, ఆస్తిపాస్తులు అతనిని ఆకర్షించలేవు."

▪️ "అతడు, తన శరీరానికి ఆరోగ్యానిచ్చేవే తింటాడు మరియు త్రాగుతాడు, అతడు తన ఆహారాన్ని ఆస్వాధిస్తాడు కాని ఆనందించటం కోసం తినడు."

▪️ "అతడు ఏ మాత్రం దుఃఖానికి మరియు అసంతృప్తికి లోను కాడు. అతడి విధులు అతడి బాధ్యత కావున, అతడు విధులకు హాజరవుతాడు."

💖 ఎస్.పత్రి 💖

తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)

లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004

👍 VicTorY oF Light 🎇

💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment