Monday, January 11, 2021

నేనూ ఒక అమ్మనే.........

నేనూ ఒక అమ్మనే.........
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
తన భర్తకు చాలా ఇష్టమని గుత్తివంకాయకూర
వండింది ఓ మహిళ. తన వంటకాన్ని తన భర్త మెచ్చుకునేలా చేయాలని అన్నీ
సమపాళ్ళలో వేసి వంకాయ కూరను వండింది. ఆ వంటకం ఘుమ ఘుమలాడుతోంది. ఎలాగైనా తన భర్త తన వంటకాన్ని మెచ్చుకోవాలని కోరుకుంది ఆమె.
భర్త ఇంటికి రాగానే త్రాగడానికి నీళ్ళు అందించి భోజనానికి రమ్మని పిలిచింది.
భర్తకు భోజనాన్ని వడ్డించింది. ఏమీ మాట్లాడకుండా వంకాయకూరను
తినసాగాడు....చాలా బాగుంది. అని చెపుతాడేమో అని ఆశగా ఎదురుచూస్తోంది భార్య.ఎలాంటి స్పందన లేదు...... తట్టుకోలేక ఇలా అడిగింది భర్తను..
" మీకిష్టమని గుత్తివంకాయకూర చేశాను. ఎలా ఉందండీ! మీకు నచ్చేలా
చేశానా లేదా చెప్పకుండానే తింటున్నారు కదా!" అంది.
" గుత్తివంకాయకూర మా అమ్మ చేసినట్లు ఎవరికీ రాదు. ఆమె చేతి
మహాత్యమే అది. ఎంతైనా అమ్మ చేతి వంటకు తిరుగేలేదు.
మా అమ్మ ఏమి చేసినా వీధి చివరికి వాసన వచ్చేది " అంటూ
తిన్నంతసేపూ అమ్మనే తలచుకుంటూ భోజన్నాన్ని ముగించాడు.
తన వంట బాగుందని చెపుతాడని ఆశించిన ఆమెకు నిరాశే ఎదురైంది.
" ఎప్పుడు చూసినా అమ్మ ....అమ్మ అంటూ కలవరిస్తారు. ఈయన
గారికే అమ్మ ఉన్నట్టు.....ఆవిడగారే మహా వండినట్టు.......చీ....ఛీ...
ఈయన నా వంటను మెచ్చుకుంటారు అని ఎదురుచూడటం
నిజంగా నా బుద్ధి పొరపాటు" అంటూ సణగడం మొదలెట్టింది భార్య,
కాసేపటికి కొడుకు భోజనానికి వచ్చాడు.
" అమ్మా! ఆకలి చంపుతోంది. గుత్తొంకాయకూర వాసన వీధి చివరికి
వస్తోంది. త్వరగా వడ్డించమ్మా! " అని అన్నాడు.
ప్రేమగా కొడుకుకు వడ్డించసాగింది. తింటూ కొడుకు ఇలా అన్నాడు.
" అమ్మా! మీ వంట అమోఘం... ఏమి చేసినా మా అమ్మే చేయాలి.
కూర ఎంత రుచిగా ఉందో తెలుసా! మళ్ళీ మళ్ళి అదే తినాలనిపిస్తోంది.
ఇంకాస్త కూర వడ్డించమ్మా! ఎంతైనా అమ్మ ప్రేమగా వండి వడ్డిస్తుంటే
స్వర్గం కూడా వద్దనిపిస్తోంది. మా మంచి అమ్మ " అంటూ స్కూలుకు
పరుగులు తీశాడు.
తన భర్త దగ్గరినుండి ఆశించిన మెచ్చుకోలు కొడుకు నోటినుండి విన్న
ఆ తల్లి కళ్ళల్లో కన్నీరు. అప్పటి వరకు తన భర్తపై రుస రుసలాడిన
ఆమె మనసుకు అర్థం అయింది. ప్రతి బిడ్డకూ తల్లి వంటకు మించి
ఏదీ అంత బాగా నచ్చదనీ.....ఆ ప్రేమకు సాటి మరొకటి లేదనీ.....
ఎంతో కష్టపడి కనిపెంచిన తల్లిని , తల్లి వంటనీ మరువడం జరగదనీ...
అమ్మ తరువాతే ఎవరైనా......ఏదైనా అని ఆ తల్లికి అర్థం అయింది.
....కాబట్టీ....అమ్మ ప్రేమే నిజమైన ప్రేమ....అమ్మ వంటే అమృతం.
నిజంగా మీ అమ్మ వంట మీకు నచ్చితే షేర్ చేయండి....
మా అమ్మ వంట అంటే నాకు చాలా చాలా ఇష్టం......
అమ్మ.........అమ్మ.......అమ్మ.........అమ్మ..........
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment