Tuesday, January 5, 2021

సహనం

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹


సహనం



👉 మనిషికి తొందరపాటు ఎక్కువ. అనుకున్నది వెంటనే చేసేయాలనుకుంటాడు.

👉 మనిషికి భయం ఎక్కువ. ఆపద కలగగానే డీలా పడిపోతాడు.

👉 మనిషికి ఆవేశం ఎక్కువ. ఇతరులపై కోపం కలగగానే అక్కసు వెళ్లగక్కుతాడు.

👉 మనిషికి నిరాశ ఎక్కువ. బాధ కలగగానే కుమిలిపోతాడు.

👉 మనిషికి దురాశ ఎక్కువ గుడికి వెళ్ళి ఒక్క సెకను దణ్ణం పెడతాడు. తరతరాలు కూర్చుని తింటే తరగని సంపదని కోరతాడు.

👉 మనిషికి సహనం తక్కువ. ఒక్క రోజు ధ్యానం చేస్తాడు. 'నేను బుద్ధుడు' కావాలి అంటాడు.

👉 ఒక్కరోజు ధ్యానం చేస్తాడు. 'నాకు ఆరోగ్యం కావాలి' అంటాడు.

👉 ఆరోగ్యం రాకపోతే ఫోటోలు మారుస్తాడు.గుళ్ళు మారుస్తాడు. మతాలు మారుస్తాడు. దేవుళ్ళను మారుస్తాడు.

👉 దేనికీ కుాడా సహనం ఉండదు మానవునకు.

👉 మనకు ఏదైతే కావాలో దానికోసం సాధన ఎంతైనా అవసరం.

👉 అయితే...సాధనతో పాటు కాస్తంత ‘సహనం’తో నిరీక్షిస్తే అంతిమంగా ‘విజయం’ సాధించవచ్చు.

👉 సహనం ఒక నిగ్రహశక్తి, ఒక మానసిక పరిపక్వత గల స్థితి.

👉 సహనమనేది నీగమ్యాని కి నిన్ను చేర్చే మార్గం.

👉 ముఖ్యంగా కష్టసమయాల్లో ఏదైనా ఉద్వేగాన్ని దాటవేయాలన్నా, వాయిదా వేయాలన్నా సహనం తప్పనిసరి.

👉 ఎదుటి మనిషి నుంచి మనకు దేని కారణంగా ఒత్తిడి కలుగుతుందో, అందులోకి మనం కలసిపోవడం.

👉 అంటే ఎదుటివారిలోని ఏ గుణం మనకు కోపాన్ని తెప్పించి, సహనాన్ని పోగొడుతుందో దానిని మనలోకి ఆవహింపచేసుకోవడమే సహనం.

👉 మరి దీని కోసం ధ్యాన సాధన అవరం.

👉 మరి మనమందరమూ సహనంతో ధ్యాన సాధనచేద్దాం.మన గమ్యాన్ని చేరుదాం.

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

Source - Whatsapp Message

No comments:

Post a Comment