Tuesday, January 5, 2021

తెలుగు భాష తీయదనం కోసం చిన్న వ్యాసం మీ కోసం..

తెలుగు భాష తీయదనం కోసం చిన్న వ్యాసం మీ కోసం..
🌸🌸🌸
కంప్యూటర్ యుగంలో కాన్వెంట్ చదువులు, కాంపిటీటివ్ ప్రపంచం. కలెక్టర్(Collector) అవ్వాలని ఒక తండ్రి కల కంటే, నా కూతురు అమెరికా వెళ్ళాలి అని ఆశ పడే మరో తల్లి. మన పిల్లలు మన మాతృ భాష మరచి పోతారనే భయం ఒక వైపు ఆందోళన కలిగిస్తున్న, తమ పిల్లలు సొసైటీ లో అందరి పిల్లల లాగ కాకుండా భిన్నంగా ఉండి పోతారేమో అని…

హాయ్ మామ్! (Hai Mom!)

హే డాడ్! (Hey Dad!)

అని మాట్లాడిన, వారిని ఆపరు సరి కదా, ఇంకా వాళ్ళని ప్రోత్సహిస్తారు. ఎందుకంటే ప్రతి తల్లి, ప్రతి తండ్రి, తమ పిల్లలు పెద్ద చదువులు చదవాలని, విదేశాలకు వెళ్ళాలి అని, M.N.C. లో పని చేయాలనీ, అందరు తమ పిల్లల్ని ఫారిన్ రిటర్న్(Foreign return) అంటుంటే గర్వ పడాలనే కోరిక.

“దేశ భాషలందు తెలుగు లెస్స?లెస్?

గ్రామాల్లో ఇప్పటికి బడిలో నేర్పించే తెలుగు పద్యాలూ, అమ్మలు నేర్పించే పాటలు, సమయానుకూలంగా, సందర్భాన్ని బట్టి బామ్మలు చెప్పే సామెతలు, పిల్ల, పెద్దా అందర్నీ అలరించే పొడుపు కధలు.

అబ్బ… తేనెలూరు తెలుగుని ఎందుకు మరచి పోతున్నాం మనం అనే భావన కలిగిస్తుంది కదూ?

అలా మరచిపోయిన పద్యాలూ, సామెతలు, పొడుపు కధలు కొన్ని గుర్తు తెచ్చుకుందామ? మన తెలుగు భాష తీయదనాన్ని ఒక్కసారి ఆస్వాదిద్దామా?

చిన్నారి పాటలు:

బొంగరం

బొంగరం బొంగంరంతెలుగు చిన్నారి పాటలు బొంగరం
గంగరావి బొంగరం
తాడు లేని బొంగరం
తాత తెచ్చిన బొంగరం
చిన్నారి బొంగరం
చిటికకు తిరిగే బొంగరం
ముళ్ళులేని బొంగరం
పిల్లలాడే బొంగరం

చిట్టి మిరియాలు

చిట్టి చిట్టి మిరియాలు
చెట్టు కింద పోసి
పుట్ట మన్ను తెచ్చి
బొమ్మరిల్లు కట్టి
అల్లం వారి ఇంటికి, చల్లకు పొతే
అల్లంవారి కుక్క “భౌ భౌ ” అన్నది
నా కాళ్ళ గజ్జెలు, గళ్ళు గళ్ళు మన్నది
చంకలోని పాప, క్యార్ క్యార్ మన్నది

రంగులు

కాకమ్మ నలుపు! కారు మబ్బు నలుపుతెలుగు చిన్నారి పాటల బొమ్మలు
కొంగమ్మ తెలుపు! కోడిగుడ్డు తెలుపు
చిలుకమ్మ పచ్చన! చేల్లన్ని పచ్చన
దానిమ్మ ఎరుపు! తాంబూల మెరుపు
పండు నిమ్మ పసుపు! బంగారు పసుపు

బుర్రు పిట్ట

బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది
అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది
మామ తెచ్చిన మల్లె మొగ్గ ముడువనన్నది
మొగుడు పెట్టిన మొట్టికాయ తింటనన్నది
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది.

చిన్నప్పుడు మీరు నేర్చుకున్న ఈచిన్నారి పాటలు మీ పిల్లలకి కూడా నేర్పించి మన మాత్రు భాష ఎంత తీయనిదో తెలియచేయండి.

తెలుగు పొడుపుకధలు

బుల్లి బుల్లి పెట్టె గళ్ళు గళ్ళు మొగబట్టె చేత ఎత్తి చెంపబెడితె కబుర్లెన్నో చెప్ప బట్టె?

ముడిస్తే మొగ్గనై మూలాన చేరుతాను విప్పుతే పూవునై తలపై చేరుతాను?

పులిలా ఉంటాను పాలు పెరుగు తింటాను ఎలుకలంటే నాకు ప్రాణం కుక్కలంటే నాకు ద్వేషం?

బెత్తెడు తోకతో ఉంటాను తలను దించుకు పోతాను ఊలు, పాలు, ఇస్తాను డి అంటే డి కొడతాను?

నీటిలోనే జననం నీటిలోనే మరణం తినేవారికి ఇంపు తిననివారికి కంపు?

నల్ల నల్లగుంటాను పూల పైన వాలుతాను పూల తేనె తాగుతాను జుమ్మని పాడుతాను?

పుట్టిన రోజు పాటలు :

చిట్టి పొట్టి చిన్నారి పుట్టిన రోజు
చేరి మననం ఆడే పాడే పండుగ రోజు
ఆడుదామా దొంగాటా పాడుదామా ఇవెలా
చిట్టి పొట్టి చిన్నారి పుట్టిన రోజు
చేరి మననం ఆడే పాడే పండుగ రోజు
కన్నులుండి చూడలేరు కొంత మంది జనం
దారి తప్పి తిరగడమే తెలివిలేని తనం
మెదడు పదను పెట్టాలి అసలు దొంగను పట్టాలి
చిట్టి పొట్టి చిన్నారి పుట్టిన రోజు
చేరి మనం ఆడే పాడే పండుగ రోజు.

తారంగం

తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం
వేణునాద తారంగం వేంకట రమణ తారంగం
వెన్న దొంగ తారంగం వేణుగోపాల తారంగం
చిన్ని కృష్ణ తారంగం చీరాల దొంగ తారంగం
నల్లనయ్య తారంగం నంద గోపాల తారంగం
తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం

లాలి పాటలు(lullaby):

రామ లాలీ మేఘ శ్యామా లాలీ..
తామ రస నయనా దాశరధ తనయా లాలి
అబ్జ వర్ధన ఆటలాడి అలసినావయ్యా కృష్ణా..
బొజ్జలోన పాలు గురువేగా నిదురపోవయ్యా..
లాలి రామ లాలి మేఘ శ్యామ లాలీ..
తామ రస నయనా దశరధ తనయా లాలి
ఎంతో ఎత్తు మరిగినావయ్యా…
కృష్ణ.. ఎంతోఎత్హు మరగినావయ్య..
లాలి రామ లాలి మేఘ శ్యామ లాలీ..
తామ రస నయనా దశరధ తనయా లాలి

జానపద గేయాలు: (Folk songs)
అత్త లేని కోడలు ఉత్తమురాలు ఓలమ్మ
కోడలు లేని అత్త గుణవంతురాలు
కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓలమ్మ
పచ్చి పాల మీద మీగడేదమ్మ…
ఆ..వేడిపాల మీద వెన్న యేదమ్మ..
అత్తమ్మ నీ చేత ఆరేల్లకాని ఓలమ్మ
పచ్చిపాల మీద మీగాడున్తుందా
ఆ వేడిపాలలోన వెన్న ఉంటుందా
వంట ఇంటిలోన ఉట్టి మీదుంచిన
సున్నుండ లేమయే కోడల
మినుప సున్నుండ లేమయే కోడల
ఇంటికి పెద్దయిన గండు పిల్లులుండగ
ఇంటి కెవరు వస్తారు అత్తమ్మా
వేరే ఇంకెవరు తింటారు అత్తమ్మా
కొరివితో గుమ్మని కంటా వొచ్చిందీ
పొమ్మని కాలంట కుట్టింది తేలు
అయ్యో… అబ్బా…అమ్మా.. అయ్యో...

తెలుగు భాష లెస్(LESS) కాదు…లెస్స అని నిరూపిస్దాం!
🌸🌸🌸

Source - Whatsapp Message

No comments:

Post a Comment