Thursday, January 14, 2021

మంచి మాటలు

సోమవారం --: 11-01-2021
నేటి AVB మంచి మాట ..లు
చూడు మిత్రమా ! . మనం చేసిన మంచిని మరుక్షణంలోనే మరిచిపోవాలి , మనకు మంచి చేసిన మనుషులను మాత్రం మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి . కానీ నేటి సమాజంలో యేరు దాటగానే తెప్పను తగలేస్తున్నారు కొంతమంది నీతిలేని మూర్కులు .

ప్రతి ఒక్కరు
జీవితంలో ఎవరిని తక్కువ చేసి చూడడం , అసహ్యించుకోవడం చేయాకూడదు . ఎందుకంటే మనం ఎవరినైతే చులకన భావం తో చూస్తామో భవిష్యత్తు లో వాళ్ల ముందే చేయిచాచే పరిస్థితి వస్తుంది నీ హోదా , నీ స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకుని పైకి చూస్తూ నడవడం చేస్తే
కాలానికి
గుణపాఠం నేర్పే అలవాటు ఉంది ముల్లు లా నీ కాలికి గుచ్చుకుని నీ చేయితోనే తీసుకునేలా చేస్తుంది .

మన
తోటి వారు మన లాంటి వారే వారికి మనసుంటుంది జీవితంపై ఆశ ఉంటుంది .వారి ఆశల్ని చిదిమేస్తూ మనసికంగా శారీరకంగా కర్కశంగా హింసించడం అంటే పశువుకంటే దారుణమైన కౄరత్వం . నీ బలం మీరు చూపించి హింసించడం గొప్పకాదు . వారు తలచుకుంటే‌ ఒక్క క్షణంలో మిమ్ముల్ని మట్టుబెట్ట గలరు . కానీ అలా చేయడం లేదు అంటే మీ బలం కాదు . సమాజం ఏమనుకుంటుందో అని అలోచించే వారి బలహీనత

సేకరణ ✒️
మీ .AVB సుబ్బారావు 🕉️💐🤝🌷🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment