Sunday, January 10, 2021

భయం నీడలో భారతీయ సమాజం.

భయం నీడలో భారతీయ సమాజం.

"ఆహారం, నిద్ర, భయం," అనబడే మానసిక భావనలు సకల ప్రాణులకు సహజమే.

ఏదైనా చూడలేని సంఘటన, వినజాలని శబ్దము విన్నప్పుడు భయం అనే మానసికమైన భావన కలుగుతుంది. మనిషికి భయం ఉంటుంది కానీ దాని వల్ల నష్టాలు ఉన్నాయా? లేక ఉండవలసిందేనా.? అనుకున్నప్పుడు మనిషికి, భయం తగిన మోతాదులో ఉండాలి. అతి భయం వల్ల మనిషికి కష్టాలు, నష్టాలు ఉంటాయి. భయం కొందరికి శాశ్వతంగా ఉండవచ్చు. కొందరికి తాత్కాలికంగా ఉండవచ్చు.

అతి భయం పనికిరానిది దాని వల్ల దుష్ఫలితాలు సంభవించవచ్చు.
కొందరు భయం వల్ల కూడా చనిపోవడం సంభవిస్తుంది. భయం వల్ల శారీరక మానసిక స్థిరత్వంలో మార్పు కనిపిస్తుంది. భయంతో చెమటలు పట్టవచ్చు. కాళ్లు వణకవచ్చు. శరీరం స్వాధీనం తప్పవచ్చు.

జంతువులలో కూడా కొన్ని మార్పులు కలుగుతాయి. జంతువులు, పక్షులు, క్రిములు, కీటకాలు తమకు భయం కలిగినప్పుడు పరిగెత్తడం చూస్తుంటాం. విధిలేని పరిస్థితుల్లో మాత్రమే అవి మనిషికి ఎదురు తిరుగుతాయి. భయం పుట్టుకతోనే వచ్చే సహజమైన భావన. ఈ భయమే మానవుడిని పిరికివాడిగా చేస్తుంది. అసమర్థుడుగా తయారు చేస్తుంది. భయం వల్ల మనిషి యొక్క ప్రతిభ మరుగున పడిపోతుంది.

శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నా, భయం వల్ల మనిషి ముందుకు పోలేక పోతాడు. కొన్ని పనులు నిర్వహించలేక పోతాడు. ఆలోచనా రాహిత్యంతో మనిషి మనసు స్వాధీనం తప్పుతుంది తాను ఏం చేస్తున్నాడు ఏం చేయాలో అనే విచక్షణ జ్ఞానం కూడా మరచి పోతాడు.

ఈ భయం లోంచి "దైవం"అనే భావన పుట్టుకొచ్చింది కాబట్టి, అదే ఆలోచనలోంచి మనిషి బయటపడలేక పోతున్నాడు. మేము మనుషులకు దేవునికి మధ్య వారధులమని చెప్పే వారిని ప్రజలు తల ఊపి వారేదో దైవాంశ సంభూతులు అని నమ్ముతూ ఉంటారు వారికి సాష్టాంగ ప్రణామములు చేస్తూ భయంతో విధేయులై ఉంటారు.

ప్రపంచంలో సాధారణంగా
ప్రజలందరికి ఉండే భయాలు

క్రూరమృగాల భయం..
చీకటి భయం..
భూకంపాల భయం..
పెనుతుఫానుల భయం..
ఇంకా అనేకానేక ప్రకృతిపరమైన భయాలు ప్రపంచంలో అందరి ప్రజలకి ఒకే రకంగా ఉంటాయి. ప్రపంచంలో ఏ దేశ ప్రజలకు లేని విచిత్రమైన భయాలు మన ఇండియాలో ఉన్నాయి.
*
భారతీయులకు, ప్రపంచంలో, ఏ దేశంలో ఏ ప్రజలకు లేని ఒక విచిత్రమైన భయం ఉంది.
అదేంటంటే.!
సెంటిమెంట్ల భయం..
మూఢనమ్మకాల భయం..
మత గ్రంథాలను ప్రశ్నిస్తే ఏమవుతుందోనని, కీడు కలుగుతుందని భయం..
భక్తి భయం..
దేవుడి భయం..
పాప భయం..
నరక భయం..
ప్రశ్నించడం అంటే భయం..
మంత్రాలకు గడ్డిపోచ కూడా కదలదని తెలిసినా.!
ఎదురు తిరగడం అంటే భయం..
పూజించటం కీర్తించడం లంచం ఇవ్వటం ఇవి చేయకపోతే పనులు కావు అనే భయం..
మంత్రాలకు గడ్డి పోచ కూడా కదలదని తెలిసినా అవి అంటే భయం..
గుడ్లగూబ అరిస్తే భయం..
కాకి కావు కావు అంటే భయం..
మరీ ముఖ్యంగా కడుపుకు తినేటప్పుడు, పదార్థాల మీద లేని భయం..
రోడ్లమీద కనపడితే భయం..
(నిమ్మకాయలు, కొబ్బరి కాయలు, ఎర్ర నీళ్లు, మిరపకాయలు,అన్నపు ముద్దలు, గుడ్లు మొదలగునవి.)

బాణామతికి బయపడతాడు. రాళ్లకు కేవలం పసుపు కుంకుమ పెట్టి అగరబత్తి వెలిగించి దాన్ని తొక్కితే ఏమవుతుందోనన్న భయం. దయ్యాలు, భూతాలు, పిశాచాలు ఆత్మలు లేవని తెలిసినా వాటి గురించి మాట్లాడితే భయం.

ఇలా ఇలా ప్రతి దానికి భయపడి భారతీయులు భయం నీడలో బతుకుతున్నారు కాస్త బుర్ర పెట్టి హేతుత్వంతో ఆలోచిస్తే, ఇవన్నీ కేవలం ఉట్టి భయాలుతప్ప, వాస్తవమైన విషయాలు కావు. వీళ్ళ భయానికి కారణం సహేతుకంగా ఆలోచించే లేకపోవడమే. విషయాన్ని సమగ్రంగా, ఆలోచించి విశ్లేషించక పోవడమే. భారతీయులు మతాల ఊబిలో మెడదాకా కూరుకు పోయారు. కనీసం చదువుకున్న వారు అయినా ఆలోచిస్తారేమోనని ఆశిస్తే, ఆశాభంగమే కలుగుతుంది.

వాళ్ల మెదళ్ళు మతాలకు, కులాలకు, దైవాలకు, అహేతుకమైన, అసంగతమైన, అనవసరమైన, అర్థరహితమైన ఊహలకు తాకట్టు పెట్టబడ్డాయి తరాల నుంచి కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికిప్పుడు మారాలంటే కొన్ని తరాలు గడిచిపోవాలి. కనీసం చదువుకున్నవారైనా మారతారని ఇతరులకు వాస్తవ జ్ఞానాన్ని చెప్తారని ఆశిస్తే ఆశాభంగం కలుగుతుంది ఈ భారతీయ సమాజం మారడానికి ఇంకా కనీసం వందేళ్లు అయినా పట్టవచ్చని ఒక సర్వేలో వెల్లడైన విషయం.
👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment