వ్యక్తిత్వం
ఈ ప్రపంచంలోని ప్రజలంతా అందరి మేలును తన మేలుగా భావిస్తూ శత్రువులను, మిత్రువులను సమంగా చూసేగుణాన్ని కలిగి ఉండాలంటాడు కబీరు దాసు. అంటే మనిషి రూపు రేఖలు, కులగోత్రాలు ప్రధానం కాదు.. నలుగురి మంచిని కోరి అందరినీ సమానంగా చూడడమే మానవధర్మం. అదే మనిషి వ్యక్తిత్వానికి గుర్తుగా నిలుస్తుందనేది ఈ పద్యంలోని అంతరార్థం. ఒకరి నడవడిక, ఆలోచనా విధానాలు, వాటిని వ్యక్తపరిచే విధానమే వారి వ్యక్తిత్వం అవుతుంది. క్రమశిక్షణ లేని మనసు శత్రువుగా మారుతుందని.. చక్కని శిక్షణ పొందిన మనసు మనిషికి స్నేహితునిగా వ్యవహరించి మంచిపేరు తెస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పాడు.
మానవచరిత్రలో ఎందరో మహానుభావులు తమ మంచిగుణాలతో రాణించి, ప్రపంచాన్ని ప్రభావితం చేసి అద్భుతాలను సృష్టించారు. అందుకు వారి వారి వ్యక్తిత్వాలే కీలకంగా నిలిచాయని చెప్పవచ్చు. అందుకే కబీరుదాసు చెప్పినట్టు.. మనిషికున్న సిరిసంపదలు, చదువులు ముఖ్యం కాదు. మంచి గుణాలు మేధో, ఆధ్యాత్మిక సంపదతో కూడిన వ్యక్తిత్వమే మనిషిని మహనీయునిగా మారుస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే మనకు గుర్తొచ్చే మొదటి పేరు శ్రీరాముడిదే. రామాయణంలో ఎన్నో ఘట్టాల్లో రాముని మృదుస్వభావం, బలగర్వం లేని వినయం, వివక్ష లేని ఆప్యాయత కనిపిస్తాయి. ఉదాహరణకు తన వనవాసానికి కారణమైన కైకేయిని మిగతావారు ద్వేషించారేమో కానీ, రాముడు కాదు. శబరి ఎంగిలి చేసిచ్చిన పండ్లను తృప్తిగా ఆరగించడం, తండ్రికి ఇచ్చిన మాటను నెరవేర్చకుండా అయోధ్యకు తిరిగిరానని చెప్పి వనవాసాన్ని కొనసాగించడం.. ఇవన్నీ రాముడి వ్యక్తిత్వానికి అద్దం పట్టే ఘట్టాలే.
ఆధునిక కాలంలో గొప్పదైన తన వ్యక్తిత్వంతో ప్రపంచాన్ని ఆకర్షించి విశ్వగురువుగా పూజలందుకుంటున్న మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. ఆయనొక ఆధునిక యోగి, మహా దార్శనికుడు, మహా సంస్కర్త, గొప్ప సంస్కరణాభిలాషి. తాను పొందిన ఆత్మజ్ఞానాన్ని వదులుకుని.. సనాతన ధర్మం కోసం తనను తాను అర్పించుకుని.. మొదట భారతదేశంలో, ఆ తర్వాత ప్రపంచదేశాల్లో పర్యటిస్తూ వ్యక్తుల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే రూపశిల్పిగా నిరంతరం శ్రమించాడు. ఆధునిక కాలంలో అన్నీ సమకూర్చుకున్న మనిషి మాత్రం ఏదో ఆందోళన చెందడానికి కారణం.. ఆధ్యాత్మిక స్పృహ కోల్పోవడమేనని వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు. వివేకానందుడు తన బోధనలన్నింటిలో వ్యక్తిత్వాన్నే కీలకంగా చూపుతూ మనిషిని మేలు కొలిపే ప్రయత్నం చేస్తుండేవాడు. ప్రస్తుత కాలంలో జరిగే చాలా అనర్థాలకు కారణం.. సరిగా రూపుదిద్దుకోని వ్యక్తిత్వాలేనని మనస్తత్వ శాస్త్ర నిపుణులు కూడా చెబుతారు. కాబట్టి.. మంచి వ్యక్తిత్వ నిర్మాణం కోసం మహనీయుల జీవిత చరిత్రలు చదివి, వారి మంచి గుణాల్లో కొన్నింటినయినా అనుకరించి ప్రయత్నించాలి.
Source - Whatsapp Message

No comments:
Post a Comment