Tuesday, January 5, 2021

తృప్తి - సంతృప్తి..

🌸 తృప్తి - సంతృప్తి.. 🌸

🌸 తృప్తి, సంతృప్తి అనేవాటి కోసమే భౌతిక జీవితం ప్రయాణం అంతా... తృప్తి కోసమే పరుగులు, సంతృప్తి కోసమే పోటీతత్వం... ఇది అందరికీ తెలుసు... కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఇవే ప్రధాన శత్రువులు, అవరోధాలు.. తృప్తి అనిపిస్తే సాధన మందగిస్తుంది... సంతృప్తి అనిపిస్తే ఆధ్యాత్మిక0గా ఏమి చెయ్యనవసరం లేదు... ఇక ఫ్లైట్ కు రెడీ అవ్వాలి అనిపిస్తుంది... అంటే మనం ఎంచుకొచ్చిన పని అవ్వలేదు అంటే మనం భూమి మీద జీవించే ఉంటాము... పని అయ్యేవరకు... పని అయిన తరువాత కూడా జీవించే ఉంటాం మన ఇచ్చతో...

🌸 నిత్యం నేర్చుకోవాలి అనుకుంటే తృప్తిని ధూరంగ పెట్టలి... సంతృప్తికి చోటే ఉండదు నేర్చుకునే, లేదా శోధించే క్రమంలో అందుకే నిత్యం నేర్చుకోవాలి... నేర్చుకున్న విషయాన్ని , విషయంలో ఉన్న మాధుర్యాన్ని గ్రహించటం అలవాటైతే మనకు ఆయుర్దాయం గురించి ఆలోచన అవసరమే లేదు... ఎందుకని అంటే అక్కడ ఆయుర్దాయం గురించి ఆలోచించే సమయం ఉండదు కాబట్టి... అంటే మనదగ్గరే అన్ని సమాధానాలు ఉన్నాయి.. మనకు ఆయుర్దాయం గురించి ఆలోచన ఎప్పుడైతే ఉండదో మన పిల్లలకు మనం పంచేది ఒక్కటే ప్రతి విషయాన్ని నేర్చుకో కానీ పోటీ పడకు అనే చెబుతాం... (1 st rank ) మొదటి తరగతి అడగం... నేర్చుకో అనే చెబుతాం.. ఆ వైపే నడిపిస్తాం అంటే ఇక్కడ వత్తిడి అనేది మన ఇంట్లోకి రాదు... వత్తిడికి చోటు లేదు..
వత్తిడి లేని చోట పోటీ ఉన్న ఆరోగ్యంగా ఉంటుంది... మన జీవితాన్ని ఎంత తేలికగా చక్కగా మార్చుకోవచ్చు... ఎన్ని నేర్చుకోవచ్చు... అంటే మన జీవితం మన చేతులలో.. ఎంత బాగుంది ఈ మాట..

🌸 జీవితం చాలా అందమైనది,అద్భుతమైనది... ఎలా కావాలి అనుకుంటే అలాగే మలుచుకునే స్థితికి మనం చేరుకుంటే చాలు ఉన్న అనుభవాలన్ని మాధుర్యాలే.. నేర్చుకునే క్రమంలో మనకు అలవడే సహనం, ఓపిక మనకు పరిస్థితుల మీద చక్కటి అవగాహన ఇస్తుంది.. అదే అన్నింటికీ కూడలిగా తెలుసుకుంటాం... నేర్చుకోవాలి అనే కోరిక మిగతా కోరికలను తనలో కలిపేసుకుంటుంది... అదే అన్ని విషయాలకు మూలం... ఇది సరైన దారి అని అర్ధమైతే మనం నిత్యం నేర్చుకుంటూనే లేదా నేర్పుతూనే ఉంటాం...

ఇప్పటికి ఇంతవరకు...

Thank you...🌸🌸🌸

Source - Whatsapp Message

No comments:

Post a Comment