Thursday, January 14, 2021

ఏమి తీసుకెళ్తావ్ ...

ఏమి తీసుకెళ్తావ్ ...
జీవితం జీవించటం కోసం! కాని దానిని మరిచిపోయి జీవితం సంపాదన కోసం అన్నట్లుగా సంపాదనా యంత్రాలుగా నోట్ల మధ్యన - అంకెల మధ్యన ఏకాకిగా మారిపోతున్నారు. ఎన్ని వున్నా, ఎందరు వున్నా అనుభవించలేని అశక్తత! అనుభూతికి అందని సంపద. మానసిక ఆనందం, శారీరక ఆనందం తప్పించి, నిజమైనది, శాశ్వతమైనది, అతీతమైనది అయిన సత్-చిత్-ఆనందం ఎంత మంది పొందగలుగుతున్నారు?
అజ్ఞానం - ఆవేశాలతో కూడిన పోటీ! కరెన్సీ కాగితాల మధ్య బంధింపబడి మోహంతో, లోభంతో జీవించే వ్యక్తికీ నిజమైన ప్రశాంతత, స్వేచ్ఛ లోంచి పుట్టుకొచ్చే ఆత్మీయతలు ఎలా అనుభూతికి వస్తాయి?
మరణం తప్పదు. పైలోకానికి ప్రయాణం తప్పదు.

నీతో పాటు ఏమి తీసుకెళ్తావ్?
‘నా వాళ్ళు’ అంటూ మోహించిన బంధాలు నీతో వస్తాయా? నానా కష్టాలు పడి, మోసాలు, అబధ్ధాలు ఆడి, ఎవరికీ తెలియకుండా పోగు చేసిన ఆస్తులు, డబ్బు దేనితో తీసుకువెళ్తావ్? ఏదీ నీతో రాదు - ఎవ్వరూ నీతో ‘రారు’! మరి అలాంటప్పుడు నీవు జీవించిన జీవితం, పరిశ్రమ, త్యాగం … ఇవన్ని వృధాయే కదా!
కాని మహాత్ములు, బాబాజీ వంటి హిమాలయ గురువులు, సాయిబాబా వంటి సద్గురువులు ‘మరణం కూడా అడ్డుకోలేని వాటిని సంపాదించుకోవచ్చు’ అని చెబుతున్నారు, నిరుపిస్తున్నరు. అటువంటి శాశ్వతమైన సంపదను సంపాదించుకొమ్మని మరీ మరీ బోధిస్తున్నారు.
ఆ సంపదే “ధ్యానం”

మరణానికి అతీతంగా తీసుకుపోగలిగేదే నిజమైన ‘సంపద’. మరణం తరువాత మనతో రానిదంతా అబద్ధమే - అప్రయోజనమే! అటువంటివి పోగు చేసుకోవటం అంటే ఆత్మా వంచనతో జీవించటమే! మనల్ని మనం మోసం చేసుకోవటమే కాదు, ఇతరులను కూడా మోసగించటం అవుతుంది. మీ లోపలికి ‘ధ్యానం’ ద్వారా ప్రయాణం చేస్తే, అంతరాంతరాల్లోకి చేరుకోగలిగితే మీరు మీకు బాగా అర్ధం అవుతారు. నిజమైన శాంతిని, ఆనందాన్ని అనుభివించగలుగుతారు. మీ సహజ స్థితి - ఎరుక - చైతన్యం - దృష్టి … ఇవన్ని కలిసి మిమ్మల్ని జ్ఞానిగా మారుస్తాయి. ఆ జ్ఞానం ద్వారా మీరు శరీరం కాదనీ, మీరు మనసు కాదనీ - అంతే కాదు ప్రాపంచికంగా పోషించేవి - చెప్పుకొనేవి - ప్రకటించుకోనేవి - ప్రవర్తించేవి … ఏవీ మీరు కాదు అని వాటి అన్నిటికీ అతీతమైన మీరు మీకు తెలుస్తారు. ఈ జగన్నాటక మిధ్యా ప్రపంచంలో పాత్రౌచితంగా జీవిస్తూ, ఇంద్రియాలకు లొంగకుండా, అవిద్యలో పడకుండా ‘మితం - పరమితం’ తెలుసుకుని జన్మను గడిపేస్తారు. ..
‘ధ్యానం’ - ‘జ్ఞానం’ నిజమైన ఎరుకను పెంచుతాయి. ఆత్మకు దగ్గరగా జీవింపజేస్తాయి. ఆత్మ దర్శనం ఎప్పుడైతే పొందామో మన జీవితం అన్నిటికీ సాక్షిభూతంగా మారుతుంది. అది అతీత స్థితి - అవధూత స్థితి - సద్గురు స్థితి - పరమహంస స్థితి! ఆ స్థితిలో మరణాన్ని కూడా తెలుసుకోగలం. మరణంతో స్నేహం చేయగలం. ఆ ధ్యాన స్థితిని మరణం కూడా మన నుంచి వేరు చేయలేదు. ఆ సాక్షిభూత స్థితి జన్మ జన్మలకు మనం మనతో తీసుకుపోగలం. అదే నిజమైన సంపద.

మతాలన్నీ దీని గురించే చెబుతున్నాయి. మతాల ప్రయోజనం వ్యక్తులందరినీ ఆ స్థితికి తీసుకు వెళ్ళటమే! మరణం తరువాత కూడా మీతో వచ్చే నిజమైన సంపద కోసం ఈ రోజే ప్రయత్నించండి. సద్గురువునాశ్రయించండి - శాంతి, సుఖాలను పొందండి.
👏👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment