Thursday, January 14, 2021

మంచి మాటలు

శుక్రవారం --: 08-01-2021 :-- ఈరోజు AVB మంచి మాట...లు

మనతో ఎవరు ఉన్నా లేకపోయినా జీవితం సాగిపోతునే ఉండాలి , ఎవరితో కలిసి రాలేదు మనం అలా అని ఎవరితోనూ కలిసిపోలేము ఇది మనకు ఒంటరి ప్రయాణం పోతూ పోతూ కొందరి మనసుల్లో స్థానం సంపాదించుకుని పోవడమే జీవితం

అందరినీ మార్చాలి అనుకోవడం మన పొరపాటు ఒక్కరిని కూడా మార్చలేము అనుకోవడం ఇంకా పొరపాటు , ఏ ఒక్కరినీ మార్చలేకపోవడం ఇంకా ఇంకా పొరపాటు , ప్రయత్నించి ఓడి పొవడం తప్పుకాదు మనం ఏ ప్రయత్నం చెయ్యకపోవడమే పెద్ద తప్పు .

ఈ లోకంలో మంచి అనేది మంచు లాంటిది రోజు రోజుకు కరిగిపోతుంది ‌. చెడు అనేది చెత్త లాంటిది రోజు రోజుకు పెరిగిపోతుంది .

చెడ్డవారు మంచివారు అని వేరువేరుగా లేరు ఇప్పుడు నటన రానివారు నిజం మాట్లాడే వారు చెడ్డవారిగా మిగిలిపోతున్నారు అంతే . ఎవరైతే నీతో మంచిని చూసినప్పుడు నీతో ఉన్నారో నీలో లోపాలు చూసినప్పుడు కూడా నీతో ఉంటారో వారే నీ నిజమైన ఆప్తులు

సేకరణ ✒️మీ...AVB సుబ్బారావు 🌷💐🤝🕉️🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment