Monday, January 11, 2021

విగ్రహం -అద్దం !

విగ్రహం -అద్దం !
ఒక శిష్యుడు గురువుగారి ని అడిగిన ప్రశ్న....v
భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా.
హృదయంలో ఉండే హరిని వెతకటానికి మనుషులు ఎంతో కష్టపడి దేవాలయాలకు వెళ్లడం దేనికి?
గురువు గారి జవాబు:
ముఖం మన దగ్గరే ఉంది.
కానీ మన కంటికి మన ముఖం కనిపించదు. కనపడడానికి అద్దం లో చూసుకొంటాము,
అద్దంలో ప్రాణం లేదు,
కంటికి ప్రాణం ఉన్నా ప్రాణం లేని అద్దంపై ఆధారపడితేనే మన ముఖం మనకు కనిపిస్తుంది.

అలాగే తెలుసుకోవాల్సిన మనం ఇక్కడే ఉన్నాం.
తెలియదగిన దేవుడు ఇక్కడే ఉన్నాడు. కానీ ఆ తత్వం చూడాలంటే ఈ రెండు కాకుండా మనకి ఏదయినా ఒక అద్దం లాంటిది కావాలి, అదే విగ్రహం ....

భగవంతుడు అంతటా ఉంటాడు అనుకున్నప్పుడు విగ్రహంలోనూ ఉంటాడు.
అందులో భగవంతుడిని చూసే భక్తి మనకి కావాలి.
మనలోన భక్తి, విగ్రహం ఈ రెండు అద్దం లాంటి ఫలితాన్నిస్తుంది....
అప్పుడే భగవంతుడి సాక్షాత్కారం పొందవచ్చు....
అందుకే గుడికి వెళ్ళాలి.

Source - Whatsapp Message

No comments:

Post a Comment