😊క్షమ - పగ😡
🕉️🌞🌏🌙🌟🚩
మన మనసులో రెండు వైరుధ్య భావా లుంటాయి. ఒకటి క్షమించడం, రెండోది పగ తీర్చుకోవడం. ఈ రెంటికీ సదా సమరం జరుగుతూ ఉంటుంది. క్షమ గెలిస్తే హృదయం ఆనంద మయం అవుతుంది. మనసులో అంతు లేని సంతోషం కలుగుతుంది. మనలో ఉండే ప్రేమ ఎప్పుడూ 'క్షమించు క్షమించు' అని చెబుతూనే ఉంటుంది. ప్రేమిస్తే ప్రేమ ను పొందుతాం. ద్వేషిస్తే ద్వేషాన్నే తిరిగి పొందుతాం.
గుండెలో పగ దాచు కోవడం అంటే 'పామున్న ఇంటిలో ఉండటమే' అంటుంది భారతం. పగ వల్ల పగ పోదనీ.. ఏ విధంగా చూసి నా పగని అణచడం లెస్స అనీ..భారత మహేతి హాస ఉద్బోధ...!!!
'నా కన్ను నువ్వు పొడిస్తే..నీ కన్ను నేను పొడుస్తా' అని 'కన్ను'కు కన్ను... పన్నుకు పన్ను' సిద్ధాంతం తో అందరూ ముందుకు దూకితే- లోకం అంతా..గుడ్డి వాళ్ల తో..బోసి నోటి వాళ్ల తో నిండి పోతుంది.
ప్రతీకారం అనే విష చక్రం నుంచి బయట పడాలంటే "క్షమించడం" ఒక్కటే ఉపాయం. ఇందు వల్ల రెండు లాభాలున్నాయి. ఒకటి- క్షమించే వారు, ఆదర్శ వ్యక్తులుగా గౌరవం పొందుతారు. రెండోది- క్షమ పొందేవారు, తమ జీవితాలను సరి దిద్దుకుంటారు.
క్షమా గుణం శత్రువును సైతం మిత్రుడి గా...మార్చేస్తుంది. 'పొరపాటు' అనేది. మానవ సహజ గుణం. క్షమ దైవ విశిష్ట గుణం' అని ఆంగ్ల సామెత.
మహా భక్తుల జీవితాలన్నీ...ప్రేమ మయాలు.
ఏక నాథుడు పాండు రంగడి భక్తుడు. ప్రశాంత చిత్తుడు. సదా స్వామి సేవలో, భజన లో కాలం గడిపే వాడు. ప్రజలందరూ ఆయన్ని ప్రశంసించడం చూసి కొందరు ఈర్ష్య పడ్డారు. ఎలా గైనా ఏక నాథుడికి కోపం తెప్పించాలని ప్రయత్నించ సాగారు. ఒక దుష్టుడికి డబ్బు ఆశచూపి, ఆ పనికి నియోగించారు.
ఏక నాథుడు రోజూ తెల్లవారు జామునే నది లో స్నానం చేసి వచ్చేవాడు. ఆ సమయం లో ఆ దుష్టుడు ఏక నాథుడి పై ఉమ్మి వేశాడు. ఏక నాథుడు ప్రశాంత చిత్తంతో చిరు నవ్వు చెరగ నీయ కుండా మళ్ళీ... వెనక్కి వెళ్లి నదీ స్నానం ఆచరించాడు..
ఇలా మొత్తం నూట ఏడు సార్లు జరిగింది.
ఏకనాథుడు ఏమాత్రం నిగ్రహం వీడ కుండా మందస్మిత వదనం తో అన్ని సార్లూ మరల మరల స్నానం చేసి వస్తున్నాడు.
దీంతో ఆ కుటిలుడి హృదయం చలించి పోయింది!
ఆయన ఏక నాథుడి కాళ్లపై పడ్డాడు. 'స్వామీ, మీరు నిజం గా దైవ స్వరూపులు. మీ నిగ్రహం చెడ గొట్టి, ఎలా గైనా మీకు కోపం తెప్పించాలని కొందరు నన్ను పురమా యించారు. మీకు ఆగ్రహం తెప్పించ గలిగితే నాకు ధనం ఇస్తా మని ఆశ చూపారు. "మీ క్షమాగుణం" తెలియక నేను ఈ నీచ కృత్యానికి అంగీకరించాను!' అన్నాడు ఆ వ్యక్తి పశ్చాత్తాపం తో.
ఏకనాథుడు అతడికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. 'నాయనా, నీవు నా కెంతో మేలు చేశావు. నా చేత నూట ఎనిమిది సార్లు పవిత్ర నదీ స్నానం చేయించిన మహాను భావుడివి నువ్వు! నేను నీ మేలు ఎన్నటికీ మరచి పోను!'
ఏక నాథుడి పలుకులు విని అవతలి వ్యక్తి నిర్విణ్ను డయ్యాడు.
ఆ భక్తా గ్రేసరుడి "క్షమాగుణం' ఆ ఉమ్ము వేసిన వ్యక్తి హృదయాన్ని ప్రక్షాళనం గావించింది. పశ్చాత్తాపం తో అతడు కన్నీరు కార్చాడు.
క్షమ అంటే భూమి. భూమి ఓర్పు గల తల్లి కను కనే మనం ఎంత బాధ పెట్టినా భూ మాత మన పై పగ తీర్చు కోవాలను కోదు. క్షమించే గుణం ఉన్నది కదా అని మనం భూమాతను అదే పనిగా హింసించ కూడదు.
క్షమా గుణానికీ హద్దులుంటాయని గుర్తుంచు కోవాలి! క్షమాగుణం పురాణాలకు, ప్రాచీన ఇతి హాసాలకే పరిమితం కాదు.
ఇటీవలి చరిత్రలో క్షమాగుణం తో చరితార్థు లైన మహాపురుషు లెందరో ఉన్నారు.
ఆర్య సమాజ స్థాపకు లైన మహర్షి దయానంద నిష్కాపట్యం, నిర్భయత్వం సమాజం లో అనేకులకు కంట గింపైంది.
ఆయన వద్ద వంట వాడికి లంచం ఇచ్చి, ఆహారం లో విషం పెట్టించారు.
దయానందులు మృత్యుశయ్యపై ఉన్నారు.
తన వంటవాడిని దగ్గరకు పిలిచారు. కొంత డబ్బు అతడి చేతి లో పెట్టి ఇలా అన్నారు. 'వెంటనే నువ్వు నేపాల్‌కి వెళ్లిపో! నా శిష్యులకు నువ్వు చేసిన పని తెలిస్తే నిన్ను బతక నీయరు!'
తనకు ప్రాణ హాని కలిగించిన వ్యక్తిని సైతం క్షమించి, అతడికి ప్రాణ దానం చేసిన మహర్షి దయానంద చరితార్థులయ్యారు.
క్షమాగుణం మానసిక రుగ్మతలకు మంచి మందు.
పగ తీర్చుకుంటే ప్రశాంతత చిక్కుతుందను కోవడం కేవలం భ్రాంతి మాత్రమే!
నిజానికి అభద్రత మిగులు తుంది. చిత్త వికారం ఏర్పడుతుంది. చివరకు జీవితం విషాదాంతం అవుతుంది.
ఒక అరబ్బీ సామెత ఇలా చెబుతుంది--
ఇతరులు మనకు చేసిన అప కారాలను ఇసుక పై రాయాలి. ఇతరులు మనకు చేసిన ఉప కారాలను చలువ రాయి పై చెక్కు కోవాలి!'
🕉️🌞🌏🌙🌟🚩
Source - Whatsapp Message

No comments:
Post a Comment