Wednesday, January 13, 2021

ధ్యానం

🧘‍♀️ ధ్యానం🧘‍♀️

ధ్యానం అంటే ధ్యాస, లేదా ఎరుక.

రైల్వే ప్లాటుఫామ్ మీద మనకి హిందీ లో వినిపించే సందేశం " ధ్యాన్ సే సునియే" ఆంటే అర్థం,
ధ్యాస పెట్టి వినండి అని .

పాకె పిల్లవాడు నడక నేర్చుకోవడానికి గోడను కానీ మూడు చక్రాల సైకిల్ కానీ లేదా ఇప్పుడు మార్కెట్లో వచ్చిన ఆట బొమ్మ తో కానీ అటు ఇటు పడకుండా నడవడం సాధన చేస్తాడు. నడక బాగా అలవాటు అయ్యాకా అంటే పడకుండా నడిచేటట్టు వస్తె ఇక ఆ ఆధారాలని ఆంటీ పెట్టుకొని ఉండడు. అలాగే నడక సాధన చెయ్యాడు.

(ofcourse తిండి ఎక్కువై అరగక మలి వయస్సులో డాక్టర్ సలహాపై నడక సాధన చేస్తాడు అనుకొండి అది వేర్ విషయం).

ఇలానే మన మనస్సు గతంలోకి కానీ, భవిషత్తు లోకి కానీ జారిపోకుండా ప్రతిక్షణంలో ఎరుకలో ఉండడానికి, ఎదో ఒక ఆలంబన పెట్టుకొని సాధన చెయ్యాలి.

ఎప్పుడైతే మనస్సు ప్రతిక్షణలో ఎరుకలో ఉండడం అలవాటు అవుతుందో, అప్పుడు ప్రత్యేకంగా ధ్యానం చేయాల్సిన అవసరం ఉండదు.

ధ్యానం చేయడం ఉండదు, ధ్యానంలో జీవించడం ఉంటుంది.

ఇక అలంబనలు,
నామం కావచ్చు,
మంత్రం కావచ్చు,
"ఓం" కావచ్చు,
లేదా మనలో మన ప్రమేయం లేకుండా అనన్యము గా సాగే పనులు కావచ్చు.
వీటిని క్రియలు అంటాం.
శ్వాస క్రియ ఒకటి.

కాబట్టి అలంబంన "మన లోపలికి తీసుకునే శ్వాస" "బయటకు వదిలే శ్వాస" కావచ్చు.

ఉన్న అలంబనలలో ఈ "శ్వాస మీద ధ్యాస" తేలిక ఆయినది.

శ్వాస ని నియంత్రించకుడదు, పెంచ కుడదు, సహజంగా ఎప్పుడు జరిగే శ్వాస క్రియని గమనించాలి అంతే.

శ్వాస మనస్సు ఒక సైకిల్ కి ఉన్న రెండు చక్రాలు వంటివి. ఒకదానిని నియంత్రిస్తే రెండవది నియంత్రించబడుతుంది. వెనక చక్రాన్ని తొక్కితే ముందు చక్రం నడిచినట్టు, వెనక చక్రానికి బ్రేక్ వేస్తే ముందు చక్రం ఆగినట్టు అన్న మాట.

ఇక ధ్యానానికి ముందు మనం చేయాల్సిన పనులు అన్ని చేసేసి, ఎటువంటి జంఖాటములు లేకుండా చూసుకోవాలి.

స్టవ్ మీద పాలు పెట్టి ధ్యానం చేయకూడదు. పాలైనా పొంగి పోతాయి లేదా ధ్యాస పాలు పొంగుతాయేమో అన్న దాని మీద ఉంటుంది.

ఇక ధ్యానానికి స్థిరంగా కూర్చునే సహజ ఆసనం (మనకి అలవాటు అయినది) సుఖంగా ఉండేది గా ఉండాలి.

ఎక్కువ సేపు ధ్యానంలో కూర్చున్నా మన శరీరానికి అసహనం ఉండకూడదు.

ఎందుకంటే ధ్యానము లో "సహనమే ప్రగతి".

ఇక భగవద్గీత లో 6వ అధ్యాయం లో చెప్పి నట్టు "సమం కాయం శిరో గ్రీవం" గా ఉండాలి మన శరీరం. అంటే,

మన తల, కంఠం, వెన్నెముక ఒక గీత గీసి నట్టు ఉండాలి.

ఇలా ఉంటే మనలో శక్తి ప్రవాహం ఎటువంటి బ్రేక్స్ లేకుండా ఫ్రీ గా ఉంటుంది.

ఉదాహరణకు స్ట్రెయిట్ గా ఉన్మ రోడ్డుపై వేగంగా వెళ్తాము, అదే వంకర టీంకరగా ఉన్న రోడ్డు మీద ఎక్కువ మలుపులు ఉంటాయి కాబట్టి వేగం ఉండదు.

పద్మాసనము లేదా అర్థ పద్మాసనము లో కానీ కూర్చుంటే సమం కాయం శిరో గ్రీవం కుదురుతుంది.
(అర్థ పద్మాసనము ఆంటే ఒక కాలు రెండవ కాలి మీద కానీ, ఒకవేళ క్రింద కూర్చోలేని వారు, కుర్చీ లో కూర్చుంటే కాలిని తొడకు ఆనించి కానీ కూర్చోవడం చేయాలి. దేవతా విగ్రహాలు కానీ, చిత్ర పటాలు కానీ గమనిస్తే అర్థం అవుతుంది).

ఇక కళ్ళు అర్థ నిమిలితం కావాలి,
పుర్తిగా మూసివేస్తే నిద్ర వస్తుంది,
తెరచి ఉంటే బయటి దృశ్యాలు డిస్టర్బ్ చేస్తాయి.
మన కళ్ళు కౌరవులలో దుశాసనుడు లాంటిది. ఎటువంటి శాసనముకి లొంగదు.

వెళ్లలో వేళ్ళు పెట్టుకొని, మన మనస్సుని ముక్కు రంధ్రాల దగ్గర ఉంచి అక్కడ శ్వాసను గమనించాలి.

ఈ శ్వాస "హనుమంతుడు" లాంటిది.
మన లోపల ఉన్న "ఆత్మారామూడి" దర్శనం కావాలి అంటే హనుమ అనుమతి కావాలిగా మరి.

అందుకే హనుమాన్ చాలిసాలో

రామ ద్వారే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైసారే |

అని అన్నారు.

ఇలా శ్వాస మీద ధ్యాస పెడితే నెమ్మదిగా మనస్సు ఏకాగ్రమై అంతర్ముఖము అవుతుంది.

ఇలా అయిన క్షణంనుండి మన తల బరువుగా మారుతుంది.

ఇది ధ్యానం లో తొలి అనుభవం.

మన చుట్టూ ఉన్న విశ్వశక్తి మన సహస్రారము ద్వారా లోపలికి వస్తుంది. అందుకే తల బరువు ఎక్కడము.

ఆ తరువాత శరీరం లో ఏక్కడ ఎక్కడ నెప్పులు అల్రెడీ ఉన్నాయో అవి ఎక్కువ అవుతాయి. ఏమి పర్వాలేదు ఆ నెప్పులు ఓర్చుకోవాలి. విశ్వశక్తి మనలో వచ్చేటపుడు ఈ నెప్పులను ఛేదించు కొని ముందుకు వెళ్తుంది. మోరి చోక్ అయితే పుల్ల పెట్టి పొడుస్తాం కదా అలానే ఇది కూడా.

ఇది ధ్యానంలో రెండవ అనుభవం.

ఆ తరువాత నాభి దగ్గర ఎదో కేంద్రీకృతం ఆయినట్టు, మన శరీరాన్ని ఎవరో ముందుకు వెనకకి ఉపి నట్టు జరుగుతుంది.
ఇది మూడవ అనుభవం.

రెండుకనుబోమ్మల మధ్య వత్తిడి పెరుగుతుంది
ఇది నాల్గవ అనుభవం.

మనకి వివిధ రకాల రంగులు కనబడతాయి.
ఇది ఐదవ అనుభవం,

శరీరము తేలిక అవుతుంది.

ఇది ఆరవ అనుభవము.

ఇలా ధ్యానము లో ఆరు రకాల అనుభవాలు వస్తాయి.

ఇవి అందరికి వస్తాయి.

ఆ తరువాత వచ్చే అనుభవాలు వారి వ్యక్తిగతమైనవి,
అవి అందరికి రావు,
మనకి రావాలని ప్రయత్నం చేయకూడదు.

ఎందుకంటే "మన తోటి ద్యాని తాను తొడ కోసుకుంటే మనం మెడ్ కోసుకోలేం"
🌞🔥🌞🔥🌞🔥🌞🔥

Source - Whatsapp Message

No comments:

Post a Comment