Thursday, January 7, 2021

మంచి మాటలు

ఆత్మీయ బంధుమిత్రులకు మార్గశిరమాస గురువారపు శుభోదయ శుభాకాంక్షలు . గురుభ్యో నమః పూజ్య గురుదేవులు ఆది శంకరాచార్యలు గురు దత్తాత్రేయ స్వామి వారు, గురు రాఘవేంద్ర స్వామి వార్ల అనుగ్రహం తో మీకు మీ కుటుంబసభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించేలా దీవించాలని కోరుకుంటూ . సమయం అమూల్యమైనది ,వైద్యులకు ప్రాణం కాపాడటానికి పనికి వస్తుంది ,లాయర్లకు దోషులను శిక్షించడానికి నిర్దోషి ని శిక్షించడానికి ,సైనికుడికి దేశరక్షణకు ,గురువులకు పైన పేర్కొన్నవారిని తయారుచేయడానికి ఉపయోగపడుతుంది అదే కాలం గడిచిపోతుంది మనం కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి రంగమేదైనా పని ముఖ్యం ఆది నీతో పాటు పదిమంది కి ఉపయోగపడేలా సద్వినియోగం చేసుకుందాం .ఆచరించండి ఆనందించండి ...మీ AVB సుబ్బారావు 🌷🤝💐🕉️🙏
గురువారం --: 07-01-2021 :-- ఈరోజు మంచి మాట..లు

మనకు ఉన్న దానిని నిర్లక్షం చేస్తూ లేనిదాని కోసం ఆరాటపడుతూ ఉన్నంత కాలం మనం ఎప్పటికి సంతోషంగా ఉండలేం .

మన కన్నీటి నుండే కసి పుట్టాలి , మనకు జరిగిన అవమానాల నుండే అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల పుట్టాలి ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురుచూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం లో పయనించాలి

డబ్బు ఎవరికోసమైన ఖర్చు చేయొచ్చు కానీ సమయాన్ని మాత్రం అర్హత" గలవారి కోసమే ఖర్చు చెయ్యాలి . చాలా మంది అనుకుంటారు తప్పు చేసి సుఖ పడవచ్చు అని కానీ తప్పు చేసినా వారు ఎప్పటికి సుఖపడలేరూ ఇది జీవిత సత్యం .

సమయం ఆరోగ్యం బంధం ఇవి ఎప్పుడు ఎలా మారిపోతాయన్నది ఎవ్వరం చెప్పలేము . అందుకే . సమయాన్ని ఆనందంగా ఉపయోగించుకోండి ఆరోగ్యం బాగుండేలా ఆనందంగా గడపండి బంధాలను పదిలంగా కాపాడుకోండి .

సేకరణ ✒️
మీ ...AVB సుబ్బారావు *💐🌷🤝🕉️🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment