Sunday, January 10, 2021

ఎల్లప్పుడు సంతోషంగా ఉండగలిగితే మనం మన పాత్రను అద్భుతంగా పోషీ oచడమే

🧘‍♂️నేటి ఆత్మ విచారం🧘‍♂️

✍️ మురళీ మోహన్

🤘ప్రతి చిన్న విషయానికి మన మనసు విచలిత మవుతువుంటుంది. దీనికి కారణం మనం ఈ జీవితం అనే నాటకాన్ని తీవ్రంగా తీసుకోవటమే...

జీవితమంటే పూర్తి అవగాహనలేక మనలాగా అజ్ఞానంలో ఉన్నవారితో మనం పోల్చుకోవడం కూడా ముఖ్యకారణం. మనకు పోయేదేమీ లేదు. వచ్చేదేమి లేదు.

మరి ప్రాణమే అశాశ్వతం ఐనప్పుడు మన జీవితంలో జరిగే సంఘటలను ఎందుకు తీవ్రంగా తీసుకోవాలి.... ? ఇక్కడ తీవ్రంగా తీసుకోకపోవడం అంటే విచ్చలివిడిగా ప్రవర్తించడం, లేదా భాద్యతారాహిత్యంగా ప్రవర్తించటమని కాదు.. ఈ జీవితం అనే నాటకంలో నీ పాత్ర అద్భుతంగా పోషించమని .

పరిస్థితులు మనం అనుకున్నట్లుగా ఉండవు. పరిస్థితులను మనం నిర్ణయించలేము. పరిస్థితుల వల్ల మనం బాధకు గురవుతున్నామని అనుకుంటాం. కానీ ఇది నిజం కాదు. మనిషిని ఎవరు బాధించలేరు, తనుతప్ప.

మన ప్రతిస్పందన మనకు బాధను కలిగిస్తుంది. పరిస్థితులతో సంబంధం లేకుండా మనం ఎల్లవేళలా సంతోషంగా ఉండవచ్చు. మనం అలా సంకల్పించడం లేదు అంతే...

మన తోటి వారు మనకన్నా బాగున్నరానో...ఫలానావారితో సమానంగా ఉండాలనో మనం కోరుకోకపోతే మనం ఎప్పుడు సంతోషంగా ఉండొచ్చు.

మనం వాళ్ళలాగా, వీళ్ళలాగా ఉండాలనుకుంటున్నామంటే అహంకార పిశాచాన్ని పోషిస్తూ సంతోషాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తున్నాం. మన ఉనికిని వేరేవాళ్ళు నిర్దేశించేటట్లు చేసుకుంటున్నాం. మన సంతోషాన్ని ఇతరులు నిర్దేశించడం ఏమిటి... ? నిజానికి మనం సమాజానికి చేయగలిగే గొప్ప సేవా సదా మనం ప్రశాంతంగా ఆనందంగా ఉండటమే.

_జీవితమనే నాటకంలో మనం మన పాత్రను ఎంత సమర్థ వంతంగా పోషిస్తున్నామో చూసుకోవడమే మన చేయాల్సిందల్లా. అనుకూల, ప్రతికూల సమయంలో విచలితం కాకుండా ప్రశాంతంగా ఉంటూ, చుట్టు ఉన్న వాళ్ళ వ్యక్తిత్వాలతో, ప్రవర్తనతో సంబంధం లేకుండా ఎల్లప్పుడు సంతోషంగా ఉండగలిగితే మనం మన పాత్రను అద్భుతంగా పోషీ oచడమే👍

Source - Whatsapp Message

No comments:

Post a Comment