🌸తపస్సు అంటే🌸
🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺
🌹 తపస్సు అంటే అనుకున్నది సాధించే వరకు మనసు చేసే ఎడతెగని ప్రయత్నం.
🌹 మనసు సామాన్య స్థితిలో చంచల స్వభావంతో అనేక విషయాల్లో సంచరిస్తూనే ఉంటుంది. అదే మనసుకు ఒకే విషయాన్ని గ్రహించి, మిగిలినవన్నీ విస్మరించే ఉన్నత లక్షణమూ ఉంది.
🌹 మనసును సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడమే తపస్సుగా పెద్దలు చెబుతారు.
🌹 ఒక వస్తువుపై మనసును నిలకడగా కాసేపు ఉంచగలిగితే అది ధారణ అవుతుంది.
🌹 మరింత సమయం మనసును నిలువరించగలిగితే అది ధ్యానమవుతుంది.
🌹 మనసు అనే వింటి నారిని తపస్సు అనే విల్లులో బాగా లాగి కట్టాలి. అప్పుడే బుద్ధి జాగృతమై లక్ష్యాన్ని ఛేదిస్తుంది.
🌹 మనసును నియంత్రించడమన్నది చాలా పెద్ద సమస్య.
🌹 మహాభారతంలోని శాంతిపర్వం మనసును, ఇంద్రియాలను తాదాత్మ్యం చేసి బాహ్యం నుంచి అంతరంగానికి తీసుకుపోయేదే తపస్సుగా చెప్పింది.
🌹 మనోనిగ్రహం ఒక్కరోజు కృషితో పొందేది కాదు. నిరంతర అభ్యాసం కావాలి.
🌹 బాహ్య అంతఃకరణాలైన మనసు ఇంద్రియాలను సమాధాన పరచడమే తపస్సుగా ఆదిశంకరులు బోధించారు.
🌹 మనిషిలోని మనోబలాన్ని, సంకల్ప శక్తిని పెంచేదే తపస్సు. పెంపొందిన ఈ మనఃశక్తిని ఎలా వినియోగించుకోవాలి అనేది మాత్రం మనిషి లక్ష్యంపైనే ఆధారపడి ఉంటుంది.
🌹 లక్ష్యాన్ని బట్టి తపస్సును సాత్విక, రాజసిక, తామసాలనే మూడు విధాలుగా భగవద్గీత చెబుతుంది.
🌹 మంచి చెడు తేడాలతో సంబంధం లేకుండా అసురులవలే అనుకున్నవన్నీ సాధించాలని చేసే తీవ్రమైన ప్రయత్నాలన్నీ తామసమని, పదవి కీర్తికోసం చేసేవి రాజసికమని, చిత్తశుద్ధి కోసం చేసేవి సాత్వికమని గీత చెబుతుంది.
🌹 తపస్సు, తపస్సుతో పొందేది రెండూ దైవంగానే చెబుతుంది తైత్తిరీయం.
🌹 దుష్టత్వాన్ని దహించే మనసును కడిగి శక్తిని ప్రజ్వలింపజేసేదే తపస్సు. నిష్కామ, నిస్వార్థ కార్యాలన్నీ తపస్సే. యజ్ఞమూ తపస్సే, యుద్ధమూ తపస్సే.
🌹 చిత్తశుద్ధి కోసం చేసే జపం, చిత్తశుద్ధితో చేసే ప్రతీపని తపస్సే అవుతుంది.
🌹 సాధనా తపస్సే, సేవా తపస్సే.
🌹 తపస్సు అంటే వెంటనే మనకు స్ఫురించేది నుదుట విభూది రేఖలు, మెడలో రుద్రాక్షలు, కళ్లు మూసుకుని చేసే మంత్ర జపాలు. ఇవి తపస్సుకు అంగాలు మాత్రమే.
🌹 మన లక్ష్యాన్ని అనుక్షణం గుర్తుచేసే చిహ్నాలు. తప్పటడుగు వెయ్యకుండా మనసును నియంత్రించేందుకు దోహదపడేవి.
🌹 మనసును ఏకాగ్రపరచడం, నిస్వార్థ సేవతో జీవించడం తపస్సుకు పరమావధి...
🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺
Source - Whatsapp Message

No comments:
Post a Comment