🔅ప్రభాత గుళిక🔅
💎💥💦🌟💧✨
ఉన్నత వ్యక్తిత్వానికి దారి....
ప్రతి వ్యక్తీ గొప్పవాడు కావాలని కలలు కంటుంటాడు. ఇది సహజం.
కానీ, అందరికన్నా గొప్పవాడు కావాలని కొందరు ఆరాటపడతారు. అలా కావటానికి చేతనైన అన్ని రకాల విధానాలూ అనుసరిస్తారు. అడ్డదారులు తొక్కుతారు. నిస్సంకోచంగా అబద్దాలు ఆడతారు.
కొందరు విశేషంగా ధనం సంపాదించి తాము గొప్పవారమనే భ్రమతో గర్విస్తారు. మరికొందరు హోదా లభించగానే అధికార దర్పం, అహంకారం ప్రదర్శిస్తారు. ఇది కూడా ఆధిక్యతాభావం వల్లనే!
కొందరు తమకంటే అందరూ తక్కువ స్థాయిలోనే ఉండాలని కోరుకుంటారు. తమకన్నా ఎవరు మించిపోతున్నా భరించలేరు. అసూయతో కుమిలిపోతారు. వారికి కష్ట నష్టాలు కలిగినప్పుడు లోలోపల సంతోషపడుతూ ఉంటారు.
అసూయ అగ్ని వంటింది. ద్వేషమూ అంతే.
ఏ కర్ర నిప్పు ఆ కర్రనే కాల్చినట్లు, ఎవరు అసూయాపరులో వారినే అసూయాద్వేషాలు దహిస్తాయి. ఇది నిత్య సత్యం.
చదువులో అసూయ తప్పులేదు. కానీ, అది ద్వేషపూరితంగా ఉండకూడదు. పోటీతత్వంతో, పట్టుదలగా విద్య నేర్వాలి. వాయిదాలు వేయకుండా విధ్యా కృషి చేయాలి. "రేపు చదవచ్చు" అని బద్దకిస్తే చివరికది పరీక్షల సమయం దాకా ఆచరణగా మారదు. అప్పుడు ఆందోళన, ఆవేదన పడుతూ ఆరొగ్యభంగం చేసుకోవాల్సి ఉంటుంది.
నిరంతర కృషి ఒకటే విజయ ద్వారాలకు తాళపు చెవి. మరే అడ్డుదారులూ ఉండవు. సత్కార్యాలకు ఆలొచన-ఆచరణ మధ్య ఆలస్యం ఉండకూడదు.
భక్తిని బోధించేవారిని కాకుండా, భక్తిగా జీవించేవారినే భగవంతుడు సైతం ఇష్టపడతాడు.
అసూయ లేకపోవటం ఎంతగొప్పదంటే ..... అసూయ లేని హ్రుదయం పరిశుద్ద దేవాలయం. అసూయలేదంటే ప్రేమకు నిలయమని అర్ధం. అసూయలేని వారికి ద్వేషం ఉండదు. శత్రువులూ ఉండరు.
ఉన్నత వ్యక్తిత్వం కేవలం అసూయా రహితులకే సాధ్యం.
మనం మన దేహంలోని రోగాల నుంచి విముక్తి పొందటానికి ఎంత తహతహలాడతామో, అసూయ నుంచి విముక్తి పొందటానికి కూడా అంతే తహతహలాడాలి.
💎💥🌟💧✨💦
Source - Whatsapp Message

No comments:
Post a Comment