Tuesday, May 25, 2021

నేటి మంచిమాట

🌹నేటి మంచిమాట🌹

వ్యామోహాలలో చిక్కుకొని,
నీ బలాన్ని మరచిపోవద్దు!
వ్యామోహాల వలలో చిక్కుకుంటే,
నీ బలమే బలహీనతగా మారుతుంది..
ఆ బలహీనతే చివరికి నిన్ను మట్టిలో కలిపేలా చేస్తది!!
మనిషి తన ఉనికిని చాటుకోవడం కోసం ఎన్ని పాట్లు పడతాడో,
చివరికి అదే నిజమని నమ్మించే ప్రయత్నంలో తనని తాను అబద్ధం అనే చాటున భద్రంగా ఉంటాడు!

ఒక విషయం గురించి ఆలోచిస్తున్నా మంటే,
దానికి తగిన విలువ ఉండాలి.!
విలువ లేని దాని గురించి ఆలోచించడం వల్ల,
మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది!
ఇష్టమైనోళ్ళ కాలుతగిలినా సర్దుకుపోతారుగానీ,
ఇష్టంలేనోళ్ళ చెయ్యితగిలినా,
పెద్ద రాద్దాంతం చేస్తారు నేటి జనాలు!
పరిస్థితుల ప్రభావాలను అర్థం చేసుకోకపోతే,
మీరు మంచి వాళ్ళైనా సరే...
మీ వల్ల చెడే జరుగుతుంది!

*_🌺🌞శుభోదయం🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment