Thursday, May 27, 2021

నీజాయితీ

💥నీజాయితీ💥
🕉️🌞🌎🏵️🌼🚩

గంగాధరం అనే కూరగాయల వ్యాపారి దగ్గర, సత్యరాజు అనే యువకుడు కొత్తగా పనిలో చేరాడు.

సత్యరాజు ఎంతో నిజాయితీగా, చురుగ్గా పనిచేస్తూ, అతితక్కువ కాలంలోనే యజమాని మెప్పుపొందాడు.

అయితే, సత్యరాజుకు కాస్తకోపం ఎక్కువ. కూరగాయలు కొనడానికి వచ్చినవాళ్ళు ఎక్కువగా
బేరమాడుతూ విసిగిస్తే, "వెళ్ళండి, వెళ్ళండి! మీరేం కొంటారు." అంటూ కసురుకునేవాడు.

ఇందుకు ముఖ్యకారణాల్లో ఒకటి, ఏ రకం కూరగాయలు ఏ ధరకు అమ్మాలో ముందుగానే నిర్ణయించివుండడం.

అయినా, ఈ కసురుకోవడం కోప్పడడంలాంటివి మానుకోమని, గంగాధరం ఎంతగానో చెప్పిచూశాడు.

కానీ, సత్యరాజు ఇవేమీ వినిపించుకోలేదు.

ఒకరోజు, ఆ ఊరిపెద్ద ఇంట్లో పనిచేసే మనిషి మీద సత్యరాజు దురుసుగా మాట్లాడడంతో,గంగాధరం నానా మాటలూ పడాల్సి వచ్చింది.

ఇక ఊరుకుని లాభంలేదని గంగాధరం, సత్యరాజును పనిలోంచి తీసివేశాడు.

దిగాలుపడిపోయిన సత్యరాజు రెండురోజుల తర్వాత తిరిగి గంగాధరం వద్దకు వచ్చి, తనను పనిలోకి
తీసుకోమని బతిమాలడం మొదలు పెట్టాడు.

అయితే, గంగాధరం, అతడు చెప్పేది వినిపించుకో
కుండా గొంతుపెద్దది చేసి, "ఏయ్, చెప్తుంటే మనిషినికాదూ వెళ్ళు, పో!" అంటూ అరిచాడు.

గంగాధరం తనను కుక్కను అదిలించినట్లుగా కరకుగా మాట్లాడడంతో, సత్యరాజు మనసు కలుక్కుమన్నది. అతడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూండగా తలదించుకుని వెనక్కు తిరిగాడు.

వెంటనే గంగాధరం అతణ్ణి, "సత్యరాజు ఇలారా!" అంటూ పిలిచాడు.. సత్యరాజు వెనక్కువచ్చి యజమాని ఎదురుగా నిలబడ్డాడు.

అప్పుడు గంగాధరం, "ఇప్పుడు
నీకు అర్థమయిందా? ఒక మనిషితో మరొకమనిషి మర్యాదగా, గౌరవంగా మాట్లాడకుండా కసురు కుంటే ఆ మనిషి ఎంతగా బాధపడతాడో!" అన్నాడు సౌమ్యంగా.

నిజంగానే సత్యరాజుకు ఆ బాధ అనుభవంలోకి వచ్చింది .

అతడు వినయంగా చేతులు జోడిస్తూ, "ఆ బాధ ఎలావుంటుందో తెలిసివచ్చింది. బాబూ!" అన్నాడు.


"ఇప్పుడు నేను, నిన్ను నమ్మగలను. వెంటనే పనిలో చేరు," అన్నాడు గంగాధరం శాంతంగా...

సత్యం మృదు ప్రియం ధీరో వాక్యం హితకరం వదేత్ ఆత్మోత్కర్ష స్తదానిందాం పరేషాం పరివర్ణతే ..

నీతి మృదువుగా, ప్రియముగా, ధైర్యము గా, హితకరముగా సత్యము పలుకుట అభ్యసించాలి. నిన్ను నీవు *పోగడుకోవటం ,పరులను నిందించుట విడిచి పెట్టాలి.

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

No comments:

Post a Comment