Sunday, July 11, 2021

శివ పూజ

🌷⚜️శివ పూజ🔱🌹
🕉️🌞🌎🏵️🌼🚩

ఒక గ్రామంలో నిత్యం శివ పూజ చేసే శివ భక్తుడు ఉండేవారు.

శివ నామ స్మరణ చేయకుండా మంచి నీళ్ళు కూడా ముట్టుకోని మహా భక్తుడు..

కొద్దిగా వ్యవసాయ భూమి ఉంటే సాగు చేసుకుంటూ కుటుంబ పోషిoచు కునే వారు.. నిత్య అనుష్ఠానపరుడు శివనామమే ఊపిరిగా బతికే ఆ శివ భక్తుడు ఏ పని చేసిన శివ నామ స్మరణతో చేయడం వల్ల అది మహా తపస్సు అయ్యింది.

అతనికి రకరకాల పూలతో శివయ్య ని అలంకారం చేసి మురిసిపోవడం పూలతో అర్చన చేయడం చాలా ఆనందంగా ఉండేది.

వీరి భక్తిని ఒక మేకలు కాచే గొల్లవాడు గమనిస్తూ వారి లాగా పూజ చేయలేక పోయిన శివ నామ స్మరణ చేయడం అలవాటు చేసుకున్నాడు.

వారిలాగా మంత్రాలతో అనుష్ఠానం చేయలేను కనుక కనీసం వారు చేసే పూజలో ఎదో రూపంలో పాలు పంచుకోవాలి అని ఆశతో ఒక రోజు శివ గానం చేస్తూ అనేక రకాల పూలు చెట్టల్లో సేకరించి శివ భక్తుని గుమ్మం ముందు నిల్చుని వివిధ రకాల పుష్పాలు వారికి చూపించి ...
స్వామి నేను మీలాగా మంత్రాలతో కీర్తనలతో స్వామి కి పూజ చేసి మెప్పించ లేను నాకు అంత చదువు లేదు శివ నామ స్మరణ తప్ప ఇంక ఏమీ తెలియదు మీరు చేసే శివ పూజ నాకు చాలా ఇష్టం ఈ పూలను శివ పూజకు ఉపయోగిస్తే స్వామి కరుణించాడని సంతోషిస్తాను ..

మీరు అనుమతిస్తే ప్రతి రోజు మీ పూజకు పువ్వులు సేకరించి సేవ చేసుకుంటాను అని వేడుకున్నాడు..

మహా భక్తుడు అయిన ఆయన అతన్ని గమనిస్తున్నారు ఆ గొల్లవాని మొహంలో అమాయకత్వం తప్ప అసూయ అహంకారం లేదు చదువు లేకున్నా మాటలో సంస్కారం ఉంది,

పేదవాడు శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాడు పైగా శివ నామ స్మరణతో పువ్వులు తెస్తాను అంటున్నాడు ఇస్తున్నది శివయ్యకే కదా అని చాలా సంతోషం అలాగే కానివ్వు అని ఒప్పుకున్నారు,.

శివుడే వరం ఇచ్చినట్టుగా అతను పొంగిపోయాడు .

ప్రతి రోజు శివ నామ స్మరణ చేస్తూ పూలను తెచ్చి ఇచ్చే వాడు పూజ జరిగే సమయంలో కిటికీ లోనుండి చూసి శివ నామ స్మరణతో పొంగిపోయే వాడు.

ఇలాగే కాలం గడిచింది ఇరువురికి కైవల్య ప్రాప్తి కలిగింది శివ భక్తుడి కోసం శివ గణాలు వచ్చారు , ఆ గొల్ల వాని కోసం శివుడు పూల పల్లకిని పంపిస్తాడు..

అది గమనించిన శివ భక్తుడు ఆ గొల్లవాన్ని తీసుకొని వెళ్లడానికి ఆ పల్లకీ వచ్చింది ఎందుకు అని అడుగుతారు ..

, 'అతను మహా శివ భక్తుడు శివ నామ స్మరణతో ప్రతి నిత్యం నామ స్మరణ చేస్తూ ఒక మహా శివ భక్తుడు చేసే శివ పూజకు భక్తిగా పూలు సమర్పించే వాడు అతను భక్తిగా సేకరించే సమయంలోనే ఆ పూలు శివ పాదాల చెంతకు చేరేవి అతని భక్తికి మెచ్చి అతను ఒక భక్తుడికి మంచి మనసుతో సహాయం చేయడం వల్ల తన కర్మల నుండి విముక్తి కలిగి ఆ శివయ్యే పూల పల్లకీ పంపారు' అని వివరించారు,

ఆ శివ భక్తుడికి ఆశ్చర్యం తో పాటు నిస్వార్ధమైన సేవకు దక్కిన ఫలితాన్ని చూసి ఆనంద పడ్డారు..

శివ గణాలతో వెళ్లిన శివ భక్తుని కన్నా ముందే పుష్ప పల్లకీలో ఆ గొల్లవాడు శివుని సన్నిధి చేరుకున్నాడు.


🍁🍁🍁🍁🍁

తోడు తొడటన్న తొడనే ఉన్నాడు,
లేడు లేడటన్న...లేనె లేడు.
కాదు కాదటన్న ..కానేకాడు,

విశ్వదాభిరామ వినురవేమ !!

భగవంతుని విషయంలో నమ్మేవారు కొందరు, నమ్మనివారు కొందరు, అటు ఇటుగా కొందరు ఉంటారు. భగవంతుడు కూడా అలాగే ఉంటాడు.

పరమేశ్వరుడు ఉన్నాడు అని పూర్తిగా నమ్మి, సంపూర్ణమైన భక్తి విశ్వాసములతో ఎవరైతే ఆయనను సేవిస్తూ ఉంటారో అటువంటి వారు ఎపుడైనా ఆపద వచ్చినప్పుడు పరమేశ్వరా నీవే దిక్కు అని తలిస్తే చాలు తప్పకుండా ఆదుకుంటాడు.

అదే విధంగా లేదు అన్న వారికి లేనట్లుగాను, కాదు అన్న వారికి కానట్లుగాను ఉంటాడు.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు... నన్ను ఎవరెవరు ఏవిదంగా తలిస్తే వారిని నేను ఆవిధంగానే గానే అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు కదా

🕉️🌞🌎🏵️🌼🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment