Sunday, July 11, 2021

ఒక తల్లి కథ ...

💎ఒక తల్లి కథ ...🎊.
🕉️🌞🌎🌼🏵️🚩

ఒక దేశాన్ని దోచుకునే బందిపోటు దొంగలు గుంపుగా వస్తున్నారు. కంటికి ఎదురుగా కనిపిస్తున్న అందరిని నరుకుతూ ముందుకు సాగుతున్నారు  


ప్రజలంతా ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి పరుగులు పెడుతున్నారు.

వీధిలో ఒక మహిళ ఇద్దరు పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉన్నింది ఆ దొంగలను చూడగానే బిడ్డలిద్దరిని ఎత్తుకుని పరిగెత్తసాగింది 


చాల దూరం ఇద్దరిని పట్టుకుని పరిగెత్తలేకపోవడంతో ఒక బిడ్డను దారిలో వదిలేసి ఒక బిడ్డతో సురక్షితంగా బయట పడింది  

తాను దించేసిన బిడ్డను ఆ దొంగలు నరికేశారు  


ఇదంతా గమనించిన ఒక పెద్దాయన తల్లికి ఇద్దరు బిడ్డలు సమానమే ఒక బిడ్డను అలా ఆ బిడ్డనే ఎలా వదిలేసావు అని అడిగాడు 


అందుకు ఆ తల్లి వేదన నిండిన హృదయంతో ఇలా చెప్పింది సమాధానం  

నా బిడ్డకు మా పొరుగింటి బిడ్డకు అన్నం తినిపిస్తూ ఉంటె ఇంతలో ఈ బందిపోట్లు వచ్చారు 

  ఇతరులబిడ్డను అక్కడ వదిలేసే హక్కు నాకు లేదు అందుకే ఆ బిడ్డను కాపాడాలని నా బిడ్డను దించేసాను అని చెప్పింది


ఇది విన్న పెద్దయానకు కన్నీళ్లు ఆగలేదు  

ఈ సంఘటన జపాన్లో జరిగిందంట అక్కడి మనుషుల మనస్తత్వాలు ఇతరుల పట్ల వారి మర్యాదను తెలిపే కథ ఈ తల్లి కథ అంటారు

శుభోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment