💎జీవిత లక్ష్యం🌟
🕉️🌞🌎🏵️🌼🚩
మంచి జరిగితే, భగవంతుడి కృప దండిగా ఉందని దండాలు పెడతాడు మనిషి. ఘనంగా పూజలు చేస్తాడు. భూరి కానుకలిస్తాడు. కష్టాలు వస్తే, దేవుడు చల్లగా చూడటం లేదని కినుక వహిస్తాడు.- ఎందుకిలా?
మానవ జన్మ వచ్చినది కేవలం తనని తాను తెలుసుకొని, జనన మరణ సంసారం చక్రం నుండి బయట పడటానికి మాత్రమే— అదే మనిషి యొక్క జీవిత లక్ష్యం .
మానవుడు తన పేరు ప్రఖ్యాతలు తోనూ,వృత్తి వ్యాపారాలతోనూ , శక్తిసామర్త్యాల తోనూ,ఆస్తిపాస్తుల తోనూ, గద్దెల పదవుల తోనూ గుర్తించుకుంటున్నాడు.అసలైన తానెవరో గుర్తెరుగక, మరచిపోయాడు.
తనని తాను గుర్తెరిగి ,తన స్వస్థానం చేరడం—జీవిత పరమార్థం
ఎదో ఒక లౌకిక లక్ష్యం పెట్టుకొని,అదే జీవిత పరమార్థంగా భావించి, దాని కోసం జీవితాంతం శ్రమపడుతూ,విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు.
అందుకే ఒకాయన వృధా చేయబోకు ఈ జన్మమ సదా రాదు నీకు ఉత్తమ జన్మమురా.దీనిని వ్యర్థము చేయకురా ఉత్త సంసారమురా అది మృత్యు రూపమురా.
84 లక్షల జీవరాసులలో బుద్ధి సూక్ష్మత, కుశలత గల ఏకైక జీవి మనిషి మాత్రమే,కానీ కోట్లాది జనులలో కొంతమంది మాత్రమే జన్మ రాహిత్యం కోసం ప్రయత్నిస్తున్నారు.వారిలో ఒకరో,ఇద్దరో పరిపూర్ణులవుతున్నారు.
"బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే "
మహర్షులు,చక్రవర్తుల,భక్తులు , సీదాసాదా అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారు.లోక విద్యలని కాకుండా ఆధ్యాత్మిక విద్యని అభ్యసించాలి,భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా "ఆధ్యాత్మ విద్య విద్యానాం" అంటాడు కాబట్టి "పుట్టి చావని విద్య" "చచ్చి పుట్టని విద్య " దానిని అభ్యసించాలి.
గ్రీష్మంలో నదీనదాలు ఎండిపోతాయి.అందులోని జీవులకు దిక్కు తోచదు.
వర్షరుతువు వచ్చిందంటే చాలు- కొత్తనీటితో నిండిన నదుల హొయలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు.
సూర్యుడు ఎంతగా ధగధగలాడుతున్నా, ఒక్కోసారి ఆకాశం మేఘావృతము అవుతుంది. మబ్బులు కమ్ముకొస్తాయి. అంతమాత్రానికే సూర్యుడి పని అయిపోయినట్లు కాదు. మబ్బులు తొలగాక, మళ్లీ సూర్య ప్రతాపం మామూలే!
చంద్రుడు అమావాస్య వరకు క్షీణిస్తాడు. ఆ తరవాత దినదినాభివృద్ధితో సంపూర్ణత్వం పొంది, పున్నమి వెలుగులందిస్తాడు.
ఏదీ శాశ్వతం కాదని, అంతా తాత్కాలికమే అని ఒక గురువులా బోధిస్తుంది ప్రకృతి. విచక్షణ కలిగిన మనిషి అసలు విషయమేమిటో గ్రహించాలి.
ప్రస్తుత స్థితి... ఆనందమైనా, బాధైనా- ఎప్పటికీ అదే కొనసాగుతుందన్న భ్రమలో అతడు ఉండకూడదు.ఎవరి అంచనాలకూ అందని ఒక మహాశక్తి.
ఆ శక్తిని అనుభూతి చెందాలంటే, మనిషి తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి.ఎటువంటి భావ మాలిన్యమూ అంటుకోని దశకు అతడు చేరుకోవాలి.
నవ విధ భక్తి మార్గాల్లో ఏదో ఒకదాన్ని సొంతం చేసుకొని తనదైన రీతిలో ముందుకు సాగినప్పుడే, ఆ జీవితానికి ఓ అర్థం, పరమార్థం ఏర్పడతాయి!
బంధానికి మోక్షానికి మనసే కారణం మరేదీ కాదు
"మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః "
మనసు జ్ఞానేంద్రియాల వలన బాహ్య ప్రాపంచిక విషయాలతో సంగమేర్పడి,కోరికలు కలిగితే వాటిని కర్మేంద్రియాలతో కర్మలు చేసి తీర్చుకొని సుఖాన్ని అనుభవించి వాసనగా చిత్తంలో దాచుకోవడం అవి ఆగామి సంచిత ప్రారబ్ద రాసులుగా ఏర్పడడం వలన బంధం ఏర్పడును.
అజ్ఞానంతో కనిపించే ఈ జగము దేహము సత్యమని నిత్యమని మోహించి చీకటిలో తాడుని పామనుకొని భ్రమించి గుడ్డివాడిలా దుఃఖ భాజనులమై చావుపుట్టుకల కుమ్మరిసారెలో తిరుగుతున్నాం.
తల్లిగర్భంలో ఉన్నపుడు గతజన్మ జ్ఞానం ఉంటుంది కాబట్టి ఈసారి ఎలాగైనా బయటకి వచ్చి భక్తితో సద్గురువుని ఆశ్రయించి పరతత్వ తెలుసుకుని,మళ్ళీ ఈ గర్భనరకంలోకి రాకూడదని పరమాత్మని వేడుకుంటాడు.
కానీ తల్లిగర్భం నుండి బయట పడగానే బొద్దిపేగు కోసి,కన్నీళ్లు పెట్టగానే గత జన్మ జ్ఞానం పోతుంది. మాయ కమ్మేసి తనని తాను మరచిపోతాడు .
అలాకాకుండా ప్రాపంచిక విషయసుఖాలు,ఇహపర భోగాలు శాశ్వతం కాదని,దుఃఖానికి ప్రతిరూపాలని గ్రహించి,వాటిమీద ఆసక్తిని తగ్గించుకొని శాశ్వతమైన సుఖం కోసం ప్రయత్నించాలి.
ఈ జగన్నాటకానికి వెనక ఒక మహా చైతన్యం ఉందని తెలుసుకోవాలి.
బుద్ధి కుశలతతో,మనసుని అంతర్ముఖం చేసి ఆధ్యాత్మికత వైపుకి తిప్పాలి.గురువుని ఆశ్రయించి ,గురువాక్యాన్ని శ్రవణ,మనన,నిధిధ్యాసలతో ఆత్మానాత్మ విచారణ చేసి,తనని తాను గుర్తెరిగితే జ్ఞానోదయమగును, తద్వారా వాసనలన్నిటిని తొలగించుకుని , మనసుని నిర్మలం, నిశ్చలం,ఆత్మాను సంధానం చేసి,సాధనలో పరిపూర్ణులైతే మోక్షాన్ని పొందగలరు.
తన స్వస్థానం చేరకుండా జాలరి వేసిన గాలానికి చిక్కిన చేపలగా మాయ గాలానికి చిక్కి పరస్థానంలో బ్రతుకుతున్నాం.
గజేంద్రునిలా సంసారమడుగులో దిగి మృత్యువనే ముసలికి చిక్కిపోతున్నాం. చేపకి నీరు స్వస్థానం,నేల పరస్థానం.
ఏనుగుకి నీరు పరస్థానం,
నేల స్వస్థానం.మనిషికి ఆత్మ స్వస్థానం,మనసు పరస్థానం
మనిషి స్వస్థానమైనా ఆత్మగా ఉండక మనసుతో సంగం పెట్టుకొన్నాడు. అది పంచ జ్ఞానేంద్రియాలతో సంగం పెట్టుకొన్నది.ఈ జ్ఞానేంద్రియాలు ప్రాపంచిక విషయాలతో సంగం పెట్టుకొని,సుఖదుఃఖాలలో జీవుడు మునిగి తేలుతున్నాడు.
భ్రమసాగరంలో దారిగానక తిరుగుతున్నాడు.
కలలోని సిరిసంపదలు కోసం పాకులాడుచున్నాడు. కల బాగుందని దానిలోనే బ్రతుకుతున్నాడు, కల నుండి మేలుకోలేక పోతున్నాడు. కలే నిజమనుకొని భ్రాంతిలో బ్రతుకుతున్నాడు.
ఉన్నది కన్నులేదుట ఉన్న కానలేక,లేని దాని కోసం కలలు కంటున్నాడు.ఉన్నది ఉన్నట్టుగా చూడలేక తెలుసుకోలేక లేనిదాన్ని విడిచిపెట్టి మనసుని ఆత్మానుసంధానం చేసి స్వరూప జ్ఞానంతో స్వస్థానం చేరాలి.
సేకరణ. మానస సరోవరం 👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment