Wednesday, November 17, 2021

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.
మనం మాట్లాడే కొన్ని మాటలు ఎదుటి వ్యక్తిని సూటిగా గాయపరుస్తాయి. మనం చేసే మరికొన్ని ఆలోచనలు మన మైండ్ నుండి బయటకు రాకపోయినా ఇతరుల్ని హర్ట్ చేసేవిగానే ఉంటాయి. పాపాలూ, శాపాలూ ఎక్కడో లేవు. మన ప్రవర్తనలోనే అవి భాగం.

ఒక వ్యక్తికి మనం మానసికంగా గాయం చేసినప్పుడు మనకు అది సరదాగా ఉండి ఉండొచ్చు. మనం భేషుగ్గానే జీవిస్తూ ఉండొచ్చు. కానీ అవి మానసికంగా మనకు తెలీకుండా మన సబ్-కాన్షియస్‌లో గిల్ట్ రూపంలోనూ, ఇతర రూపాల్లోనూ పేరుకుపోతూ ఉంటాయి. అవి manifest అవడానికి వాటికంటూ ఓ రోజు వస్తుంది. అప్పుడు అవి తమ ప్రభావాన్ని మనపై చూపిస్తాయి. ఆ ప్రభావం ఏ రూపంలో ఉంటుందో కూడా మన ఊహకు తట్టదు.

ఎప్పుడు ఒకలానే ఉండటానికి
మనం మిషన్ కాదు మనుషులం కదా. పారే నది కూడా దిశ మార్చుకుంటుంది పయనాన్ని ఆపుకోలేక,వీచే గాలి కూడా స్తబ్దుగా నిలిచి పోతుంది, పయనమెటో తెలియక,
అల్లరి చేసే మనసు కూడా
మౌనంగా ఉండిపోతుంది గాయాలను మోయలేక,
ఒక్కోసారి అంతే అంతు చిక్కని ఆలోచనలలో పడి మనం తప్పిపోతాం.ఎప్పుడు ఒకలానే ఉండటానికిమనం రాయి, రప్ప కాదుగా..మళ్ళీ మనల్ని మనం వెతికే క్రమంలో మనం దొరుకుతామో లేదో కూడా తెలియదు.కొన్ని మార్పులు
మేలుకొల్పుతాయి.కొన్ని మార్పులు మనల్ని మనకు దూరం చేస్తాయి.

ఉషోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment