ప్రశ్న: మన అభివృద్ధికి భయమే అవరోధం అంటారు. అసలు భయం అంటే ఏమిటి? భయానికి కారణాలు ఏమిటి? భయాన్ని పోగొట్టుకునే మార్గాన్ని సూచించండి.
జవాబు: మన సామర్ధ్యం మీద మనకు నమ్మకం సన్నగిల్లి, వ్యతిరేక శక్తుల ప్రభావానికి లోనైనప్పుడు కలిగే ఒత్తిడిని 'భయం' అంటారు. మన పరాజయాలన్నింటికీ మూలకారణం భయమే! భయం కలగడానికి ముఖ్య కారణాలు :
1. ఆత్మవిశ్వాసం లేకపోవడం : ఎప్పుడైతే మనం మన మీద విశ్వాసం కోల్పోతామో అప్పుడు ప్రతికూలభావాలు మనల్ని ఆవరిస్తాయి. "భయమే మరణం, భయమే పాపం, భయమే నరకం, భయమే దుఃఖానికి మూలకారణం. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ప్రతికూల భావాలు ఉత్పన్నమయ్యేవి భయం అనే దుష్టశక్తి నుంచే" అని అంటారు స్వామి వివేకానంద.
2. పరులపై ఆధారపడడం : మన స్వశక్తిపై ఆధారపడకుండా ప్రతిదానికీ ఇంకొకరిపై ఆధారపడే స్వభావం మనల్ని నిస్సహాయులుగా, భయస్థులుగా మారుస్తుంది.
"Why are people so afraid? The answer is that they have made themselves helpless and dependent on others. - Swami Vivekananda
3. పని మీద నిబద్ధత, నమ్మకం కోల్పోవడం : మనం చేసే పని ఎంత చిన్నదైనప్పటికీ ఇతరులు చులకనగా చూస్తారనే భావన మనలో రానివ్వకూడదు. దానివల్ల మనం పని మీద నిబద్ధతనూ, నమ్మకాన్ని కోల్పోతాం. అలాంటి ఊహాజనిత భయాలను వీడితేనే ప్రగతి సాధ్యం.
ఉదాహరణకు ప్రఖ్యాత వ్యాపారవేత్త, ధార్మికుడు అయిన జి. పుల్లారెడ్డిగారు మిఠాయిల వ్యాపారం ప్రారంభించక ముందు వీధుల్లో తిరుగుతూ టీ అమ్మేవారు. ఒకరోజు రోడ్డు ప్రక్కన టీ అమ్ముతుండగా అతని బంధువు ఒకతను ఆ దారిలోనే రావడం గమనించారాయన. తాను టీ అమ్మడం నామోషీగా భావించి టీ కెటిల్ ను అక్కడే వదిలేసి చెట్టు చాటున దాక్కున్నారు. ఇంతలో మేకలు గుంపుగా వచ్చి ఆ టీ కెటిల్ ను తన్నేయడంతో టీ అంతా నేలపాలైంది. అప్పుడు ఆయన చాలా బాధపడి 'నిజాయతీగా కష్టపడి పనిచేస్తున్నప్పుడు చిన్నతనంగా ఎందుకు భావించాలి? ఇతరులను చూసి ఎందుకు భయపడాలి?' అని తనని తాను ప్రశ్నించుకొని నిర్భయంగా తన పనిని కొనసాగించారు. కాబట్టి మనం నిజాయతీగా చేపట్టే ఏ పనినైనా భయం లేకుండా చేయడం వల్ల సత్ఫలితాల్ని సాధించవచ్చు.
4. విమర్శల గురించి అతిగా ఆలోచించడం: ఇతరుల విమర్శలకూ, అభిప్రాయాలకూ భయపడితే ఏ కార్యంలోనూ విజయాన్ని సాధించలేం. కాబట్టి వాటి గురించి అతిగా ఆలోచించి భీతిల్లకూడదు.
We cannot succeed in anything, if we act in fear of other people's opinions. . C. Rajagopalachari
భయాన్ని పారద్రోలడానికి కొన్ని సూచనలు :
భయం మానసిక బలహీనత వల్ల కలుగుతుంది. 'A sound mind in a sound body అనే నానుడి మనందరికీ తెలిసిందే! దృఢమైన మనస్సు ఉండాలంటే దృఢమైన శరీరం అవసరం. అందుకు ప్రతీరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
క్రమశిక్షణతో కూడిన నీతిబద్ధమైన జీవితాన్ని గడపడం అలవరచుకోవాలి. అప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోగలం.
ఇతరుల విమర్శలను మనలోని బలహీనతల్ని తొలగించు కోవడానికి ఉపయోగించుకోవాలి.
• ఇతరుల శక్తి సామర్థ్యాలతో పోల్చుకొని బాధపడకుండా నిరంతర తపన, నిర్విరామ కృషితో దేనినైనా సాధించగలమనే విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.
మనలోని లోటుపాట్లను అధిగమించడానికి అనుభ వజ్ఞులైన పెద్దల నుంచీ, సన్నిహితుల నుంచీ సలహాలను స్వీకరించాలి.
Source - Whatsapp Message

No comments:
Post a Comment