Sunday, November 21, 2021

నిజమే నిలుస్తుంది

"నిజమే నిలుస్తుంది"

ఇది చిన్న అబద్దమే అని
అనుకోవొద్దు..
అబద్దాలన్నీ ఒక్కటై
నిజాన్ని నెట్టేస్తుంది...

మనిషి మనసును
కూల్చేస్తుంది..
గుండెను పేల్చేస్తుంది..
విశ్వాన్ని..
జయించాలని చూస్తుంది..
విషయం తెలిసిందో
విచ్ఛిన్నమవుతుంది!!...
అబద్దాలకు సలాంచేసి
గులాములౌతుంటే...
దగాకోరు బడాచోరులు
నిజాన్ని చంపేస్తోంటే...
ఇక ధర్మం..
న్యాయం!!ఎక్కడ??

కత్తి పోటుకన్నా
అబద్దం పోటు ఎక్కువ...
పడగ విప్పిఆడుతుంది..
మనుషుల్లో..
భేదాలను సృష్టిస్తుంది!!..
వింతలెన్నో పుట్టిస్తుంది!!..

సత్యం..ధర్మం
కళ్ళకు గంతలుకట్టి
నిజాన్ని నిలువుగా
పాతేస్తోంటే...
విలువలన్నీ...
వీధుల వెంబడి
విచిత్ర వేషధారణతో..
చీకటి శూన్యంలో..
వేదనాభరితరోదనతో
తిరుగుతున్నాయి!!..

నిజం..
నిజమెన్ని తంటాలు
పడ్డా తన్నుకొని వస్తుంది!!...
ఎంతవారినైనా..
తలను వంచేలా చేస్తుంది!!..
గంభీరంగా గర్జిస్తుంది!!..
నిర్భయంగా లేచి నిలబడుతుంది!!..
భరించలేని భయంకర అబద్దాన్ని..
బద్దలు కొడుతుంది!!..
చివరికెపుడూ గెలుపు
నిజానిదే!!...

అబద్ధం ఎంతఎత్తుకు
ఎగిరినా..చివరకు
చిక్కిశల్యం కావలసిందే!!
వేలాదిమంది అడ్డుపడినా..
నిజం నిప్పులా..
ఎగసిపడుతుంది!!..
అబద్ధం ఉప్పులా..
చిటపటలాడాల్సిందే!!...

యుగాలనుండి
ఈ అబద్దం..
మానవమనుగడను
కూల్చేస్తోంది!!..
మనుషుల మధ్య
పగల్ని పెంచుతోంది!!...
కొందరి జీవితాల్ని
నలిపేసింది!!..
సముద్రమంత..
విశాలమైన..
మానవ సమాజాన్ని...
ఆవగింజంత అబద్ధం
అంతా కల్తీ చేస్తోంది!!
అందుకే అబద్ధం వద్దు..
నిజమే ముద్దు!!..
చివరికి నిజమే నిలుస్తుంది!!...

అంబటి నారాయణ
నిర్మల్
సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment