అందరికీ నమస్కారం.
ఈరోజు పదం "తపస్సు"
సృష్టిలో దేన్నైనా పొందే మార్గం తపస్సే....చివరికి భగవంతుణ్ణి కూడా.మామూలుగా తపస్సు అంటే కావాల్సిన దానికోసం తపించి పోయే కోర్కె కల్గివుండడం.కానీ ఇక్కడ తపస్సు అంటే ఒక విశేషమైన అర్థం దాగి ఉంది.
ఒక దివ్యమైన ,ఉన్నతమైన స్థితిని అలా స్థిరంగా ,కంటిన్యూ గా కల్గివుండడమే తపస్సు.
ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సాదకుడూ ఖచ్చితంగా తపస్సును ఆచరించి తీరాల్సిందే.తపస్సు లేని సాధన అసలు సాధనే కాదు.
మానవుడు తాను అంటే శరీరం కాదనీ....తాను అంటే అఖండ నిర్గుణమైన ఆత్మననీ తెలుసుకుని ,ఆ ఆత్మ యొక్క స్వాభావిక గుణంతో జీవించడమే ఆధ్యాత్మిక సాధన.
ఆత్మ యొక్క స్వాభావిక గుణం ఆనందమే.
మనం నేను ఫలానా అనే అహంకారంతో జీవించినంతసేపూ దొరికే ఆనందం పరిమితము,అశాశ్వతమూ అయి ఉంటుంది.అందుకే మళ్లీ మళ్లీ ఆనందంగా ఉండడానికి అనేక కర్మలు చేస్తుంటాడు.
ఈ కర్మలు మనల్ని కర్మ చక్రంలో ఇరికిస్తాయి గానీ శాశ్వతంగా ఆనందంగా ఉండే దారిని చూపించవు.
అందుకే ఈ అహంకారం నుండి తనను తాను వేరుచేసుకుని ఆత్మానందం పొందడానికి మనిషి బ్రహ్మ చర్యమనే సాధన చెయ్యాల్సి ఉంటుంది.బ్రహ్మచర్యం అంటే బ్రహ్మము యొక్క గుణాలతో జీవించడం. అంటే నీ సహజ స్థితి ఎదో అలా ఉండడం.
మితాహారం,మిత భాషణం,వీర్య రక్షణ,ప్రాపంచిక విషయాలపై వైరాగ్యం, నిరంతర దైవారాధన,స్వాధ్యాయం, మంచీ చెడులను సమంగా స్వీకరించే స్థితప్రజ్ఞత, గాఢమైన ధ్యాన సాధన.......ఈ సాధనలు చెయ్యడమే బ్రహ్మ చర్యమంటే.....
ఈ బ్రహ్మ చర్య సాధనను విఫలం అవ్వకుండా నిరంతరం కొనసాగించడమే ఇక్కడ తపస్సు అనబడుతుంది.
అంటే నీ స్వధర్మమైన బ్రహ్మతత్వాన్ని జారిపోనీకుండా ఆ స్థితిని కొనసాగించడమే తపస్సు.
ఎన్ని అవాంతరాలు వచ్చినా తన సాధననుండి తప్పుకోకుండా ఉండడమే తపస్సు అనబడుతుంది.
ఎన్ని కష్టాలు వచ్చినా నీ సాధనను విడవకుండా ఉన్నవంటే.....భగవంతుని పొందెటందుకు నీవు తపించిపోతూఉన్నవనే కదా అర్థం.
ఇంత గొప్ప తపస్సును మనమందరం నిరాటంకంగా ఆచరించి బ్రహ్మజ్ఞాన సిద్ధిని పొందుదాం.
మాస్టర్ సాగర్ సింధూరి🙏🙏🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment