Monday, February 28, 2022

శివ తత్వం

శివ తత్వం:-

➡ శివం - శుభకరం, శుభాన్ని కలిగించేవాడు.
➡ త్రినేత్రం - ధ్యానం.
➡ ఢమరుకం - సంగీతం.
➡ తాండవాభినయం - నృత్యం.
➡ శివుని చేతిలోని అగ్ని - నిప్పుతో చెలగాటం అనగా జీవితంలో ఎట్టి ఒడిదుడుకులు ఎదురైనా, ధైర్యంగా ఎదుర్కోవటం.
➡ భిక్ష పాత్ర - ప్రతి ఒక్కరి నుండి జ్ఞానం నేర్చుకోవడం.
➡ కపాలం - శరీరం యొక్క చివరి దశని సూచిస్తాయి.
➡ కోరుకునేది - చితా భస్మం కాదు. చిత్త భస్మం. (అనగా శూన్య స్థితి)

సేకరణ

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

అగ్గిపెట్టెలోని ఆఖరి పుల్లను
వెలిగిస్తున్నప్పుడు ఉన్న అప్రమత్తత,మొదటి అగ్గిపుల్ల
వెలిగిస్తున్నప్పుడూ ఉండేలాటి జాగ్రత్త మన ప్రతి అడుగులోనూ
ఉంటే జీవితాన్ని సులభంగా జయించవచ్చు.

సమయం డబ్బుకన్నా విలువైనది.
ఎక్కువ డబ్బు సంపాదించడం వీలవుతుంది..కానీ సమయాన్ని సంపాదించలేం..అందుకే మీ సమయాన్నిమీ ప్రియమైన వారికి మాత్రమే బహుమతిగా ఇవ్వండి.
ఎందుకంటే మన జ్ఞాపకాలను పంచుకున్నా,మనకు జ్ఞాపకాలను
మిగిల్చినా వారే కనుక.

దారులు ఎన్నో ఉండొచ్చు కానీ చేసే ప్రయాణాలపై స్పష్టత ఉండాలి.అప్పుడే మనసుకి హాయి.

ఆత్మీయుల వల్ల ఒక్కోసారి బాధ,దుఃఖం కూడా కలుగుతాయి.
ఎల్లప్పుడూ ఆనందమే కాదు. అన్నిటినీ తట్టుకుని భరించ గలిగితేనే ఆ బంధం శాశ్వతంగా ఎప్పటికి మనతోనే ఉంటుంది.

ఉషోదయం తో మానస సరోవరం

సేకరణ

Sunday, February 27, 2022

*వీరిని ఎంత ఆపత్కాలంలో* ( *కష్టకాలంలో)కూడా* *ఆశ్రయించ కూడదట...*

వీరిని ఎంత ఆపత్కాలంలో ( కష్టకాలంలో)కూడా
ఆశ్రయించ కూడదట...

🌷🌷🌷🌷

1-షండుడు:సకాలంలో స్నానం చేయని వాడు, దేవతలను, తల్లిదండ్రులను గౌరవింపనివాడు.

2.మార్జానుడు:-
అహంకారం తోను, నిర్లక్ష్యం తోను, జప, తపాలు చేసేవాడు.

3:-అఖువు:-
కావలసినన్ని సంపదలు ఉన్నా తాను తినక, ఇతరులకు పెట్టని వాడు.

4:-కుక్కుటుడు:-
పక్షపాతం తో తీర్పులు చెప్పేవాడు.

5:-పతితుడు:-తన ధర్మం విడిచి పరధర్మం ఆచరించేవాడు.

6:-అపవిద్దుడు:-
గోహత్య, స్త్రీ హత్య మొ:లగు పాతకాలు చేసే వాడు.

7.నగ్నుడు.:-దైవ భక్తి లేనివాడు.

8:-ఛండాలుడు:- ఎంతో ఆశతో వచ్చినవానికి, తాను సహాయపడక, ఇతరులు కూడా సహాయపడకుండా అడ్డుపడే వాడు, మరియూ శరణు కోరి వచ్చేవానిని గాలికి వదిలేసేవాడు.

9:-అధముడు:-బంధువులు, స్నేహితులు, ఉత్తములు మొదలగువారికి దూరమైనవాడు.

ఇలాంటి వారిని ఎంత కష్టదశలో ఉన్నా ఆశ్రయించరాదు అని విజ్ఞులైన మనపెద్దలు చెప్పారు.
🌹💐🌹🌹🌹🌹💐💐

సేకరణ

మరణించీ జీవించు!

మరణించీ జీవించు!
‘పుణ్యాత్ములు,
మహానుభావులు,
పండితులు,
ధర్మాత్ములు కీర్తిశరీరాలతో జరామరణాలను అతిక్రమించిన యోగుల్లా సర్వదా ప్రకాశిస్తూనే ఉంటారు’ అంటాడు భర్తృహరి.
కీర్తికాంక్ష కలవారు జీవించేది మరణంవరకే.
విద్య, సంపద, పదవివల్ల పేరు ప్రఖ్యాతులు లభించవు. లభించినా అవి శాశ్వతమైనవి కావు.
జ్ఞానం, సచ్ఛీలం, సత్కర్మ, సత్యసంధత, నిరాడంబరత వల్లనే యశస్సు ఒనగూడుతుంది.
చిత్తశుద్ధి, సంస్కారం, మేధస్సు కలవాడు వినమ్రుడై పదిమందిలో మంచివాడనిపించుకుంటాడు. పోతన మహాకవి సామాన్య జీవన విధానానికి శ్రీనాథకవి సార్వభౌముడే అచ్చెరువొందాడు. తన భౌతిక సంపదకు బతికినన్నాళ్లు తానొక ధర్మకర్తగానే మనిషి భావించుకోవాలి. మనిషి కీర్తి వెంటపడక, కర్తవ్య దీప్తి వెంటపడాలి. వృత్తిని దైవంగా, ప్రవృత్తిని ధర్మబద్ధమైనదిగా భావిస్తే, మన్నన దానంతట అదే లభిస్తుంది. ఏ పని వెనకైనా కీర్తి కాముకత ఉంటే- దానికి విలువే లేదు... గెలుపూ ఇవ్వలేదు. పైగా అటువంటి కీర్తి కాంక్షాపరులు నలుగురిలో చులకనైపోతారు.

‘కీర్తికాంక్షకు మోహమే మూలం. ఆ మోహమే బుద్ధిహీనతకు వినాశానికి దారి తీస్తుంది’ అంటాడు వాసుదేవుడు. కీర్తి కోసం అహంకారపూరితుడై బలిచక్రవర్తి పాతాళాన పడిపోయాడు. కౌరవ సైన్యంలో ద్వేషం, వ్యక్తిగత ఖ్యాతి కోసం పాకులాడేవారు ఉండటం వల్ల వారంతా కురుక్షేత్రంలో పరాజితులయ్యారు. ‘విశ్వశ్రేయస్సు కోసమే కావ్యరచన’ అన్న సత్సంకల్పంతో నిర్మలచిత్తంతో లోక కల్యాణం కోసం రామాయణ, మహాభారత రచన చేసిన వాల్మీకి, వ్యాస మహర్షులు చిరయశోశిఖరాయమానులయ్యారు. సామాన్యుడైన విదురుడు హితమైన బోధలతో మాన్యుడయ్యాడు. అమేయమైన భక్తివల్ల శివుడికి తన కన్ను అప్పగించి కన్నప్ప లోకవంద్యుడయ్యాడు. త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు తమ జీవితాలను కీర్తికోసం పరమాత్మకు అంకితం చేయలేదు. ఆదిశంకరులు ప్రధాన జీవన లక్ష్యాలను ఖ్యాతికోసం ప్రచారం చేయలేదు.
ఎవరైనా మృత్యుదేవతకు బానిసలే. మంచి మరణం ధర్మవ్రతుడికే లభిస్తుంది. ఆ ధర్మమే మరణం తరవాత అతణ్ని బతికిస్తుంది. పాప జీవితం గడిపినవాడే మరణానికి భయపడతాడు. మమకారం వీడినవాడు మరణం ముందు ధైర్యంగా నిలబడతాడు. చచ్చిన తరవాత నలుగురే మోస్తారు. బతకడంలో తేడా వస్తే లోకం అంతా మోస్తుంది చరిత్రహీనుడంటూ!
మరణ సమయంలో నిశ్చింతగా పోయేవాడు జీవితాన్ని గెలిచినవాడే. అతడే ఆధ్యాత్మిక చక్రవర్తి. ఉన్నతమైన ఆసనం మీద కూర్చున్నంత మాత్రాన ఎవరూ గొప్పవారు కారు. ఉన్నతమైన ఆలోచనలు, ఆశయాలుండి కింద కూర్చున్నవాడే మహాత్ముడు, మహోన్నతుడు అంటాడు భాస్కర శతక కర్త. సాధన, ప్రయత్నం, దృఢ సంకల్పం, దీక్ష అనేది లేకుండా కీర్తి కండూతితో వక్రమార్గంలో సన్మానాలు, సత్కారాలు అందుకోవడానికి తాపత్రయపడటం- ఎండమావిలో నీటికోసం అన్వేషించడం లాంటిదే! స్వావలంబనతోపాటు పారమార్థిక చింతన ఉన్న మనిషిని మాత్రమే ఖ్యాతి వరిస్తుంది. ప్రతిభ ఉంటే ప్రశంస పరుగెడుతూ వస్తుంది. ప్రశంస కోసమే పరుగులు పెట్టేవాడు ప్రతిభకు దూరమైపోతాడు. మనోవాక్కాయ కర్మల్లో పవిత్ర ప్రవర్తన కలవాడే మరణానంతరం చిరస్మరణీయుడవుతాడు. మరణించాక జీవించాలంటే బతుకంతా తపస్సు చేయాలి
.

సేకరణ

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

అశయం లేని జీవితం,విశ్వాసం లేని మాటలు ,పట్టుదల లేని పనులు నిరుపయొోగం..
జీవితంలో ప్రధాన లక్ష్యoగా దేన్నయితే ఎంచుకుంటామో,దాన్ని సాధించడానికి పట్టుదలతో వ్యవహరించాలి,నిరంతరాయంగా శ్రమించాలి..అలాంటి కార్యాచరణకు పునరంకితం కావాలి అప్పుడే విజయం తథ్యo..

🍃🥀గాలి, వెలుతురు అన్ని గదుల్లోనికి రానిస్తేనే ఇల్లు సుందరంగా, శుభప్రదంగా,
నివాస యోగ్యంగా ఉంటుంది..

అలాగే మనసులోకి ఆనందాన్ని,అందరి మేలు కోరే, ప్రశాంతమైన ఆలోచనలు, రానిచ్చినప్పుడే ఆరోగ్యమైన శరీరం కాంతివంతమైన ముఖవర్చస్సు కలుగుతాయి..

🍃🥀నిన్ను విమర్శించే వారందరూ నీకన్నా తక్కువ స్థాయి, తక్కువ సామర్థ్యం ఉండేవారేనని,గుర్తుంచుకో..
ఎక్కువ స్థాయి, ఎక్కువ సామర్థ్యం, కలవారు మందలిస్తారు, సలహా ఇస్తారు.అంతే..

చదరంగం ఆటలో ఆడుతున్నప్పుడు మాత్రమే రాజు.. బంటు.. నలుపు తెలుపు!

ఆట అయిపోయిన తరువాత అన్ని ఒకే చోటకు చేర్చబడతాయి..!

జీవితం అనే చదరంగంలో కూడా అంతే! నువ్వు రంగంలో ఉన్నంతవరకే నీ విలువ గౌరవం...!

ప్రాణం పోయిన తరవాత IAS అయినా అయ్యా S అయినా ఒక్కటే! శవం) అందరిని ఒకే చోటకు..(స్మశానం).

"అసూయ ద్వేషాలు మానసిక రోగాలు, మనిషి ఎదుగుదలను ఆపివేస్తాయి." "సంతోషం, సహనం, శాంతం అనే మూడు గుణాలు ఎదుగుదలకు ఉపయోగపడతాయి..."

నిన్న గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు..
నేడు పోరాడాలేనివాడు రేపు గెలవలేడు..
గెలుపు కావాలంటే భయం వదిలెయ్యాలి...
భయం పోవాలంటే పోరాడితీరాలి... భయపడుతూ చేసే పోరాటం ఓటమి పాలవుతుంది...
భయం వదిలి పోరాడితే విజయం నీ సొంతమాతుంది.
👏👏👏👏

సేకరణ

బుద్ధ ప్రబోధిత ధ్యానమార్గం -- ఆనాపానసతి

పూజాకోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమో జపః
జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమో లయః
కోటి పూజలు ఒక స్తోత్రం తో సమానం,కోటి స్తోత్రాలు ఒక జపం తో సమానం, కోటి జపాలు ఒక ధ్యానం తో సమానం, కోటి ధ్యానాలు ఒక లయం తో సమానం.
పూజలు, స్తోత్రాలు, జపాలు కన్నా ధ్యానం అగ్ర భాగం లో ఉంది
==========================
అత్యున్నత ధ్యాన మార్గం – అంటే శ్వాస మీద ధ్యాస అంటే ఆనాపానసతి.
బుద్ధ ప్రబోధిత ధ్యానమార్గం -- ఆనాపానసతి

సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించండి

“ఆనాపానసతి” అన్నది సుమారు 2500 సం|| ల క్రితం గౌతమబుద్ధుడు ఉపయోగించిన పాళీ భాష కు చెందిన పదం. పాలీ భాషలో..

‘ఆన’ అంటే ‘ఉచ్ఛ్వాస' (లోపలికి పీల్చుకునే గాలి)

‘అపాన’ అంటే ‘నిశ్వాస’(బయటికి వదిలే గాలి)

‘సతి’ అంటే శ్వాసతో కలిసి ఉండటం

ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క సరి అయిన ధ్యాన పద్ధతి ఆనాపానసతి! సత్యాన్ని కనుక్కోవాలి అని ఆరాటం చెందేవారు చివరిగా చేరే స్థితే ఆనాపానసతి .. అక్కడి నుంచే వారి అసలైన “ఆధ్యాత్మిక అనుభవైక ప్రయాణం” మొదలవుతుంది! “ఆనాపానసతి” అంటే “మన శ్వాసతో మనం కూడుకుని వుండడం” .. దీనినే మనం “శ్వాస మీద ధ్యాస” అని చెప్పుకుంటున్నాం. “ఆనాపానసతి” అన్నది ప్రపంచానికి సకల ఋషులు, సకల యోగులు అందరూ కలిసికట్టుగా ఇచ్చిన అద్భుతమైన వరం !

“ధ్యానం చేయడానికి ఎక్కడైనా కూర్చోవచ్చు”

ధ్యానం కోసం భూమి మీద చాప వేసుకుని కూర్చోవచ్చు, గోడకు ఆనుకుని కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు. అయితే పాదాలు రెండూ ఒకదానికి ఒకటి క్రాస్ చేసుకోవాలి, వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకోవాలి ; పడుకుని మాత్రం ధ్యాన అభ్యాసం చేయకూడదు. ముసలివాళ్ళు, కూర్చోలేనివాళ్ళు అయితే మాత్రమే పడుకుని చేసుకోవచ్చు. కూర్చోగలిగినవాళ్ళు, ఆరోగ్యవంతులైన వాళ్ళు మాత్రం విధిగా కూర్చునే ధ్యానం చేసుకోవాలి.

“ధ్యానం ఎంతసేపు చెయ్యాలి?”
ప్రతిరోజూ విధిగా ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోవాలి. అంటే పది సంవత్సరాల వయస్సు వాళ్ళు పదినిమిషాలు, ఇరవై సంవత్సరాల వయస్సువాళ్ళు ఇరవైనిమిషాలు, ముప్పై సంవత్సరాల వయస్సువాళ్ళు ముప్పై నిమిషాలు .. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ధ్యానంలో తప్పనిసరిగా కూర్చోవాలి.

ప్రతిరోజూ ధ్యానాభ్యాసం అలవాటు చేసుకోవాలి. అన్నం ఉడకడానికి సమయం పడ్తుంది. ఊరికే ‘అలా’ పొయ్యి మీద బియ్యం పెట్టి ‘ఇలా’ తీసేస్తే అన్నం ఎంతమాత్రం వుడకదు గదా! అలాగే “ఆత్మ కూడా ‘ఉడకాలి’” అంటే ఈ ఆనాపానసతి అనే పొయ్యిమీద కాస్సేపు వుండాలి! “ఎంతసేపు ఉడకబడాలి?” అంటే వయస్సు ఎక్కువ ఉన్నప్పుడు ఆనాపానసతి అనే పొయ్యి మీద ఎక్కువసేపు వుండాలి. తక్కువ వయస్సు వున్నప్పుడు తక్కువ సమయం సరిపోతుంది. సరియైన సమయం కేటాయించినప్పుడే, పూర్తిగా ఉడకుతాం ! అప్పుడే “విపస్సన” అనేది మనకు సంభవిస్తుంది.


ఈ ఆనాపానసతి అన్నది రోజుకు ఒక్కసారి అయినా నిశ్ఛలంగా కనీసం ఎవరి వయస్సు ఎంత వుందో అన్ని నిమిషాలు కూర్చోవాలి.

సేకరణ

Friday, February 25, 2022

ఒంటరిగా ఉంటే అన్ని కోల్పోయినట్టు కాదు... మనస్సుకు నచ్చినట్టు ఉండటం తప్పు కాదు....

తెల్లవారింది..
నాకు ఐదు గంటలకే మెలకువ వచ్చింది
లేచి చేసేది ఏముందని అలాగే పడుకొని ఉన్నాను.మార్నింగ్ వాక్ కి వెళ్ళాలి...
కానీ బద్దకంగా అనిపించింది.
మావారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు...ఆయన చనిపోయి రెండేళ్లు
అయింది... కొడుకు కూతురు అమెరికాలో
స్థిర పడి పోయారు.నన్నూ అక్కడకు
వచ్చేయమంటారు...కానీ నాకే ఇషష్టం లేదు
ఆయన పోయాక నాకు ఆసక్తి పోయింది నిరాశ నిస్పృహలతో కాలం గడుపుతున్నాను..
కాఫీ తాగాలి అనిపించింది కానీ ఈ మధ్యన
చక్కెర వ్యాధి రావడాన డాక్టర్స్ సలహా మేరకు
కాఫీ మానేశాను..కాఫీ త్రాగడం ఎప్పటి అలవాటో!
చిన్నగా నిట్టూర్చి పైకి లేచాను బ్రష్
చేసుకొని వాకింగ్ కి బయలు దేరాను...
కొంత సేపటికి జాగింగ్ చేస్తూ ఒక యువతి ఎదురు పడింది వయసు పాతిక ఉంటుంది.
అందంగా...ఆరోగ్యంగా...అంతకు మించి చలాకీగా ఉంది.
నన్ను చూడగానే "గుడ్ మానింగ్ ఆంటీ!" అని విష్ చేసింది,.ఆ అమ్మాయి ఎవరో గుర్తు రాలేదు.
ఇంటికి వెళ్ళాక కూడా ఆ అమ్మాయి ని
గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాను.
కానీ గుర్తు రాలేదు.,మరుసటి రోజు వాకింగ్ కి వెళ్ళినప్పుడు కూడా అదే చిరు నవ్వుతో
విష్ చేసింది.
అలా వారం గడిచింది ఒక రోజు తను నన్ను విష్ చేసినప్పుడు " సారీ అమ్మా!
నిన్ను గుర్తు పట్టలేక పోయాను!"అన్నాను.
ఆ యువతి చిన్నగా నవ్వి " మన మధ్య పరిచయం ఉంటే కదా ఆంటీ!మీరు నన్ను గుర్తు పట్టడానికి" అన్నది.
నేను ముఖం ప్రశ్నార్థకంగా పెట్టాను.
అప్పుడా అమ్మాయి" విష్ చేయడానికి పరిచయం ఎందుకు?" అన్నది.,తన మాటకు
నేను నవ్వేసాను..నేను నవ్వి చాలా కాలం అయింది.,ఆ విషయం మనసు గుర్తు చేసింది.
" నీ పేరు?" అని అడిగాను"స్వప్న.మరి మీ పేరు?" అని అడిగింది."వకుళ" అని చెప్పాను.స్వప్న నన్ను దాటిపోతూ
వెనక్కి తిరిగి "ఆంటీ! మీ నవ్వు చాలా బాగుంటుంది" అన్నది.,నాకు మావారు గుర్తుకు వచ్చారు.ఆయన కూడా అదే మాట అనేవారు గుండెలో సంతోషం పొంగింది.
మధ్య మధ్యలో నాకు స్వప్న ఉత్సాహం...సంతోషం గుర్తుకు వస్తూ ఉండేవి ఉత్తేజంగా అనిపించేది.
ఒక రోజు "ఒక ఐదు నిముషాలు అలా కూర్చుని మాట్లాడుకుందాం" అన్నాను.
స్వప్న సరేనంది ఇద్దరం అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాము.
"నీకు పెళ్లి అయిందా?" అని అడిగాను.
"అయింది ఒక బాబు...పాప" అంది స్వప్న మాటల్లో మావారు పోయిన విషయం...మా పిల్లలు అమెరికాలో ఉన్న విషయం చెప్పాను మావారు పోయినందుకు
సంతాపం తెలియ పరిచింది.
కొద్ది క్షణాల తరువాత "ఇప్పుడు ఇంటికి
వెళ్లి బ్రేక్ ఫాస్ట్ ఏం చేస్తారు?" అని అడిగింది స్వప్న." బ్రెడ్" అని చెప్పాను.
"ప్రతి రోజూ అదేనా?" అని అడిగింది స్వప్న.
"ఒక్కదాన్నే గా!అందుకే!" అన్నాను.
"ఒక్కరు కాబట్టే మంచి ఆహారం తీసుకోవాలి మీ ఆరోగ్యం మీరు కాపాడు కోవాలి" అంది స్వప్న.కొంచెం సేపు ఆగి..,తనే" మీవారు..పిల్లలు ఉన్నప్పుడు వాళ్లకు
ఇష్టం అయినవి చేసి పెట్టి ఉంటారు..,
ఇప్పుడుమీకు ఇష్టమైనవి చేసుకు తినండి" అన్నది.,
ఆ తరువాత మేం వెళ్ళిపోయాము.
ఇంటికి వెళ్ళిన తరువాత కూడా స్వప్న మాటలు తలపుకు వచ్చాయి.అందులోని వాస్తవం గుర్తించాను.,చాలా కాలం తరువాత నాకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేసుకు తిన్నాను.
ఎందుకో మనసుకు తృప్తిగా అనిపించింది.
మరుసటి రోజు కలిసినప్పుడు స్వప్నకి
జీడిపప్పు ఉప్మా గురించి చెప్పాను ఎంతో సంతోషించింది."మంచి పని చేశారు" అని అభినందించింది..,మాటల్లో జీవితం నిరాసక్తత
గా ఉన్నట్లు చెప్పాను.స్వప్న మౌనం వహించింది.
నెల తరువాత ఒక రోజు " వీలు చూసుకొని ఒకసారి మా ఇంటికి రా!" అని ఆహ్వానించాను.స్వప్న వచ్చే ముందు ఫోన్ చేసి వస్తాను" అని నా సెల్ నంబర్ తీసుకుంది.మా వారు పోయాక నేను
మా ఇంటికి ఆహ్వానించిన తొలి వ్యక్తి స్వప్న.
సాయంత్రం నాలుగు గంటలకు వస్తున్నట్లు స్వప్న ఫోన్ చేసింది.
నాకు సంతోషం అనిపించింది.
తనకోసం కాఫీ చేసి ఫ్లాస్క్
లో పోసి ఉంచాను..,చెప్పినట్లు సరిగ్గా
నాలుగు గంటలకు స్కూటీ మీద వచ్చింది.
వస్తూ వస్తూ నాకోసం గులాబీ కుండీ తెచ్చింది.
"ఎందుకిది " అని అడిగాను."రోజూ దీనికి నీళ్లు పోస్తూ పూవు పూసే రోజు కోసం ఎదురు చూడండి!" అంది.
స్వప్న సోఫాలో కూర్చుంది కాఫీ అందించాను."మీరు తీసుకోరా?" అని అడిగింది."డయాబెటీస్.అందుకే ఇష్టమైనా
తీసుకోవడం లేదు" అన్నాను.
తను కిచెన్ లోకి వెళ్లి ఒక కాఫీ కప్పు తెచ్చి అందులో కొద్దిగా కాఫీ పోసి నాకు అందిస్తూ"జబ్బు కంటే భయమే శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది..,ఏం కాదు.హ్యాపీగా త్రాగండి" అంది నేను మంత్ర ముగ్ధురాలిలా కాఫీ సిప్ చేశాను..
చాలా కాలం తరువాత త్రాగుతున్న కాఫీ నాకు అద్భుతంగా అనిపించింది..
అప్పుడు స్వప్న చిక్కటి పాలల్లో..
బ్రూ పౌడర్ కలుపుకు త్రాగినా రుచి అద్భుతంగా ఉంటుంది..,అందుకు కొంచెం
మైండ్ సెట్ మార్చుకోవాలి" అన్నది.
కాఫీ త్రాగడం పూర్తి అయ్యాక "ఇల్లు చూద్దువు గాని రా!" అని స్వప్నను లోనికి తీసుకు వెళ్ళాను.
తను పూజా మందిరం చూసి " రోజూ పూజ చేయడం లేదా?" అని అడిగింది." లేదు"
అన్నాను..,తను రెండు అగరొత్తులు తీసి వెలిగించింది.,క్షణంలో గది పరిమళ భరితం
అయింది అప్పుడు స్వప్న "పూజ చేసినప్పుడు
మన మనసూ ఇలా పరిమళ భరితం అవుతుంది" అన్నది.
" ఈ అమ్మాయి ఏ విషయం చెప్పినా ఎంతో
బాగుంటుంది" అని మనసులో అనుకున్నాను.
స్వప్న బయలు దేరినప్పుడు " గులాబీ మొక్కకు నీరు పోసేటప్పుడు చిన్నప్పుడు
మీ పాపకు పాలు పట్టడం గుర్తు చేసుకోండి!"
అన్నది."అలానే" అన్నాను.
గదిలో అలుముకున్న అగరొత్తుల
పరిమళం స్వప్న వెళ్ళిపోయినా ఆమెను
గుర్తు చేస్తూనే ఉంది.
మరునాటి ఉదయం రోజులా నిస్పృహతో
లేవలేదు.కాఫీ త్రాగాలన్న ఉత్సాహంతో లేచాను.కాఫీ చక్కెర లేకుండా త్రాగాను.స్వప్న చెప్పినట్లు మైండ్ సెట్ మార్చుకొని త్రాగితే బాగుంది అనిపించింది..,
చాలా కాలం తరువాత ప్రభాత సమయంలో ఉత్సాహంగా అనిపించింది...
వాకింగ్ సమయంలో అదే విషయం స్వప్నకి
చెప్పాను.సంతోషం వ్యక్తం చేసింది.
స్వప్న ఇచ్చిన గులాబీ మొక్కకు రోజూ శ్రద్ధగా నీరు పోయసాగాను క్రమేపీ దానితో
అనుబంధం పెరిగింది..,ప్రతి రోజూ దాన్ని
శ్రద్ధగా పరిశీలించ సాగాను మొగ్గ తొడగడం...
పువ్వు విచ్చడం పరిమళం అద్భుతం అనిపించ సాగింది.
మావారు ఉన్నప్పుడు పూల కుండీలు
ఉండేవి గాని...వాటి పోషణ ఆయన చూసుకునేవారు ఇప్పుడు ఇది నాకు సరి కొత్త అనుభవం.
మధ్య మధ్యలో స్వప్న తను ఇచ్చిన గులాబీ మొక్క గురించి వాకబు చేస్తూ నా ఆనందం
పంచుకుంది.
ఈమధ్య స్వప్న నాతో పాటే వాకింగ్ చేయసాగింది.,ఒకరోజువాకింగ్ మధ్యలో " మీకో చిన్న పని చెప్తాను., అలా చేసి ఎలా ఉందో నాకు చెప్పండి" అంది.
"ఏమిటది?" అని ఆసక్తిగా అడిగాను.
రెండు చిన్న బౌల్స్ తీసుకొని ఒకదానిలో
బియ్యం గింజలు..ఒకదానిలో నీరు పోసి
మీ పిట్ట గోడ మీద పెట్టండి" అన్నది.
తన భావం గ్రహించి" సరే" అన్నాను.
అలా పెట్టిన గింజలు పిట్టలు తింటూ...
దప్పిగొన్న పక్షులు నీరు తాగుతుంటే ఆ దృశ్యం మనోహరంగా అనిపించ సాగింది.
ఉదయం తాగుతున్న కాఫీ...పూజ...
అగరొత్తుల పరిమళం... పూస్తున్న గులాబీలు...గింజలు తింటున్న పిట్టలు...
నీరు తాగుతున్న పక్షులు....ఇవి చిన్న చిన్న
మార్పులే గానీ నా జీవితంలో పెను మార్పులు తెచ్చాయి.ఒకప్పుడు నిరాశ..నిస్పృహలతో నిరుత్సాహంగా ఉండే నేను ఇప్పుడు ఉత్సాహంగా...సంతోషంగా ఉంటున్నాను.
నాలోని మార్పుకు స్వప్నే కారణం.
ఒకరోజు సాయంత్రం స్వప్న స్కూటీ మీద
వచ్చింది.తనతో పాటు ఇద్దరు పిల్లలను తెచ్చింది."వీళ్ళు మా పని మనిషి పిల్లలు.
బాగా చదువుతారు.,కానీ వీళ్ళమ్మ వీళ్ళను
చదివించలేక పోతున్నది..
అందుకే ఈ బాబుకు నేను స్కూల్ ఫీ కడుతున్నాను.
మీకు అభ్యంతరం లేకపోతే ఈ పాప స్కూల్ ఫీ కి మీరు సహాయం చేయండి" అన్నది..
నేను క్షణం ఆలస్యం చేయకుండా ఒప్పేసుకున్నాను...
వాళ్లకు సహాయం చేయడం నాకు ఎంతో తృప్తిని ఇచ్చింది.
పిల్లలు నన్ను అడిగి జామ చెట్టు దగ్గరకు వెళ్ళి జామ కాయలు కోసుకున్నారు,స్వప్న నాతో "మీ హాబీస్ ఏమిటి?" అని అడిగింది." ఒకప్పుడు బొమ్మలు గీసేదాన్ని" అని చెప్పాను.
" వావ్" అని స్వప్న నన్ను కౌగిలించుకుంది.
"ఆంటీ! నాకు పెయింటింగ్స్ అంటే పిచ్చి.
నాకోసం ఒకటి డ్రా చేయండి" అని చిన్న పిల్లలా మారాం చేసింది ."వాటి జోలికి వెళ్లి
చాలా కాలం అయింది..,వేయగలనో! లేదో!"
అన్నాను."తప్పక వేయగలరు!" అంది స్వప్న.
ఆన డమే కాదు...ఆ సాయంత్రం నేను పెయింటింగ్ వేయడానికి అవసరమైన డ్రాయింగ్ చార్ట్...పెన్సిల్స్...వాటర్ కలర్స్
తెచ్చి ఇచ్చింది.
దాన్ని బట్టి తనకు పెయింటింగ్స్ ఎంత ఇష్టమో అర్థం చేసుకున్నాను.
ఆలోచించి రాధా కృష్ణుల పెయింటింగ్ మొదలు పెట్టాను.మొదట కొంచెం తడబడినా త్వరగానే దారిలోకి వచ్చాను.
పెయింటింగ్ పూర్తి చేయడానికి నాలుగు రోజులు పట్టింది.,ఆ విషయం స్వప్నకి చెప్పాను.
ఆ సాయంత్రమే పరుగున నా దగ్గరకు వచ్చేసింది.పెయింటింగ్ చుడగానే " "ఎక్సలెంట్ ఆంటీ!" అని నన్ను కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది.
నాకు సంతోషం...సిగ్గు రెండూ కలిగాయి.
" పెయింటింగ్ మీద మీ సైన్ చేసి నాకు గిఫ్ట్ గా ఇవ్వండి" అని కోరింది.అలానే చేశాను.
ఆ రాత్రి అమెరికాలో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేశాను. "ఎప్పుడూ మేం చేయడమే గాని,నీవు చేసింది లేదు.ఫస్ట్ టైం నువ్వే చేశావు" అని ఆశ్చర్య పోయింది.క్లుప్తంగా స్వప్న గురించి చెప్పాను." నీ లైఫ్ స్టైల్
మార్చింది .నా అభినందనలు తెలియ జేయి"
అన్నది.
కొద్ది రోజులకు స్వప్న తన ఇంటికి
ఆహ్వానించింది.తనే వచ్చి స్కూటీ మీద తీసుకు
వెళ్ళింది.,ఇంటికి వెళ్లగానే నేను పెయింట్ చేసిన రాధాకృష్ణ అందమైన ఫ్రేమ్ లో
కనిపించి కనువిందు చేసింది.,నాకు మనసులో గర్వంగా అనిపించింది.
స్వప్న నాకు వాళ్ళ అత్త మామ గార్లను
పరిచయం చేసింది.,నేను సోఫాలో కూర్చున్నాను.,స్వప్న కాఫీ తేవడానికి లోనికి
వెళ్ళింది.
స్వప్న అత్తగారు నాతో మాట్లాడుతూ..
" మా కోడలు దేవతమ్మా!మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది."అన్నది.,అంతలో
స్వప్న కొడుకు...కూతురు మా దగ్గరకు వచ్చారు.నేను వాళ్లకు నేను తెచ్చిన బిస్కెట్స్...చాక్లెట్స్ ఇచ్చాను. వాళ్ళు
అక్కడినుంచి వెళ్లి పోయారు.
అప్పుడు స్వప్న అత్తగారు" ఈ బాబే స్వప్న కొడుకు ఆ పాప అనాధ.,స్వప్న దత్తత తీసుకొని పెంచుకుంటున్నది అంతే కాదు...
మరిక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది.,అదేమంటే...మన పిల్లలను మనం పెంచడం ...ప్రేమించడం గొప్ప కాదు.
అనాధకు చేయూత నీయడం గొప్ప అంటుంది.
మా అబ్బాయి అందుకు సమర్ధిస్తాడు" అని
చెప్పింది.
అది విన్న నాకు సంభ్రమాశ్చర్యాలు
కలిగాయి.స్వప్న కు అంత చిన్న వయసులోనే
ఎంత పరిపక్వత అనుకున్నాను.,కాఫీ తెస్తున్న స్వప్న లో నాకు దేవతా మూర్తి గోచరించింది.
స్వప్న,అత్తగారితో " మొత్తం చెప్పేసారా?
చెప్ప నిదే ఊరుకోరు కదా!" అంది నవ్వుతూ.
నేను సింపుల్ గా " అభినందనలు స్వప్నా!"
అన్నాను.
ఇల్లు చేరానే గాని ఆ రాత్రి నిద్ర పట్టలేదు.స్వప్నను చూసాక జీవన మాధుర్యం
బోధ పడింది.ఈరోజు తను చేసిన పని తెలిశాక నా జీవిత గమ్యం బోధ పడింది.
నా దగ్గర బాగానే డబ్బు ఉంది.,నా డబ్బు మా పిల్లలు ఆశించరు.ఆ విషయం నాకు బాగా తెలుసు. చాలా సేపు ఆలోచించి ఏం చేయాలో
నిర్ణయం తీసుకున్నాను.,అప్పుడు హాయిగా నిద్ర పట్టింది.
కొద్ది కాలానికి మా వారి పేరు మీద
ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పరిచాను.,దానికి
సెక్రటరీ గా స్వప్నను ఏర్పాటు చేశాను.
ఇప్పుడు నాకు జీవితం నిరాశగా... నిస్పృహగా అనిపించడం లేదు...సంతోషంగా...
ఉత్సాహంగా అనిపిస్తున్నది...
ఒకప్పుడు సమయం గడవని నాకు..,
ఇప్పుడు సమయం చాలడం లేదు.
వయసులో చిన్నదే అయినా ..నా మనసులో గురువు స్థానం స్వప్నకే
ఇచ్చాను!!

Note≈ ఒంటరిగా ఉంటే అన్ని కోల్పోయినట్టు కాదు... మనస్సుకు నచ్చినట్టు ఉండటం తప్పు కాదు.... 🙏🙏🙏

సేకరణ

సేకరణ

వర్ణమాలతో పెళ్లి ఆహ్వానం

వర్ణమాలతో పెళ్లి ఆహ్వానం
—————————————-
- అరుదైన అమ్మాయి
- ఆకతాయి అబ్బాయి
- ఇద్దరికి
- ఈడు జోడి కుదిరి
- ఉంగరాలను తొడిగి
- ఊరంతా ఊరేగించారు
- ఋణాల కోసం
- వరెవరినో అడుగుతూ ఉంటే
- ఏనుగు లాంటి కుభేరుడితో అడిగి
- ఐశ్వర్యం అనే కట్నం ఇచ్చి
- ఒకరికి ఒకరు వియ్యంకులవారు
- ఓర్పుతో ఒప్పందం చేసుకొని
- ఔదార్యాని ఇరు కుటుంబాలకు
అం - అందించాలని కోరుకుంటూ
: - : అంటూ
- కలపతో తయారయిన పత్రికలపై
కలంతో రాసిచ్చి
- ఖడ్గలతో నరికిన పందిరి ఆకులను
- గడప ముందుకు తీసుకొచ్చి
- ఘనమైన ఏర్పాట్లు చేయించి
- చాపుల (బట్టలు)నింటిని కొని
- ఛత్రం (గొడుగు) పట్టి గండదీపాని
- జరిపిస్తూ
- ఝాము రాత్రి దాక
- పకాయలను కాలుస్తూ
- ఠీవిగా (వైభవంగా)
- ప్పులతో
- ఢం ఢం అని శబ్దాలతో సాగుతుంది
- కంక ణా లు చేతికి కట్టుకొని
- తట్టలో తమలపాకులు పట్టుకొని
- థమన్(మ్యూజిక్ డైరెక్టర్) డప్పులతో
- దగ్గరి బంధువులను పిలిచి
- నవంతులను కూడా పిలిచి
- అనే నలుగురిని పిలిచి
- పది మందిని పలకరిస్తూ
- ఫంక్షన్ కి రావాలని చెప్తూ
- లగాలతో బంగార దుకాణాలకు వెళ్లి
- భటువులని (ఆభరణాలు) కొని
- మంగళ స్నానాలు చేయించి, రాజసూయ
- యాగం లాంటి పెళ్లి కి
- రా రండోయ్ వేడుక చూద్దాం అని చెప్పి
- లక్షణమైన
- వధూవరులను మీరు
- శతమానం భవతి అని
- షరతులు లేకుండా ఆశీర్వదించడానికి
- సప్తపది (పెళ్లి) వేడుకలో
- హంగు ఆర్భాటాలతో రెడీ అయిన మండపంలో
- క త్రం (భార్య) కాబోతున్న ఆమె ప్రక్కన వరుడు కూర్చొని
క్ష - క్షత్రియ చెంత ఉండే బ్రాహ్మణుల సాక్షిగా జరిగే ఈ పెళ్లి కి
- *ఱరండ…….

సేకరణ

శాపగ్రస్తుడు (సామాజిక కథ) రచన :: బుద్ధవరపు కామేశ్వరరావు హైదరాబాద్



శాపగ్రస్తుడు
==========
(సామాజిక కథ)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్


రాత్రి పదకొండు అయి ఉంటుంది. కిటికీలోంచి తెల్లటి, చల్లటి వెన్నెల గది అంతా పరచుకుంది. మా గదిలో ఉన్న మిగతా నలుగురు, వాళ్ళ మంచాల మీద హాయిగా పడుకున్నారు, నేను తప్ప.

నిద్ర పట్టక మంచంమీద అటూఇటూ దొర్లుతున్నాను. సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజున నా కొడుకు, కోడలు నన్ను ఈ వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్లిపోయారు. ఆ తరువాత వాళ్ళ వివరాలు ఏవీ నాకు తెలియలేదు. తెలుసుకోవాలని నేనూ ప్రయత్నం చేయలేదు.

నా భార్య మరణించిన ఓ ఏడాదికే నాకు ఇక్కడికి స్థాన చలనం. "భగవంతుడా నేనేం పాపం చేసాను? " కన్న కొడుకు ఉండి కూడా నాకు ఏమిటీ దుస్థితి ? అనుకున్నా, మనసులో. ఇదే ప్రశ్న గతంలో కూడా నాలుగు సార్లు వేసుకున్నాను.



మొదటిసారి వేసుకున్నది, పదవ తరగతి చదువుతున్న రోజుల్లో....

ఆ రోజు పరీక్షా ఫలితాలు వచ్చిన రోజు. డిగ్రీ ఫైనల్ చదువుతున్న పెద్దన్నయ్య బయటనుండి రిజల్ట్స్ పడిన పేపర్ తెచ్చి,
"ఇదిగో ఈ సన్యాసి పరీక్ష తప్పాడు. ఇలా పరీక్ష తప్పడం మన ఇంటా వంటా లేదు" అంటూ బిగ్గరగా కేకలేయసాగాడు. ఆయనకు డిగ్రీ చదువుతున్న చిన్నన్నయ్య, ఇంటర్ చదువుతున్న అక్కలిద్ధరూ వంత పాడారు. కాసేపటికి అమ్మా నాన్నా కూడా వారితో శృతి కలిపారు. సాయంత్రానికి తెలిసింది, నేను తప్ప, మా క్లాసు పిల్లలందరూ ఉత్తీర్ణులయ్యారనీ. అదిగో ఆ రోజు రాత్రి మొదటి సారి అనుకున్నాను,

"భగవంతుడా నేనేం పాపం చేసాను" అని ?



ఇక రెండవ సారి, పెళ్లి అయిన తరువాత రోజుల్లో...
ఎంతో ఇష్టపడి రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టాను. అయితే తన అంతస్తుకు, తన అందానికి నేను తగననుకుందేమో మరి, అప్పటినుంచి తన గయ్యాళి తనం నా మీద ప్రదర్శించేది. తనతో ఏ ఒక్క రోజూ కూడా నేను సుఖపడలేదు.
అదిగో అప్పుడు అనుకున్నాను,
మా అన్నయ్యలకు, మా బంధువులు అందరికీ అనుకూలవతులైన భార్యలను ఇచ్చావు.

"భగవంతుడా నేనేం పాపం చేసాను?" నాకు ఇలాంటి గయ్యాళీ భార్యను ఇచ్చావు అని.



ఇక మూడవసారి అనుకున్నది…

అప్రయోజకుడైన మా అబ్బాయి రాజు గురించి. మా పెళ్లి అయిన చాలా ఏళ్ల తర్వాత నాకు పుత్రోత్సాహం కలిగింది. వాడిని చాలా గారంగా పెంచింది నా భార్య రాజ్యం. దానితో వాడు మొండిగా తయారయ్యాడు. ఏ ఉద్యోగం లోనూ కుదురుగా లేడు. అదిగో అప్పుడు అనుకున్నాను, మా బంధువుల, స్నేహితుల పిల్లలు అందరూ చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, "భగవంతుడా నేనేం పాపం చేసాను?" నా కొడుకును ఇలా పుట్టించావని.



ఇక నాలుగో సారి,

మా అబ్బాయికి సంతానం కలగకపోవడం గురించి. పెళ్లి చేస్తే స్థిరపడతాడని వాడికి వివాహం జరిపించాము. అప్పటికే అనారోగ్యంతో ఉన్న మా ఆవిడ "ఒరే ఓ మనవడిని కనరా! హాయిగా చూసి కన్ను మూస్తా" అని కోరడంతో నేను కూడా అదే విషయం చెప్పాను. ఎంతకీ ఆ ప్రయత్నం ఫలించక పోయేసరికి అనుమానం వచ్చి కోడలితో సహా వాడిని తీసుకుని వెళ్లి అన్ని పరీక్షలు జరిపించా. తర్వాత తెలిసింది, భార్యాభర్తలు ఇరువురిలోనూ లోపముందనీ, సంతానయోగం లేదని.
అదిగో అప్పుడు అనుకున్నాను, అందరూ మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా ఆడుకుంటున్నారు, "భగవంతుడా నేనేం పాపం చేసాను?" నాకు ఆ ఆనందం లేకుండా చేసావని.



ఇలాంటి ఆలోచనలతో నిద్ర పట్టని నేను, ఆ రాత్రంతా జాగరమే చేసాను. అయితే, నా మనోవేదనను ప్రస్తుతం ఆశ్రమంలో సాయంత్రం పూట ప్రవచనాలు చెబుతున్న సదానంద స్వామికి వివరించి, పరిష్కారం సూచించమని అడగాలి అని నిశ్చయించుకున్న తరువాత, తెల్లవారు జామున ఎప్పుడో నిద్రలోకి జారుకున్నా.



మర్నాడు సాయంత్రం,

నా మనోవేదన అంతా విన్న స్వామీజీ,
"నాయనా! 'భగవంతుడా! నేనేం పాపం చేసాను?' అని సాక్షాత్తూ నువ్వే ఆయనను అడుగుతున్నావంటే, నీకు ఆ భగవంతుని మీద నమ్మకం ఉందనీ అందుకే ఆయననే ప్రశ్నించే స్థాయికి ఎదిగావని తెలుస్తోంది.

అయితే దేవుని సృష్టిలో ప్రతీ చర్యకూ ఓ ప్రతిచర్య ఉంటుంది. నాకు తెలిసి నువ్వు కేవలం ప్రతిచర్య మాత్రమే చెప్పావు. దానికి ముందు తప్పకుండా ఓ చర్య ఉండే ఉంటుంది. దాని గురించి ముందు శోధించు. తప్పకుండా సమాధానం దొరుకుతుంది. అంతకీ దొరక్కపోతే, నేను ఇంకా ఒక మాసం రోజులు ఇక్కడే ఉంటాను కదా! అప్పుడు పరిష్కారం సూచిస్తాను" అపరిష్కృతంగా ఇచ్చిన స్వామీజీ సమాధానంతో అన్యమనస్కంగా అక్కడ నుంచి కదిలాను.



ఆ రాత్రి నుంచి ప్రతీరోజూ గదిలో పడుకొని స్వామీజీ చెప్పిన దిశగా ఆలోచించసాగాను.

ముందుగా నేను పదవ తరగతి పరీక్ష తప్పడానికి కారణమైన చర్యలు ఏమిటా అని ఆలోచించసాగాను. కొంతసేపటికి దానికి నేను ఏడవ తరగతిలో చేసిన ఓ దుశ్చర్య కారణం అనిపించింది.

ఆ రోజు సైన్సు పరీక్ష. ఆ సబ్జెక్టు మీద అవగాహన లేక కొన్ని స్లిప్పులు పెట్టుకుని, పరీక్షకు హాజరయ్యాను. కాసేపటికి స్క్వాడ్ మేము ఉన్న హాలులోకి వచ్చింది. వెంటనే తేరుకున్న నేను ఆ స్లిప్పులు నా వెనుక బెంచి కిందకు తోసేసాను. యాదృచ్చికంగా అదే సమయానికి ఆ వెనుక బెంచి కుర్రాడు రాసిన సమాధానాలు ఆ స్లిప్పులతో సరిపోవడంతో, అతడు ఏం చెప్పినా వినకుండా, అధికారులు అతడిని డిబారు చేసారు. బహుశా అతడిని మోసం చేసిన ఫలితమే నా పదవ తరగతి పరీక్ష తప్పడం అనిపించింది.



ఇక రెండో సారి.... నా గయ్యాళి భార్య గురించి, దేముడిని ప్రశ్నించిన దానికి కూడా సమాధానం లభించింది.

మా మేనమామ కూతురు రాధ పుట్టగానే, మా పేర్లు కూడా కలవడంతో మా ఇరుకుటుంబాల వారూ ఏకపక్షంగా తీర్మానం చేసేసారు, తనే నా భార్య అని. అలాగే మేమిద్దరమూ కూడా నిజమైన భార్యాభర్తలే అనుకునేవారం, నాకు రాజ్యలక్ష్మి సంబంధం వచ్చేంతవరకూ! అందంగా ఉండడం, డబ్బున్న వారి అమ్మాయి కావడంతో నేను రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకున్నాను, నా తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా.

ఈ సంఘటనతో అవమానం చెందిన మా మేనమామ సరిగ్గా అదే ముహూర్తానికి కట్నం లేకుండా ఓ రెండో పెళ్లి వాడికిచ్చి రాధ పెళ్లి జరిపించాడు. అయితే ఆ తర్వాత రెండేళ్ళకే అనారోగ్యంతో రాధ భర్త మరణించడంతో, పిల్లలు లేని ఆమె తెలిసిన వాళ్ల ఇళ్లల్లో వంటపని చేసుకుంటూ బతుకుతోంది అని తెలిసింది. బహుశా రాధకు నేను చేసిన ద్రోహం ఫలితంగానే నాకు ఇలా గయ్యాళీ భార్య దొరికిందన్న మాట అనుకున్నాను.



ఇంకో రెండు రోజుల తర్వాత ..... మా అబ్బాయి అప్రయోజకత్వం గురించిన నా మూడవ ప్రశ్నకు కారణం కూడా తెలిసింది.

నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో, కంపెనీ వారు నాకు ఓ సహాయకుడిని వేసుకొనే అవకాశం ఇచ్చారు. ఇంటర్వ్యూ చేసి అన్ని అర్హతలు ఉన్న వడ్డాది ధనరాజ్ అనే యువకుడిని సెలెక్ట్ చేసాను. కానీ, ఓ పదివేలు లంచం అడిగాను. తాను చెల్లించే స్థితిలో లేనని అతడు ఎంత మొత్తుకున్నా వినకుండా వేరే యువకుడి వద్ద లంచం తీసుకుని ఆ ఉద్యోగం ఇచ్చేసాను. బహుశా ఓ ప్రయోజకుడిని అన్యాయంగా తిరస్కరించిన ఫలితమే మా అబ్బాయి అప్రయోజకుడుగా మారడం అయ్యుంటుంది.



ఆ మరుసటి రోజు రాత్రి నాకు, నాల్గవ ప్రశ్నకు అదే, మా అబ్బాయికి పిల్లలు పుట్టకపోవడం గురించి కూడా కారణం తెలిసింది. నిజంగా అది చాలా ఘోరం, నేరం కూడా.

మా రాజ్యం నెల తప్పిందని తెలియగానే ఇద్దరమూ మాకు తెలిసిన వెల్ విష్ బేబీ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయిస్తే, కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిసింది. వెంటనే రాజ్యాన్ని ఒప్పించి, బాగా తెలిసిన డాక్టర్ ద్వారా రహస్యంగా అబార్షన్ చేయించా. నిజంగా ఆ అమ్మాయి పుట్టి ఉంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి దాపురించి ఉండేది కాదు. బహుశా ఆ శాపం ఫలితమే మా అబ్బాయి నిస్సంతుగా మారడం.



ఇక ఆఖరుది, ఐదవది అయిన నా వృద్ధాశ్రమ జీవితం గురించి కూడా నాకు సమాధానం దొరికింది.

నాన్న చనిపోగానే, మా తోబుట్టువులు ఐదుగురం అమ్మని వంతులు వేసుకుని చూడసాగాము. అయితే మా ఇంటి వాతావరణంలో అమ్మ ఇమడలేక పోవడంతో, మా వాళ్లను సంప్రదించి వృద్ధాశ్రమంలో చేర్పించాను.

అప్పుడు అమ్మ, "ఒరే నాకు ఐదుగురు సంతానం కాబట్టి వంతులు వేసుకుంటున్నారు. నీకు ఒకడే కొడుకు కాబట్టి, కంట్లో పెట్టుకు చూసుకుంటాడేమో?" అన్న మాటలు ఇంకా గుర్తు. అయితే అమ్మ మాటలు నిజం కాలేదు. నేను అమ్మకు చేసిన మర్యాదే నాకు నా కొడుకు చేసాడు.



నేను భగవంతుని అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకడంతో, మర్నాడు సాయంత్రం స్వామీజీకి ఈ విషయాలు వివరించి, ప్రాయశ్చిత్తం చేసుకొనే మార్గం చెప్పమని వేడుకోవాలి అనుకుని, చాలా రోజులు తర్వాత ప్రశాంతంగా పడుకున్నా.



మర్నాడు సాయంత్రం స్వామీజీని కలిసి, ఈ పది రోజుల్లో నాకు జ్ఞాపకం వచ్చిన నా పాపాల జాబితా వారికి వివరించి,

"స్వామీ! మొన్న మీరు చెప్పినట్లు ఆలోచించగానే నేను చేసిన పాపాలే నాకు శాపాలుగా మారాయని అర్ధమయ్యింది స్వామి. మరి ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం ఏదైనా సూచించండి" అని అడిగాను.

దానికి వారు చిన్నగా నవ్వి,

"చూడు గోపాలం, దేవుని ప్రశ్నించే స్థాయి నుంచి, తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం అడిగే స్థాయి వరకూ వచ్చావు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం ఏమీ లేదు నాయనా! దైవాన్ని స్మరించుకుంటూ మనసు నిర్మలంగా ఉంచుకో. చెడు ఆలోచనలు మనసులోకి రానీయకు. మిగతాది ఆయనే చూసుకుంటాడు. అంతా మంచే జరుగుతుంది" అంటూ నన్ను ఆశీర్వదించి పంపారు.



మూడు వారాల తర్వాత.......

ఈ రోజుతో , ఆశ్రమంలో సదానంద స్వామీజీ వారి ప్రవచనాలు పూర్తవుతాయి. ఈ ఇరవై రోజుల్లో నాకు పూర్తి మనశ్శాంతి కల్గించేలా చేసిన స్వామిని ఈ సాయంత్రం ఓ సారి కలుసుకుని వారికి పాదాభివందనం చేయాలని నిశ్చయించుకున్నా.

అయితే మధ్యాహ్నం నా ఫోన్ లో ఒక తెలియని నెంబర్ నుంచి వచ్చిన ఒక మెసేజ్ నన్ను ఆశ్చర్యంలో పడేసింది.



సాయంత్రం, స్వామీజీకి పాదాభివందనం చేసి, వారి బోధనలతో నేను పొందిన మనశ్శాంతి గురించి చెప్పి,
"స్వామీ, మీరు చెప్పినట్లే ఓ ఇరవై రోజుల్లోనే నిజంగా ఓ మంచి జరిగింది. మీరు వింటానంటే మధ్యాహ్నం వచ్చిన ఓ సందేశం మీకు చదివి వినిపిస్తాను" అని వారి అనుమతితో ఆ సందేశం చదవడం మొదలెట్టాను.

""నాన్నా ! నేను మీ అబ్బాయి రాజుని. మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఈ మెసేజ్ పంపుతున్నాను.
పిల్లలు లేరని నేను ఎంత మానసిక క్షోభ అనుభవించానో, కొడుకు ఉండి కూడా నువ్వు ఈ నాలుగు సంవత్సరాలలో అంత బాధ పడీ ఉంటావని నాకు అర్ధమయ్యింది. అందుకే నిన్ను ఆ బాధ నుంచి తప్పించాలని నిశ్చయించుకున్నా.

ఇక అసలు విషయానికి వస్తే,

నాన్నా ! నువ్వు త్వరలో తాతవి కాబోతున్నావు. ఔను!... నేను పుట్టిన వెల్ విష్ బేబీ ఆసుపత్రి వాళ్ళ అబ్బాయి ఈ మధ్యనే విదేశాల్లో వైద్య విద్య నేర్చుకుని వచ్చాడు. ఆయన మా ఇద్దరికీ కొన్ని పరీక్షలు చేసి సంతానం కలిగే అవకాశం ఉందని చెప్పాడు. ఆయన వైద్యం ఫలించింది. ఇప్పుడు మీ కోడలికి ఐదవ నెల.

కానీ, విశ్రాంతి అవసరం అని చెప్పడంతో, సహాయం కోసం పెద్ధత్తయ్య సలహాతో మీ మేనమామ కూతురు, అదే మన రాధ పిన్నిని అడిగాను. నీకు, మీ కోడలికి, పుట్టబోయే బిడ్డకు కూడా సపర్యలు చేయడానికి ఆమె సంతోషంగా ఒప్పుకుంది. త్వరలో వస్తానంది.

నీకు ఇంకో శుభవార్త.

నాకు బేంక్ లో ఉద్యోగం వచ్చింది. త్వరలో ఆర్డర్ వస్తుంది. నిజం నాన్నా! నాకు ఈ మధ్యనే ధనరాజ్ అనే ఆయన పరిచయం అయ్యారు. ఆయన గతంలో, ఏదో కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి, అక్కడి అధికారికి లంచం ఇవ్వలేక ఆ ఉద్యోగం పోగుట్టుకున్నాడుట. ఆ తరువాత ఉద్యోగ ప్రయత్నాలు మాని, 'వడ్డాది కన్సల్టెన్సీ' పెట్టి, బేంక్ టెస్టులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆయన శిక్షణ వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది.

నా భావోద్వేగాలు నోటితో చెప్పలేక ఇలా మెసేజ్ పెట్టాను.

రేపు ఉదయం రెడీగా ఉండు. నేను వచ్చి తీసుకుని వెళ్తాను.
క్షమాపణలు కోరుతూ
ప్రయోజకుడైన
మీ అబ్బాయి రాజు.""

మెసేజ్ చదవడం పూర్తి అవ్వగానే,

"చూసావా గోపాలం! దేవుని లీలలు. అంతా నాటకీయంగా ఉంది కదూ? నీ పశ్చాత్తాపం మెచ్చి, భగవంతుడు నిన్ను ఎలా అనుగ్రహించాడో ఇప్పటికైనా అర్థమయ్యిందా? నీ ప్రశ్నలు అన్నింటికీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు ఆ దేవుడు. మరింకేం తిరిగి నూతన జీవితం ప్రారంభించు" అని ఆశీర్వదించారు స్వామీజీ.

"స్వామీజీ ! కానీ, ఓ చిన్న సందేహం ఉండిపోయింది. నా వలన మోసపోయిన ఆ ఏడవ తరగతి......" అని నేను సందేహం వ్యక్తం చేయబోయేంతలో

"దానికీ సమాధానం దొరుకుతుంది గోపాలం! హాయిగా ఇంటికి వెళ్లు" అంటూ తన శిష్యుని వైపు చూస్తూ నవ్వుతూ వెళ్లారు స్వామీజీ.

నాకు ఏమీ అర్ధం కాక , వారి శిష్యుని వైపు తిరిగి,

"చిన్న స్వామీ! పెద్ద స్వామి నవ్వుకు అర్ధం ఏమిటి?" అడిగాను ఆశ్చర్యంగా.

"గోపాలం! నీ వలన మోసపోయిన ఆ ఏడవ తరగతి విద్యార్ధి ఆనంద్ ఎవరో కాదు. ఈ సదానంద స్వామీజీ యే! నీవలనే కాదు చాలా మంది చేతుల్లో మోసపోయిన ఆయన నీలా భగవంతుని ప్రశ్నించలేదు. తనని తాను ప్రశ్నించుకుని ఇలా ఆధ్యాత్మిక ధోరణిలో పడి, ఈ స్థితికి వచ్చారు" ఆయన చెబుతున్నది విని నోరు వెళ్లబెట్టిన నాతో,

"ఔనూ! ఈ ఇరవై రోజుల్లో నువ్వు భగవంతుని ఏం వేడుకున్నావు?" అడిగారు చిన్న స్వామి.

"
భగవంతుడా నేనే పాపం చేసాను , నన్ను క్షమించమని వేడుకున్నాను" అని చిన్న స్వామికి చెప్పి, వారికి నమస్కారం చేసి వెనుతిరిగాను,
ఎక్కడనుంచో

'దీనుల కాపాడుటకు దేముడే ఉన్నాడు
దేముని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు'
అనే పాట మంద్రస్థాయిలో వినిపిస్తుండగా!

శుభం *

(నేను రాసిన ఈ కథ, ఫిబ్రవరి 2022
"సాహో" మాసపత్రికలో ప్రచురితమైనది)

సేకరణ

మంచి మాట...లు

🔱శుభోదయం🙏
ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు.. లక్ష్మి.. సరస్వతి.. గాయత్రి.. దుర్గా అమ్మవార్ల అనుగ్రహం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందం జీవించాలని కోరుకుంటూ
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ ।
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం ॥

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం ।
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం ।
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం ।
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ॥
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
25-02-2022:-శుక్రవారం
ఈ రోజు AVB మంచి మాట...లు

చూడు మిత్రమా!!

మన జీవితం పొలం అనుకుంటే మనకోచ్చే కష్టాలు కలుపు మొక్కలు.. కలుపుమొక్కలను లాగి పక్కన పడేస్తాము కాని పొలం పాడుచేసుకోము అలానే మనకోచ్చే కష్టాలను పక్కన పడెయ్యాలి కానీ జీవితాన్ని పక్కన పడేయకూడదు


మనం ఎవరికైనా మేలు చేస్తే అది తప్పకుండా వడ్డీతో సహా మనకు చేరుతుంది, అదే మనం ఎవరికైనా కీడు చేస్తే అది చక్ర వడ్డీతో సహా మనకు చేరుతుంది, ఏదైనా మనకు చేరడానికి ఎనకటికీ ఏండ్లు గడిచేది, ఇప్పుడు రోజులు కూడా గడవడం లేదు, జగ్రత్త సుమీ,,


కుక్క మొరుగుతుంది అని సింహం వెనుదిరిగి చూడదు,, అలాగే మన జీవిత ప్రయాణంలో ఎవరో మనల్ని విమర్శించారని బాధపడకూడదు, సింహానికి కుక్కలు ఎంతో, మనకు మనల్ని విమర్శించే వారు కూడా అంతే,,
సేకరణ ✒️ AVB సుబ్బారావు 🌹💐🤝

సేకరణ

Thursday, February 24, 2022

ప్రాణశక్తి - పంచ ప్రాణాలు

ప్రాణశక్తి - పంచ ప్రాణాలు :

📚🖊️ భట్టాచార్య

సనాతన ధర్మము ప్రవచించిన, యోగ శాస్త్రం ప్రకారం....ప్రాణశక్తి, ఆదిమ - వైశ్విక శక్తి. ఈ శక్తి భౌతిక విధులన్నిటిపై ఆధిపత్యం వహిస్తుంది. ప్రాణశక్తి, మహత్తరమైన జీవ శక్తి. ఈ శక్తి సృజనాత్మక శక్తి.

ఈ ప్రాణశక్తి మూడు రూపాలలో, ఈ శరీరానికి , మనస్సుకు శక్తిని ఇస్తూ ఉంటుంది. చిత్త శక్తి, మనస్సును నియంత్రిస్తూ ఉంటుంది. ఆత్మ శక్తి , ఆత్మతో అనుసంధానమై ఉంటుంది.

ఈ ప్రాణ శక్తి శరీరంలో, ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యానాది పంచ ప్రాణములు గానూ......నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయాది ఉప ప్రాణములు (ఉప వాయువులు) గానూ....విస్తరించి, తన విధులను నిర్వహిస్తోంది.

కొంత మంది వైజ్ఞానీకులు, వీటిని Cloud of Ions గా వర్ణిస్తారు. శరీర శాస్త్రవేత్తలు, ఈ ప్రాణ శక్తులనే, Bio-Plasmic Energy గా పిలుస్తారు.

ఈ ప్రాణశక్తి, అనేక దేశాలలో...అనేక రకాలుగా పిలువబడుతోంది. అయితే మనుజుల యొక్క, ఈ ఉన్నతమైన ప్రాణ శక్తి లో హెచ్చు భాగం, వ్యర్థమైన కార్యకలాపాలకు, చెడుపనులకు, దురాలోచనలకు ఖర్చైపోతూన్నది.

హఠయోగంలో, ప్రాణశక్తి మరియూ చిత్త శక్తులు....సమత్వంలో ఉంటే, ఈ రెండు రకాల శక్తుల సామరస్యం, ఆత్మశక్తి అనే తలుపును తెరుస్తాయి. ఈ శక్తుల సామరస్యం, ఉన్నత స్థాయి చైతన్యాన్ని అనుభవించేటపుడు, ఒక యోగిలో శక్తి స్థాయిలను పెంచుతాయి. ఈ శక్తుల అసమతౌల్యం...ఒక యోగిలో భౌతిక,మానసిక, భావాత్మక సమస్యలు సృష్టిస్తుంది. కాబట్టి "సమత్వం యోగ ఉచ్యతే".

ప్రాణ శక్తి అనేది పింగళా నాడితో అనుసంధానమై ఉంటే, చిత్త శక్తిని ఇడా నాడి ప్రతిఫలిస్తుంది.

ఈ శక్తిని సమత్వం చేయడానికి.... యోగాసనాలు, ప్రాణాయామము, ముద్రా ప్రాణాయామాలు, ముద్రా ధ్యానాలు, రక రకాల ధ్యాన పద్ధతులు, చక్రాలపై చెసే వివిధ ధ్యానాలు...ఇవన్నీ శక్తి సమం చేయడానికి ఉపయోగ పడతాయి.

ప్రాణ శక్తి, మరల 5 ప్రాణాలుగా విభజించబడింది అని చెప్పుకున్నాం కదా! వాటి గూర్చి రేఖా మాత్రంగా తెలుసుకుందాం.....

1. ప్రాణము : శ్వాస, ఆహారము...మొదలైన విషయాలను గ్రహించే శక్తిని ప్రాణము అంటారు. శరీరంలో బలాన్ని సంచరింప జేసేదానిని ప్రాణము అంటారు. శబ్దోచ్ఛారణ లోని స్పష్టత దీని ప్రభావమే. ఇది పసుపు రంగులో ఉంటుంది. గాఢమైన ధ్యానంలో, ఈ ప్రాణం యొక్క తత్వం అనుభవానికి వస్తుంది. ఈ ప్రాణం, అనాహత చక్రాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది.

2. అపానము : శరీరంలో మల, మూత్ర, చెమట, కఫం, రజస్సు, వీర్యము, ప్రసవము...మొదలైన వాటిని బయటికి నెట్టి వేయబడే క్రియలు అపాన శక్తి వలననే కలుగుతాయి. దీని స్థానము గుద స్థానము. ఇది నారింజ ఎరుపు రంగులో ఉంటుంది. మూలాధార చక్రాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది.

వ్యానము : శరీరమంతా వ్యాపించి ఉన్నదాన్నే...వ్యానము అంటారు. రక్త సంచారము, ఉచ్ఛ్వాస-నిశ్వాసాలు, నాడుల ద్వారా ఈ వ్యానము శరీరం మొత్తాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. మనస్సు, శారీరక విధుల సంచాలనము దీని ద్వారా జరుగుతుంది. ఇది గులాబి రంగులో ఉంటుంది. దీని స్థానం, స్వాధిష్ఠానం.

ఉదానము : శరీరాన్ని నిలబెట్టి, నిటారుగా నిలబెట్టి, పడిపోకుండా చేసే శక్తిని ఉదానము అంటారు. నిద్రావస్థలోనూ, మరణానంతర విశ్రాంతి దీని పనే. ఇది వంకాయ రంగులో ఉంటుంది. ఇది విశుద్ధ చక్రానికి అనుసంధానించబడి ఉంటుంది.

సమానము : శరీరములోని రసాలను చక్కగా యథా స్థానాలకు తీసుకొని వెళ్ళి, పంపిణీ చేసే ప్రాణ శక్తి విశేషాన్ని, సమానము అంటారు. మనము తిన్న తరువాత వచ్చే, రసాల ఉత్పత్తి-వినియోగము, తద్వారా వచ్చే శక్తి పంపిణీ చేయడం....ఈ సమాన వాయువు పని. నాభి, దీని స్థానం. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మణిపూరక చక్ర సంబంధంగా ఉంటుంది.

సశేషం

సేకరణ

Walking Experiment on Diabetes ఫలితాలు..

Diabetes / sugar / చక్కెర వ్యాధి ఉన్నా.. లేకపోయినా.. అందరికీ పంపించండి.

మీకు తెలిసున్న Diabetes వారికి పంపండి.. వారికి చాలా చాలా ఉపయోగం.

ఇంగ్లాండు లో ఒక పరిశోధన నిర్వహించారు.

ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఇది చదవండి... చదివించండి.

Walking Experiment on Diabetes ఫలితాలు..

రోజుకు ఒక అర గంట, లేక 45 నిముషాలు వాకింగ్ ( పొద్దున్న కానీ, సాయంత్రం కానీ, వారి వారి వీలును బట్టి ) ఏకబిగిన నడిచే వారికంటే, పొద్దున్న టిఫిన్ చేసిన తరువాత ఒక 5 నుంచి 10 నిముషాలూ, మధ్యాన్నం లంచ్ తరువాత 10 నిముషాలూ, రాత్రి డిన్నర్ తరువాత ఒక 10 నిముషాలూ, అలా మొత్తం రోజులో మొత్తం మీద అరగంట వాకింగ్ చేయడం వల్ల రక్తం లో సుగర్ నిల్వలు బాగా తగ్గుతాయి అని తేలింది...!!!

అలా
తిన్న 5 నిముషాల లోపు లేచి, 5-10 నిముషాలు వాకింగ్ చేసిన వారి రక్తం లో Sugar నిలవలు 11% నుంచి 44% శాతం వరకు తగ్గినట్లు వారు నిర్వహించిన Blood Test లలో తేలింది ...!!!

కాబట్టి, Diabetics వరకు, ఎంత సేపు వాకింగ్ చేశారు, ఎంత దూరం నడిచారు ? అనే దానికంటే, టైమింగ్, అనగా ఎప్పుడు నడిచారు ? అనే దానికి ప్రాధాన్యత ఉన్నట్లు తేలింది..!!!

ఈ పరిశోధన , ఇంగ్లాండ్ లో 23 దఫాలు గా నిర్వహించారు.

ఇందులో పెద్ద సంఖ్య లో, అనగా 12 లక్షల మంది డయాబెటిస్ ఉన్నవారు వాలంటీర్స్ గా సహకరించారు.

ఈ పరిశోధన 40 రోజుల పాటు సాగింది. వారు వాడే Medicines Dosage లలో ఏమీ మార్పు లేదు.

ఇందులో సగం మందిని, రోజుకు ఏకబిగిన 45 నిముషాలు నడవమన్నారు. మిగతా సగం మందిని 3 పూటలా, తిన్న వెంటనే ( తిన్న 5 నిముషాల లోపే,.. లేచి.. 10 నిముషాలు నడవమన్నారు.)

40 రోజుల తరువాత 2 గ్రూపులకీ Blood Test లు చేసారు.

దానిలో ఈ సత్ఫలితాలు వెల్లడి అయ్యాయి. ముఖ్యంగా, రాత్రి Dinner తరువాత 10 నిముషాలు నడిచిన వారి లో Sugar శాతం 22% తగ్గిందని వెల్లడి అయ్యింది.

Sugar complaint ఉన్నవారు, స్త్రీలైనా, పురుషులైనా, మొత్తం మీద వారానికి 150 నిముషాలు యావరేజి న వాకింగ్ చెయ్యవలసిందే అని ఏకగ్రీవంగా వెల్లడి అయింది.

Action point :-

తిన్న వెంటనే TV చూస్తూ కూర్చోకండి.

లేచి,.. మీ ఇంటి గదుల్లోన్నయినా సరే, గడియారం చూసుకుని 10 నిముషాలు నడవండి.

3 పూటలా నడవండి.
40 రోజుల తరువాత Blood Test చేయించుకోండి.

సేకరణ

మన వేదాలు చెబుతున్నదేమిటంటే - భగవంతుని సాక్షాత్కారం కలిగి, ఆత్మానుభూతిని పొందినవాడు సామాన్య జీవుడైనా దేవుడే అవుతాడు అని చెబుతున్నాయి!!... అది ఎలా???

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

నేటి మాట

భగవంతుడు...!!!

మన వేదాలు చెబుతున్నదేమిటంటే - భగవంతుని సాక్షాత్కారం కలిగి, ఆత్మానుభూతిని పొందినవాడు సామాన్య జీవుడైనా దేవుడే అవుతాడు అని చెబుతున్నాయి!!... అది ఎలా???

అసలు...!!...
భగవంతుడు ఉన్నాడా..
ఉంటే కనబడడే..
ఎప్పుడు కనబడతాడు..
ఏం చేస్తే కనబడతాడు..
ఇటువంటి ప్రశ్నల పరంపర మానవ జాతి పుట్టిన నాటి నుంచి కొనసాగుతూ వస్తోంది...

ఈ ప్రశ్నలకు సమాధానాలను వేదాలు సుందరంగా చెప్పాయి, వేద మంత్రద్రష్టలైన మహర్షులు వ్యాఖ్యానించి ఎన్నో గ్రంథాలు రాశారు.
ప్రవక్తలు ఎన్నో ప్రవచించారు, అయినా మానవుల్లో కరడుగట్టిన అజ్ఞానం ఆ విషయాలను మరచిపోయేట్లు చేస్తోంది.
ఏమీ తెలియని అసమర్థుల్లా మార్చివేస్తోంది...!!

పాలతో కడిగితే బొగ్గు తెల్లబడుతుందా...!!
అలాగే ఎంత ప్రక్షాళన చేసినా కరిగిపోకుండా ఘనీభవించిన అజ్ఞానానికి దాసుడైన మనిషికి జ్ఞానప్రబోధాలు అనుక్షణం అవసరమనే మాట యథార్థం.
భగవంతుణ్ని చూడటం అంటే తన గురించి తాను తెలుసుకోవడమే.
దీనికి కొన్ని ప్రయత్నాలు అవసరమని మహర్షులు ప్రవచించారు.
ఉన్నత విద్యల్లో ఆరితేరాలంటే ప్రాథమిక విద్యల్లో ముందుగా నిష్ణాతులు కావాలి...

అక్షరాలు రానివారికి అంతరిక్ష విజ్ఞానాన్ని బోధపరచగలమా... అలాంటిదే బ్రహ్మవిద్య కూడా. ‘బ్రహ్మం’ అంటే భగవంతుడు.

కనుక బ్రహ్మవిద్య అంటే భగవంతుణ్ని తెలిపే విద్య , ఈ విద్యను తెలుసుకోవడానికి నాలుగు దారులున్నాయని పెద్దలు చెప్పారు. అంటే...

ఒక ఇంటి చిరునామాను కనుక్కోవడానికి ముందు ఆ ఇంటికి చేరే దారులను కనుక్కోవడం అన్నమాట...

మొదటి దారిలో వెళ్లడం అంటే...!!
భగవంతుడు ఒక్కడే నిత్యుడు, శాశ్వతంగా ఉండేవాడు అని తెలుసుకోవడం.
అంతేకాదు… భగవంతుడికి భిన్నమైనదంతా అనిత్యం, అంటే అశాశ్వతం అనీ గ్రహించడం, నిత్యం అంటే ఎంత కాలం గడచినా చెక్కు చెదరకుండా ఉండటమే.
భగవంతుడు చేసిన సృష్టి ఎప్పటికో ఒకప్పటికి ప్రళయంలోకి జారుకొని అంతరిస్తుంది...
కనుక సృష్టి అంతా అనిత్యమే, ఏది పుడుతుందో అది నశిస్తుంది, ఏది పుట్టదో అది నశించదు, అందుకే జీవకోటి నశిస్తుంది... భగవంతుడు నిత్యమై ఉంటాడు...

రెండవ దారిలో వెళ్లడం అంటే...!!
మనిషి అనుభవిస్తున్న భౌతిక సుఖాలకు సంబంధించిన సామగ్రి అంతా ఎప్పటికైనా నశించిపోయేదే అని తెలుసుకోవడం... యజ్ఞయాగాలు, తపస్సులు, దానాలు చేసి సంపాదించుకొన్న పుణ్యంతో స్వర్గానికి వెళ్లి పరలౌకిక సుఖాలను పొందినా అవీ ఒకనాటికి నశించిపోయేవే అని తెలుసుకోవడం.
ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మనిషి పొందే సుఖాలు అశాశ్వతమైనవి అనే జ్ఞానం కలగడం...

మూడవ దారిలో వెళ్లడం అంటే..!!
ఆకలి వేసినప్పుడు అన్నం కోసం, దాహం వేసినప్పుడు నీళ్ల కోసం ఎలా మనసు పరుగులు తీస్తుందో, అలాగే పరమార్థజ్ఞానాన్ని సంపాదించడం కోసం సద్బోధనలు వినడం, విన్నవాటిని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడం, అలాంటి విషయాలపై మనసును నిలపడం. పనికిరాని దృశ్యాలను చూడకుండా కళ్లను..
వ్యర్థ ప్రసంగాలు వినకుండా చెవులను.. అసభ్య సంభాషణలు పలుకకుండా నోటినీ నియంత్రించుకోవడం.
చలికీ గాలికీ ఎండకూ తట్టుకోగలగడం, దూషణ భూషణలకు ఏ మాత్రం చలించకుండా స్థిరంగా నిలవడం. వికారాలన్నీ శరీర ధర్మాలేగానీ ఆత్మకు వాటితో సంబంధంలేదని తెలుసుకోవడం.
గురువులనూ, పూజ్యులనూ సేవించి, వారి నుంచి జ్ఞానాన్ని పొందడం.

నాలుగవ దారిలో ప్రయాణించడం అంటే..!!
అజ్ఞానం వలన కలిగే సాంసారిక బాధలను జ్ఞాన సాధన ద్వారా అధిగమించడం.
అంటే.. మనిషికి అతని జీవితంలో కలిగే కష్టసుఖాలు క్షణికాలనవి అవి నిరంతరం వస్తూ పోతూ ఉంటాయే గానీ, స్థిరంగా ఉండవనీ చక్కగా గ్రహించగలగడం.

ఈ విధమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు మనసు చలించకుండా ఉంటుంది...
అప్పుడు అన్నింటికీ అతీతమైన స్థితి లభిస్తుంది.
అన్ని బంధాల నుంచి మనిషి విముక్తుడు అవుతాడు.
అదే భగవంతుని సాక్షాత్కారం, అలాంటి అనుభూతిని పొందినవాడు సామాన్య జీవుడైనా దేవుడే అవుతాడు...

🍂శుభమస్తు🍂
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

సేకరణ

భగవంతుడు తప్పక ఇస్తాడు

భగవంతుడు తప్పక ఇస్తాడు

🌷🌷🔅🍁🕉🕉️🍁🔅🌷🌷

ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతడు ఎప్పుడు మందిరానికి వెళ్ళినా అక్కడ ఇద్దరు భిక్షుకులు దేవాలయానికి కుడి పక్క, ఎడమ పక్క కూర్చుని ఉండేవారు.

కుడి పక్క కూర్చున్నవాడు - “ఓ భగవంతుడా, నువ్వు రాజుకు ఎంతో ఇచ్చావు. నాకు కూడా ఇవ్వు.” అని అనేవాడు.

ఎడమ పక్కకు కూర్చున్నవాడు - “ఓ రాజా, ఈశ్వరుడు మీకు ఎంతో ఇచ్చాడు. నాకు కూడా కొద్దిగా ఇవ్వండి.” అని అనేవాడు.

కుడిపక్క కూర్చున్నవాడు ఎడమపక్కన కూర్చున్నవాడితో రాజును ఎందుకు అడగడం,- “భగవంతుడిని అడుగు. అతడు అందరి ప్రార్థనలను వింటాడు.” అనేవాడు.

ఎడమ పక్కవాడు- “గమ్మున ఉండురా మూర్ఖుడా” భగవంతుడు వింటాడో లేదో కానీ రాజు వింటే తప్పకుండా సాయం చేస్తాడు అని జవాబు చెప్పేవాడు.

ఒకసారి రాజు తన మంత్రిని పిలిచి - “గుడి ఎదురుగా, కుడిపక్క కూర్చునేవాడు ఎప్పుడు భగవంతుని ప్రార్థిస్తాడు. భగవంతుడు తప్పకుండా అతడి అభ్యర్థనను వింటాడు. కానీ ఎడమపక్క కూర్చున్నవాడు ఎప్పుడు నన్ను అడుగుతాడు. అందువల్ల ఒక పెద్దపాత్రలో పరవాన్నం నింపి, అందులో బంగారు నాణేలను వేసి అతడికి ఇవ్వు.” అన్నాడు.

మంత్రి ఆ విధంగానే చేసాడు. అప్పుడు ఆ యాచకుడు పాయసం తింటూ, మరొక బిచ్చగాడిని వెక్కిరిస్తూ- “అబ్బో, ‘ఈశ్వరుడు ఇస్తాడు’ అన్నావే, ఇదిగో చూడు, నేను రాజును అడిగాను. దొరికిందా లేదా” అంటూ రెండోవాడిని ఎద్దేవా చేస్తూ కడుపునిండుగా తృప్తిగా తిని అతడికి ఇక చాలు అనిపించగానే , మిగిలిన పరవాన్నం గిన్నెను ఎంతో జాలిగా రెండవ బిచ్చగాడికి ఇస్తూ, “తీసుకో, నువ్వు కూడా రుచి చూడు, మూర్ఖుడా!” అన్నాడు.

రెండవరోజు రాజు వచ్చినప్పుడు చూస్తే ఎడమపక్క కూర్చున్న దరిద్రుడు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. కానీ కుడిపక్క కూర్చున్నవాడు కనిపించకుండా పోయాడు.

రాజు ఆశ్చర్యచకితుడై - “నీకు పాయసాన్నము పాత్ర దొరకలేదా” అనడిగాడు.

భిక్షుకుడు - “దొరికింది రాజా, అబ్బ, ఎంత రుచికరంగా ఉందో పాయసం. నేను కడుపునిండా తిన్నాను.” అన్నాడు.

అప్పుడు రాజు ఉత్సుకతతో - “తర్వాత ఏమైంది” అంటూ ప్రశ్నించారు... దానికి భిక్షుకుడు స్పందిస్తూ - “ఆ పాయసంతో నా కడుపు నిండింది. నేను తినగా మిగిలిపోయిన దాన్ని రెండవ బిచ్చగాడికి, అదే, ఇక్కడ కూర్చునేవాడే, అతడికి ఇచ్చేశాను. పాపం,మహారాజా వాడొట్టి మూర్ఖుడు, ఎప్పుడూ అనేవాడు- ‘పరమాత్మ ఇస్తాడు, భగవంతుడే ఇస్తాడు’ అని, పరమాత్ముడు ఇంత అద్భుతమైన పాయసాన్ని ఇవ్వటం జరిగే పని కాదని వాని అజ్ఞానం మీద జాలి వేసింది, అందువల్ల నేను తినగా మిగిలిపోయింది ‘నువ్వూ తిను’ అని ఇచ్చాను.” అన్నాడు.

రాజు నవ్వి- “తప్పకుండా అతనికి భగవంతుడే ఇచ్చాడు” అన్నాడు.

పరమేశ్వరుని యందు విశ్వాసము నుంచవలెను.

🙏🕉️ఓం నమః శివాయ🔱🙏
🌹🌹🔅🍁🌷🌷🍁🔅🌹🌹

సేకరణ

మంచి మాటలు

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః 🙏
ఆత్మీయ బంధు మిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు.. పూజ్య గురుదేవులు దత్తాత్రేయులవారు ఆదిశంకరాచార్య గారు రాఘవేంద్ర స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
గురువారం --: 24-02-2022 :--

మంచి ఆలోచనలతో మనస్సు నింపుకున్నవారు ఎప్పటికి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఈ సమాజంలో బ్రతుకు అనుకున్నంత సులభము కాదు మనకు ఎదురయ్యే సమస్యలను స్వీకరించే శక్తి తానుగా వచ్చేస్తుంది .

ప్రపంచానికి అమెరికా ఆయుధాలను ఇచ్చింది చంపుకోమని, చైనా కరోనాని ఇచ్చింది అందరూ చావాలని ,,పాకిస్థాన్ ఉగ్రవాదులను తయారుచేసి ఇస్తుంది భారతీయులను చంపమని, నా భారతదేశం మాత్రమే మెడిసిన్ ఇస్తుంది అందరు బతకాలని నా దేశం నా ప్రజలు ఎప్పుడు గొప్పవారే.

నీవు నటించే నటన ముందు నీ నిజాయితీ ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది మరణమే ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు ఏడవకు ఎందుకంటే నీ శత్రువుకు కావాల్సింది నీ మరణం కాదు నీ భయం మాత్రమే .

నీ స్నేహానికి వయస్సుతో పని లేదు ఆస్తులతో అంతస్తులతో అవసరం లేదు ఒకరీ నోకరు అర్థం చేసుకునే మనసుంటే చాలు అదే శాశ్వతమైన స్నేహ బంధం అవుతుంది , నీకు విలువ లేని చోట నీ నిజం గెలవదు నీకు నువ్వు నిలదొక్కుకున్న చోట నీ అబద్దం సైతం చిందులేస్తుంది

జనం దృష్టిలో మంచి చెప్పిన వారు ఎప్పడూ చెడ్డోడే చెడు చెప్పిన వారు ఎప్పుడూ మంచోడే ఎలాగంటే కాటు వేసే పాము కే పాలు పోస్తారు కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు .

సేకరణ ✒️*మీ ... AVB సుబ్బారావు 🌹🕉️🤝

సేకరణ

Video - Old Aged( 123yrs) Person Lifestyle

మంచి మాట..లు

ఆత్మీయ బంధుమిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు విజ్ఞ నాయకుడు విఘ్నేశ్వరుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి హరిహరసుతుడు అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహముతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
23-02-2022:-బుధవారం
ఈ రోజు AVB మంచి మాట..లు
ఇంకొకరి కన్నీళ్లతో దాహం తీర్చుకోవాలని ప్రయత్నించకు.. ఎదో రోజు కర్మ ఫలితం తిరిగివచ్చి నీ కడుపున మంట పెట్టక మానదు

జీవితంలో గతాన్ని చూసి ఏ మాత్రం సిగ్గుపడకు.. ప్రతి ఒక్కరూ ఏవో తప్పులు చేస్తారు ఆ తప్పుల నుండి జీవిత పాఠాలు నేర్చుకునే వారు కొందరు మాత్రమే

కన్నీరు చాలా విలువైనది.. ఎందుకంటే కన్నీరులో 1శాతం మాత్రమే నీరు మిగిలిన 99 శాతం నీ ఫీలింగ్స్.. దయచేసి తొందరపడి ఎదుటివారిముందు కన్నీరు కార్చి నీ ఫీలింగ్స్ బయటపడనియకండి

ఎగతాళిగా నవ్వేవాళ్ళని నవ్వానీయండి... అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడవనీయండి..మీరు మాత్రం మీ లాగే ఉండండి ..ఎందుకంటే ఏడ్చినా వాళ్లు.. నవ్వినా వాళ్ళు ఏదోరోజు నీ దేగ్గెరికి వస్తారు. మీ సాయం కోసం
సేకరణ ✒️ AVB సుబ్బారావు 💐🌹🤝

సేకరణ

నేటి ఆణిముత్యాలు. నీ గుండెల్లో ఓ ఆనందపు నిధి ఉంది.. తడిమి చూడు.. ఇకపై నిజమైన జీవితం నీ స్వంతమవుతుంది.

నేటి ఆణిముత్యాలు.

జీవితం చిన్నది.ప్రతికూలతలను ను తగ్గించండి.పుకార్లను మరచిపోండి.మిమ్ములను
పట్టించుకోని వ్యక్తులకు వీడ్కోలు చెప్పండి.మీతో ఉండే వ్యక్తులతో మీ సమయాన్ని ఆనందంగా
గడపండి.

ప్రతి పని చిత్త శుద్ధితో ఉత్తమంగా చేయండి. ఎక్కడో మూల మీ అభిమాని ఉండే ఉంటాడు/ ఉంటుంది.అనుక్షణం అప్రమత్తంగా ఉండండి. మీ కోసం ఎక్కడోచోట మీ శత్రువు వేచి చూస్తూ ఉండొచ్చు.

మూలాల్ని ప్రేమించడం వేరు, ఆ ప్రేమతో ఇతరుల మూలాల్ని ద్వేషించడం వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్.

నువ్వు ప్రేమించడం మానేశాక.. నిన్ను నువ్వు ఇంప్రెస్ చేసుకోవడం మానేశాక..
ఇంకెవర్ని ఇంప్రెస్ చేస్తావు, ప్రేమిస్తావు? హృదయంలో ఆనందం పెట్టుకుని మనుషుల మొహాల్లో ఎంతకాలమని టార్చ్ లైట్‌తో వెదుకులాడి ఢీలా పడతావు?
నీ గుండెల్లో ఓ ఆనందపు నిధి ఉంది.. తడిమి చూడు.. ఇకపై నిజమైన జీవితం నీ స్వంతమవుతుంది.

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

Story వ్యాపారి డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని రాత్రి ఆనక పగలనక అందరినీ పీడిస్తూ డబ్బు సంపాదిస్తూ వుండేవాడు

ఒక ఊరిలో ఒక వ్యాపారి డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని రాత్రి ఆనక పగలనక అందరినీ పీడిస్తూ డబ్బు సంపాదిస్తూ వుండేవాడు

ఇది చూస్తున్న ఒక పెద్దాయన ఆ వ్యాపారి తో ఇలా అంటాడు
బాబు నువ్వు ఎంతో కష్టపడి నీ జీవితానికి కావలసిన దానికంటే కూడ ఎన్నో రెట్లు ఎక్కువ డబ్బు సంపాదించావు కదా ఇక నైనా డబ్బు సంపాదన ఆపి కాస్త మనశ్శాంతి గా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అంటాడు

అప్పుడు ఆ పెద్దాయన మాటకు సమాధానంగా ఆ వ్యాపారి ఇలా అంటాడు నేను కష్టపడి సంపాదిస్తున్న డబ్బు నా ఒక్కడి కోసం కాదు నా పిల్లల కోసం,నా పిల్లల పిల్లల కోసం ఇలా నా తరువాత తరాల నా వారసుల కోసం అంటాడు

అప్పుడు ఆ పెద్దాయన ఇంకా పుట్టని వారికోసం ఇప్పుడు వున్న నీ తోటి వారిని పీడుంచు కొని ఇబ్బంది పెడుతూ సంపాదించడం ధర్మమా?
అంటాడు

అప్పుడు ఆ వ్యాపారి దర్మమో కాదో నాకు
తెలియదు కానీ నాకు భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు నేను సంపాదిస్తున్నాను అంతే అంటాడు

ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఎంతో తరగని డబ్బు సంపాదించిన ఆ వ్యాపారి చనిపోతాడు
చనిపోయిన ఆ వ్యాపారి నేరుగా భగవంతుడి దగ్గరకు వెళతాడు

అప్పుడు ఆ భగవంతుడు ఆ వ్యాపారిని ఇలా ప్రశ్నిస్తాడు

బాబు నువ్వు
ఎందుకు అందరిని పీడించి అందరిని ఇబ్బంది పెట్టి ఎవరి కోసం అంత డబ్బు సంపాదించావు అంటాడు

అప్పుడు ఆ వ్యాపారి నా తరువాత తరాల నా వారసుల కోసం అంటాడు

అప్పుడు భగవంతుడు ఇలా అంటాడు నువ్వు మంచి జ్ఞానాన్ని సంపాదించాలని మంచి ఆనంద కరమైన జీవితాన్ని జీవించాలని నేను నీకు ఎంతో విలువైన సమయాన్ని ,ఎంతో విలువైన శరీరాన్ని ఇచ్చి పంపితే నువ్వేమో
నువ్వు మనశ్శాంతి గా వుండక ఇతరులను మనశ్శాంతి గా వుంచక ఇలా చేసావు భాగుంది నీ నిర్వాకం

సరే నువ్వు ఎంతో కష్టపడి సంపాదించిన నీ సంపాదనను
అనుభవించే నీ వారసులను
చూస్తావ అంటాడు

దానికి ఆ వ్యాపారి సంతోషం తో సారే అంటాడు అప్పుడు భగవంతుడు ఆ వ్యాపారి యొక్క వారసులను చూపిస్తాడు

వారిని చూసిన ఆ వ్యాపారి తన అజ్ఞానానికి తానే
నవ్వు కుంటాడు.
ఎందుకంటే తను సంపాదన కోసం ఎవరినైతే పీడించి బాధ పెట్టాడో వారే తన వారసులుగా పుడుతున్నారు అని. అంటే మన శత్రువులు మన మీద పగ తీర్చుకోవాలి అంటే ఇదొక మార్గం. కావున ఈ సత్యం తెలుసుకొని మనందరం ఎలా మెలగాలో నిర్ణయించుకుందాం.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

Wednesday, February 23, 2022

నేటి మంచిమాట. నిజమైన భక్తి అంటే జ్ఞానం!

నేటి మంచిమాట.

భక్తి అంటే.. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, భజనలు, దేవుణ్ణి పొగడ్తలతో కీర్తించడాలు, అవినీతి సొమ్మును ధారాళంగా దేవుడికి ఖర్చు చేయడము,గుళ్ళు గోపురాలు నిర్మించడాలు, క్షుద్రపూజలు, పెద్ద పెద్ద విగ్రహాలు ఇంట్లొనో వీధిలోనో ప్రతిస్టించడాలు, వృధా ధనవ్యయము కాదు ..ఇదే భక్తి అని చాలమంది భావిస్తున్నారు.
వాస్తవానికి అది వారి కర్మానుసారము గుణాలతో కలిగిన ఇస్టమే కానీ అది భక్తి కాదు.

నిజమైన భక్తి అంటే జ్ఞానం!
నిత్యం ఆత్మను అధ్యయనం చేయడాన్నే దేవుడు నిజభక్తిగా భావిస్తాడు.
దేవుడి కోసం చేసే పూజలు, అర్భాటాలు బాహ్య ప్రపంచంలో
భక్తిప్రధర్షనగా నిలుస్తాయి కానీ. దేవుడి కోసం చేసేవు కావు. అవేవి దేవుడికి అవసరం లేదు. దేవుడికి కేవలం నీలోని ఆత్మను గుర్తించడమే కావాలి.
కానీ మనిషి మాత్రం అన్నీ వినీ, తెలుసుకొని ఇప్పటికీ ఆత్మను వదిలి
బయటే విగ్రహాలని పట్టుకొని, రారా కృష్ణా.. రారా రామా, లేదా రారా సాయీ..
ఇలా పాటలు, పద్యాలతో అదే భక్తి అనీ అపోహ పడి అజ్ఞానం వైపు వెళ్తున్నారు.
ఇదేది భక్తి కాదు. ఇది కేవలం నీ గుణములతో ఏర్పడిన ఇష్టం అదే మాయ,
అదే మనిషిని మతం వైపు నడిపిస్తుంది.
దాని కారణంగానే ఇప్పుడు పుట్టుకొచ్చిన మతాలు అన్నీ...
దేవుడు ఎప్పుడూ శూన్యం కాబట్టి ఆయన్ని రూప రహితుడిగానే భావించండి.
ఇక రూపం కేవలం జ్ఞానం తెలిపే సాధనం.
దాని ముందర కూర్చొని చెక్క భజనలు చేసేందుకు కాదు.
అనంతమైన దేవుణ్ణి చూస్తే నీలోనే చూడాలి. బయట కాదు.

నిజంగా భక్తి భావం గలవారు విగ్రహాలను, భక్తి ప్రధర్షనలకు దూరంగా ఉంటూ..
అంతర్గతమైన ఆత్మ ధ్యాసతో అసలైన దైవత్వాన్ని రోజూ ధర్షిస్తూ ఉంటారు.
కానీ భక్తిని ప్రధర్షించరు. అర్భాటాలు చేయరు.

బాహ్య ప్రపంచానికి కనిపించే భక్తులు భక్తి పేరుతో
బయట ప్రధర్షనలతో బిజీగా ఉంటూ,
బయటే దేవుణ్ణి వెతుకుతూ,చూస్తూ.. ఎప్పుడూ బయటే (ప్రపంచ గుణాల్లో) ఉండిపోతారు. వీరు కేవలం మనుషుల దృష్టిలో పరమ భక్తులు.
కానీ.. దేవుడి దృష్టికి మాత్రం పరమ మూర్ఖులు, సన్నాసులు.
- వారణాసి కృష్ణ కిరణ్

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

నేటి జీవిత సత్యం. క్రోధానికీ, కామానికీ బానిసలైతే కలిగే దుష్పరి ణామాలను తెల్పుతుంది ఈ కథ.

నేటి జీవిత సత్యం.

క్రోధానికీ, కామానికీ బానిసలైతే కలిగే దుష్పరి ణామాలను తెల్పుతుంది ఈ కథ. ఆడైనా మగైనా నోటిదురుసుతనం,అయిన దానికీ కానిదానికీ దుర్భాష లాడితే కలిగే ఫలితం ఏమిటో చదవండి.
ఔర్వుడు అనే మహర్షి కూతురు కందళి.ఆమె చాలా అందగత్తె,మంచి సుగుణాలు వున్నది.కానీ ఆమెకు నోటి దురుసుతనం యెక్కువ. ఆమె దుర్వాస మహర్షిని పెళ్లి చేసుకుంటానని తండ్రి తో చెబుతుంది. ఆయన చాలా కోపిష్టి అని తండ్రి వద్దని వారిస్తాడు. కానీ కందళి పట్టు బడుతుంది. సరే యని ఆమెని దూర్వాసును దగ్గరికి తీసుకెళ్ళి ఆమె గురించి వివరంగా చెప్పి ఆమె కోరిక గురించి చెప్తాడు. అన్నీ విన్న దూర్వాసుడు ఆమె అందానికి మోహితుడై ఆమెను వివాహం చేసుకోడానికి అంగీకరిస్తాడు.కాకపొతే కందళి యొక్క నూరు దుర్భాషలను క్షమిస్తానని ఆ పైన వూరుకోననీ ఒక నియమం పెడతాడు.తండ్రీ కూతుళ్ళు ఒప్పుకుంటారు.
ఆ పైన ఔర్వుడు వివాహం జరిపిస్తాడు.కొంత కాలం వారి దాంపత్యం సవ్యంగానే సాగుతుంది. ఆమె నోటి దురుసుతనం దూర్వాసుడికి కష్టం కలిగించినా యిచ్చిన మాటకు కట్టుబడి ఆమెని క్షమిస్తాడు.చివరకు ఆమెతో మాట్లాడకుండా వుండే పరిస్థితులు వస్తాయి. అలా కొంతకాలమయ్యాక ఆమె నూరు దుర్భాషలూ పూర్తవుతాయి.ఒక రోజు ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం లో వుండగా కందళి వచ్చి ఏమిటి నాతో
మాట్లాడరా? అని దబాయిస్తుంది.అప్పటికే ఆమె ప్రవర్తనతో విసిగి వున్న దుర్వాసుడు కళ్ళు తెరిచి ఆమెను తీక్షణం గా చూస్తాడు. ఆ చోపుకు కందళి నిలువెల్లా మాడిపోయి బూడిదవుతుంది.
.ఆమె ఆత్మ రూపం లో వచ్చి నిలబడి ఆయనను క్షమించమని వేడుకుంటుంది.
తర్వాత దుర్వాసుడు ఆమెను భస్మం చేసినందుకు బాధ పడుతూ వుండగా అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఒక స్త్రీ కోసం తన తపస్సు యొక్క శక్తిని దుర్విని యోగం చేసుకున్న దుర్వాసుడికి కర్తవ్య దీక్షను వివరిస్తాడు..
.
తన కోపానికి గురైన భార్య గుర్తుగా కంద ళీ
వృక్షాన్ని సృష్టిస్తాడు.కందళి క్రమేపీ కదళి గామారిన అరటికి .మానవుల పూజలలో, తాంబూలం లో యెంతో ప్రాధాన్యం వుండేట్టు అనుగ్రహిస్తాడు దుర్వాసుడు.అదీ మన అరటి కథ.
తపశ్శక్తి వున్న మహర్షి, యెంత అందం సుగుణాలు వున్నఆడైనా మగైనా దుర్భాష లాడితే కలిగే అనర్థాలను ఈ కథ మనకు తెల్పుతుంది యిప్పటి మన సమాజం లో విడాకులకు దారితీసేది కూడా ఈ కోపం,దుర్భాష లే. అందుకే అవి అదుపులో పెట్టుకోవాలని తెలుసుకోవాలి.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

చదువు

చదువు

"ఏంటి రా గోపి,బడికి వెళ్లకుండా గేదలు కాయటానికి వచ్చావ్"అని అడిగింది గేదలలో వెనకనున్న ఆవు .

"నాకు ఇక చదువు రాదని మానాన్న మరియు సర్ నిన్న ఓ నిర్ణయనికి వచ్చారు" బాధగా చెప్పాడు గోపి.

"చదువేముందిరా, నేను గడ్డి తిన్నంత సులువు" అంది ఆవు.

"అలనా ఎలా?" ఆశగా అడిగాడు గోపి. అప్పటికే పొలం వచ్చింది. "ముందు నన్ను కాస్త తినివ్వు తరువాత చదువు మర్మం చెపుతా "అని మేత లో మునిగి పోయింది ఆవు.

కాసేపు ఓపిక పట్టిన గోపి "ఎం చేస్తున్నావ్? నాకు ఎదో చెపుతానని నీవు తింటూ ఉన్నావ్" అని అడిగాడు. నేను ఏకాగ్రతగా ఆంత్ర గ్రహణం చేస్తున్నా.... కదిలించకు అంది ఆవు.

అదేమిటి కొత్త గా ఉంది అని గోపి అనగా "ఆహారాన్ని లోపలకు తీసుకోవడాన్ని ఆంత్ర గ్రహణం అంటారు.అంటే క్లాస్ లో టీచర్ పాఠం చెప్పేటప్పుడు వినటం లాంటిది. ఇక్కడ శ్రద్ధ అవసరం. అర్ధమైన కాకున్నా ముందు ఆలకించాలి. ఇది చదువు మొక్క మొదటి లక్షణం.

ముందు నన్ను సరిపడినంత తిననివ్వు. మిగిలినది తరువాత చెపుతా" అంటూ తినటం కొనసాగించింది.
గోపి పరికించి

తినటం లో ఉన్న శ్రద్ధ వినటం లో ఉండాలన్నమాట " అనుకున్నాడు.

కాసేపు గడిచాక ఆవు , గోపి ఇద్దరూ చెట్టు కిందకు చేరారు. "అదేంటి ఒట్టిగా నోరు చప్పరిస్తూ నములుతున్నావ్" వింత గా అడిగాడు గోపి. దానికి ఆవు నవ్వుతూ ..... దీనిని నెమరు వేయటం అంటారు. ఇందాక గబ గబ తిన్న ఆహారాన్ని తీరుబడిగా నోటిలోకి తెచ్చుకొని నమలటం. ఇది చాలా ముఖ్యం.

"ఎందుకలా" అడిగాడు గోపి. సర్ చెపుతున్న చాలా విషయాలు అప్పటికి బాగుంటాయి.కానీ కాసేపటికి మర్చిపోతాం. అందుకే ఇంటికి వచ్చాక తీరుబడి గా నెమరు వేసుకోవాలి. ఎవరికైతే నేమరు వేసే అలవాటు ఉంటుందో వారికి చదువు బాగా జీర్ణమౌతుంది.

నిజానికి చదువు లోని మర్మం ఇదే.
అని రహస్యంగా చెప్పింది ఆవు.

గోపీకి తన పొరపాటు ఇప్పుడు అర్ధమైంది. తాను ఏనాడు ఇంటికొచ్చి పుస్తకం ముట్టింది లేదు.

సాయంత్రమయ్యింది. గేదలు ఇంటికి మల్లాయి. గోపి చూపు అంతా ఆవు మీదనే ఉంది. అది ఉదయం కన్నా హుషారుగా ఆనందగా ఉంది. ఏంటి విషయమని గోపి అడిగాడు.

దీనిని స్వాంగీకరణ అంటారు. జీరమైన ఆహారం రక్తంలో చేరి మనకు శక్తిని హుషారు ను ఇస్తుంది. జీర్ణం సరిగా జరిగితేనే ఈ ఆనందం అనుభవించగలం.

అంటే చదువు నీకు అర్థమై ఒంటపట్టటం. అది తెలిస్తే చదువు రుచికరంగా ఉంటుంది. నీకు ఒక పేరును గుర్తిపును తెస్తుంది. నీ ముఖం లో ఓ వెలుగు, నీ పేరుకు ఓ మెరుపు వస్తాయి అంది ఆవు.

గోపి గుండె పట్టుదలతో కొట్టుకోగా రక్తం వేగంగా పంతం గా పరిగెత్తింది.

అంతేనా ఇంకేమైనా ఉందా? ఆలోచన గా అడిగాడు గోపి.

ఇంకో విషయం ఉంది. పేడ తట్ట తీసుకొని రా చెపుతా అంది అవు. గోపీకి విషయం అర్థమై తట్ట తెచ్చి పేడ పట్టి పక్కన పెట్టి చెప్పు అన్నాడు.

చదువు లో చివరి విషయం మల విసర్జన . అంటే పనికి మాలిన పనులు వదిలేయడం. కబుర్లు.... సెల్ ఫోన్ , tv లు ముచ్చట్లు .... వీటిని విసర్జించాలి.

అప్పుడు నీకు జీర్ణం చేసుకోవటానికి మరింత సమయం దొరుకుద్ది. అని నవ్వుతూ చెప్పి ముగించింది ఆవు.
ఆవు కు మేత పెట్టి గోపి ఇంటికెళ్లాడు.

నెల గడిచింది. గోపికి SA 2 ప్రోగ్రెస్ కార్డు ఇస్తూ .... సర్ ఆశ్చర్య ముగా మెచ్చుకోలుగా చూసాడు.

ఈ సారి గోపి ఇంటి కెళ్లకుండా నేరుగా ఆవుల కొష్టం వద్దకు బయలు దేరాడు. "ఆ " రోజు సాయంత్రం ఆవు నడిచిన నడక లోని శక్తి గోపి అడుగులలో ఈ రోజు కనిపిస్తుంది.

సేకరణ

భగవద్గీతలో ఒక ప్రసిద్ధ శ్లోకము

ఇది భగవద్గీతలో ఒక ప్రసిద్ధ శ్లోకము, ఇది ఎంతగా ప్రజాదరణ పొందిందంటే భారత దేశం లోని చాల మంది స్కూలు పిల్లలకి కూడా ఇది తెలుసు. ఇది కర్మ సిద్ధాంతం గురించి లోతైన అవగాహన కల్పిస్తుంది. కర్మ యోగ విషయం ఎప్పుడు చర్చించబడినా ఈ శ్లోకం ప్రస్తావించబడుతుంది. ఈ శ్లోకం కర్మ సిద్ధాంతం గురించి నాలుగు సూచనలను చెప్తున్నది..

1. నీ కర్తవ్యం చేయుము కానీ ఫలితాల గురించి పట్టించుకోకు.

2. వచ్చిన కర్మ ఫలములు నీ యొక్క ఆనందం కోసం కాదు.

3. పని చేసేటప్పుడు కూడా కర్తుత్వభావన (నేనే చేస్తున్నాను అన్న భావన) విడిచిపెట్టు.

4. కర్మలను మానివేయుటలో ఆసక్తి ఉండరాదు.
నీ ధర్మ నీవు చేయుము కానీ ఫలితాల గురించి విచారించకు.

మనకు మన కర్తవ్యాన్ని చేసే హక్కు ఉంది కానీ ఫలితాలు మన ఒక్కరి ప్రయత్నము మీదనే ఆధారపడి ఉండవు. చాలా కారణాలు ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి - మన పరిశ్రమ, మన ప్రారబ్ధం (గత కర్మలు), భగవంతుని సంకల్పము, ఇతరుల పరిశ్రమ, సంబంధిత అందరి ప్రారబ్ధం, దేశ కాల పరిస్థితులు (అదృష్టము) మొదలగునవి. ఇప్పుడు మనం ఫలితాల గురించి ఆరాట పడితే అవి మనకు అనుకూలంగా లేనప్పుడల్లా ఆందోళన పడాల్సి వస్తుంది. కాబట్టి ఫలితముల గురించి ఆందోళనని విడిచి పెట్టి, చేయవలసిన పని మీదనే శ్రద్ధ చూపమని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. నిజానికి ఫలితాల గురించి పట్టించుకోనప్పుడే, మన పరిశ్రమ మీద పూర్తి శ్రద్ధ పెట్టగలుగుతాము, దీనితో ఇంతకు పూర్వం కన్నా మంచి ఫలితాలు వస్తాయి.

🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🚩

సేకరణ

మౌనంగానే ఎదగాలి

మౌనంగానే ఎదగాలి

వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది.

అయిదు శాంతులలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు. ‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత. ‘మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’ అన్నారు స్వామి వివేకానంద. 

మౌనం మూడు రకాలు. ఒకటి, వాక్‌మౌనం. వాక్కును నిరోధించడమే వాక్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి. రెండోది అక్షమౌనం. అంటే ఇంద్రియాలను నిగ్రహించడం. మూడోది కాష్ఠమౌనం. దీనినే మానసిక మౌనం అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది. దాన్నీ అరికట్టినప్పుడే కాష్ఠమౌనం సాధ్యపడుతుంది.

మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, అంతర సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటివారిలో  పరివర్తన  తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకు శాంతి లభిస్తుంది. సమయం సద్వినియోగమవుతుంది. పతంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో మౌనానికి ప్రాధాన్యమిచ్చారు. మౌనాన్ని అవలంబించిన మహాత్ముల్లో రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ వంటి వారెందరో ఉన్నారు.

ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగానూ మౌనం పాటించనిదే ధ్యానం చేయడం అసాధ్యం. నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు.

రోజూ అరగంట మౌనంగా ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ,  టీవీ కార్యక్రమాలు చూస్తూ, కంప్యూటర్‌ ముందు కూర్చుని అంతర్జాలం చూడటం కాదు. కళ్లు మూసుకుని మాటను, మనసును మౌనంలోకి జార్చేస్తే మనసు తేలిగ్గా ఉంటుంది. ఎంతో మంది అనుభవపూర్వకంగా చెబుతున్న విలువైన మాట ఇది.

ఆచి తూచి మాట్లాడటం చేతకానితనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును అది తెలియజేస్తుంది. ‘చేజారిన కాలం, పెదవి దాటిన పలుకు’ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి.

ప్రతి రోజూ ఎన్నో రకాల ఆలోచనలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మన మాటలపై, చేతలపై పడుతుంది. అవి ఓ చక్రం తిరిగినట్టు తిరుగుతాయి. ఆ చక్రాన్ని ఆపే శక్తే ‘మౌనం’.

ఏ సాధన అయినా మౌనం వల్లనే సాధ్యమవుతుంది. భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైన సాధనం మౌనమే. మనందరం మౌనంగానే ఎదుగుదాం!

సేకరణ

సాధన ఎలా ఉండాలి?

🍁 సాధన ఎలా ఉండాలి? 🍁
➖➖➖
✍️ మురళీ మోహన్

🤘సాధనలో .. అహం పెరగకుండా వినయం పెరగడం ఉత్తీర్ణతకు గుర్తు !!

గురువు సత్యాన్ని గుర్తు చేస్తాడు. సద్గురువు సత్యాన్ని గుర్తుపట్టేలా, గుర్తుండేలా.. చూస్తాడు.

మనలో భక్తీ, సాధన పెరుగుతుందంటే ‘శాంతి, వినయం’ పెరగాలి. మనం సత్యానికి దగ్గరవుతున్నాం అనటానికి అదే గుర్తు.

భౌతిక జీవనంలో డబ్బు, కీర్తి, పాండిత్యం పెరిగితే సాధారణంగా అహంకారం పెరుగుతుంది. అవి పెరిగినా అహం పెరగకపోవడమే ఉత్తమ జీవనం అవుతుంది.

ఆధ్యాత్మిక మార్గంలో కూడా సాధన పెరిగే కొద్ది సిద్ధులు, శక్తులు, సంకల్ప బలం పెరిగి అహం పెరుగుతుంది.

సాధన పెరిగేకొద్దీ అహం పెరగకుండా శాంతి మరియు వినయం పెరగడం ఉత్తీర్ణతకు గుర్తు

దైవసంకల్పం లేకుండా ఒక గడ్డిపోచ అయినా కదలదు. ఒక జీవుడికి మంచిరోజులు వచ్చినపుడు అతడి ఆలోచనలు అతణ్ణి ప్రార్థనకు పురికొల్పుతాయి. అదే చెడ్డ రోజులు దాపురించినపుడు అతని ఆలోచనలన్నీ చెడుదారిన పడతాయి.

గొంగళి పురుగు అని అసహ్యించు కున్నవారు సీతాకోకచిలుకలా మారిన తరువాత వర్ణించడానికి మాటలు వెతుకుతుంటారు.....

మనిషి జీవితం కూడా అంతే... కష్టపడుతున్నప్పుడు రాని ఎవరూ... నువ్వు సుఖపడుతున్నప్పుడు వెతుక్కొని మరీ వస్తారు.

మనం చేసే ప్రతి పనిని ధర్మం కనిపెడుతూనే ఉంటుంది.
అన్నీ దేవుడు చూస్తూనే ఉంటాడు.
అంతరాత్మ పరిశీలిస్తూనే ఉంటుంది.
ఇక పగలు..రాత్రి.. సూర్యుడు.. చంద్రుడు ఉండనే ఉన్నాయి......
ఇన్నిటి ఎదుట మనం ఏదైనా
తప్పు చేస్తున్నామంటే.....
అది ఆత్మవంచనే అవుతుంది.....!!

నీ విజయాలను నీకన్నా చిన్నవారితో పంచుకో..! స్ఫూర్తితో వారు నిన్ను అనుసరిస్తారు.

నీ ఓటములను నీకన్నా పెద్దవారితో పంచుకో! అనుభవంతో వారు నీకు బోధిస్తారు.

ఎకరా ఎకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి స్మశానం నవ్వింది..... ‘నిన్ను కొనబోయేది నేనేనని..!.’ నీకు ఇవ్వబోయేది ఆరడుగులేనని..!"

ఆశ ఉన్నవారు....ఆనందంలో మాత్రమే బ్రతకగలరు!

ఆశయం ఉన్నవారు... బాధలో కూడా ఆనందంగా బ్రతకగలరు!

తెలివికి నిదర్శనం తప్పులు వెదకడం కాదు! పరిష్కారాలను సూచించ గలగడం....!

వీలైతే నలుగురు కి సాయం చేయి!
గొప్పలు చెప్పకు ,
ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకు
నిజాలు మాట్లాడు ,
అబద్ధాలతో అందమైన జీవితం ఊహించుకోకు.
ఇంకొకరి తో పోల్చుకొని, మనశ్శాంతి కోల్పోకు✍️

🌷🙏🌷

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సేకరణ

Tuesday, February 22, 2022

మంచి మాటలు

ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు... 💐🌹శ్రీ రామభక్త వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు... వల్లి దేవసేన సమేత తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవింకగాలని కోరుకుంటూ
22-02-2022 మంగళవారం
ఈ రోజు తేదీ ఎటు పక్క నుండి చుసిన 22/0/22/0/22
జీవితంలో డబ్బులు ఎంతైనా సంపాదించవచ్చు.. ఏమైనా కొనవచ్చు... కాని డబ్బుతో కొనలేనివి అంటూ కొన్ని ఉన్నాయి..జీవితంలో వాటిని ఎప్పుడు కోల్పోకండి... అవే.. కాలం.. సంతోషం.. ప్రేమ.. కలలు.. ఆరోగ్యం.. నమ్మకం..స్నేహితులు..

ఎవరైనా ఏదైనా సహాయం చేస్తారని ఎదురుచూడకండి.. నమ్మకం పెట్టుకోకండి ఎందుకంటే ఎవరి సమస్యలు వారివి ఎవరి స్వార్థం వారిది.. మిమ్మల్ని మిరే నమ్ముకోండి.. సగం సమస్యలు అవే పరిష్కారం అవుతాయి 👍

బుద్ది ఇంద్రధనస్సు లోని రంగుల్లా అందంగా ఉండాలి కాని ఊసరవెల్లిలా సందర్బనికి తగినట్లు రంగు మారుస్తూ ఉండకూడదు.. ఎదో ఒకరోజు అసలు రంగు బయటపడుతుంది.. అప్పుడు జీవితంలో ఏ రంగు లేకుండా పోతుంది 😄
సేకరణ ✒️AVB సుబ్బారావు 💐🌹🤝

సేకరణ

️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో కేవలం ప్రేమను ఇవ్వడం లేదా తీసుకోవడం కాకుండా, మనమే ప్రేమగా ఎలా మారగలం?

✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో


కేవలం ప్రేమను ఇవ్వడం లేదా తీసుకోవడం కాకుండా, మనమే ప్రేమగా ఎలా మారగలం?

మాతృ భిక్ష

ఇది దాదాపు 175 ఏళ్ల క్రితం భారతదేశంలో జరిగిన యధార్థ సంఘటన. వెనుకబడిన కులానికి చెందిన ధని అనే ఒక స్త్రీ ఉండేది, ఆమె చాలా దయగలది. ఆమె గ్రామ కమ్మరి భార్య, బిడ్డ పుట్టినప్పుడు సహాయపడే ఒక మంత్రసానిగా పనిచేసేది.

ఆ రోజుల్లో, ఒకసారి ఒక బ్రాహ్మణుని ఇంట్లో బిడ్డ పుట్టాడు. ఈ బిడ్డ పుట్టడంతో, కమర్పుకూరు ఊరి వాతావరణంలో ఒక మార్పు వచ్చినట్లుగా అయ్యింది - అంతటా పక్షుల కిలకిలరావాలు వినిపించాయి, పువ్వులు వికసించాయి, ఊళ్ళో చెట్లకు కొత్త ఆకులు రావడం మొదలైంది. ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రశాంతపరిచే విధంగా వాతావరణం మారింది. ఆ బిడ్డ పుట్టుక ఆనందాన్ని తీసుకొచ్చింది, కుటుంబం మొత్తానికి ఇంకా ఎక్కువ సంతోషాన్ని తెచ్చింది.

ధని అక్కడ మంత్రసానిగా, సంరక్షకురాలిగా పని చేయడం ప్రారంభించి, ఆ బిడ్డను చూసుకునేది. కాలక్రమేణా, ఆమెకు ఆ శిశువుతో ఒక అనుబంధం ఏర్పడింది. ధని ఆ చిన్నారిని ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునేది. ఆ పిల్లవాడు కూడా ఆవిడతో ఒక భిన్నమైన, మాతృ సంబంధాన్ని పెంచుకున్నాడు. ధనీకి ఆ బిడ్డతో చెప్పలేని ఒక భావోద్వేగ బంధం ఏర్పడింది.

చూస్తూండగా ఆ అబ్బాయికి 9 ఏళ్లు వచ్చాయి. ఒకరోజు మంత్రసాని ఆ బ్రాహ్మణ బాలుడితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం కనిపించింది. ఒక తల్లి ఏదో బాధ్యతను కోరుతున్నట్లుగా, పిల్లవాడు ఆమెకు వాగ్దానం చేస్తున్నట్లుగా కనిపించింది. తర్వాత ఆ మంత్రసాని చెమ్మగిలినకళ్లతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.

9 సంవత్సరాల తరువాత, ఆ బాలుడి కుటుంబ సభ్యులు అతనికి ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఆ కుర్రవాడి అన్నగారు ఆ ఆచారం, దాని ప్రవర్తనా నియమావళి యొక్క అంతర్భావాల గురించి అతనికి సూచనలు ఇస్తున్నాడు.

"మాతృ భిక్ష (తల్లి నుండి భిక్ష)" అనేది ఉపనయనంలో ఒక ముఖ్యమైన ముగింపు కార్యం. (మగ శిశువుకు ఒక నిర్దిష్ట వయస్సు వచ్చినప్పుడు, అతనికి పవిత్రమైన దారాన్ని [ యజ్ఞోపవీతాన్ని శరీరంపై వికర్ణంగా] ధరింపజేయడం బ్రాహ్మణులలో ఒక ముఖ్య ఆచారం. గాయత్రి మంత్రం కూడా అతనికి చెప్పబడుతుంది.
ఈ వేడుక బాలుడి జీవితంలో అత్యంత ముఖ్యమైన సందర్భాలలో ఒకటి, ఎందుకంటే ఈ వేడుక తర్వాత మాత్రమే బాలుడు సంపూర్ణ బ్రాహ్మణుడు అవుతాడని ఒక నమ్మకం.) ఈ సమయంలో, బాలుడు తన తల్లి నుండి మొదటి భిక్ష (ఒక పాత్రతో అన్నం, పండ్లు) అందుకుంటాడు. తల్లే అతనికి మొదటి ఆశీర్వాదం ఇస్తుంది. ఇది ప్రతి తల్లికీ చాలా గర్వకారణమైన విషయం.

అన్నయ్య ఈ ఆచారం గురించి చెబుతుంటే, ఆ పిల్లవాడు ఇలా అన్నాడు: "నేను ధనిఅమ్మ నుండి మొదటి భిక్ష తీసుకుంటాను, అలా నేను ఆమెకు వాగ్దానం చేసాను."

వారిది సనాతన కుటుంబం అయినందున, అన్నయ్య భయపడుతూ ఇలా అన్నాడు: "అది చాలా అసాధారణమైనది, ఆ మంత్రసాని ధని అమ్మ వద్దనుండి మొదటి భిక్ష తీసుకుంటే, గ్రామ పండితుల మధ్య మన గౌరవం పోతుంది."

ఆ అమాయకపు పిల్లవాడు వెంటనే ఇలా బదులిచ్చాడు "సోదరా, ఈ వేడుకలో ధనిఅమ్మకి నా తల్లిగా హక్కు ఇస్తానని నేను వాగ్దానం చేసాను, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే, నేను ఈ పవిత్ర యజ్ఞోపవీతానికి అర్హుడిని కాదు."
అన్నగారు ఈ మాటలు నమ్మలేకపోయాడు.

త్వరలోనే, ఆ పవిత్రమైన రోజు వచ్చింది.

మంత్రోచ్ఛారణలు, శ్రావ్యమైన సన్నాయి వాయిద్యాల మధ్య వేడుక చక్కగా ప్రారంభమైంది. కుటుంబ సభ్యులందరూ, చుట్టుపక్కల వారందరూ చాలా ఉత్సాహంగా ఆ వేడుకలో పాల్గొనడం ప్రారంభించారు. ఈ సంబరాల్లో, వేడుక హడావిడిలో, ఇంతకుముందు వారిరువురికీ జరిగిన చర్చను తమ్ముడు మరిచిపోయాడేమో అని అన్నగారు అనుకున్నాడు.
మరి కొద్దిసేపట్లో " మాతృ భిక్ష" ఆచార కార్యక్రమం ప్రారంభంకానుంది. కుర్రవాడి తల్లి, ఇతర స్త్రీలు అందరూ 'భిక్ష' ఇవ్వడానికి సిద్ధం అయ్యారు.

కానీ, భిక్ష ఇవ్వడానికి కొంత బియ్యం, పండ్లతో దూరంగా ఒక మూల నిలబడి ఉన్న ధనిఅమ్మ వైపు ఆ కుర్రవాడు చేతిలో బిక్ష సంచితో నడుస్తూ వెళ్లగా, అక్కడి వారందరూ అలా చూస్తూ ఉండిపోయారు.

బ్రాహ్మణ పండితులందరూ చూస్తూండగా, స్త్రీలందరూ నిర్ఘాంతపోయి నిలబడిపోగా, సమాజంలో అంటరానితనం తారాస్థాయిలో ఉన్న సమయంలో, ఆ అమాయక బాలుడు, తాను ధనిఅమ్మకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లుగా, ఆమె ముందు వంగి, ఒక వెనుకబడిన కులానికి చెందిన స్త్రీ అయిన ధని నుండి మొదటి "మాతృ భిక్ష"ను అందుకున్నాడు!
కళ్ళలో నీళ్లతో, హృదయంలో మాతృప్రేమ ఉప్పొంగుతూండగా, ధని ఆ బిడ్డకు తన ఆశీస్సులు ఇచ్చింది. ఆ నిరుపేద తల్లికి, ఆమె జీవితంలో ఉన్న కోరిక ఇదొక్కటే.

ఈ వేడుకలో అటువంటి సంఘటన జరిగినప్పుడు, దాని గురించి పెద్ద రభస, అలజడి జరుగుతుందని అందరూ ఊహించారు, కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆ వేడుకకు సంబంధించిన ప్రధాన పండితుడు మాత్రం ఆ పిల్లవాడి, "సత్య వాక్య పరిపాలనం" గురించి ప్రశంసించి, హృదయపూర్వకంగా ఆశీర్వదించారు.

ఈ చిరస్మరణీయమైన నిశ్శబ్ద విప్లవం పశ్చిమ బెంగాల్లోని ఒక చిన్న గ్రామంలో జరిగింది, ఈ నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకువచ్చిన బాలుడు "గదాధర్ ఛటోపాధ్యాయ", అతనే తరువాత రామకృష్ణ పరమహంసగా ప్రాచుర్యం పొందాడు.

ఈ అన్యోన్యమైన ప్రేమ, ఆప్యాయతల బీజం ఒక పేద స్త్రీ యొక్క మాతృ ప్రేమ నుండి అతనిలో ఉద్భవించింది ఉండచ్చు. బహుశా అదే రామకృష్ణ పరమహంస యొక్క ఔన్నత్యానికి పునాది వేసి ఉంటుంది.
తరువాతి సమయంలో స్వామి వివేకానంద ఆయన ప్రధాన శిష్యుడు అయ్యాడు.

మనలో నిజమైన ప్రేమ పెంపొందితే, అందరూ సమానంగా కనిపిస్తారు. ప్రేమ అంతిమ లక్ష్యానికి మార్గాన్ని సులభతరం చేస్తుంది, ఎందుకంటే ప్రేమ ఒక అత్యుత్తమమైన శక్తి.

ప్రేమను పెంపొందించుకోవడానికి ఏకైక మార్గం నిరంతర స్మరణ.

♾️

మీరు ప్రేమతో మాత్రమే హృదయాలను గెలుచుకోగలరు. దానికి ఇంకో మార్గం లేదు. 🌼
లాలాజీ మహారాజ్


హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌

అనువాదబృందం ఆంధ్రప్రదేశ్

సేకరణ

వయస్సు దాటుతున్న వేళ

🙏 వయస్సు దాటుతున్న వేళ🙏🙏👌👏👏

1. ఈ సమయం ఇన్నాళ్ళూ సంపాదించినదీ, దాచుకున్నదీ తీసి ఖర్చు పెట్టె వయసు.తీసి ఖర్చు పెట్టి జీవితాన్ని ఎంజాయ్ చెయ్యండి.

దాన్ని ఇంకా దాచి అలా దాచడానికి మీరు పడిన కష్టాన్ని, కోల్పోయిన ఆనందాలనూ మెచ్చుకునేవారు ఎవరూ ఉండరు అనేది గుర్తు పెట్టుకోండి

2. మీ కొడుకులూ, కోడళ్ళూ మీరు దాచిన సొమ్ముకోసం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో? ఈ వయసులో ఇంకా సంపాదించి సమస్యలనూ, ఆందోళనలూ కొని తెచ్చుకోవడం అవుసరమా?
ప్రశాంతంగా ఉన్నది అనుభవిస్తూ జీవితం గడిపితే చాలదా?

3. మీ పిల్లల సంపాదనలూ, వాళ్ళ పిల్లల సంపాదనల గురించిన చింత మీకు ఏల? వాళ్ళ గురించి మీరు ఎంత వరకూ చెయ్యాలో అంతా చేశారుగా? వాళ్లకి చదువు, ఆహారం, నీడ మీకు తోచిన సహాయం ఇచ్చారు. ఇపుడు వాళ్ళు వాళ్ళ కాళ్ళమీద నిలబడ్డారు.ఇంకా వాళ్ళకోసం మీ ఆలోచనలు మానుకోండి. వాళ్ళ గొడవలు వాళ్ళను పడనివ్వండి.

4. ఆరోగ్యవంతమైన జీవితం గడపండి. అందుకోసం అధిక శ్రమ పడకండి. తగిన మోతాదులో వ్యాయామం చెయ్యండి. (నడక, యోగా వంటివి ఎంచుకోండి) తృప్తిగా తినండి. హాయిగా నిద్రపోండి. అనారోగ్య పాలుకావడం ఈ వయసులో చాలా సులభం, ఆరోగ్యం నిలబెట్టుకోవడం కష్టం. అందుకే మీ ఆరోగ్య పరిస్థితిని గమనించుకుంటూ ఉండండి. మీ వైద్య అవుసరాలూ, ఆరోగ్య అవుసరాలూ చూసుకుంటూ ఉండండి. మీ డాక్టర్ తో టచ్ లో ఉండండి. అవుసరం అయిన పరీక్షలు చేయించుకుంటూ ఉండండి. (ఆరోగ్యం బాగుంది అని టెస్ట్ లు మానేయకండి)

5. మీ భాగస్వామికోసం ఖరీదైన వస్తువులు కొంటూ ఉండండి. మీ సొమ్ము మీ భాగస్వామితో కాక ఇంకెవరితో అనుభవిస్తారు? గుర్తుంచుకోండి ఒకరోజు మీలో ఎవరో ఒకరు రెండో వారిని వదిలిపెట్టవలసి వస్తుంది. మీ డబ్బు అప్పుడు మీకు ఎటువంటి ఆనందాన్నీ ఇవ్వదు. ఇద్దరూ కలిసి అనుభవించండి.

6. చిన్న చిన్న విషయాలకు ఆందోళన పడకండి. ఇప్పటివరకూ జీవితం లో ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొన్నారు. ఎన్నో ఆనందాలూ, ఎన్నో విషాదాలూ చవి చూశారు. అవి అన్నీ గతం.
మీ గత అనుభవాలు మిమ్మల్ని వెనక్కులాగేలా తలచుకుంటూ ఉండకండి, మీ భవిష్యత్తును భయంకరంగా ఊహిచుకోకండి. ఆ రెండిటివలన మీ ప్రస్తుత స్థితిని నరకప్రాయం చేసుకోకండి. ఈరోజు నేను ఆనందంగా ఉంటాను అనే అభిప్రాయంతో గడపండి. చిన్నసమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి .

7. మీ వయసు అయిపొయింది అనుకోకండి. మీ జీవిత భాగస్వామిని ఈ వయసులో ప్రేమిస్తూనే ఉండండి. జీవితాన్ని ప్రేమిస్తూనే ఉండండి. కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉండండి. మీ పొరుగువారిని ప్రేమిస్తూ ఉండండి.

"జీవితంలో ప్రేమ, అభిమానం, తెలివితేటలూ ఉన్నన్ని నాళ్ళూ మీరు ముసలివారు అనుకోకండి. నేను ఏమిచెయ్యగలనూ అని ఆలోచించండి. నేను ఏమీ చెయ్యలేను అనుకోకండి"

8. ఆత్మాభిమానం తో ఉండండి (మనసులోనూ బయటా కూడా) హెయిర్ కట్టింగ్ ఎందుకులే అనుకోకండి. గోళ్ళు పెరగనియ్యిలే అనుకోకండి. చర్మసౌందర్యం మీద శ్రద్ధ పెట్టండి. పళ్ళు కట్టించుకోండి. ఇంట్లో పెర్ఫ్యూమ్ లూ, సెంట్లూ ఉంచుకోండి. బాహ్య సౌందర్యం మీలో అంతః సౌందర్యం పెంచుతుంది అనే విషయం మరువకండి. మీరు శక్తివంతులే!

9. మీకు మాత్రమె ప్రత్యేకం అయిన ఒక స్టైల్స్ ఏర్పరచుకోండి. వయసుకు తగ్గ దుస్తులు చక్కటివి ఎంచుకోండి. మీకు మాత్రమె ప్రత్యేకం అయినట్టుగా మీ అలంకరణ ఉండాలి. మీరు ప్రత్యేకంగా హుందాగా ఉండాలి.

10. ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉండండి. న్యూస్ పేపర్లు చదవండి. న్యూస్ చూడండి. పేస్ బుక్ , వాట్సాప్ లలో ఉండండి. మీ పాత స్నేహాలు మీకు దొరకవచ్చు.

11. యువతరం ఆలోచనలను గౌరవించండి.
మీ ఆదర్శాలూ వారి ఆదర్శాలూ వేరు వేరు కావచ్చు. అంతమాత్రాన వారిని విమర్శించకండి .

సలహాలు ఇవ్వండి, అడ్డుకోకండి. మీ అనుభవాలు వారికి ఉపయోగించేలా మీ సూచనలు ఇస్తే చాలు. వారు వారికి నచ్చితే తీసుకుంటారు. దేశాన్ని నడిపించేది వారే!

12. మా రోజుల్లో ... అంటూ అనకండి. మీరోజులు ఇవ్వే!
మీరు బ్రతికి ఉన్నన్ని రోజులూ " ఈరోజు నాదే" అనుకోండి

అప్పటికాలం స్వర్ణమయం అంటూ ఆరోజుల్లో బ్రతకకండి.
తోటివారితో కఠినంగా ఉండకండి.

జీవితకాలం చాలా తక్కువ. పక్కవారితో కఠినంగా ఉండి మీరు సాధించేది ఏమిటి? పాజిటివ్ దృక్పధం, సంతోషాన్ని పంచే స్నేహితులతో ఉండండి. దానివలన మీ జీవితం సంతోషదాయకం అవుతుంది. కఠిన మనస్కులతో ఉంటె మీరూ కఠినాత్ములుగా మారిపోతారు. అది మీకు ఆనందాన్ని ఇవ్వదు. మీరు త్వరగా ముసలివారు అవుతారు.

13. మీకు ఆర్ధికశక్తి ఉంటె, ఆరోగ్యం ఉంటె మీ పిల్లలతో మనుమలతో కలిసి ఉండకండి. కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం మంచిది అని అనిపించవచ్చు. కానీ అది వారి ప్రైవసీకి మీ ప్రైవసీకి కూడా అవరోధం అవుతుంది.వారి జీవితాలు వారివి.
మీ జీవితం మీది. వారికి అవుసరం అయినా, మీకు అవుసరం అయినా తప్పక పిల్లలతో కలిసి ఉండండి.

14. మీ హాబీలను వదులుకోకండి. ఉద్యోగజీవితం లో అంత ఖాళీ లేదు అనుకుంటే ఇప్పుడు చేసుకోండి.
తీర్థ యాత్రలు చెయ్యడం, పుస్తకపఠనం, డాన్స్, పిల్లినో, కుక్కనో పెంచడం, తోట పెంపకం, పెయింటింగ్ ... రచనా వ్యాసంగం ... ఏదో ఒకటి ఎంచుకోండి.

15. ఇంటిబయటకు వెళ్ళడం అలవాటు చేసుకోండి. కొత్త పరిచయాలు పెంచుకోండి. పార్కుకి వెళ్లండి, గుడికి వెళ్ళండి, ఏదైనా సభలకు వెళ్ళండి. ఇంటిబయట గడపడం కూడా మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

16. మర్యాదగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. పిర్యాదులు చెయ్యకండి. లోపాలను ఎత్తిచూపడం అలవాటు చేసుకోకండి. విమర్శించకండి. పరిస్థితులను అర్ధం చేసుకుని ప్రవర్తించండి. సున్నితంగా సమస్యలను చెప్పడం అలవాటు చేసుకోండి.

17. వృద్ధాప్యం లో బాధలూ, సంతోషాలూ కలిసి మెలసి ఉంటాయి. బాధలను తవ్వి తీసుకుంటూ ఉండకండి. అన్నీ జీవితంలో భాగాలే

18. మిమ్మల్ని బాధపెట్టిన వారిని క్షమించండి

మీరు బాధపెట్టిన వారిని క్షమాపణ కోరండి

మీ తోపాటు అసంతృప్తిని వెంటబెట్టుకోకండి.

అది మిమ్మల్ని విచారకరం గానూ,
కఠినం గానూ మారుస్తుంది
ఎవరు రైటు అన్నది ఆలోచించకండి.

19. ఒకరిపై పగ పెట్టుకోవద్దు
క్షమించు, మర్చిపో, జీవితం సాగించు.

20. నవ్వండి నవ్వించండి. బాధలపై నవ్వండి
ఎందరికన్నానో మీరు అదృష్టవంతులు.
దీర్ఘకాలం హాయిగా జీవించండి.

ఈ వయసు వరకు కొందరు రాలేరు అని గుర్తించండి.
మీరు పూర్ణ ఆయుర్దాయం పొందినందుకు ఆనందించండి.
🙏🙏
శుభోదయం

సేకరణ

మళ్ళీ మళ్ళీ లేనిచోటే మన ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాం.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🍎🥭🍍శుభోదయం 🍍🥭🍎
💐💐💐💐💐💐💐💐💐💐💐

జీవితం ఒక సినిమాలాంటిదే. నిజం కాదు. ఉన్నది భగవంతుడు ఒక్కడే.నేను, నా ఎదురుగా ఉన్నవాడూ, వాడికి సమస్యను సృష్టించిన వాడూ అందరూ ఆ భగవంతుని రూపాలే'— అనే జ్ఞానం సదా నిలిచి ఉంటుంది. మనం కూడా అటువంటి జ్ఞానాన్ని పొందేవరకు ఈ భ్రాంతులు తప్పవు.

మనం సినిమాకి వెళ్ళినప్పుడు అందులోని నవరసాలను మన జీవితంలోనే జరుగుతున్నట్లుగా తాదాత్మ్యం చెంది అనుభవిస్తూనే ఉంటాం కానీ అంతర్లీనంగా
'ఇది కేవలం సినిమా మాత్రమే. నిజం కాదు.' అనే జ్ఞానం మనకు సదా ఉంటుంది. అందుకే సినిమాలో బాంబు పేలితే మనం అక్కడినుంచి లేచి పారిపోము, హత్య జరిగితే పోలీసులకి ఫోన్ చెయ్యము. మహాత్ములకి నిజ జీవితంలో కూడా నిరంతరం ఈ జ్ఞానం ఆరూఢమై ఉంటుంది.

ఒకసారి ఇద్దరు మిత్రులు సినిమాకు వెళ్లారు. సినిమాలో హీరో గుఱ్ఱం మీద వెళ్తున్నాడు. మొదటి మిత్రుడు,
"ఇప్పుడు ఆ హీరో గుఱ్ఱం మీదనుంచి పడిపోతాడు. కావాలంటే వంద రూపాయలు పందెం" అన్నాడు. ఆ హీరో పడిపోడని రెండవ మిత్రుడూ పందెం కాసాడు. మరికొద్ది నిముషాలలో ఆ హీరో పడిపోవడం, రెండవ మిత్రుడు మొదటివానికి వంద రూపాయలు ఇవ్వడం జరిగిపోయాయి. అయితే ఆ మొదటి మిత్రుడు, "నేను ఈ డబ్బులు తీసుకోలేను. నేను నిన్ను మోసం చేశాను. నేను ఈ సినిమా ఇదివరకే చూసేసాను" అన్నాడు.

అప్పుడా రెండవ మిత్రుడు,
"నేను కూడా ఈ సినిమా ఇదివరకే చూసాను. అయినా ఆ హీరోకి ఏమాత్రం బుద్ధి ఉన్నా ఒకసారి గుఱ్ఱం మీదనుంచి పడ్డవాడు రెండవసారి జాగ్రత్తగా ఉంటాడులే అనుకొని నీతో పందెం కాసాను. కానీ ఆ బుద్ధిలేని హీరో మళ్ళీ అలాగే పడిపోయాడు" అన్నాడు.

ఇది వింటే ఆ రెండవవాడి అమాయకత్వాన్ని చూసి మనం నవ్వుకుంటాం. కానీ ప్రతిరోజూ మనం చేస్తున్నది కూడా అదే. మన జీవితంలో ప్రతిరోజూ ఇలాంటి భ్రమలకు, భ్రాంతులకు లోనవుతున్నాం. ఎలాగో చూద్దాం. మనకు ప్రధానంగా ఆరుగురు శత్రువులని పెద్దలు చెబుతారు కదా! అవే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి మన ప్రబల శత్రువులని చిన్నప్పటినుండి వింటూనే ఉన్నాం. అలాగే వీటి దాహం తీరనిదని, ఎంత సమర్పించుకున్నా ఇంకా ఇంకా అగ్నిలా ప్రజ్వరిల్లుతూనే ఉంటాయని సాక్షాత్తు భగవానుడే గీతలో చెప్పాడు కదా! అయినా మనం ప్రతిసారీ
'ఈ ఒక్కసారికి వాటి మాట విని వాటి ఆకలి తీరిస్తే మళ్ళీ మన జోలికి రావులే' అనుకుంటూ మళ్ళీ మళ్ళీ వాటికి లొంగిపోతూనే ఉంటున్నాం.

ఒకరికి విపరీతమైన షుగర్ వ్యాధి ఉంటుంది. కానీ తీపి అంటే ఎంతో ఇష్టం.
'ఈ ఒక్కసారికి తినేస్తే ఆ కోరిక తీరిపోతుందిలే. ఆ తరువాత ఇంకెప్పుడూ తినద్దు' అనుకుంటూ తినేస్తాడు. అయితే ఆ కోరిక అక్కడితో ఆగుతుందా? మళ్ళీ మళ్ళీ తీపివైపుకు లాగుతూనే ఉంటుంది, వీడు మళ్ళీ మళ్ళీ దానికి లొంగుతునే ఉంటాడు.

చివరికి వాడి ప్రాణం మీదకు తెచ్చుకుంటాడు. అలాగే ఒకడికి విపరీతమైన కోపం ఉందనుకోండి. అది తప్పు అని వాడి బుద్ధి మాటిమాటికి హెచ్చరిస్తూనే ఉంటుంది. అయినాసరే
'ఈ ఒక్కసారికి నా పిల్లవాడిమీద కోపం చూపిస్తే తరువాత వాడే నా మాట వింటాడులే' అనుకుంటూ ఉంటాడు. ఆ పిల్లవాడు మాట వినేదెప్పుడు? వీడి క్రోధం అణిగేదెప్పుడు? రెండూ కల్లలే. చివరికి ఆ పట్టరాని క్రోధంలోనే ఏదో జరగరాని అనర్థం జరుగుతుంది.

అలాగే లోభగుణం ఎక్కువగా ఉన్నవాడు ఎవరికైనా ధన సహాయం చేయవలసి వస్తే
'ఈ ఒక్కసారికి దాచుకుందాంలే. వచ్చేసారి నుంచి నా శక్తికొలది తప్పకుండా దానం చేస్తాను' అని ప్రతిసారి అనుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటాడు. అలాగే మన కళ్ళముందే మనం మోహం పెంచుకున్న ఎందరో బంధువులు, స్నేహితులు వెళ్లిపోతున్నా మళ్ళీ మళ్ళీ 'ఈ ఒక్కసారికే' అనుకుంటూ క్రొత్త వారి(టి)పై మోహం పెంచుకుంటూనే ఉంటాం. ఇక ఎన్నిసార్లు 'నీ సత్తా ఇంతేరా!' అని భగవంతుడు మొట్టికాయలు వేస్తున్నా 'అమ్మో! వచ్చేసారి జాగ్రత్తగా ఉండాలి' అనుకుంటూనే ఉంటాం, అయినా మళ్ళీ మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు 'నా అంతవాడు లేడు' అనుకుంటూ మదాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాం. ఇలాగే ఎప్పటికప్పుడు 'ఇది తప్పు. భగవంతుడు నాకు ఇవ్వాల్సింది బాగానే ఇచ్చాడు' అనుకుంటూనే మళ్ళీ ఈర్ష్య, అసూయ, అసహనం, ఓర్వలేనితనం రూపాల్లో మాటిమాటికి మాత్సర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాం.

అయితే పైన చెప్పుకున్న కథలో మొదటివాడు ఎందుకు భ్రాంతిలో పడలేదు? రెండవవాడు ఎందుకు పడ్డాడు? అని విచారిస్తే మొదటివాడు
'ఇది సినిమా. ఎన్నిసార్లు చూసినా ఇందులో మార్పేమీ ఉండదు. అది ఎప్పటికీ నిజం కాబోదు' అనే జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఇక రెండవవాడు సత్యానికి, కల్పనకి భేదం తెలుసుకోలేక ఆ కల్పనే నిజమని భ్రమించి ఎప్పటికైనా అది మంచిగా మారకపోతుందా అనుకుంటూ అందులో లీనమై మళ్ళీ మళ్ళీ ఆత్రంగా చూస్తూనే ఉన్నాడు.

ఇదే మనకీ, జ్ఞానులైన మహాత్ములకు ఉన్న తేడా. మనం ఈ చూసే ప్రపంచమంతా సత్యమేననే భ్రమలో పడి
'ఇందులో రమించడం మన ఆథ్యాత్మిక ఉన్నతికి అవరోధం' అని మన బుద్ధి మాటిమాటికి హెచ్చరిస్తూనే ఉన్నా 'ఎప్పటికైనా ఇందులోనే మనకు కావలసింది దొరక్కపోతుందా'* అని మళ్ళీ మళ్ళీ లేనిచోటే మన ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాం.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

సేకరణ