Tuesday, February 15, 2022

నేటి జీవిత సత్యం.

నేటి జీవిత సత్యం.

మనం అనుకుంటూ ఉంటాం మనవాళ్ళు ఎవరో మనల్ని ఉద్ధరిస్తారని!

కానీ ఇలలో ఎవరినెవరూ కూడా ఉద్ధరించేదేదీ ఉండదు.

నిజానికి ఏ ఒక్కడూ వేరొకరికి హాని చేసేందుకు కానీ ఉద్ధరించేందుకు కానీ శక్తి గలవాడు కానేకాదు.

కర్మఫలమే ఆ విధముగా అన్నింటికీ కారణమౌతుంది.

మనం ఈ లోకంలోకి వచ్చినది మన కర్మఫలాన్ని అనుభవించడానికే తప్ప వేరెవరినో ఉద్ధరించడానికి కాదు.

వేరే ఎవరూ మనలను కూడా ఉద్ధరించేది లేదు.

ఈ విషయమై మనం భ్రమ చెంది భగవంతుని విడచిపెట్టి జన్మను బ్రష్టపరచుకుంటున్నాం.

నిద్రలో చూసేది కేవలం కల్పితమే కదా!! నిద్ర నుండి మేల్కున్నపుడే నిజం కనిపిస్తుంది.

ఇంతవరకునూ నిద్రించినది చాలు!. ఇకనైనా మేల్కొందాం. సత్యాన్ని గ్రహిద్దాం. సత్యనారాయణుణ్ణి ఆశ్రయిద్దాం. జన్మను సార్థకం చేసుకుందాం. సుఖశాంతులతో జీవనం సాగిద్దాం.

ఉషోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment