Monday, February 14, 2022

మంచి మాట..లు

ఆత్మీయబంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు.. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటు...
సోమవారం :-14-02-2022

ఈ రోజు AVB మంచి మాట..లు
మన ఆనందం పంచుకునే వారికంటే మన బాధను పంచుకునే వారినీ ఎప్పుడు వదులుకోవద్దు... ఆనందం అందరు పంచుకుంటారు.. మన బాధను కొందరే పంచుకుంటారు

మనకు ఏవైనా బాధలు, కష్టాలు ఉంటే వాటిని ముందుగా భగవంతునికే చెప్పుకోవాలి.

ఎందుకంటే ఏ బాధలు లేని వాడు మాత్రమే వేరొకనిబాధలు తీర్చగల సామర్ధ్యం కలిగి ఉంటాడు.

మనలో బాధలు లేనివారంటూ ఎవరూ లేరు.

ఏ బాధలు లేనివాడు భగవంతుడొక్కడే. కనుక ఆయనకే ముందుగా చెప్పుకోవాలి.


అయితే ఒక్కసారి మనం మన బాధలను గూర్చి ఆయనకు చెప్పాక వాటిని గూర్చి ఆలోచించడం మానేయాలి. పదే పదే చెప్పడం చేయకూడదు.

భగవంతుడే వాటి సంగతి చూసుకుంటాడు అన్న ధీమాతో మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఇదే అసలైన విశ్వాసం, అదే నిజమైన శరణాగతి..


సేకరణ ✍️ AVB సుబ్బారావు
.

సేకరణ

No comments:

Post a Comment