Friday, July 14, 2023

ఇదివో సంసారమెంత సుఖమో కాని* *తుదలేని దుఃఖమను తొడవు గడియించె..* తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తన

[7/14, 00:11] +91 93902 09144: *ఇదివో సంసారమెంత సుఖమో కాని*
*తుదలేని దుఃఖమను తొడవు గడియించె..*

తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తన

గానం. సత్తిరాజు వేణుమాధవ్ గారు
రాగం. భూపాళం 

రేకు: 50-5
సంపుటము: 1-308
రేకు రాగము: శ్రీరాగం

ఇదివో సంసారమెంత సుఖమో కాని
తుదలేని దుఃఖమను తొడవు గడియించె

పంచేద్రియంబులను పాతకులు తనుఁ దెచ్చి
కొంచెపు సుఖంబునకుఁ కూర్పఁగాను
మించి కామంబనెడి మేఁటి తనయుండు జని-
యించి దురితధనమెల్ల గడియించె

పాయమనియెడి మహాపాతకుఁడు తనుఁ దెచ్చి
మాయంపు సుఖమునకు మరుపఁగాను
సోయగపు మోహమను సుతుఁడేచి గుణమెల్లఁ
బోయి యీ నరకమను పురము గడియించె

అతిశయుండగు వేంకటాద్రీశుఁడను మహా-
హితుఁడు చిత్తములోన నెనయఁగాను
మతిలోపల విరక్తి మగువ జనియించి అ-
ప్రతియయి మోక్షసంపదలు గడియించె

*ఇదివో సంసారమెంత సుఖమో కాని*
*తుదలేని దుఃఖమను తొడవు గడియించె..*

భావము :

- శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు

     కొన్ని అన్నమయ్య కీర్తనలు వేదాంతం నేర్పితే కొన్ని వైరాగ్యాన్ని రుచి చూపిస్తాయి. ఇవి అంత తేలికగా అర్ధం కావు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం అనే పంచేద్రియాలు పాపాత్ముల స్నేహం వలన మనిషి సంసారమనే దానితో  భోగిస్తే 'కామము', 'మోహము' అనే కొడుకులు పుట్టారట. వాళ్ళవల్ల నాశనమై, వేంకటపతి దయ వలన భక్తి అనే కూతురు పుట్టి మోక్షం దారిలో పడ్డాడంటున్నారు అన్నమయ్య.
[7/14, 00:11] +91 93902 09144: ఇదివో ప్రజలారా! సంసారమంటే ఎంత సుఖమో కాని, అది చివరికి దుఃఖములనే ఆభరణములు పెట్టుకొన్న ఆడది అని గ్రహించండి.

1. మనిషి అటుపైన పంచేద్రియములు (చెవులు, కళ్ళు, నాలుక, ముక్కు, చర్మము) అను పాపాత్ముల స్నేహము వలన స్వల్ప శారీరక సుఖానికి ఆశపడితే 'కామము' అనే కొడుకు జన్మించాడు. వాడు ధనసంపాదన అనే వ్యసనం అలవాటు చేసి చివరికి పాపము అనే ధనం మూటగట్టాడు. అధోగతిబట్టాడు, మనిషి.

2. ఆ తరువాత ప్రాయము (యవ్వనం) అనే పాపాత్ముడి స్నేహం కలిసి మాయ అనే సుఖముతో రమించి 'మోహము' అనే కొడుకు పుట్టాడు. ఇంకా దుర్మతి వీడు. ఈ మనుష్యుడి  సుగుణాలనన్నిటినీ చెడగొట్టి నరకము అనే నగరాన్ని కొని వాళ్ళ నాన్నకు (అంటే మనిషికి) బహుమతిగా ఇచ్చాడు. చివరికి ఆ పట్నం లో దారి తప్పి భ్రష్టుడయ్యాడు మనుష్యుడు.

3. చివరికి ఆ వేంకటేశ్వరుడికి ఈ మానువుడిపై జాలి కలిగి ‘విరక్తి' అనే మంచి కుమార్తెను పుట్టించి దయ చూపాడు. వాడి మనస్సులో అప్రతిహతమైన మోక్షమనే సంపదపై ధ్యాసకలిగించి వాడికి మోక్షమును ఆ విరక్తి అనే కూతురు సంపాదించి ఇచ్చింది. లేకపోతే వాడిగతి అధోగతే.


No comments:

Post a Comment