*చెట్టును* నరికేయడం చాలా *సులభం* కానీ అదే చెట్టు *పెరిగి, పెద్దది* కావాలంటే *జీవితకాలం* పడుతుంది. అలాగే *కోపంతో* ఒక *మాట* అనేయడం చాలా *సులభం* కానీ *క్షణ* కాలంలో *జారే* ఆ మాట ఒక *బంధాన్ని* తెంచేస్తుంది...!!
********************************
గుణం లేని వారు *కులం* గొడుగు పడతారు మానవత్వం లేని వారు *మతం* ముసుగు వేస్తారు పని లేని వారు *ప్రాంతాల* ఊసెత్తుతారు జనులంతా ఒక *కుటుంబం* జగమంతా ఒక *నిలయం* .
********************************
మౌనం *మనస్సు* ని శుద్ధి చేస్తుంది. స్నానం *దేహాన్ని* శుద్ధి చేస్తుంది. ధ్యానం *బుద్ది* ని శుద్ధి చేస్తుంది. ప్రార్థన *ఆత్మ* ను శుద్ధి చేస్తుంది దానం *సంపాదన* ను శుద్ధి చేస్తుంది ఉపవాసం *ఆరోగ్యాన్నీ* శుద్ది చేస్తుంది. అలాగే క్షమాపణ *సంబంధాల* ను శుద్ది చేస్తుంది.
********************************
నీ గురించి *పదిమంది* గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు *వందమంది* గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి *సత్యం* వైపు నీవుండాలను కుంటే *ఒంటరిగా* మహావృక్షంలా నిలబడడానికి *సిద్ధంగా* ఉండాలి ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి *విత్తనం* లాగా పడిపోవాలి.
*NANNAKA's*
No comments:
Post a Comment