|| యువత – జ్ఞానయోగం ||
“ఒకానొక తుమ్మెద ప్రతి పువ్వు నుంచీ మకరందాన్ని గ్రహించినట్లు ఒకానొక ఆత్మజ్ఞానాభిలాషి ప్రతి ఒక్కరి దగ్గరినుంచీ నేర్చుకోవాలి. ఈ సృష్టిలో ఉన్న వృక్షజాతి మరి పక్షి, జంతు జాతులనుంచీ నేర్చుకోవాలి .. అదే మరి జ్ఞానయోగం!
“ఇలా నేర్చుకోవడం అన్నది చిన్నప్పటినుంచే మొదలుపెట్టాలి. ఆలస్యం అమృతం విషం కనుక శుభస్య శీఘ్రం” అంటూ “ముక్కు పచ్చలారకముందునుంచే పిల్లలకు ధ్యానం నేర్పించాలి. ధ్యానంవల్ల ఒక రాముడికీ, ఒక కృష్ణుడికీ, ఒక ప్రహ్లాదుడికీ జ్ఞానం అబ్బినట్లు ప్రతి ఒక్కరికీ జ్ఞానం అబ్బుతుంది. అప్పుడే వాళ్ళు తమ జీవితాలను చక్కగా జీవించి వాటిని సార్థకం చేసుకుంటారు. ఎంతో కష్టపడి తెచ్చుకున్న మానవజన్మను గౌరవప్రదంగా చూసుకోగలుగుతారు.
“చిన్న చిన్న విషయాలకే బెంబేలెత్తిపోయి ఆత్మహత్యలు చేసుకోకుండా ‘యుద్ధాయ కృతనిశ్చయః’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు .. కష్టాలను ఛాలెంజ్‌స్‌లా తీసుకుని తమను తాము బ్రతికించుకుంటారు. మానవుడు దేవుడిలా పరిణమించడానికి ‘ఈ భూలోకమే సరియైన క్షేత్రం .. మరి ఈ దేహమే సరియైన ఉపకరణం’ అని తెలుసుకుని దానితో ప్రయోగాలు చేస్తారు.
“చిన్నపటి నుంచీ తల్లిదండ్రుల సరికాని పెంపకాల వలనో లేక మన చుట్టుప్రక్కల వాళ్ళు మనగురించి మాట్లాడే మాటలవలనో మనలో మనపట్ల మనకే తెలియని ఒకానొక నమ్మక వ్యవస్థ ఏర్పడిపోతుంది. అయితే ఆ వ్యవస్థను గ్రుడ్డిగా అనుసరించకుండా .. ఎప్పటికప్పుడు దానిని ‘చెక్’ చేసుకుంటూ మరి సరిచేసుకుంటూ ఉండాలి.
“ఇక్కడ ఎవ్వరూ పరఫెక్ట్ కాదు! ఎవ్వరూ ఎక్కువ కాదు; ఎవ్వరూ తక్కువ కాదు. ఎవరెవరి స్థాయిలలో వాళ్ళు వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు కాబట్టి మన దగ్గర ఉన్నదానిని ప్రక్కవాళ్ళతో పరస్పరం పంచుకుంటూనే ఉండాలి. మనకు ‘ABCD’ లు తెలిస్తే వెళ్ళి ప్రక్కవాడికి నేర్పించాలి. మనకు ధ్యానం తెలిస్తే దానిని ప్రక్కవాడికి నేర్పించాలి.
” ‘ఒక మనిషి ఎంతయినా చెయ్యగలడు’ అని తెలుసుకుని దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు .. శరీరంతో ఉన్నప్పుడే అన్నీచెయ్యగలగడం మరి Equality is the highest quality .. and simplicity is the highest spirituality .. అని తెలుసుకోవడమే జ్ఞానయోగం” .
- Bramharshi Patriji
No comments:
Post a Comment