*_నేటి మాట_*
*దైవానుగ్రహం...!!*
మనకి అనుభవంలోకి వచ్చిన ప్రయోజనం వెనుక అవ్యక్తంగా ఉన్న పరమాత్మను గుర్తిస్తే దైవానుగ్రహం నిరంతరంగా ఎలా వర్షిస్తుందో తెలుస్తుంది. దైవం యొక్క స్వరూపమే అనుగ్రహం అనే విషయం అప్పుడు అర్థమవుతుంది...
తల్లి కడుపులో చిన్న వీర్యపు బిందువుగా మొదలైన మన జీవితం తొమ్మిది నెలల్లో చక్కని రూపుదిద్దుకోవడం మనకు అనుగ్రహంగా కనిపించటంలేదు.
పుట్టినప్పుడు జానెడు పకందుగా ఉండి ఆ తర్వాత ఆరడుగులు పెరగడంలో ఆశ్చర్యం కలగటంలేదు.
కానీ ఎవరో ఎక్కడో ఏదో ఒక వస్తువు సృష్టించారని తెలిస్తే తెగ ఆశ్చర్యపోతాం.
మనం అనుభవించటం మినహా స్వయంగా చేయలేని ఎన్నో విషయాలు ప్రకృతి మనకు అందిస్తుంది.
మనతో నిమిత్తం లేకుండా జరిగిపోయే పనంతా దైవమే...
గులాబీ మొక్క నాటి నీళ్ళు పోస్తే, పువ్వు సిద్ధమవుతుంది. కానీ ఇది దైవానుగ్రహం అని మనకు అనిపించదు.
మామిడిపండులోని తియ్యదనం అంటే ఇష్టపడతాం.
అది మనకు లభించటాన్ని అనుగ్రహం అంటాం.
పండులో తియ్యదనం ద్వారా వ్యక్తమైన అనుగ్రహం భూమిలో టెంకె నాటినప్పుడే ఉంది.
రుచికరమైన వంటచేసి పెట్టినవారి శ్రమను గుర్తించి కృతజ్ఞతలు చెప్తాం...
కానీ అసలు ఆ వంటకు మూలమైన ఆహార పదార్థాలను అందించిన దైవానుగ్రహాన్ని మనం గుర్తించం, మనం తినేది , అనుభవించేది, అంతా దైవానుగ్రహంగా భావించాలి,
ఈ సృష్టి అంతా దైవానుగ్రహంగా వ్యక్తమవుతుంటే..
కొంత మంది మాత్రం పరిమిత ఫలాల్ని ఆశించి అవి నెరవేరటాన్ని బట్టి అనుగ్రహాన్ని కొలతలు వేసుకుంటారు... అది చాలా అజ్ఞానం ...
*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
No comments:
Post a Comment