Friday, August 15, 2025

 *@ ప్రయత్నించండి..@43
     తేది:15/08/2025
""""""""""""""""""""""""""""""""""""
పిల్లలకు నీతి కథలు చెప్పడం,వాటి ద్వారా వారికి జీవన
రీతిని బోధించడం మన నాగరికతలో భాగం
మొక్కై
వంగనిది మానై వంగునా అని సామెత అందుకే చిన్నప్పుడే
పిల్లలకు అవసరమైన జీవిత పాఠాలను కథల రూపంలో
చెబితే అవి వారి చిట్టి మనసుల్లో నాటుకుపోతాయి పెద్ద
య్యాక చక్కటి వ్యక్తిత్వంతో మంచి మనుషులుగా రాణిస్తారు
అంతేకాదు, కథలు వారి జ్ఞాపక శక్తికి, సృజన శక్తికి పదును
పెడతాయి ఆలోచన రేకెత్తిస్తాయి వారి పదసంపదను
పెంచి సంభాషణా చాతుర్యం అలవడేలా చేస్తాయి జీవన
నైపుణ్యాలను నేర్పుతాయి
కానీ పాఠ్యపుస్తకాలకు ఇచ్చిన ప్రాధాన్యం మనం కథల
పుస్తకాలకు ఇవ్వడం లేదు స్కూలు నుంచి విశ్వవిద్యాలయం
వరకూ అడుగడుగునా పిల్లల ప్రతిభకు పరీక్షలే కొలమానాలుగా
చలామణీ అవుతున్న రోజులివి పరీక్ష తప్పితేనే కాదు,
అనుకున్న దానికన్నా నాలుగు మార్కులు తక్కువొచ్చినా పిల్లలూ
తల్లిదండ్రులూ కూడా తలకిందులైపోతున్నారు అది సరైన
పద్ధతి కాదని అందరికీ తెలుసు అయినా ఆ పరిస్థితి ఎదురైన
ప్పుడు మాత్రం అన్నీ మరిచిపోతున్నారు అసలే పరీక్షల కాలం
ఫలితాల గురించి ఆలోచించకుండా ప్రయత్నలోపం లేకుండా
చదివి పరీక్ష రాయడమే మీ కర్తవ్యమని పిల్లలకు గుర్తు
చేయాల్సిన సమయం ఒకవేళ ఫలితం అనుకున్నట్లు రాకపోతే
మరోసారి ప్రయత్నించాలి ఆ స్ఫూర్తినిచ్చే ఒక చిన్న కథ...
అడవి పక్కన చెరువులో రెండు కప్పలు చాలా స్నేహంగా
ఉండేవి ఒకరోజు అవి ఊరు చూద్దామని బయల్దేరాయి కొంత
దూరం వెళ్లాక ఒక గుడిసె కన్పించింది లోపల ఏముందో
చూడాలని ఉత్సుకతతో అవి రెండూ కిటికీలోకి ఎక్కాయి
లోపలంతా చీకటిగా ఉండి ఏమీ కన్పించలేద...!దాంతో ఇంకాస్త
ముందుకు జరిగి చూడబోతూ దబ్బుమని ఒక కుండలో
పడ్డాయి ఆ కుండ నిండా మీగడ పెరుగు ఉంది నీళ్లలో
ఈదినట్టు ఈదలేకపోతున్నాయి అయినా కుండలో నుంచి
బయటపడాలని రెండూ ఎగురుతున్నాయి మొదటి కప్ప
కాసేపటికే నీరసించిపోయింది జీవితం మీద ఆశ వదులు
కుంది కాసేపటికే ప్రాణం వదిలింది కానీ రెండో కప్ప అలా
కాదు పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉంది ఒంట్లో శక్తి
ఉన్నంతసేపు ఎగురుతూనే ఉంది ఆ ఎగిరే క్రమంలో దాని
కాళ్లు తగిలీ తగిలీ పెరుగు చిలికినట్లయింది మెల్లగా చిక్కటి
పెరుగు కాస్తా మజ్జిగలా మారి కప్పకి ఈత తేలికైంది ఆ
పెరుగునుంచి తయారైన వెన్నంతా ముద్దలా పేరుకుని మజ్జిగ
మీద తేలుతోంది కప్ప ఆ వెన్నముద్ద పైకి ఎక్కి అక్కడి
నుంచి కిటికీలోకి ఒక్క గెంతు గెంతింది కిటీకీలోనుంచి
బయట పడి బతుకుజీవుడా అంటూ చెరువు దారి పట్టింది
మళ్లీ మళ్లీ ప్రయత్నించడమే వివేకవంతుల లక్షణం అలా
ప్రయత్నిస్తే ఎలాంటి పరిస్థితులనైనా మనకి అనువుగా మలచు కోవచ్చని చెప్పడానికి
@బాగుంది కదూ ఈ కథ@*

No comments:

Post a Comment