Tuesday, August 12, 2025

 *_Heart Diseases Angina  awareness._*
  
*_గుండెపోటు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు :-_*

*_1.మొదట మనిషి మనసును స్థిమితంగా ఉంచుకోవాలి ద్వేష భావాలు ఉండకూడదు._*

*_2.ధూమపానం మద్యపానం పూర్తిగా మానివేయాలి._*

*_3.బిపి షుగరు ఆస్తమా వంటి వ్యాధులు ఉన్నవారు క్రమంగా మందులు వాడాలి._*

*_4.రక్తంలో కొలెస్ట్రాల్ అనే కొవ్వు పదార్ధం ఉంటుంది ఆ కొవ్వు తక్కువగా ఉన్న వంటనూనె మాత్రమే వాడాలి ._*

*_4.వెన్న శాతం తక్కువగా ఉన్న పాలు వాడాలి._*

*_5.మాంసాన్ని తగ్గించి చేపలని తినవచ్చు._*

*_6.ఉల్లి వెల్లుల్లి ఎక్కువగా వాడవచ్చు._*

*_7.స్థూలకాయం ఉన్నవారికి గుండెపోటు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది కాబట్టి డాక్టర్ గారి సలహా మేరకు శరీర బరువు తగ్గించుకోవాలి._*

*_8.ప్రతిరోజు నడవడం క్రమంగా వ్యాయామం చేయడం చేయాలి._*

*_9.వేపుడు కూరలు తగ్గించాలి._*

*_10.గుండెపోటు లేదా అనారోగ్య సమస్యలు అనేవి దేహానికి ఎప్పుడైనా రావచ్చు ._*

*_అయితే వయసు రీత్యా కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. కొంతమంది అదృష్టవంతులు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా హాయిగా ఉంటారు. కారణం వారి యొక్క జీవన శైలి. సరైన జీవన శైలిని పాటించడం ద్వారా ఉన్నని రోజులు మందులు వాడకుండా, ఆరోగ్యంగా, సంతోషంగా బతకడనికి అవకాశం ఉన్నది.._*

*_సరైన జీవన శైలి ని పాటించండి✍️_*

 *_-సదా మీ శ్రేయోభిలాషి..💐_*

 *_-మీ..తుకారాం జాదవ్.🙏🏾_*

No comments:

Post a Comment