Thursday, October 9, 2025

 🙏🕉️ హరిఃఓం  🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(239వ రోజు):--
        కాని, మన ప్రస్తుత మనస్థితిలో మనమీదగాని, మన ప్రపంచంమీద గాని మనకు ఆధిపత్యం లేదని గుర్తుంచుకుందాం, మనకు కొంచెం తెలివున్న క్షణాల్లోనైనా. మనసును అధీనంలో ఉంచుకోవటమెలానో వేదాంతం బోధిస్తుంది. ఆత్మవికాసా నికి అది రాజమార్గం. 
       ప్రపంచాన్నంతనూ హత్తుకోవా లని గాఢంగా కోరుకోండి. కాని, ప్రాగ్దే శాల పరమార్థికచింతననూ, పశ్చిమ దేశాల వస్తుసంపదనూచేర్చి పరుపు  కుట్టాలనే పిచ్చిఅలోచనలేవీ పెట్టుకో వద్దు. అది సాధ్యంకానిపని. వాటిలో ఒకటున్నచోట మరొకటి మనలేదు. 
     పాఠాలను శ్రద్ధగా చదువు ; ఆత్మ ను అధ్యయనం చెయ్యి : యాత్రను ప్రారంభించు; గమ్యాన్ని సాధించు. 
              స్వామి చిన్మయానంద 
       చాలాసార్లు అమెరికా పర్యటిం చిన తర్వాత, ఇక ప్రారంభదశను ముగింపుకు తేవాలనీ, అసలు కార్య క్రమాన్ని మొదలుపెట్టాలనీ స్వామీజీ నిశ్చయించారు. భారతదేశంలో నిర్వహించిన యజ్ఞాలవంటి గంభీర మైన వేదాంత కార్యక్రమాల్ని అక్కడ కూడా మొదలుపెట్టారు. ఉదయం ఆదిశంకరాచార్యుల భజగోవిందం వంటి గ్రంథం, సాయంకాలం గంట న్నరసేపు భగవద్గీత, ఒక పదినిము షాల విరామం తర్వాత ఉపనిషత్తు లు - ఇలా ఉండేది కార్యక్రమం. ఈ ఉపన్యాసాల తర్వాత ధ్యానకార్య క్రమంకూడా ఉండేది. కాని ధ్యానా నికి అవసరమైనంత నిశ్చలత వారి మనసులకు ఇంకా లభించలేదనీ, మనసు ఇంకా పరిశుద్ధం కావాలనీ గ్రహించిన స్వామీజీ కొన్నేళ్లపాటు దానిని నిలిపివేశారు. 
        శాన్ఫ్రాన్సిస్కోలో ఏర్పడిన అమె రికన్ విద్యార్థిబృందం వేదాంతపఠ నంలో తమకందరికీ ఉన్న ఆసక్తివల్ల కలిగిన సమైక్యతాభావాన్ని ఇంకా ముందుకు సాగించాలనుకున్నారు. యోసెమిటీ అనే హిమవత్పర్వత ప్రాంతంలో అన్ని జాతులవారూ కలిసికట్టుగా జీవించే జననివాసాన్ని నిర్మించే ఉద్దేశంతో తమ స్వంత ఆస్తులన్నిటినీ అమ్ముకొని అక్కడికి తరలి వెళ్లారందరూ. క్వేకర్ మతాని కి (క్రైస్తవమతంలో ఒకతెగ) చెందిన ఒక దంపతులు ఈ ప్రయత్నానికి కావలసిన స్థలాన్ని దానంగా ఇచ్చా రు. కాని ప్రతికుటుంబం తమకు నచ్చిన రీతిలో గృహం నిర్మించు కోడానికి స్థానికప్రభుత్వం అంగీకరిం చలేదు. దీనికితోడు, ఏర్పాటు చెయ్యాల్సిన సదుపాయాల విష యంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. నిరాశచెందిన ఆ బృందం ప్రోత్సాహం కోసం స్వామీ జీకి జాబు వ్రాశారు. వారందరూ ఆశ్చర్యపోయేలా, ఆ ఉద్దేశాన్ని విర మించుకొని తమతమ సమాజాల్లోనే నివసించమని ఆదేశించారు స్వామీ జీ. "ఆధ్యాత్మిక జీవనం గడపాలంటే కుటుంబాన్నీ, ఉద్యోగబాధ్యతలనూ పరిత్యజించాలని అమెరికన్లు అను కుంటున్నట్లుంది" అంటూ వారిని మందలించారు. 
         🙏🕉️హరిఃఓం 🕉️🙏 
  🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
                🌺 సరళ  🌺

No comments:

Post a Comment