*ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏*
భక్తుడు :
భగవాన్! మనసులో' ఒకేసారి రెండు విషయాలు ఉండవని, భగవంతుడో లేక సంసారమో ఏదో ఒకటే ఉండాలని, సంసారము ఇప్పటికే అక్కడ ఉందని, సంసార భావన మెల్లమెల్లగా తగ్గించి, అక్కడ భగవంతుణ్ణి ప్రవేశపెట్టాలి” అని అంటారు కదా?
మహర్షి :
ఎప్పుడూ ఉండేది భగవంతుడేగాని సంసారము కాదు. సంసారమనే ఈ చెత్తతో మనసును నింపినందు వలన నీవు దైవాన్ని చూడవు; అంతే. సంసారమనే చెత్తను తీసిపారవేస్తే భగవంతుణ్ణి చూడగలవు.
ఒక గదిలో ఎన్నో వస్తువులు నింపి ఉంటే అక్కడున్న స్థలం ఎక్కడికీ మాయమయి పోదు. మనకు స్థలం కావాలంటే అక్కడున్న వస్తువులను తీసివేస్తే చాలు. క్రొత్తగా స్థలం సృష్టించ అవసరం లేదు.
అలాగే దైవం అక్కడ ఉండనే ఉన్నాడు. మనసును బయటికి పోనీయకుండా అంతర్ముఖం చేస్తే, ఏది మాత్రమే ఉన్నదో ఆ ఏకత్వంలో మనసు లీనమైపోతుంది.
No comments:
Post a Comment