Sunday, May 2, 2021

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు రవివారపు శుభోదయ శుభాకాంక్షలు,.. మీకు మీ కుటుంబసభ్యులకు ప్రత్యక్ష నారాయునుడి అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. దేముడు అందరిని నమ్మక కొందరికి అధికారాన్ని ఐశ్వర్యాన్నిఇచ్చాడు అందరికి సరిగా పంచమని, కాని వారు చేస్తున్నది ఎవరికీ పంచకుండా దేముడిని కూడా మోసం చేస్తున్నారు, ఆలోచించుకోండి.. ఎవరి సంపాదనలోనైనా పావలా వంతు కు మాత్రేమే మీరు హక్కుదారులు, మిగిలినది తోటివారిది అని గమనించండి. ఇప్పటికైనా దేముడు మీ మీద పెట్టిన నమ్మకాన్ని వొమ్ము చేయకుండా మీకు అప్పగించిన భాద్యతను సక్రమముగా నిర్వహించండి

అదివారం- 02-05-2021
ఈ రోజు AVB మంచి మాట.. లు
జీవితం సాఫీగా నడుస్తున్నంత కాలం హాయిగానే ఉంటుంది కానీ జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడే నువ్వేంటో అందరికీ తెలుస్తుంది .

నీలో రక్తం చుక్కలు చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకర ఆయుధం మాట దానిని మూర్ఖులు వాడిన తర్వాత ఆలోచిస్తారు తెలివైనవారు ఆలోచించి మాట్లాడుతారు .

మనకు మనస్సులో సంతోషం లేనపుడు నువ్వు ఏడంతస్థుల మేడలో ఉన్నా ఏమీ లేని గుడిసెలో ఉన్నా ఒకటే ! . మనస్సులో ఓర్వలేనితనం ఉన్నప్పుడు నువ్వు ఏడుకొండలు ఎక్కినా ఏడుస్తూ పూజచేసినా ఒక్కటే .

నీకున్నదంతా ఏదో ఒక రోజు ఇచ్చేయాల్సిందే నీ వెంట ఏదీ తీసుకెళ్ళలేవు అందుచేత ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు . ఇచ్చే గొప్ప ఆవకాశాన్ని నువ్వే వాడుకో . ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే కానీ నీ వారసులు కాదు .

సేకరణ ✒️ *మీ ...AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

No comments:

Post a Comment