Thursday, May 6, 2021

_🤔అసలు జీవితాన్ని ఎంజాయ్ చెయ్యటం అంటే ఏమిటి !?

శ్రీరమణీయం -(881)
🕉🌞🌎🌙🌟🚩


📚✍️ మురళీ మోహన్

🤔అసలు జీవితాన్ని ఎంజాయ్ చెయ్యటం అంటే ఏమిటి !?"

జీవితాన్ని ఎంజాయ్ చెయ్యటమంటే చాలా మంది తెచ్చిపెట్టుకున్న కృత్రిమమైన సంతోషం అనుకుంటున్నారు. పుట్టినరోజు వేడుకల్లో, న్యూఇయర్ హంగామాల్లో, ఇంకా శృతిమించిన విందులు, వినోదాల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ 'జీవితాన్ని ఎంజాయ్ చేయవద్దా' ? అని ప్రశ్నిస్తున్నారు. అదంతా కాఫీ మీది నురుగను సేవించి సంతోషించటంలాంటిది. పైగా జీవితంలో ఎంతో దుఃఖాన్ని మిగిల్చే సంతోషం. జీవితాన్ని ఎంజాయ్ చెయ్యటమంటే మనమేదో చేసి ఆనందించటం కాదు. మన జీవితంలోనే ఉన్న ఆనందాన్ని గుర్తిస్తే ఏ శ్రమ లేకుండా నిరంతర ఆనందంతో జీవనం సాగించవచ్చు. ఆకాశంలో తిరిగే విహంగాల్లా నిత్యానందంతో స్వేచ్ఛగా జీవించవచ్చు. పశుపక్ష్యాదులకు ఆహార అన్వేషణ, ప్రాణభయం మినహాయించి మరో సమస్యలేదు. కానీ ఎంతో ఉన్నతుడనని భావించే మనిషి మాత్రం నిరంతరం సమస్యల వలయంలో ఉంటున్నాడు. అందుకు కారణం జీవనసౌరభాన్ని గుర్తించలేకపోవటం, దాన్ని కాపాడుకోలేకపోవటం !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
"కొలికిపూస-ముగింపు మాట !" [అధ్యాయం -109]

🕉🌞🌎🌙🌟🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment