Thursday, May 27, 2021

అమ్మ అబద్దాలు

అమ్మ అబద్దాలు 😊

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిఝంగా నిజం అండి...
అవునండి మనకి అబద్ధాలు చెప్పకూడదు, ఎప్పుడూ నిజమే చెప్పాలి అని హరిశ్చంద్రుడు , గాంధీగారి కధలు చెప్పిన అమ్మ, మన చిన్నప్పటి నుండి మనకెన్ని అబద్ధాలు చెప్పిందో తెలుసా?

అందగాడిని గాకున్నా ......
చందమామనంటుంది

కంచం నిండా తిన్నా .......
కొంచెమే కదా అంటుంది

అల్లరెంతగా చేసినా .......
పిల్లలింతేనని చెబుతుంది

అత్తెసరున పాసయినా .......
కొత్త సిలబసే కారణమంటుంది

ఆటలు పాటలు రాకుంటే .......
వాటికి విలువలేదంటుంది

ఇంత కప్పు నే గెలిస్తే మాత్రం .......
ఎంతో గొప్పని అంటుంది

తప్పులెన్ని నే జేసినా ........
ఒప్పులుగనే లెక్కలేస్తుంది

అప్పుడప్పుడూ అబద్దమాడినా .......
చెప్పనే చెప్పదు నాన్నకైనా

పాతికేళ్ళ వయసున్నా ........
పసివాడిగానే చూస్తుంది

కష్టపడి వాళ్ళు సంపాదించినా .......
అదృష్టం నాదంటుంది

మనం తల్లి తండ్రులo అయ్యాకే తెలిసేది .......
అమ్మ అబద్ధాలు

ఆమె మమతల నుంచి .......
రాలిన పూలరెక్కలం

ఆమె వాత్సల్యంతో ఒలికించిన .......
తేనె చుక్క లం

ఏమిచ్చి ఆ ఋణం తీర్చుకోగలం
కన్నీటితో కాళ్ళు కడగడం
ప్రేమతో అమ్మని చూసుకోవడం తప్ప..🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment