Monday, October 31, 2022

తలంబ్రాలుగా బియ్యమే ఎందుకు గోధుమలు వాడొచ్చు కదా !

 తలంబ్రాలుగా బియ్యమే ఎందుకు గోధుమలు వాడొచ్చు కదా !
...............................................................

వరుడు వధువును ఉద్దేశించి

మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం.

నా బంగారుజీవితానికి సుఖ సంసారానికి కారణమైతున్న ఈ శుభసూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను. నువ్వు సుమంగళిగా నిండు నూరేళ్ళు జీవించాలి.

ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి.

ధర్మ నిర్వహణలోకాని సంపదలు పొందినపుడు కాని, సంసారిక జీవితాన్ని గడపడంలో కాని, చివరకు మోక్షము పొందుటలో కాని నేను నిన్ను విడువనని ప్రమాణం చేస్తున్నానని అంటాడు.

మాంగల్యధారణ అనంతరము తలంబ్రాలు పోసుకోవడం మన ఆచారం, సాంప్రదాయం.ఇందులో ఎంతో పరమార్థాన్ని పరాశరుడిలాంటి స్మ్రతికారులు ఏర్పాటుచేశారు. తలంబ్రాలనే అక్షతావరోహణం అంటారు. అక్షతలు లోని అక్షత అంటే క్షయం లేనిది, నాశనంకానిదని అర్థం. తలను + ప్రాలు = తలంబ్రాలు. ప్రాలు = బియ్యం.

అక్షతలకు కాని తలంబ్రాలకు కాని బియ్యాన్నే ఎందుకు వాడాలి ? జొన్నలు, రాగులు, సజ్జలు, బార్లీ, గోధుమలు వంటి ఇతర ధాన్యాలను ఎందుకు వాడకూడదు ?

పసుపుతో కలిసిన బియ్యం శుభానికి సూచన.జొన్నలు, రాగులు, సజ్జలు, బార్లీ, గోధుమలు  వంటి ధాన్యాలను కల్లము (త్రెష్షింగ్ ప్లోర్) నుండి ఇంటికి తెచ్చుకొని అవసరమున్నప్పుడు దంచుకొని, లేదా విసురుకొని లేదా నూరుకొని వంట చేసుకొని తింటాము, అంటే ధాన్యాన్ని ప్రత్యక్షంగా తింటామన్నమాట.(Direct Consupmtion) బియ్యము కావాలంటే వడ్లను దంచి, బియ్యాన్ని తయారు చేసుకొని, ఆ 
బియ్యాన్ని మరల దంచుకొని లేదా విసురుకొని లేదా నూరుకొని తినాలి, అంటే శ్రమించి అన్నాన్ని చేసుకోవాలి.అలాగే దాంపత్యజీవితంలో కూడా జీవించటానికి శ్రమ అవసరము. శ్రమకు గుర్తుగా బియ్యాన్ని ఉదాహరించడం జరిగింది.

తలంబ్రాలు పోసుకొనే సమయంలో వధూవరులు ఎంతో ఉత్సాహంతో తలనిండుగా బియ్యం (తలంబ్రాలు) పోసుకొంటారు. దంపతుల జీవితములో అన్నం నిండుగా ఉండాలని, సమృద్ధిగా దొరకాలని జీవితాంతం ఎంతో ఉత్సాహంగా గడపాలని సింబాలిక్ గా చెప్పడమే తలంబ్రాల తంతు ముఖ్యోద్దేశ్యము.

పురోహితుడు వధువు దోసిట్లో తలంబ్రాలు పోసి ఆపై నేయ్యిని విదిలించి, వరుడి దోసిలిలో (అంజలిలో) అక్షతలు పోసి, నేయిని చిలకరించి వధువు అంజలి కింద వుంచుతాడు. తరువాత ప్రజాపతి స్త్రీ యాంయశ: కామస్య తృప్తిమానందం తస్యాగ్నే హమ అని మంత్రం చదువుతూ వధువు శిరస్సుపై తలంబ్రాలు జారవిడవాలి.అలాగే వధువు కూడా వేదమంత్రాలను పఠిస్తూ తలంబ్రాలను వరుడు తలపై పోయాలి.

తలంబ్రాల తంతు తరువాత పాణిగ్రహణం వుంటుంది. ఈ కార్యములో వరుడు వధువును అగ్నిగుండము దగ్గరకు తీసుకు వెళ్ళి ప్రధానహోమము చేస్తాడు. వరుడు తన కుడిచేత ( బోర్లించిన విధంగా అంటే అరచేయి కిందకు ఉండేలా) వధువు యొక్క కుడిచేతిని పట్టుకొంటాడు. వధువు కుడి అరచేయి ఆకాశంవైపు చూస్తూవుండాలి) దీనినే పాణిగ్రహణమంటారు.

ఆడపిల్ల సంతానము కావాలంటే వరుడు వధువు యొక్క నాలుగు వేళ్ళను, పురుష సంతానం కావాలంటే బొటనవేలిని పట్టుకోవాలి, ఇద్దరు కావాలంటే అన్ని వేళ్ళను పట్టుకోవాలి.

/సేకరణ /
...................

ధర్మం అంటే...

 ధర్మం అంటే...

🔹🔸🔹🔸🔹🔸

1. మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. కువిర్శలు ప్రారంభమౌతాయి. ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంటిత దీక్షతో ‘ధృతి’ చెడకుండా ముందుకి సాగిపోవాలి. ‘ఇది ధర్మం’.

2. మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. క్షమాగుణంతో ఉండాలి. ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కోనాలి. కోపగించుకోకూడదు. ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు. ‘ఇది ధర్మం’.

3. మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ముఖ్యం. చదువుతున్నా, వింటున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుండాలి ‘ఇది ధర్మం’.

4. తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసికోనలేక, నిస్తేజంగా నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా, నియమరాహితుడుగా, ఉండకూడదు. ‘ఇది ధర్మం’.

5. మనిషి ఎల్లపుడూ మనస్సునూ, శరీరాన్నీ, మాటనూ ఆలోచననూ, సంసారన్నీ, ఇంటినీ, పరిసరాన్నీ, ధరించే వస్త్రాలనూ పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. మనసు పరిశుభ్రంగా వుండాలి. మాత్రమే పరిశుభ్రంగా ఉండాలి. మనిషి పరిశుభ్రంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.

6. చదువువున్నా, సంపదలున్నా, కీర్తివున్నా, బలంవున్నా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. ‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడైనా గెలుస్తాడు’ మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారిని భూతప్రేతాలుగాని, దెయ్యాలు గాని, యక్షకిన్నర కిమ్పురుశులుగాని, గ్రహాలు గాని, రోగాలు గాని, కష్టసుఖాలుగానీ, మరణంగానీ, వశంలో వుంటాయి. కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి ‘ఇది ధర్మం’.

7. ప్రతి విషయానికీ సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం కూడదు ‘ఇది ధర్మం’.

8. మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. అకారణంగా, అనవసరంగా, ఒకరి మెప్పుకోసం, ఒకరిని మెప్పించటంకోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం. తనవారిని తృప్తిపెట్టట్టంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం కలిగిస్తుంది. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరోకనాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. మన శక్తినీ, మనకీర్తినీ, మన గోప్పదనాన్నీ పాతాళానికి త్రోక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. ‘ఇది ధర్మం’.

9. మానవునికి ఆహరం ఎంత ముఖ్యమో, వివేకం కూడ అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. ‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవిత గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా,భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.

10. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని  పతనావస్థకు నేడతాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. తనను కన్నవారికీ, తాను జన్మనిచ్చిన వారికీ, తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది.

అకారణంగా సాటి ప్రాణుల్ని హింసించట, ఆహారం తింటూవున్న ప్రాణుల్ని, నీరు త్రాగుతున్న ప్రాణుల్ని, ఆడమగ కలుస్తున్న జంటల్ని హింసించటం, భయపెట్టటం, రాళ్ళతో కర్రతో హింసించతం, తన దారిన తాను వెళుతున్న ప్రాణుల్ని భయపెట్టి పరుగెత్తించటం మంచిది కాదు.

కోపాన్ని జయించితే మనుష్యుల్ని జయించవచ్చు. సమస్యల్ని అధిగమించవచ్చు. కోపం ఎప్పుడూ మనకే నష్టాన్ని కల్గించి ఎదుటివారికి లాభాన్ని కల్గిస్తుంది. కోపం ఆత్మీయుల్ని దూరం చేస్తుంది. కోపం భవిష్యత్తును ఛిద్రం చేస్తుంది. కోపం జీవితాన్ని పతనం చేస్తుంది. కోపాన్ని అడుపులో ఎల్లపుడూ వుంచుకోవాలి. ‘ఇది ధర్మం’.

                                                                                                                                                          
🔹🔸🔹🔸🔹🔸

Sunday, October 30, 2022

yandamoori gems

 *yandamoori gems*

కోల్పోయే దాని వల్ల వచ్చే విషాదం కన్నా, ఇచ్చేదాని వల్ల వచ్చే ఆనందం ఎక్కువైతే దానినే దాతృత్వం అంటారు. ఇవ్వటం వలన వచ్చే ఆనందం కన్నా, కోల్పోయే దాని వలన వచ్చే విషాదం ఎక్కువైతే దానిని మొహమాటం అంటారు.

అపనమ్మకంతో గెలిచిన గెలుపుకంటే నమ్మకంతో వచ్చే ఓటమే గొప్ప సంతృప్తిని ఇస్తుంది.

భార్యాభర్తల మధ్య ఎప్పటికీ పెళ్ళికాని ప్రేమికుల మధ్య ఉండే ఆకర్షణ మిగిలి ఉండాలంటే ఒకర్నొకరు మనస్పూర్తిగా నమ్మాలి. నిరంతరం మాటల వారధి ఉండాలి. నిర్లిప్తత వాగులా పొంగి ఆ వారధిని కూల్చేయకూడదు.

జీవితానికి అర్ధం మనం జీవిస్తేనే తెలుస్తుంది, మరణానికి అర్ధం మన దగ్గరివాళ్ళు మరణిస్తేనే తెలుస్తుంది. ప్రేమకు అర్ధం మనం ప్రేమిస్తేనే తెలుస్తుంది. రొటిన్ కి అర్ధం మన దగ్గర వాళ్ళ ప్రవర్తన వల్ల తెలుస్తుంది.

మనలో డిఫెక్ట్ ఏమిటంటే ఆనందం అనేది ఎక్కడో ఉంటుందనుకుంటాం. అరకులోయ గురించి, అలక్‌నంద గురించీ ఆలోచిస్తాం. కిటికి తెరిస్తే కనబడే సూర్యోదయాన్ని చూడం.

సరస్సులో బాతులు ఈదటం చూస్తోంటే ఎంతో అందంగా ఉంటుంది. అయితే- ఈ ఈదటం కోసం, అవి నీటి అంతర్భాగాన నిర్విరామంగా, ఎంతో బలంగా కాళ్ళు కదుపుతూనే ఉండాలి. అందమైన జీవితం కోసం కూడా అంతే.

కష్టాలు వాషింగ్ మిషన్ లాటివి. మనల్ని తిప్పికొట్టి కొట్టి ఉతికి ఆరేస్తాయి. కానీ, చివరకు మరింత స్వచ్ఛంగా తయారుచేసి బయటి భవిష్యత్తులోకి పంపిస్తాయి.

విత్తనాలన్నీ ఒకే చెట్టువే అయినా, ఆ విత్తనాలు నెలలో పాతగా వచ్చిన మొలకలు మాత్రం కొన్ని బలహీనంగా, కొన్ని బలంగా ఉంటాయి. కొన్ని మహా వృక్షాలవుతాయి. కొన్ని మొదట్లోనే మరణిస్తాయి. నేలసారం, 
వర్షపాతం దీనికి కారణం. ప్రతీ కుర్రవాడు విత్థానంలాంటివాడు. బాల్యంలో పెంపకం, స్నేహ బృందం - నేలసారం, వర్షపాతంలాంటివి. అతడి భవిష్యత్తుని అవే నిర్ధేశిస్తాయి.

మనం చేసే పనిని చూసి జనం పైకి నవ్విన, అందులో ఆ తర్వాత ఏమాత్రం నైపుణ్యం ఉన్నా, కృషి కనబడినా అభినందిస్తారు.

గెలుపుకి ఐదు ద్వారాలుంటాయి. ఒకటి: తన అంతర్గత శక్తులను తెలుసుకోవటం, రెండు: వాటిని అభివృద్ధిపర్చుకోవటం, మూడు: అడ్డుగా నిలిచే ఆటంకాల్ని తొలగించుకోవటం, నాలుగు: శక్తిని వృత్తిగా మార్చుకోవడం, ఐదు: గెలుపుని నిరంతరం ఆనందించటం.

విజయశిఖరం ఎక్కటానికి సరి అయిన నిచ్చెన వేసుకోవాలంటారు పెద్దలు. దానికన్నా ముఖ్యం- నిచ్చెన నిలబెట్టే నేల గట్టిగా ఉన్నదో లేదో చూసుకోవడం.

ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడొక ఆలోచన ఉంటుంది. ఎక్కడ సంకల్పం ఉంటుందో అక్కడ ఆ ఆలోచన ఒక విజయంగా మారుతుంది. కోరికలేని మనిషికి విజయం లేదు.

తనలో తానే ముడుచుకుపోయి "నాకు ఇలాగే భద్రత ఎక్కువ" అనుకున్న మొగ్గ, పూవుగా వికసించదు. ఫలంగా మారదు. "నాకిలా బాగానే ఉంది" అనుకునే మనిషికి విజయఫలం దొరకదు.

Saturday, October 29, 2022

అగ్ని వాయువు

 🕉అగ్ని వాయువు:


కౌశికుడు అయ్యా ! ఈ శరీరంలో అగ్ని ఎలా పుడుతుంది. వాయువులు శశరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయి అని అడిగాడు. ధర్మవ్యాధుడు మహాత్మా! మన శరీరంలో ఆత్మ అనే అగ్ని శరీరం అంతా నాభి ఆధారంగా వ్యాపించి ఉంటుంది. నాభి నుండి తల వరకు వ్యాపించి ఉన్న ఈ అగ్నిలో ప్రాణవాయువు సంచరిస్తూ ఉంటుంది. ఆ ప్రాణవాయువే సకల జీవులకు ఆధారం. ప్రాణవాయువు, ఆపానవాయువు కలిసి ప్రాణాగ్నిని జ్వలింప చేస్తుంటాయి. మానవుడిలో ఆపానము, పొత్తికడుపు, బ్రహ్మరంధ్రం మధ్యలో ప్రాణాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆపానము మలమూత్రముల విసర్జనా స్థానం. కంఠంలో ఉండే ఉదానము అనే వాయువు కర్మలను నియంత్రిస్తుంటుంది. వ్యానము అనే వాయువు శరీరావయవాల కలయికలో సంచరిస్తూ ఉంటుంది. ప్రాణ ఆపాన వాయువులను ఆధారం చేసుకుని సమాన వాయువు మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసి రక్తంలో కలుపుతుంది. నాభి వద్ద ఉండే ఆ వాయువు శరీరంలోని సకల ధాతువులను పోషిస్తుంది. పంచప్రాణములను, ఆత్మాగ్నిని గురించి తెలుసుకున్న యోగులు నిరంతర అభ్యాసము వలన ఆత్మను మూర్ధత్వ స్థానమున నిలుపుకుంటారు. ఆపాన సమాన వాయువులలో సంచరిస్తున్న అగ్ని శరీరమందు జీవాత్మగా వెలుగుతున్నాడు. ఆ జీవాత్మ తామరాకు మీద నీటి బొట్టులా శరీరంలో ఉంటూ నిర్లిప్తంగా ఉంటాడు. శరీరాన్ని విడిచిన జీవాత్మయే పరమాత్మ. అచేతనంగా పడి ఉన్న శరీరాన్ని పరమాత్మ జీవాత్మగా చైతన్యవంతం చేస్తాడు. పరమాత్మ ఈలోకాలను సృష్టించే సృష్టికర్త. బుద్ధిమంతులు తమ బుద్ధి కుశలతతో జీవాత్మను పరమాత్మగా తెలుసుకుంటారు. 

🕉🙏

మనిషి నమ్మకాలే మనసుకు పునాది

 మనిషి నమ్మకాలే మనసుకు పునాది

🔹🔸🔹🔸🔹🔸

మన్‌ కే హారే హార్‌ హై, మన్‌ కే జీతే జీత్‌
కహే కబీర్‌ హరి పాయియే మన్‌హీకే పరితీత్‌

‘‘మనిషి గెలుపు ఓటములు మనసు నమ్మకాలను బట్టే ఉంటాయి. గెలుస్తాననే భావన ఉన్నవాడు విజేత అవుతాడు. ఓడిపోతాననే భావన ఉంటే పరాజితుడవుతాడు. అదేవిధంగా మనసులో ఏర్పడిన దృఢమైన విశ్వాసంతో మాత్రమే పరమాత్మను పొందడం సాధ్యమవుతుంది’’ అంటాడు మహాత్మా కబీరు.
మనసు.. మనిషి నియంత్రణలో ఉన్నప్పుడే దృఢమైన సానుకూల నమ్మకాలు సాకారరూపం దాల్చి సత్ఫలితాలు వస్తాయి. అందుకే మనిషి మనసును, దాని ఆలోచనా విధానాన్ని ప్రాచీనకాలంలో మన రుషులు అనేక కోణాల్లో పరిశీలించి.. శరీరాన్నంతటినీ నియంత్రించే సామర్థ్యం కేవలం మనసుకు మాత్రమే ఉందని తేల్చారు. మనసులో ఏర్పరుచుకున్న నమ్మకాలతోనే మన పురాణ పురుషులెందరో మంచి ఫలితాలు పొందిన సంఘటనలు మన పురాణేతిహాసాల్లో కోకొల్లలు.

రామాయణంలో ఆంజనేయుడు రాముణ్నే మనసారా నమ్మి, రామనామాన్ని ఉచ్చరిస్తూ.. సాగరాన్ని అలవోకగా లంఘించి లంకకు చేరుతాడు. సీతమ్మ జాడ తెలుసుకునే క్రమంలో రాక్షసుల గర్వాన్ని అణిచి క్షేమంగా తిరిగి కిష్కింధ చేరుతాడు. జానకీ మాత సందేశాన్ని శ్రీరామచంద్రునికి అందిస్తాడు.

కృష్ణ పరమాత్మను నమ్మిన కారణంగానే పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను విజయవంతంగా పూర్తి చేసుకొని కురుక్షేత్రంలో గెలిచి రాజ్యాన్ని ఏలగలిగారు. అదే కౌరవులు, కృష్ణుణ్ని పరమాత్మగా నమ్మకపోవడం వల్లే ఆయన్ని బంధించ ప్రయత్నించి అభాసుపాలయ్యారు. యుద్ధంలో ఓడిపోయి చరిత్రహీనులుగా మిగిలిపోయారు. అల్పాయుష్కుడైన మార్కండేయుడు గట్టి నమ్మకంతో పరమ శివుణ్ని ఆశ్రయించి మృత్యువుని జయించడమే గాక దీర్ఘాయుష్కుడై గొప్ప తపస్సంపన్నుడయ్యాడు.
మనిషిని, మనసు నమ్మకాలను కేంద్రంగా చేసుకొనే బుద్ధుడు బౌద్ధ ధర్మాలను రూపొందించాడని చెబుతారు. రామునికి ఎంగిలి పండ్లు తినిపించిన శబరి.. శ్రీరాముని దర్శనానికై నమ్మకంతో ఓపికను కూడగట్టుకొని పదమూడేళ్లు ఎదురుచూసి, చివరకు ఆయన్ని దర్శించి ధన్యురాలైంది. ఇలా ఎన్నో గాథలు నేటి యువతకూ ఆదర్శాలు. ఆధునిక వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా.. చేసే పనిపై నమ్మకం ఉండి, చిత్తశుద్ధితో కృషి చేస్తే కోరుకున్న ప్రతి లక్ష్యాన్నీ సాధించవచ్చంటారు.

🔹🔸🔹🔸🔹🔸

మెలకువతో ఉన్నప్పుడు అన్ని విషయాలు తెలుసుకునే 'ఎరుక' నిద్రలో శూన్యస్థితిని ఎందుకు తెలుసుకోవటంలేదు ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"367"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼

*"మెలకువతో ఉన్నప్పుడు అన్ని విషయాలు తెలుసుకునే 'ఎరుక' నిద్రలో శూన్యస్థితిని ఎందుకు తెలుసుకోవటంలేదు ?"*
**************************

*"ఎరుక ఎలాంటిదంటే అద్దంలో ప్రతిబింబించే గుణంలాంటిది. అది నిరంతర ప్రవాహం. అద్దం ఏది ప్రతిబింబించకుండా ఉండలేదు. అద్దం ముందు ఏదీ లేకపోతే ఆకాశాన్నో, శూన్యాన్నో ప్రతిబింబిస్తుంది. అలాగే మనలోని ఎరుక ఏదో ఒక విషయాన్ని తెలుసుకుంటూనే ఉంటుంది. నిద్రలో మనలోని శూన్యస్థితిని తెలుసుకుంటుంది. మనం మెలకువగా ఉన్నప్పుడు కూడా మనలో శూన్యస్థితి ఉంది. అయితే మెలకువలో ఉన్నప్పుడు రూపనామాల మీదవున్న ఇష్టం చేత మన ఎరుక బాహ్య ప్రపంచంపైన ప్రసరిస్తుంది. మనకు రూపనామాలపై ఉన్న ఇష్టాన్నే జపం, ధ్యానంగా మార్చుకుంటున్నాం. బాహ్యంలో బహుముఖంగా ఉన్న ఎరుకను ఒకరూపం, ఒకనామంపై ఉంచడం ద్వారా నెమ్మదిగా అంతర్ముఖమై మనలోని నిశ్శబ్దాన్ని, శూన్యస్థితిని అనుభవించేలా తర్ఫీదునిస్తున్నాం. దైవత్వంలో జీవుడు, దేవుడన్న విభజన లేదు. ఆ రెండిటికీ మధ్య ఉన్న ఎరుకే దైవంగా ఉంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
           🌼💖🌼💖🌼
                 🌼🕉️🌼
        

అన్ని లోపాలు మరియు తప్పులకు మూలం ...

 🕉️ *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏
*భగవాన్ శ్రీ రమణ మహర్షి* చెప్పారు:
💥""అన్ని లోపాలు మరియు తప్పులకు మూలం ఒకరి నిజ స్వరూపాన్ని గ్రహించకపోవడమే. 
ఇది అత్యంత ఘోరమైన తప్పు. 
ఇది మీరు తెలుసుకోవలసిన మొదటి విషయం.💥
(పదమాలై 689).
🙏🌷🙏 *శుభం భూయాత్*🙏🌷🙏
 శ్రీ రమణాశ్రమం నుండి ఉత్తరాలు

లేఖ 57

(57) కర్తురజ్ఞాన ప్రాప్యతే ఫలం (క్రియల ఫలాలు సృష్టికర్తచే నిర్దేశించబడినవి)

11 ఆగష్టు, 1946

సుమారు పది నెలల క్రితం, కృష్ణభిక్షువు తన ఆస్తిని తన సోదరులకు కానుకగా ఇచ్చి, ఆ తర్వాత దానిని తీసుకువెళ్లాలని ఆలోచిస్తున్నట్లు నాకు వ్రాశారు. మరియు దేశం చుట్టూ తిరుగుతూ, తద్వారా మనశ్శాంతి పొందాలని ఆశిస్తూ, భగవాన్ దాని గురించి ఏమి చెబుతాడో అని ఆలోచిస్తున్నాడు. ఈ ఉత్తరం గురించి భగవాన్‌కి తెలియజేసాను.

భగవాన్ మొదట, “అదేనా? అతను చివరకు నిర్ణయించుకున్నాడా?" మరియు కొంతకాలం తర్వాత, " ప్రతి వ్యక్తి యొక్క కర్మ ప్రకారం ప్రతిదీ జరుగుతుంది ."

దీని గురించి నేను ఆయనకు వ్రాసినప్పుడు, కృష్ణభిక్షువు ఇలా జవాబిచ్చాడు: “ కార్తురాగ్నాయ ప్రాప్యతే ఫలం అని చెప్పబడింది., క్రియల ఫలాలు సృష్టికర్తచే నిర్ణయించబడతాయి.' సృష్టికర్త ఏమయ్యాడు?” నేను భగవాన్‌తో దీని గురించి చెప్పడానికి ఇష్టపడలేదు మరియు సమాధానంగా ఏమి వ్రాయాలో ఆలోచిస్తున్నాను.

ఇంతలో, ఒక భక్తుడు భగవాన్‌ని ఇలా అడిగాడు, "'కర్తురాగ్నాయ ప్రాప్యతే ఫలం'లో కర్త (చేసేవాడు) ఎవరు?" భగవాన్ అన్నాడు, “కర్త ఈశ్వరుడు. ప్రతి వ్యక్తికి అతని కర్మలను బట్టి కర్మల ఫలాలను పంచేవాడు. అంటే ఆయన సగుణ బ్రాహ్మణుడు . నిజమైన బ్రహ్మం నిర్గుణ (గుణం లేనిది) మరియు చలనం లేనిది. సగుణ బ్రహ్మానికే ఈశ్వరుడు అని పేరు. అతను ప్రతి వ్యక్తికి అతని కర్మ (క్రియలు) ప్రకారం ఫల (ఫలాలు) ఇస్తాడు.

అంటే ఈశ్వరుడుఒక ఏజెంట్ మాత్రమే. చేసిన శ్రమకు తగ్గట్టుగా వేతనాలు ఇస్తాడు. అంతే. ఈశ్వరుని శక్తి (శక్తి) లేకుండా , ఈ కర్మ (క్రియ) జరగదు.

అందుకే కర్మను జడం (జడము) అని అంటారు.” కృష్ణభిక్షువు ప్రశ్నకు ఇంకా ఏమి సమాధానం చెప్పవచ్చు? అందుకని అతనికి అనుగుణంగా రాశాను.

తన  అతీంద్రియ శక్తులతో, విక్రమార్క బ్రహ్మ లోకానికి వెళ్ళాడు, , బ్రహ్మ సంతోషించాడు, అతనికి ఒక వరం అడగమని చెప్పాడు. విక్రమార్క ఇలా అన్నాడు, “ప్రభూ, మీరు జీవులను సృష్టించినప్పుడు, మీరు వారి గత జన్మలలో వారి చర్యల ఫలితాల ప్రకారం వారి నుదుటిపై వారి భవిష్యత్తు జీవితాన్ని వ్రాస్తారని శాస్త్రాలు బిగ్గరగా ప్రకటిస్తాయి. ఇప్పుడు నువ్వు నాకు వరం ఇస్తానని అంటున్నావు. నా నుదుటిపై ఇంతకుముందే రాసుకున్న దాన్ని రుద్ది మళ్లీ రాస్తావా? లేక ఓవర్ రైటింగ్ ద్వారా సరిచేస్తారా? సరిగ్గా ఏమి చేస్తారు?"

అతని తెలివైన ప్రశ్నకు బ్రహ్మ సంతోషించి చిరునవ్వుతో ఇలా అన్నాడు, “ఇప్పుడు కొత్తగా ఏమీ చేయలేదు. జీవుల కర్మల ప్రకారం ముందే నిర్ణయించబడినది నా నోటి నుండి వస్తుంది. మేము కేవలం, 'అవును, మేము మీకు వరం ఇచ్చాము' అని చెప్పాము. అంతే. కొత్తగా ఏమీ ఇవ్వలేదు. అది తెలియక మన చేతిలో వరాలు కోసం తపస్సు చేస్తుంటారు. మీరు తెలివైన వ్యక్తి కాబట్టి, మీరు రహస్యాన్ని కనుగొన్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నా." అంటూ విక్రమార్కకు బ్రహ్మాస్త్రం అందించి అక్కడి నుంచి పంపించేశాడు. ఈ కథ నా చిన్న రోజుల్లో చదివినట్లు గుర్తు.

భాగవతంలోని పదవ ఖండంలో, శ్రీకృష్ణుడు నందుడికి చేసిన ఉపదేశంలో కూడా అదే ఆలోచన ఇవ్వబడింది: ఇంద్రుడు దేవుడికి బలి ఇవ్వమని.

--కాళిదాసు దుర్గా ప్రసాద్

ఫలితాలను ఏమీ ఆశించక నీ పని నీవు చేయి. నీవు చేయవలసింది అంతే.

 🌺ఓం నమో భగవతే శ్రీ రమణాయ🌻

      ఒక యువకుడు ఏదో కాగితాన్ని మహర్షికి అందించాడు. దానిలో ఏవో ప్రశ్నలున్నవి. సమాధానం కోసం వేచియున్నాడు. ఇతర మహాత్ములు ఎందెందు గలరో తెలిపితే, తాను వారిని దర్శించి వారి వలన మార్గం తెలుసుకొనవలెనని కోరిక అంట.

   ఇంట్లో ఎవరికీ తెలియజేయకుండా, మహాత్ముల ఉపదేశాలవల్ల దైవాన్ని అన్వేషణ చేయ వచ్చినాడు. తనకు దైవం ఏమో, అందుకై అన్వేషణ ఏమో, ఏమీ తెలియదు, నిజం. అందుకే తాను మహాత్ములను దర్శించడం.

   మహర్షి ఆ కాగితాన్ని కుర్రవానికి తిరిగి ఇచ్చి వేస్తూ ఇలా సెలవిచ్చారు ...
 
   “ *నేను ప్రతి ప్రశ్నకూ, అది ఏదైనా సరే, సమాధానం ఇవ్వవలెనన్నమాట; ఇవ్వకపోతే నేను గొప్పవాణ్ణి కాదు.* ”

    ఆ కుర్రవాడు కాగితాన్ని చింపివేసి, మరొకటి వ్రాసి మహర్షికి చూపినాడు :  *"తాము ఉడుతలను, కుందేళ్ళను దయగా చూస్తారు. పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు వానిని లాలిస్తారు. కాని మనుష్యులంటే తమకి ఉదాసీనం ఏమి ? నేను ఇళ్లు విడిచి పదిహేను రోజులుగా ఇక్కడ కాచుకుని పడియున్నాను; కొన్ని రోజులు తిండికూడా లేక పస్తుండినాను. ఎంతో కష్టపడుతున్నాను. అయినా తాము నన్ను కరుణించుట లేదు.* ”

            మహర్షి ఇలా సెలవిచ్చెను ...
  
  ఇటు చూడు. నాలో ఎటువంటి టెలివిజన్ లేదు. దైవం నాకు అటువంటి శక్తిని ప్రసాదించ లేదు. అందుకు నేను ఏమి చేయను? నీ ప్రశ్నలన్నింటికీ జవాబులు ఏమని చెప్పను ? 
  
    జనులు నన్ను మహర్షి అని అంటారు, మహర్షి వలెనే చూస్తారు. కాని నన్ను నేను మహర్షిని అని అనుకోవడంలేదు. అంతేకాదు. నాకు అందరూ మహర్షులే. 
    
     నీవు ఇంత చిన్న వయస్సులో దైవాన్ని అన్వేషిస్తున్నావు. చాల మంచి పని. దైవంపైనే మనసును ఏకాగ్రంగా నిలుపు, ఫలితాలను ఏమీ ఆశించక నీ పని నీవు చేయి. నీవు చేయవలసింది అంతే.

                   🌻ఓం తత్సత్🌺

మంచి మనస్సుతో ఆలోచించే ప్రతివారిలో దేవుడు కొలువై ఉన్నాడని చెప్పవచ్చు.

 అంతరాత్మలోనే పరమాత్మ                                                                                   మనం వెతికే దేవుడు, మనం చూడాలనుకుంటున్న దేవుడు, మనం పూజలు చేస్తున్న దేవుడు కేవలం దేవాలయాల్లో మాత్రమే కాక నీలో, నాలో, ప్రతి అణువులో, దయార్ద్ర హృదయం కల ప్రతివారిలో, నలుగురికి మేలు చేయాలనే సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరిలో ఆ దేవుడు ఉన్నాడు. అందుకే దేహానికి మించిన దేవాలయం లేదు. అంతరాత్మకు మించిన దేవుడు లేడు. నిస్సహాయునికి చేసే సేవలో పరమాత్ముడుంటాడు. మన వేద విజ్ఞానం చాలా గొప్పదని చెప్పవచ్చు. మన వేద ప్రబోధం చాలా విశిష్టమయినది. వేదాలు తరగని సంపదలు. వేదం అంటే కేవలం మంత్రాలే కాదు. వేదాలు ఏ ఒక్కరి సొత్తు కాదు. వేదాలవల్ల జ్ఞానం కలుగుతోంది. సర్వజనహితం కోసం, సర్వజీవుల సముద్ధరణ కోసం ఆ భగవంతుడిచ్చిన జ్ఞానం. వేదం సమస్త హిందూ కులబంధువుల ఆస్తిగా చెప్పవచ్చు. దేహమే దేవాలయమని చెప్పడం ఏ మతానికి సాధ్యం కాదు.

మనకున్న నాల్గు వేదాలు:
ప్రజ్ఞానం బ్రహ్మ - ఋగ్వేదం చెబుతుంది
అహం బ్రహ్మాన్ని - యజుర్వేదం చెబుతుంది
తత్త్వమసి - సాదవేదం చెబుతుంది

ఆయామాత్మా బ్రహ్మ - అధర్వణవేదం చెబుతుంది.
వేదం అంటే ప్రబోధం. అజ్ఞానం నుండి సుజ్ఞానానికి, చీకటి నుండి వెలుతురులోకి నడిపించే దివ్యచైతన్యం. 

జననం నుండి మరణందాకా ఎలా జీవించాలో వేదం చెబుతుంది. మనిషికి సుఖాన్ని ఇచ్చేది మనస్సు. డబ్బు ఎంతమాత్రం కాదు. అన్నింటికి మనస్సే కారణమవుతుంది. మనం చూస్తున్న, వింటున్న ఈ భూమండలమంతటా ఆ పరమాత్మ ఉన్నాడు.

 అంతం లేనటువంటి నాశనం కాని సృష్టిస్థితి లయకారకుడయిన ఆ పరమాత్మను తప్పక ధ్యానించాల్సిందేమరి. ఆ లయకారునికి కంఠమునకు క్రిందిభాగాన, నాభికి పనె్నండు అడుగులపై హృదయ కమలం వుంటుంది. ఆ హృదయ కమలం అనంతమయిన ప్రకాశంతో వుంటుంది. ఇదియే పరబ్రహ్మము. ఆ కమలములో తమ్మి మొగ్గవంటి హృదయం వుంటుంది. ఇది క్రిందికి వేలాడుతూ వుంటుంది. దీనిలోనే సర్వజగత్తు ప్రతిష్ఠించబడి ఉంటుంది. సుషుమ్ననాడికి మధ్యగా ఉన్నటువంటి దీని హృదయకాంతులు నలువైపులా ప్రసరిస్తూ ఉంటాయి. శరీరం చలించడానికి ఇదే మూలకారణం.

 దీనికి మధ్యలో ఉన్న హృదయకమలంలో జఠరం వద్ద ఈ ప్రకాశవంతమైన కాంతి ప్రభావం శరీరం మొత్తం వ్యాపించి దేహాన్ని ఎల్లప్పుడూ వేడిగా ఉంచుతుంది. ఈ వేడివల్లనే మనస్సు (బుద్ధి) పనిచేస్తుంది. మనిషి తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది.

ఈ తమ్మిమొగ్గవంటి హృదయంలో వరిముల్లు అంతటి పరిమాణంలో గల మెరుపుతీగ వంటి పసుపుపచ్చని రంగుగల దివ్యమైన కాంతి, అణుసమానమై వర్ణించడానికి వీలులేనంతగా ప్రకాశిస్తూ ఉంటుంది. చూడలేనటువంటి ఈ దివ్యకాంతికి మధ్యన పరమాత్మ ఉంటాడు. దీనినే ‘‘పరంజ్యోతి’’ అంటారు. ఈ పరమాత్మయే బ్రహ్మ! శివుడు! విష్ణువు! ఇంద్రుడు! ఇలాంటి పరమాత్మ నాశనం లేనటువంటిది. చాలా ఉన్నతమయినది. స్వయం ప్రకాశం కలదని చెప్పవచ్చు. ప్రణవ స్వరూపమయిన పరబ్రహ్మ ఈ హృదయంలోనే ఉంటాడు. శక్తికిమూలం ఇదే.

అందుకే ఋగ్వేదం ప్రజ్ఞానమే బ్రహ్మ అని చెబుతుంది. యజుర్వేదం చెప్పే అహం బ్రహ్మస్మికి కూడా అర్థం ఇదే. తత్త్వమసి (తత్+త్వం+అసి) నీవే ఆ పరబ్రహ్మవంటున్నది సామవేదం.

 ఆయామాత్మా బ్రహ్మ అంటున్న అధర్వణార్థం కూడా ఇదేనని చెప్పవచ్చు.

 ఈ ఆత్మయే బ్రహ్మ. మనిషి దేహంలోనే దేవుడు ఉన్నాడు. 

మంచి మనస్సుతో ఆలోచించే ప్రతివారిలో దేవుడు కొలువై ఉన్నాడని చెప్పవచ్చు.

💐💐💐💐💐💐💐💐

మనకు వచ్చే ఆలోచనలు రెండు రకాలు.1)మంచివి2)చెడ్డవి.

 మనకు వచ్చే ఆలోచనలు రెండు రకాలు.1)మంచివి2)చెడ్డవి.
       1) మంచి ఆలోచనలు.మూడు రకాలు
A) మనస్సుకి శాంతిని చేకూర్చేవి 
B) ఇతరుల పట్ల దయ, కరుణ ప్రేమ,జాలి కలిగించేవి
C)ఎలాంటి కోరికలు లేనటువంటివి.
   ఇవి కలిగి వుంటే పెంపొందించు కోవాలి.లేనివి కలిగించుకోవాలి.
 వీటిలో నివాసం వుండాలి.వీటితో బంధం కలిగి వుండాలి.వీటినే మననం చేసుకోవాలి.
2) చెడ్డ ఆలోచనలు.ఇవి మూడు రకాలు
A) రకరకాల కోరికలతో నిండినవి
B) కోపాన్ని తెచ్చి పెట్టేవి
C) హింసాత్మక మైనవి.
      కలిగిన వాటినుండి విముక్తి పొందాలి. క్రొత్తవి పుట్టకుండా చూడాలి.
   వీటితో కుస్తీ పడొద్దు.అణచ వద్దు.వీటిని పట్టించుకోకండి, సాక్షిగా వుండండి.
     ఇట్లు
షణ్ముఖానంద 9866699774

"నేను" లేకపోతే ప్రపంచం లేదు.

 "నేను" లేకపోతే ప్రపంచం లేదు.☝

ఇవి పరమశివుడే స్వయంగా చెప్పిన మాటలు కనుక మనం ఏమాత్రం సంశయం లేకుండా విశ్వసించాలి. ప్రపంచం మిథ్య అంటే అవన్నీ అబద్ధం అని కాదు. మనలోని ఆత్మ అనే ఆధార వస్తువు ఉంటేనే అవి ఉన్నాయని భావం. కాబట్టి మనం (ఆత్మ) ఆధారంగా లేకుండా ఏవీ ఉండవని అర్థం. దాన్నే "నేను లేకుండా ఏదీ లేదు" అని చెప్పారు. వ్రతాలు, పూజలు, జపతపాది క్రియాకలాపాలు అన్ని మనం చేస్తేనే ఉంటాయి. మనం లేకపోతే అవేవీ లేనట్లే. ఒక్క మనిషికే కాదు, సమస్త ప్రాణులకు ఈ ప్రపంచం తనతోనే మొదలవుతుంది !

జ్ఞానమే అంతిమఫలంగా నిలుస్తుంది !

ఆత్మబోధనలో ఎందుకంత ఉన్నత స్థాయి మాటలు చెప్పారంటే... గురువు, దైవం ఎప్పుడూ తాము గొప్పగా ఉండి పూజలందుకోవాలని భావించరు. మనందరిని అంత ఉన్నతులుగా మార్చాలన్నదే వారి దృక్పథం. అందుకు అవసరమైన జ్ఞానాన్ని అందించడమే ఇక్కడ ఋభుమహర్షి ఉద్దేశ్యం. ఉపదేశాలు, మంత్రాలు , సాధనామార్గాలన్నీ మన ప్రారబ్ధంలోనివి. అవి ఏఏ పద్ధతుల్లో ఎన్ని చేసినా మనకు కలిగే జ్ఞానమే అంతిమఫలంగా ఉంటుంది. మనకు కలిగే అవగాహనే ఆ జ్ఞానంగా  పరిణమిస్తుంది !

ప్రపంచానుభవం నీ విలువ నీకు తెలుసుకోడానికే !!

మనం దేన్నైనా 'అది' అని అంటున్నామంటేనే.. అలా అనటానికి మనం ఉండి తీరాలి. నిద్రలో మనం ఉన్నట్లు మనకు తెలియదు. మన పంచేంద్రియాలు ఏవీ అప్పుడు పనిచేయవు. నిద్రలో ప్రపంచమే కాదు మనం ఉన్నట్లే మనకు తెలియడం లేదు. ఈ ఏర్పాటు అంతా మనం ఉన్నట్లు మనకి తెలియడానికే. జాగృతిలో ప్రపంచానుభవం ఎందుకు కలుగుతుందంటే నీ విలువ నీకు తెలుసుకోడానికే. ఈ సృష్టి అంతా భగవంతుని శక్తి చాటుకోవడానికి కాదు, అసలు వస్తువు విలువ తెలుసుకోడానికే !!

నేనున్నాను అని తెలియడం కోసమే ఈ సుఖ-దు:ఖాల ఏర్పాటు !!

ఈ ప్రపంచం ఏర్పాటే మనని మనం తెలుసుకోవడానికి. మన అనుభవాలు ఏవైనా ఫలితం మాత్రం సుఖమో, దుఃఖమో ఉంటుంది. నేనున్నాను అని తెలియడం కోసమే ఈ సుఖ, దు:ఖాల ఏర్పాటు. అవన్నీ మానసిక ప్రక్రియలు. మనం కావాలనుకునే సుఖం, మనం వద్దనుకునే దుఃఖం రెండూ నిద్రలో ఉండటం లేదు. "నా వల్ల నీవు లేవు. నీ వల్లనే నేనున్నట్లు తెలుసుకుంటున్నావు" అని ప్రపంచం బోధిస్తుంది. ఇది సృష్టిలోని సూత్రం. కాబట్టే పరమసత్యంలో భగవంతుడు అన్న భావంతో సహా అన్నీ మిథ్యేనని చెప్పారు !

ఈ ప్రపంచం 'అసలు నేను" ఏమిటో తెలియజేయడానికి వచ్చింది !!

పరమేశ్వరుడి కళ్యాణగుణాల్లో వినయం అత్యంత ఉన్నతమైనది. అదే  మనకు హనుమంతుడి అవతారంలో అత్యున్నతంగా కనిపించే గుణం.  ఈశ్వరస్వరూపుడైన గురువులో కూడా అదే వినయం ఉంటుంది. ఆయన తన ఘనతతో వ్యక్తం కావాలనుకోరు. వారి ఘనతను మనమే గుర్తించి గౌరవించాలి. ఈ ప్రపంచం "నేను"ని పెంచడానికి కాదు. "అసలు నేను" ఏమిటో తెలియజేయడానికి వచ్చింది. మిథ్య అంటే ప్రపంచం లేదని కాదు ! "నేను" (ఆత్మ) లేకుండా ఏదీ లేదని !!

అనుభవాలన్నీ మనం ఉంటేనే ఉన్నాయి !!

"'నేను'" అనే భావం ఉండగా నిప్పు సెగకే భరించలేని దేహం, అందులోని ప్రాణం పోయిన తర్వాత చితిలో కాలుస్తున్నా కించిత్ నొప్పిని అనుభవించడం లేదు. 'నేను' లేకుండా నన్ను ఏమీ చేయజాలని అగ్ని మిథ్యే. అగ్నికి శక్తి స్వతహాగా ఉందా ? నీవల్ల వచ్చిందా ? భయపెట్టే శక్తి సముద్రానికి ఉందా ? నీవల్ల వచ్చిందా ? మనకు ప్రపంచంవల్ల కలిగే అనుభవాలన్నీ మనం ఉంటేనే ఉంటాయి. ఇప్పుడు మనం 'నేను'ను కష్టంతో , సుఖంతో, సంతోషంతో, దుఃఖంతో కలిపి చూస్తున్నాం. వాటిని వదిలితే అక్కడున్నది అసలు "నేనే" ! 'నేను'ను కష్టంగా తెలుసుకుంటున్నాం. కష్టం ఎవరికో చూస్తే 'నేను' సమాధానంగా వస్తుంది !

మనసుకు అతీతంగా మన ఉనికి ఘనత తెలియాలి !

సద్వస్తువు వద్ద శూన్యత (వెలితి) లేదు. అప్పటి వరకూ వెలితి తప్పదు. అందుకే మనం ఆ వెలితిలేని స్థితికి చేరుకునే వరకు ఏదో ఒకటి మనసుకు వెలితిగానే ఉంటుంది. మనం ఉన్నతంగా భావించే బుద్ధి, వివేకం, వివేచన అన్నీ మనతోనే ముడిపడి ఉన్నాయి. అవన్నీ మిథ్యే అనటంలో ఉద్దేశం, అవి అక్కర్లేదని కాదు. వాటికి అతీతంగా మన ఉనికి యొక్క ఘనతను చెప్పడం. మనవద్ద ఉన్న ఆయుధాలు రెండే.. ఒకటి మనసు, రెండు శుభేచ్ఛ. అవి రెండూ నేను లేకుండా లేవు. సాధకుడు చేసే ధ్యానం, పొందే అత్యున్నత సమాధిస్థితి రెండూ మనసుతో జరిగేవే. శుభేచ్చతో జరిగేవే !

స్వీయజ్ఞానం కోసమే ధ్యానం, సమాధి !!

ధ్యానం, సమాధి ఉన్నతమైనవే. కానీ వాటి ఉపయోగం మనను గురించి మనం తెలుసుకోడానికేగాని ఆస్థితిలోనే ఉండిపోవాలనిపించడం కాదు. ఎందుకంటే తత్ సమాన స్థితిని నిద్రలో రోజూ పొందుతూనే ఉన్నాం. తేడాఅల్లా నిద్రలో తెలియకుండా జరుగుతుంది. సాధనలో తెలిసి జరుగుతుంది. ధ్యానం, సమాధివల్ల ప్రపంచంలో సుఖదుఃఖాలకు నీవే మూలం అని తెలుస్తుంది. అంతేగానీ అవి సుఖదుఃఖాలను తప్పించుకునే మార్గాలుకావు. అలా చేస్తే టీచర్ కొడుతున్నాడని బడి మానేయడంలాంటిదే అవుతుంది !

సహజ ధ్యానం సిద్ధించే వరకూ ధ్యానం కూడా ఒక అనుభవమే !!

నిద్రను ఎవరూ తెచ్చుకోలేరు. దానంతట అది రావాల్సిందే. నిజానికి నిద్ర అనే ఒక ప్రత్యేక అనుభవం అంటూ ఏదీలేదు. మనసు అన్ని అనుభవాల నుండి పొందే ఉపసంహరణే నిద్రగా పరిణమిస్తుంది. అదే పనిని మన ప్రయత్నంతో చేస్తే అది ధ్యానంగా పరిమళిస్తుంది. అది ప్రయత్నంతో పనిలేని సహజ ధ్యానంగా మారేవరకూ... మనకు ఉన్న అనేక అనుభవాల్లాగానే ధ్యానం కూడా ఒక అనుభవంగా ఉంటుంది. అందుకే మనలోని ప్రాపంచిక భావాలను, భయాలను తీసేయడానికి అవసరమైన అనుభవాలకోసం  గురువు/దైవం భౌతిక సంఘటనలనే  వాడుకుంటారు !

ఆత్మవస్తువుకు వచ్చిన కొదువలేదు !!

జ్ఞానాజ్ఞానములు రెండూ బ్రహ్మమేనని చెప్పటంలో ఎంతో ఉన్నతమైన సత్యం ఇమిడి ఉంది. చంటి పిల్లాడు జ్ఞానా ? అజ్ఞానా ? జ్ఞానం యొక్క ప్రమేయం తెలియకుండా అజ్ఞానాన్ని ఎలా నిర్వచించగలం. ఇప్పుడు దేన్నైతే అత్యున్నతమైన జ్ఞానంగా భావిస్తున్నారో అది లేకపోవడం అజ్ఞానం అనుకుంటున్నాము. కాని ఆ రెండు స్థితులు ఉన్నా లేకున్నా ఆత్మవస్తువుకు వచ్చిన కొదువలేదు. కనుక జ్ఞాని, అజ్ఞాని ఇద్దరూ బ్రహ్మస్వరూపాలే అవుతారు. స్వస్వరూపం తెలియడం, తెలియకపోవడం అనే వ్యత్యాసం తప్ప ఆ భగవంతుని సృష్టిలో దేనిలోనూ న్యూనతకు తావులేదు. అందుకే తన స్వరూపం తెలిసిన జ్ఞాని అందరినీ బ్రహ్మస్వరూపంగా గౌరవంతో చూస్తారు !

గమనించడం అనేది పరిణామ క్రియ !!

మనకి దైవాన్ని చూడాలనో, ఇంకా చూడలేదనో ఒక భావం ఉంటుంది. తెలియని వస్తువు విషయంలో మనకా ఆలోచన రాదు. ఒక విలువైన వస్తువు గురించి తెలిసిన తర్వాత అది గోచరం అయ్యే వరకూ ప్రయత్నం ఉంటుంది. గోచరించడం అంటే మనకు స్పృశించేది, కనిపించేది, వినిపించేది, గమనించగలిగేది. గమనించడం అనేది మానసికంగా జరిగే పరిణామ క్రియ. ఒక విషయంలోకి లోతుగా చూడటం పరిశీలన అవుతుంది. మామిడి పండును చూసి తెలుసుకుంటాం. తర్వాత దానిని తిని రుచిని తెలుసుకుంటాం. ఆ రుచిలోని మాధుర్యాన్ని తెలుసు కుంటాం. ఇదంతా గమనింపులో వివిధ దశల్లో జరిగే ప్రక్రియ. దైవం విధాయంలోనూ ఉన్నాడని తెలియడం, ఎలా ఉన్నాడో తెలియడం, ఎక్కడ ఉన్నాడో తెలియడం... ఇలా సాగి ఒక రోజుకి నాతోనే, నాలోని, నాగానే ఉన్నాడని గమనింపులోకి వస్తుంది !

అనుభవాలన్నీ... చిన్మాత్రలే !!

బ్రహ్మము నిరంతర చైతన్య స్వరూపము. అది ఎప్పుడూ స్థబ్దుగా ఉండదు.  అది నిరంతర చైతన్య ప్రవాహంగా ఉంటుంది. అందుకే ద్రవ్యం కూడా చిన్మాత్రము అన్నారు. ద్రవ్యం అంటే కేవలం డబ్బు అని కాదు. ఈ సృష్టిలో మనకు ఉపయోగకరంగా ఉన్న ప్రతీదీ చిన్మాత్రమే. అలాగే కాలం అంటే మనం గడియారాలతో లెక్కించే కొలతకాదు. మన అనుభవాలకు కారణమైనది అని. అనుభవమే కాలం. అనుభవాలన్నీ చిన్మాత్రములే. సూర్యుడు నిత్యప్రకాశి. మరి ఉదయాస్తమయాలు రెండూ అసత్యం. అయినా మనకు అనుభవంలోనివి కనుక చిన్మాత్రలే అవుతాయి !

భావంగా తప్ప నిజంగా బంధం లేదు !!

భగవంతుడు దయామయుడు. కఠిన సాధన చేయమనడు. మనం ఇప్పటికే చేస్తున్నవే, చేయగలిగినవే సాధనగా చెప్తున్నాడు. చూసేది , చూడబడేది, తెలిసేది, తెలుసుకునేది అన్ని చైతన్య ప్రవాహంలో భాగాలే కనుక చిన్మాత్రము కాకుండా ఏదీలేదని గుర్తిస్తే చాలు. అనుభవంగా గోచరించే ప్రతి చైతన్యక్రియలోనూ చిన్మాత్రమే ఉంది. జ్ఞానమార్గంలో బంధం, మోక్షం రెండూ లేవని చెప్తారు. అంటే... ఒకటి ఉందనుకుంటేనే మరొకటి ఉందని గుర్తించమని బోధిస్తున్నారు. బంధంలేని స్థితి మోక్షం. మోక్షం కానిస్థితి బంధం. ఏ ఒక్కటి భావించకపోయినా రెండోదానికి ఉనికి లేదు. ఇది తెలుసుకొని భావంగా తప్ప నిజంగా బంధం లేదని గుర్తిస్తే మనం బ్రహ్మముగానే ఉన్నామని తెలుస్తుంది !

         🙏జై యోగేశ్వర్.🙏

దైవ సాక్షాత్కారం

 ॐశ్రీవేంకటేశాయ నమః
💝 ”దైవ సాక్షాత్కారం”
💖 ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం.
 💕 ~శబ్దం .
💖 వాయువుకు  ఉన్నగుణాలు రెండు.
 💕 ~శబ్దము, స్పర్శ.
💖 అగ్నికి ఉన్న గుణాలు మూడు.
 💕 ~శబ్ద, స్పర్శ, రూపములు.
💖 జలముకు ఉన్న గుణాలు నాలుగు.
 💕 ~శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.
💖 భూమికి ఉన్న గుణాలు ఐదు..
 💕 ~శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.
💞 ~ఈ ఐదు గుణాలూ
పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి.
💓 కనుకనే.. మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.
💖 జలము
💞 ~’గంథము’అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల మనం నీటిని చేతితో పట్టుకోలేము.
💕 నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం.
~కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగానీ..మనం బంధించలేము.
💖 అగ్ని
💞 ’రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవలన..అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ..కనీసం తాకనైనా తాకలేము..
💓 తాకితే శిక్షిస్తుంది
 💖 వాయువు
💕 ’రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవలన …మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము.
💓 వాయువే తనంతట తాను మనలను స్పృశించి..తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.
💖 ఆకాశం
💕 ’రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల అది మన కళ్ళకు కనిపించకుండా..తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.
💝 కేవలం..
💖 ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు..
💕 ఏ గుణమూ లేని..
💞 ~’నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు?
💝 ఆయన్ని చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి.
💖 దాన్ని తెరవాలంటే…..
 💕 ~పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను….
💞 ~అంటే ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి.
💝 అప్పుడు.
💞 ~నీవు నిర్గుణుడవు అవుతావు.
💓 ’నిర్గుణుడు’
💕 ~అంటే”పరమాత్మ”
💝 ~నిన్ను నీలోనే దర్శించుకుంటావు.
💖 అదే.. ‘అహం బ్రహ్మాస్మి’ అంటే...!
💞 ~’నిన్ను నీవు తెలుసుకోవడమే’.
 💝 దైవాన్ని దర్శించడమంటే...అదే..!
 💖 ”దైవ సాక్షాత్కారం” అంటే ఇదే కదా…!
❤️ ॐశ్రీవేంకటేశాయ నమః
~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి

కష్టం-హాయి

 కష్టం-హాయి

బాబు: మిలారేపా కష్టపడి పొందాడని, మనమూ కష్టపడి పొందాలని రూలేమీ లేదు. హాయిగా కూడా పొందవచ్చు....

నిజానికి "పొందటం" అనే క్రియ లేనే లేదు.

యెందుకంటే "అదే నేను" అనే అవగాహన పొందటమే సాక్షాత్కారం.

1. రవి: ఆ అవగాహన వచ్చే వరకు కష్టపడాల్సిదే  కదా?

బాబు:   జేమ్స్ వాట్ కష్టపడి రైలును కనిపెట్టాడు.
అందులో హాయిగా కూర్చొని  ప్రయాణిస్తే చాలు.... మళ్లీ మనం కష్టపడి,,రైలును  కనిపెట్టి, ప్రయాణించవలసిన అవసరం లేదు.

సద్గురు వాక్యమే గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణ సాధనం.' ' 

"పొందటం" అనేది compulsory గా జరిగేదే.
ఆ దిశగానే మన ప్రయాణం సాగేది.

ఆ ప్రయాణాన్నే "జీవితం" పేరుతో మనం అనుభవిస్తుండేది...

నీకు ఇష్టమున్నా లేకున్నా నీ పుట్టుక ప్రయోజనం పూర్తయ్యే తీరుతుంది....అన్న భగవాన్ వాక్కే ప్రమాణం.

వస్తుప్రయోజనం వస్తువుది కాదు,
వస్తువును ఉపయోగించేవానిదే.

అలా భగవంతుని చేతిలో నీవొక పరికరం.
నీ పుట్టుక ప్రయోజనం నీది కాదు; దేవునిది.

మోక్షం అనేది ప్రతి జీవి జన్మహక్కు.
దానికై ఎట్టి ఆందోళనా, ప్రయత్నమూ అవసరం లేదు.

ఈ ఒక్క మోక్షం తప్ప, మిగతా వాటికై కష్టపడండి అవసరమైతే.
ఇదే మోక్షసన్న్యాసయోగం అంటే.

ఏడవకు...
నేనొకడు ఉన్నానని గుర్తుంచుకో చాలు...
నిన్ను ఏ పాపమూ అంటనీకుండా మోక్షమిచ్చే బాధ్యత నాది....

ఇదే భగవద్గీత చరమగీతం.

బుజ్జగింపు, ధ్యానం సమస్య ను పరిష్కరిస్తుంది, బుజ్జగిస్తది కూడా.

::::::::: బుజ్జగింపు::::::::

మనందరం పనితనం నుండి బుజ్జగింప బడుతూ పెరిగినాము.
ముఖ్యంగా అమ్మ గారాబంగా బుజ్జగించేది. అప్పుడు అన్ని సమస్యలు, బాధలు, భయాలు మరచి అమ్మ ఒడిలో నిద్ర పోయేవాళ్ళం.
ఇలా బుజ్జగింప బడుతూ పెరిగిన మనకు జీవితం లో ఏ సమస్య వచ్చినా బుజ్జగింపు కొరకు ఎదురు చూడటం అలవాటు అయింది.
ఇది ఎలా తయారు అయింది అంటే...
1) సమస్య బుజ్జగింపు ముడి వేయబడి ఒకటి లేకుండా మరొకటి వుండదు.
2) సమస్య పరిష్కారం కన్నా ముందు మనకు బుజ్జగింపు కావాలి.
3) బుజ్జగింపు కొనసాగుతూ వుంటే సమస్య పరిష్కారం అవ్వకున్నా పర్వా లెదు
4) బుజ్జగింప బడటం కోసం అవసరం అయితే సమస్య కొని తెచ్చుకుంటాం.అంత రుచి అయినది మరి
5) సమస్య పెట్టే ఇబ్బంది/ కష్టం/నష్టం కన్నా , బుజ్జగింపు దొరక్క పోతే వచ్చే బాధ భరించ లేనిది.
6) సమస్య పరిష్కారానికి బుజ్జగింపుకి సంబంధం లేదు. ఇది సమస్య ను పరిష్కారించదు కూడా అయినా పరిష్కారం కన్నా ముందు బుజ్జగింపు కై ఎదురు చూస్తాం .
ధ్యానం సమస్య ను పరిష్కరిస్తుంది, బుజ్జగిస్తది కూడా.

ఇట్లు
పశివాడు లేని పశితనం

సేకరణ

మనకు ఎక్కువగా కలిగే భయాలు,ఆందోళనలు, ఊహాజనితాలు. ధ్యానం ఊహా ను అంతం చేస్తుంది

 పంచేంద్రియాలు వాటి వాటి విషయాలతో సంపర్కం లోకి వచ్చినప్పుడు విజ్ఞానం కలుగుతుంది.(కన్ను, ఎదురుగా ఉన్న దృశ్యం, ఈ రెంటి సంపర్కం చేత ఇది ఫలానా అన్న జ్ఞానం కలుగుతుంది)
      ఈ మూడింటి కలయిక (కన్ను, దృశ్యం, విజ్ఞానం) యెక్క ఫలితం స్పర్శ.దీని ఫలితం అనుభూతి.అనగా వేదన .
       కనుక వర్తమాన క్షణంలో ఇంద్రియాలకు సంబంధం లేకుండా కలిగే అనుభవాలు ఊహాజనితాలు,అభౌతికాలు.
         మనకు ఎక్కువగా కలిగే భయాలు,ఆందోళనలు,
ఊహాజనితాలు. ధ్యానం ఊహా ను అంతం చేస్తుంది

          ఇట్లు
కర్త లేని క్రియ

క్వాంటం ఫిజిక్స్ కోణం నుండి మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని ప్రభావితం చేసే 7 విషయాలు

క్వాంటం ఫిజిక్స్ కోణం నుండి మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని ప్రభావితం చేసే 7 విషయాలు :

1 - ఆలోచనలు

ప్రతి ఆలోచన విశ్వానికి ఒక ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తుంది మరియు ఈ ఫ్రీక్వెన్సీ ఎక్కడి నుంచి వచ్చిందో అదే మూలానికి తిరిగి వెళుతుంది. అంటే, ఫ్రీక్వెన్సీ విడుదల చేసిన వారివద్దకే మళ్ళీ వచ్చి చేరుతుంది. అందువలన, మీరు ప్రతికూల ఆలోచనలు, నిరుత్సాహం, విచారం, కోపం, భయం ఫ్రీక్వెన్సీ విడుదల చేస్తే , ఇవన్నీ మీకు తిరిగి మీ వద్దకే వస్తాయి. అందుకే మీరు మీ ఆలోచనల నాణ్యతను జాగ్రత్తగా చూసుకోవడం మరియు మరింత సానుకూల ఆలోచనలను ఎలా పెంపొందించుకోవాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం.

7 things that affect your vibration frequency from the point of view of quantum physics :

1 - Thoughts

Every thought emits a frequency to the universe and this frequency goes back to origin, so in the case, if you have negative thoughts, discouragement, sadness, anger, fear, all this comes back to you. This is why it is so important that you take care of the quality of your thoughts and learn how to cultivate more positive thoughts.

2. మీ పర్యావరణం

మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని నేరుగా ప్రభావితం చేస్తారు. మీరు సంతోషంగా, సానుకూలంగా మరియు స్థిరమైన వ్యక్తులతో మిమ్మల్ని చుట్టుముట్టినట్లయితే, మీరు కూడా ఈ కంపనంలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు, మీరు ఫిర్యాదు చేసే, గాసిప్ చేసే మరియు నిరాశావాదులతో మిమ్మల్ని చుట్టుముట్టినట్లయితే, జాగ్రత్తగా ఉండండి! నిజానికి, అవి మీ ఫ్రీక్వెన్సీని తగ్గించగలవు మరియు అందువల్ల ఆకర్షణ నియమాన్ని మీకు అనుకూలంగా ఉపయోగించకుండా నిరోధించగలవు.

2. The Companies

The people around you directly influence your vibration frequency. If you surround yourself with happy, positive and determined people, you will also enter this vibration. Now, if you surround yourself with people complaining, gossiping and pessimist, be careful! Indeed, they can reduce your frequency and therefore prevent you from using the law of attraction in your favor.

3 - సంగీతం

సంగీతం చాలా శక్తివంతమైనది. మీరు మరణం, ద్రోహం, విచారం, విడాకులు గురించి మాట్లాడే సంగీతాన్ని వింటూ ఉంటే, ఇవన్నీ మీ అనుభూతులపై ప్రభావాన్ని కలిగిస్తాయి. మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. అందువలన, మీరు వినే సంగీతం యొక్క సాహిత్యంపై శ్రద్ధ వహించండి,  మరియు గుర్తుంచుకోండి: మీరు మీ జీవితంలో ఎలాంటి భావాలు ఫీల్ అవుతున్నారో అవే ఖచ్చితంగా ఆకర్షిస్తారు.

3 - The Music

Music is very powerful. If you only listen to music that talks about death, betrayal, sadness, abandonment, all this will interfere with what you are feeling. Pay attention to the lyrics of the music you listen to, it could reduce your vibration frequency. And Remember: you attract exactly what you feel in your life.

4. మీరు చూసే విషయాలు

మీరు దురదృష్టాలు, మరణించినవి, ద్రోహాలు మొదలైన వాటితో వ్యవహరించే ప్రోగ్రామ్‌లను చూసినప్పుడు, మీ మెదడు దీనిని వాస్తవికతగా అంగీకరిస్తుంది మరియు ఆ వాస్తవికతకు సంబంధించిన కెమికల్స్ ని మీ శరీరంలోకి విడుదల చేస్తుంది, ఇది మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని ప్రభావితం చేస్తుంది. మీకు మంచి అనుభూతిని కలిగించే మరియు అధిక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ చేయడంలో మీకు సహాయపడే అంశాలను చూడండి.

4. The Things You Look At

When you look at programs that deal with misfortunes, dead, betrayals, etc. Your brain accepts this as a reality and releases a whole chemistry into your body, which affects your vibration frequency. Look at things that do you feel good and helps you vibrate at a higher frequency.

5 - వాతావరణం

ఇంట్లో లేదా పనిలో ఉన్నా, మీరు గజిబిజిగా మరియు మురికిగా ఉన్న వాతావరణంలో ఎక్కువ సమయం గడిపినట్లయితే, అది మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని కూడా ప్రభావితం చేస్తుంది. మీ చుట్టూ ఉన్న వాటిని మెరుగుపరచండి, మీ వాతావరణాన్ని నిర్వహించండి మరియు శుభ్రం చేయండి. మీరు మరిన్నింటిని స్వీకరించడానికి సరిపోతారని విశ్వానికి చూపించండి. మీకు ఇప్పటికే ఉన్నవాటిని జాగ్రత్తగా చూసుకోండి!

5 - The Atmosphere

Whether it's at home or at work, if you spend a lot of time in a messy and dirty environment, it will also affect your vibration frequency. Improve what surrounds you, organize and clean your environment. Show the universe that you are fit to receive much more. Take care of what you already have!

6 - వాక్కు

మీరు అనవసరంగా గానీ, తప్పుగా గానీ ఇతరుల గురించి, విషయాల గురించి, జడ్జ్ చేసినా, కంప్లైట్లు చేసినా, కామెంట్లు చేసినా, అది మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని ప్రభావితం చేస్తుంది. మీ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా పెరగాలంటే, ఇతరుల గురించి ఫిర్యాదు చేయడం మరియు చెడుగా మాట్లాడే అలవాటును తొలగించడం చాలా అవసరం. కాబట్టి కథలు అల్లడం మరియు బెదిరింపులకు దూరంగా ఉండండి. మీ జీవితంలోని ఎంపికలకు మీరే బాధ్యతను స్వీకరించండి!

6 - THE WORD

If you claim or speak wrong about things and people, it affects your vibration frequency. To keep your frequency high, it is essential to eliminate the habit of complaining and bad talking about others. So avoid drama and bullying. Assume your responsibility for the choices of your life!

7 - కృతజ్ఞత

కృతజ్ఞతలు తెలుపుకోవడం అనేది, మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. కృతజ్ఞతలు తెలుపడం అనే అలవాటు మీ జీవితంలో చేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన అలవాటు. ప్రతిదానికి ధన్యవాదాలు చెప్పడం ప్రారంభించండి, మంచి విషయాలకు మరియు మీరు చెడుగా భావించే వాటికి కూడా, మీరు అనుభవించిన అన్ని అనుభవాలకు ధన్యవాదాలు చెప్పండి. కృతజ్ఞతలు తెలుపడం అనేది మీ జీవితంలో మంచి విషయాలు సానుకూలంగా జరగడానికి ద్వారాలు తెరుస్తుంది

7 - GRATITUDE

Gratitude positively affects your vibration frequency. This is a habit you should integrate now into your life. Start to thank for everything, for the good things and what you consider to be bad, thank you for all the experiences you've experienced. Gratitude opens the door for good things to happen positively in your life

రామాయణం లో… వనవాసం 14 ఏళ్ళే ఎందుకు?

 🙏🙏🕉️🕉️🌹🌹

🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸
రామాయణం లో…

      వనవాసం 14 ఏళ్ళే ఎందుకు?
                   ➖➖➖✍️

మంథర రాముడిని 14 ఏళ్ళు మాత్రమే వనవాసానికి పంపడానికి కారణం ఏమిటో తెలుసా?

రామాయణంలో మంధర పాత్ర అతి కీలకమైంది. ఇప్పటికీ చెప్పుడు మాటలు ఎవరు చెప్పినా వెంటనే వారిని మంథరతో పోలుస్తారు. 

శ్రీరాముడి పట్టాభిషేకాన్ని ఆపి, వనవాసానికి పంపి.. రామాయణంలో ముఖ్యమైన ఘట్టానికి కారణమైన వ్యక్తి మంథర. 

ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో ఎవరికీ తెలియదు.. కానీ కైకేయి పుట్టింటి నుంచి ఆమెతో పాటు దాసిగా అయోధ్యలో దశరథుడి ఇంట అడుగు పెట్టింది.

నిజానికి రామాయణంలో మంధర ఒక చిన్న పాత్ర. కానీ రామాయణ కావ్యాన్ని మలుపు తిప్పిన పాత్రగా మిక్కిలి ప్రసిద్ధి పొందింది. 

నిజానికి రాముడికి పట్టాభిషేకం జరిగితే రామాయణం ఎంతో కాలం సాగేది కాదు! 

 కావచ్చు. అలా జరగకుండా చేయటానికి ఈశ్వర సంకల్పంగా వచ్చిన పాత్ర మంథర. మంథర గురించిన పూర్తి వివరాలు వాల్మీకి మహర్షి చెప్పలేదు. అయితే మహాభారతంలో మంథర గత జన్మ తాలుక కొంత సమాచారం దొరుకుతుంది.

మంథర దుందుభి అనే గంధర్వ కన్య. రావణుడి చేత బాధింప బడిన అనేక మందిలో దుందుభి ఒకరు. దుందుభి బ్రహ్మని ప్రార్ధించింది.   దీంతో బ్రహ్మ దుందుభికి వరం ఇచ్చాడు. వచ్చే జన్మలో నీ మాటల కారణంగా రావణుడు.. రాముడి చేత మరణం పొందే అవకాశం ఉంది. 
ఇది మంథర గత జన్మ….   ఇంతకు మించి ఆమె గురించి పెద్దగా ఎక్కడా ప్రస్తావన లేదు.

మంథర కైకేయికి      పుట్టిన సమయం నుండి దాసిగా ఉంది అని రామాయణంలో చెప్పడం జరిగింది. అందుకే కైకేయి వివాహం జరిగిన తర్వాత కూడా మంథర కైకేయితో దాసిగా దశరథుడి ఇంటికి వచ్చింది. 

రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అని తెలుసుకున్న మంధర స్వాభావికమైన అసూయతో, తన యజమానురాలు కైకేయి పై ఉన్న అభిమానంతో కైక మనసులో లేని ఆలోచన చొప్పించి రాముడి పట్టాభిషేకం జరగకుండా చేసింది. 

శ్రీరాముడిని అడవుల పాలు చేసి చివరకి రావణుని వధకు పరోక్షంగా కారణం అయింది.

కైకతో మిక్కిలి చనువుగా మెలుగుతూ, కైకకు అవసరం వచ్చినప్పుడు సలహాలనిస్తూ.. తన మాటను నెగ్గించుకునే స్థాయికి ఎదిగింది. 

రామునికి పద్నాలుగేళ్లపాటు అరణ్యవాసానికి పంపడం మంథర మనోవాంఛితం ఏమీ కాదు. తలచుకుంటే ఇంకా ఎక్కువ కాలమే రాముడు అడవుల్లో ఉండేలా చేయగలదు. కానీ, అరణ్యవాసం పద్నాలుగేళ్ల పాటే ఉండేలా చూడమని కైకకు ఎందుకని సలహా ఇచ్చిందంటే.. త్రేతాయుగంలో ఆస్తికి హక్కుకాలం పద్నాలుగు సంవత్సరాలు. 

ద్వాపరయుగంలో పదమూడు సంవత్సరాలు, కలియుగంలో పది సంవత్సరాలూ అని చెబుతారు. 

అంటే నియమిత కాలం పాటు అస్తి లేదా అధికారానికి ఎవరైనా దూరం అయితే, ఇక దాని మీద శాశ్వతంగా హక్కును కోల్పోతారన్నమాట. బహుశ ఈ కారణం చేతనే మంధర కైక చేత అలా చెప్పించి ఉండవచ్చు. ఇలా మంధర శ్రీరామ వనవాసానికి ప్రథమ సోపానాలను నిర్మించి, రామావతార ప్రాశస్త్యానికి చేదోడు వాదోడైంది.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.

మనలాగే మన మధ్యనే ఉంటూ, తామరాకుపైన నీటిచుక్కగా నిలవటమే జీవిత సాఫల్యం. ఈ జీవన్ముక్తి వివేకమే సర్వగమ్య మోక్షానికి సహజమైన మార్గం.

 మనిషి ఈ భూమిపైన మరిమరి వూపిరి పోసుకోవటానికి కారణం- కర్మఫలం అనుభవించటానికే. ఆ మాటే నిజమైతే- ఆలోచించటానికి మనసు, ఎలాగైనా జీవించాలన్న ఆలోచన, మనసులో ఏ భావం ఉన్నా దాన్ని కట్టడి చేసి నలుగురు మెచ్చుకునేలా మాట్లాడే వాక్‌చాతుర్యం, కంటితో ప్రత్యక్షంగా చూడగలగడం, చెవితో పరోక్షంగా వినగలగడం- వీటితో పనేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం- కర్మ కోసమే కాకుండా ఈ జన్మలో ఆత్మోన్నతి సాధించటమే ముఖ్యమైన కారణమని చెప్పక తప్పదు. అలాంటి ఉన్నతమైన ఆదర్శం లేకపోతే, మనిషి కావటంకన్నా అడవిలో మానై నిలిచిపోవటం నయం. మనిషిగా పుట్టడమే ఒక గొప్పవరం అయినప్పుడు అది శాపం కాకుండా కాపాడుకుంటూ, జీవితంలో ఉన్నతశిఖరం అందుకోవటం ఎంతో ముఖ్యం. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతూ, శిఖరాగ్రం చేరుకోవటానికి ఈ శరీరాన్ని, మనసును, అందుబాటులో ఉన్న జీవితావకాశాల్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. అందుకు ఏం చేయాలి? ఇది రెండో ప్రశ్న.
రుషులు, దార్శనికులు ఇందుకు తగ్గ మార్గనిర్దేశం ముందుగానే చేశారు. ఇప్పుడు మనం చేయవలసిందల్లా, ఆ మార్గదర్శకాలను జీవితంలో అమలుపరచటమే. మనకు శ్రమలేకుండా, వేదవేత్తలు నాలుగు ఆశ్రమధర్మాలను అందజేశారు. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం- ఈ నాలుగింటిని శిఖరాగ్రం చేరటానికి మేడమెట్లలా ఉపయోగించుకోవాలి.
మనిషి ఒక జీవితకాలంలో ఇహమైనా పరమైనా సాధించాలనుకుంటే, ఒక లక్ష్యం ముందుగానే నిర్ణయించుకోవాలి. ఒక పథకం ప్రకారం ఆ లక్ష్యం వైపు సర్దుబాట్లు, దిద్దుబాట్లు చేసుకుంటూ- అడుగు ముందుకు వెయ్యాలి. ఈ పనిని నిర్దుష్టంగా, నిర్దిష్టంగా చేపట్టడానికి బ్రహ్మచర్యాన్ని మించిన అవకాశం లేదు. జిజ్ఞాస, జ్ఞానసముపార్జన, పరిశీలన, విశ్లేషణ... ఇవన్నీ నిర్విఘ్నంగా చేయటానికి ఏ చీకూచింతా లేని బ్రహ్మచర్య ఆశ్రమమే ఆదర్శప్రాయమైన సమయం. గార్హస్థ్యంలో ఒక కుటుంబ యజమానిగా సంసార సాగరం ఈదటంవల్ల జీవితంలోని లోతుపాతులు తెలుసుకోవచ్చు. అంతకుమించి, అనుభవపూర్వకంగా ఇంద్రియాల లాలస, విషయభోగాల స్వభావం గ్రహించవచ్చు. భోగించి యోగించటమే ఉత్తమమైందని, జీవితాన్ని కాచి వడబోసిన వేమన తన వేదంలో చెప్పాడు. అసలైన వైరాగ్యానికి సిసలైన వేదిక గృహస్థ జీవితమే. మూడోదైన వానప్రస్థం మహాప్రస్థానానికి ఒక ఉపోద్ఘాతంగా చెప్పుకోవచ్చు. సహనం దాని సారాంశం. రాజులు రాజర్షులై భర్తృహరిలా సుభాషితాలు, హితబోధకాలైన గ్రంథరచనలు, ధర్మ, న్యాయసూత్రాలు సృష్టించింది ఈ స్థితిలోనే. చరమ పాదమైన సన్యాసం జీవన పరిసమాప్తికోసం నిర్దేశితమైంది. కర్మఫలాన్ని ఆశ్రయించకుండా కర్తవ్యకర్మ ఆచరించేవాడే నిజమైన సన్యాసి, యోగి అంటోంది గీత. ఒక సమన్వయకర్తగా మనిషి ఎదుగుదలకు నిదర్శనమే సన్యాసం. అలాంటి నిఖార్సయిన సన్యాసి కాషాయం కట్టి, సిగచుట్టి, విభూతిపెట్టి, కమండలం పట్టి వూరూ, వాకిలీ వదిలి వెళ్లవలసిన అవసరం లేదు. మనలాగే మన మధ్యనే ఉంటూ, తామరాకుపైన నీటిచుక్కగా నిలవటమే జీవిత సాఫల్యం. ఈ జీవన్ముక్తి వివేకమే సర్వగమ్య మోక్షానికి సహజమైన మార్గం.

సేకరణ .మీ రామిరెడ్డి మానస సరోవరం👏

మన నడవడిలో 'వడి' తగ్గాలి. మన తరవాతి తరానికి ఒరవడి కావాలి!

 మంచి ప్రవర్తనం, మంచి ఆలోచనం, నిశ్చలమైన మనసు మనల్ని సన్మార్గంలో పయనింపజేస్తాయి. ఎల్లప్పుడూ ఆనందాన్నిస్తాయి. మన సదాలోచనలు బలాన్ని, ధైర్యాన్ని చేకూరుస్తాయి. మంచి వర్తనం వల్ల మితంగా, మృదువుగా మధురంగా మాట్లాడటం అలవడుతుంది. మృదు భాషణం మనపట్ల గౌరవం పెంచుతుంది. నిజం చెప్పడం, రుజుమార్గంలో పయనించడం అవసరం. నిజం చెబితే నిష్ఠురం అనుకోవచ్చు. నేటి పరిస్థితులు అలాగే ఉన్నాయి. కొన్నాళ్లకు వాస్తవం తెలిశాక నిష్ఠురం సామెత మటుమాయం అవుతుంది. దైవాన్ని నమ్మడం వల్ల, పాపభీతితో నిజాయతీ అలవడి మనల్ని మంచిమార్గంలో నడిపిస్తుంది. మన సత్‌ ప్రవర్తనం ఇతరుల్లో ఆనందనర్తనం చేయించాలి.
పరమశివుడు జటలు ముడివేసుకుంటాడు. ఆ జటలు విప్పుకోవాలంటే మొదలు తుది తెలియవు. అందుకే జటిలసమస్య అనే మాట ఉద్భవించింది. జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి జటిల సమస్యా మనకు ఓ గుణపాఠం నేర్పుతుంది. ఆ పాఠం నేర్చుకుంటే ఇతరులకు నేర్పవచ్చు. మాన్యులైన పెద్దల సలహాలనూ సూచనలనూ సామాన్యులమైన మనం పాటించడం అలవరచుకోవాలి. ఉపన్యాసాలు దంచడం కాదు. అవి ఆచరించి చూపగలగాలి.
ఒక పావురాన్ని డేగ వెంటాడుతుంటే- ఆ పావురం శిబి చక్రవర్తిని ఆశ్రయించి శరణు కోరుతుంది. ఆ పావురం బరువు ఎంత తూగుతుందో, అంత మాంసాన్నీ తన శరీర భాగంలోంచి కోసి ఇస్తానంటాడు శిబి చక్రవర్తి. అంతేకానీ, శరణు కోరిన పావురాన్ని విడిచిపెట్టనంటాడు. పావురాన్ని కాటాలో వేస్తే అదే ఎక్కువ బరువు తూగుతుంది. చివరకు తానే వెళ్లి కాటాలో కూర్చుంటాడు. అంతటి త్యాగశీలి, దానశీలి శిబి. ఆ 'శిబి' చక్రవర్తిని బట్టే నేడు రక్తదాన 'శిబి'రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడవి విజయవంతంగా సాగుతున్నాయి. మనం ఇచ్చే దానాలు అంత గొప్పవి కాకపోయినా అటువంటి పురాణ గాథలు మనకు స్ఫూర్తినిస్తాయి. మన ఆదాయంలో ఎంతోకొంత దీన జనోద్ధరణకీ, జీర్ణ దేవాలయాల సముద్ధరణకీ ఖర్చుపెట్టాలి.
ఏదైనా నదికి కాని, చెరువుకి కాని ఉన్న ఒడ్డును కూలం అంటారు. మనం ఈవలి ఒడ్డున ఉండటం అను'కూలం'; ఆవలి ఒడ్డున ఉండటం ప్రతి'కూలం'. మనం సంఘజీవులం కనుక అందరితోనూ అను కూలంగా ఉండాలి. మన ప్రవర్తనం అలా ఉండాలి. మనకు ప్రతికూలంగా ఉన్నవారు ఎటువంటి దుష్టపదజాలాన్ని ప్రయోగించినా, మనం ఆ 'జాలం'లో పడక, ఆవేశం చెందక, శిష్టపదజాలంతోనే సమాధానం చెప్పాలి. అప్పుడు వారే తమ ధోరణి మార్చుకుంటారు. మన నడవడిలో 'వడి' తగ్గాలి. మన తరవాతి తరానికి ఒరవడి కావాలి!

సేకరణ . మీ రామిరెడ్డి మానస సరోవరం👏

Friday, October 28, 2022

గొప్ప మనసు

 _❤️ గొప్ప మనసు❤️_
                    
       నేను ఇంటి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి రెండు నెలలు అయింది. పని చురుకుగానే సాగుతున్నది.
       ఈ రోజు స్లాబ్ వేయాలి. మేస్త్రి కనిపిస్తే "పని వాళ్ళు అందరూ వచ్చినట్లేనా?" అని అడిగాను."ఒక మనిషి తగ్గాడు. మరేం ఫర్లేదు. పనికి ఇబ్బంది లేదు".. అన్నాడు.
     అంతలో ఒక వ్యక్తి వచ్చాడు.నాకు నమస్కారం చేసి "అయ్యా! నా పేరు రాజయ్య.
పొరుగూరు నుంచి కుటుంబం తో వచ్చాను.
వారం నుండి పని కోసం తిరుగుతున్నాను.
ఎక్కడా పని దొరకలేదు. పిల్లలు పస్తు ఉన్నారు. దయచూపించి పని ఇప్పించండి" అని ప్రాధేయ పడ్డాడు.
         అక్కడే ఉన్న మేస్త్రి " నీవెవరివో తెలీకుండా... నీపనితనం తెలీకుండా.. పనిలో పెట్టుకొనేది లేదు. వెళ్ళు! వెళ్ళు!" అని కసురుకున్నాడు.
     
    అతను నా వైపు జాలిగా చూస్తూ"  ఇది నాకు అలవాటున్న పనేనయ్యా! దయచూపండి" అని ప్రాధేయ పడ్డాడు.
      నాకెందుకో అతని మాటల్లో నిజాయితీ... కన్నుల్లో ఆకలి కనిపించింది.
     మేస్త్రితో " తెలిసిన పనే అంటున్నాడుగా!
ఈ రోజుకు పెట్టుకు చూద్దాం" అన్నాను.
 మేస్త్రీ అయిష్టంగా "సరే! మీ ఇష్టం" అన్నాడు.
     అతను నా వంక కృతజ్ఞతగా చూసి పనిముట్లు వైపు నడిచాడు. మధ్య మధ్యలో అతని వంక చూసాను. కష్టపడి పనిచేయడం గమనించాను. "పోనీలే! నేను పని ఇవ్వడం వలన అతని కుటుంబానికి ఒక రోజు గడుస్తుంది" అని మనసులో సంతోషించాను.
         మధ్యలో కూలీలు అందరికీ టీ తెప్పించాను. అందరూ పదినిముషాలు పని ఆపి కబుర్లు ఆడుతూ టీ తాగుతున్నారు.
రాజయ్య వంక చూసాను. ఎంతో ఇష్టంగా టీ తాగుతూ నా వంక చూస్తున్నాడు. అతను ఆకలిగా ఉన్నట్లు గ్రహించాను.
        మధ్యాహ్నం కూలీలు పని ఆపి భోజనాలు చేస్తున్నారు. రాజయ్య ఏం తెచ్చుకోకపోవడంతో పని ఆపకుండా తట్టలు పైకి మోస్తున్నాడు. ఆతని  ఆకలి గుర్తించగలిగాను. కానీ దగ్గరలో ఏం హోటల్స్ లేకపోవడంతో అతన్ని టిఫిన్ చేయడానికి పంపలేకపోయాను.  రాజయ్య మాత్రంమంచి నీళ్ళతో సరిపెట్టేసుకున్నాడు.
        అతని ఆకలి నాకు గిల్టీగానే ఉంది. సాయంత్రం అయింది. మేస్త్రీకి డబ్బులు ఇచ్చాను. అతడు కూలీలకు పంచాడు.
        రాజయ్య బయలుదేరుతూ నా దగ్గరకు వచ్చి రెండు చేతులూ జోడించి నమస్కరించాడు. "నువ్వేం తినలేదు. త్వరగా వెళ్లి భోజనం చేయి" అన్నాను.
    "నేనే కాదయ్యా! ఇంట్లో వాళ్లకు ఎవరికీ భోజనం లేదు. మీ  దయవల్ల ఈ పూట గడుస్తుంది" అన్నాడు. అతని కన్నుల్లోని ఆవేదన సరిగానే గుర్తించాను.
        అతను బయలు దేరిపోయాడు. ఎందుకో తెలీదు... రాజయ్య వంకే చూడసాగాను. వెళ్తున్న రాజయ్యకు పావురాలు అమ్ముతున్న వ్యక్తి ఎదురు పడ్డాడు. రాజయ్య ఆగి తనను దాటి పోయిన పావురాలు అమ్మే వ్యక్తినే చూడసాగాడు.
అతని చేతిలో రెండు పావురాలు ఉన్నాయి.
      రెండు నిముషాలు ఆగి రాజయ్య ఆ వ్యక్తిని కేకేసి పిలిచాడు. నాకు విషయం అర్థం అయిపోయింది. ఈపూట రాజయ్య పావురాయి మాంసంతో విందు భోజనం చేయబోతున్నాడు.... 
అన్న ఆలోచన రాగానే నాకు అంతవరకు రాజయ్య మీద జాలి కరిగి పోయింది.
      "ఆ డబ్బు జాగ్రత్త చేసుకుంటే మరో పూట కూడా గడిచి పోతుంది. అలాంటిది పావురాయి మాంసంతో జల్సా చేసుకుంటున్నాడు" ఆ ఆలోచన నాకు అతని మీద కలిగిన సదభిప్రాయాన్ని దూరం చేసింది.
         బేరం కుదిరినట్లు ఉంది. పావురాలు అమ్మే వ్యక్తి రాజయ్య ఇచ్చిన డబ్బు తీసుకొని పావురాలు అందిస్తూ" చాలా రుచిగా ఉంటాయి. మరలా నన్ను వెతుక్కోవాలి నువ్వు" అన్నాడు.
     రాజయ్య చిన్నగా నవ్వి వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీయసాగాడు. పావురాలు అమ్మిన వ్యక్తి రాజయ్యను వారిస్తూ" ఈ పని ఇంటి దగ్గర చేయి. లేకపోతే ఎగిరి పోతాయి".. అన్నాడు.
      రాజయ్య అతని మాటలు పట్టించుకోకుండా వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీసి వాటిని ఒక్కసారి ముద్దు పెట్టుకొని గాలిలోకి ఎగర వేశాడు. 
స్వేచ్ఛగా ఎగిరిపోతున్న పావురాల వంక అలానే ఆనందంగా చూడ సాగాడు.
ఆ రెండు పావురాలు స్వేచ్చగా ఎగిరి పోయాయి.
      రాజయ్య చేసినపనికి నాతో పాటు అక్కడున్న వారందరూ ఆశ్చర్య పోయారు.
ఆఖరికి పావురాలు అమ్మిన వ్యక్తి కూడా.
     "ఏంటి నీవు చేసిన పని? డబ్బులు తేరగా వచ్చాయా?" అన్నాడు.
       "డబ్బులు మరలా సంపాదించవచ్చు. పోయిన ప్రాణం మరలా రాదు" అన్నాడు రాజయ్య. ఆ మాట నా చెవినపడింది. రాజయ్య నాకు ఒక అద్భుతమైన వ్యక్తిలా కనిపించాడు.
అతని ఆకలి... ఎదురుచూసే అతని వాళ్ల ఆకలి నా కళ్ళ ముందు కదలాడింది. కూలీ పని చేసి బ్రతికే ఒక మనిషిలో ఎంత గొప్ప మనసు దాగి ఉందో బోధ పడింది.
    అంతలో పావురాలు అమ్మిన వ్యక్తి... రాజయ్యతో అన్నా! నేను చేసే పని తప్పని తెలుసు. కానీ పొట్టకోటి కోసం తప్పడం లేదు. నీ డబ్బులు నీవే ఉంచుకో!"
అని రాజయ్య డబ్బులు వెనక్కి ఇవ్వబోయాడు.
రాజయ్య అతన్ని వారిస్తూ" డబ్బు వెనక్కి తీసుకుంటే నాకు తృప్తి ఉండదు" అని ముందుకు కదిలాడు.
       కొంచెం సేపు అలానే ఉండిపోయాను.
తరువాత బైక్ స్టార్ట్ చేసి... రాజయ్య దగ్గరకు పోనిచ్చి "ఎక్కు" అన్నాను.
"వద్దు అయ్యగారూ!" అన్నాడు." మరేం ఫర్లేదు. నేనూ అటేవెళ్తున్నాను" అని బలవంతంగా ఎక్కించి ఒక హోటల్ ముందు ఆపి మీల్స్ పార్సెల్ చేయించాను.
     ఆ తరువాత రాజయ్య ఎక్కడ ఉంటున్నాడో కనుక్కొని అక్కడ డ్రాప్ చేసి మీల్స్ పార్సిల్ అందించి రెండు చేతులు జోడించి నమస్కారం చేశాను.
     "అదేంటి  అయ్యగారూ!మీలాంటి గొప్పోడు నాకు దండం పెట్టడం" అన్నాడు రాజయ్య.
    "డబ్బు ఉన్నోడు గొప్పోడు కాదు. మనసున్న వాడే గొప్పోడు. ఆ మనసు నీకుంది. రేపు పనిలోకి వచ్చేయి!" అనిబైక్ స్టార్ట్ చేసాను.
    బైక్  డ్రైవ్ చేస్తున్న నాకు ఆకాశంలో ఒక నక్షత్రం మెరుస్తూ కనిపించింది.
   నాకు రాజయ్య గుర్తుకు వచ్చాడు!!
👏👏👏

సుందర్ పిచైయ్ టెక్స్ట్ మెమరీ నుండి

 🤣భార్య కోపం వలన ఇంటి నుండి బయటకు పోవలసి వచ్చింది, దానివలన  మానవాళికి విప్లవాత్మక ఆవిష్కరణ జరిగింది :-

👍ఈ సంఘటన 2004లో జరిగింది. ప్రస్తుతం, గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ఆ సమయంలో అమెరికాలో కెరీర్‌ను పెంపొందించు కోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఒకసారి అతని పరిచయస్థుల్లో ఒకరు అతనిని తన ఇంటికి భోజనానికి పిలిచారు. సుందర్ తన భార్యతో కలిసి వెళ్లాల్సి రావడంతో భార్యతో కలిసి ప్లాన్ వేశాడు. తను  ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లి ఆఫీస్ అయ్యాక నేరుగా ఆహ్వానం పలికిన ఇంటికి భోజనానికి వెళతానని సుందర్ చెప్పాడు. ఇంటి నుంచి నేరుగా అక్కడికి చేరుకోవాలని భార్యను కోరాడు. భార్య ఇంటి నుండి నేరుగా డిన్నర్‌కి వెళ్లాలి మరియు సుందర్ పిచాయ్ ఆఫీసు నుండి నేరుగా భోజనానికి చేరుకోవాలి.

రాత్రి 8 గంటలకు విందు కార్యక్రమం. సుందర్ పిచాయ్ భార్య అంజలి తన కారులో రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకు భోజనానికి హోస్ట్ ఇంటికి చేరుకుంది. సుందర్ పిచాయ్ కూడా ఆఫీస్ నుండి బయల్దేరి  వెళ్లిపోయాడు, కానీ అతను మార్గమధ్యంలో దారి తప్పిపోయాడు. అతను  అక్కడికి చేరుకునేసరికి దాదాపు 10 గంటలైంది. అప్పటికే  పిచాయ్  భార్య అక్కడి నుంచి రాత్రి భోజనం చేసి వెళ్లిపోయింది. ఇప్పుడు పిచాయ్‌ సాహిబ్‌ పరిస్థితి విషమంగా మారింది. కారణం, అమెరికన్లు సమయపాలన పాటించడం వల్ల విందు ఆచారాలన్నీ పూర్తయ్యాయి. సుందర్ పరిస్థితి విషమంగా అయింది.  అయితే హోస్ట్ పిచాయ్ రాకకు ఘన స్వాగతం పలికి గుడ్ బై చెప్పారు

అక్కడి నుంచి ఏమీ తినకుండానే సుందర్ పిచాయ్ తన ఇంటికి వెళ్లాడు. అతను ఇంటికి చేరుకోగానే భార్య అంజలి చిరాకుపడి అతనితో గొడవ పెట్టుకుంది, కారణం, అతను సమయానికి విందుకు  చేరుకోలేదు మరియు అతని భార్య అవమానించబడింది. అంజలి  మానసిక స్థితిని చూసిన సుందర్ పిచాయ్ మళ్లీ ఆఫీసుకు తిరిగి వెళ్ళడం  సముచితం అనుకున్నాడు. (భార్య కోపంతో ఇంట్లోకి రానివ్వలేదని కొందరు అంటున్నారు)

ఏమైనా సరే, ఇప్పుడు సుందర్ తిరిగి ఆఫీసుకు చేరుకున్నాడు మరియు రాత్రంతా అక్కడే గడిపాడు. రాత్రంతా ఇలాగే ఆలోచిస్తూనే ఉన్నాడు - నాలాగే   రోజూ చాలా మంది దారి తప్పి పోయే అవకాశం ఉంది.  అదే విషయం రాత్రంతా ఆలోచిస్తూ, మ్యాప్ జేబులో పెట్టుకుని, దిక్కు కరెక్టుగా ఉంటే తను దారి తప్పేవాడిని కాదని అనుకున్నాడు.

మరుసటి రోజు ఉదయం సుందర్ పిచాయ్ తన టీమ్ మొత్తానికి ఫోన్ చేసి మ్యాప్ తయారు చేయాలనే ఆలోచనను అందరి ముందు ఉంచాడు. ఈ ఆలోచన విన్న టీమ్ చేతులు ఎత్తేసింది. టీమ్ అతని ఆలోచనను నమ్మలేదు, కానీ దాదాపు రెండు రోజుల పాటు టీమ్‌తో నిరంతరం సమావేశాలు నిర్వహించి, ప్రజలకు మార్గం చూపే ఉత్పత్తి(App)ని రూపొందించమని వారిని ఒప్పించాడు.

సుందర్ పిచాయ్ మరియు అతని బృందం కష్టపడి 2005లో గూగుల్ మ్యాప్‌ని తయారు చేసి అమెరికాలో ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాదే 2006లో ఇంగ్లండ్‌లో, 2008లో భారత్‌లో లాంచ్‌ చేశారు.. ఇప్పుడు వారు రూపొందించిన మ్యాప్‌లు యావత్ ప్రపంచానికి సరైన మార్గాన్ని చూపే పని చేస్తున్నాయని ఇప్పటికే మీకు తెలుసు. ఒక స్టడీ  ప్రకారం, మొత్తం ప్రపంచంలోని ప్రతి ఏడవ వ్యక్తి Google Mapsని ఉపయోగిస్తున్నారు.

కథ పెద్దది ఉంది కదా! ఇది నిజంగా జరిగిన సంఘటన. 

 కాబట్టి కొన్నిసార్లు మీ భార్య మీపై కోపం తెచ్చుకోవచ్చు.  చింతించకండి. ఆ కోపంలో భవిష్యత్తులో ఏదో ఒక చారిత్రక ఆవిష్కరణ దాగి ఉందని ఎవరికి తెలుసు.
👏👏👍👍🙏🙏💐💐
సుందర్ పిచైయ్ టెక్స్ట్ మెమరీ నుండి

సర్ఫబంధనం

 సర్ఫబంధనం

🐍🐍🐍🐍🐍🐍🐍
సంపదను దాచుకునే పురాతన టెక్నాలజీ "సర్పబంధనం" .అప్పట్లో రాజులకు బ్యాంకులు లాకర్ లు లేవు కాబట్టి వారు విలువైన సంపాదన సర్పబంధనం వేసేవారు. అది ఎవరైన తవ్వితే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో పాములు వచ్చేవి.మరి ఆ పాములు తెచ్చి అక్కడ ఎలా పెడతారు.....? పూర్వం రాజులు తమ సంపద దాచాలనుకున్న చోట  లోతుగా అంటే ఒక తాటి చెట్టు అంత లోతు తవ్వి అందులో సంపద పెట్టి కొంత మట్టి వేసి  తరువాత కొన్ని టన్నుల బెల్లం వేసి పెట్టేవారు. ఆ బెల్లం కోసం వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో చీమలు వచ్చి చేరి పెద్ద చీమల పుట్ట ఏర్పడేది.చీమల పుట్ట లే కదా పాములకు ఆవాసాలు అయ్యేవి.అంత పెద్ద చీమల పుట్ట లో వందల సంఖ్యలో పాములు చేరి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి కాలక్రమం లో అవి లక్షల్లో చేరుతాయి. అలా సర్పాలకు ఆవాసమయిన ఆ గుంత సర్ప గృహం గా మారుతుంది. పుట్ట కాదు సర్ప గృహం. అది ఎవడైనా తవ్వితే వేల సంఖ్యలో విష సర్పాలు బయటికి వచ్చి వాటి కాటుకు మరణిస్తాడు.

ఆ సంపద తీయలనుకున్నప్పుడు నిపుణుడు అయిన వ్యక్తి అక్కడ సమీపం లో మరొక గుంత తొవ్వి మళ్ళీ సేమ్ బెల్లం తో పెద్ద చీమల పుట్ట ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక ద్రవ్యాలతో హోమం నిర్వహించి ఆ పొగ కు ఆ పాములు అన్ని అక్కడి నుండి వేరే పుట్టలోకి పోయిన తరువాత ఆ సంపద తిరిగి రాజ్యానికి చేర్చేవారు అని "తంత్ర శాస్త్రం" చెబుతుంది

సేకరణ

🐍🐍🐍🐍🐍🐍🐍

ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడంలోనే నిజమైన సంతోషం ఉంది

 ఆనందం ఎక్కడ ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఓ కుర్రవాడు బయల్దేరాడు. దేశంలో చాలా రోజులపాటు తెగ తిరిగాడు. చివరికి సంతోషపు రహస్యం గురించి చెప్పగల ఒక పెద్దాయన గురించి విన్నాడు. ఆ పెద్దాయన ఫలానా పర్వతం మీద ఓ అందమైన భవంతిలో ఉంటాడని తెలిసింది.

ఆ ఇంటిని వెతుక్కుంటూ పర్వతాన్ని ఎక్కాడు. నిజంగానే ఆ పర్వతం మీద కళ్లు చెదిరిపోయే ఒక భవనం కనిపించింది. తన గమ్యాన్ని చేరుకున్నానన్న సంతోషంలో ఆ కుర్రవాడు హడావుడిగా భవంతిలోకి అడుగుపెట్టాడు. అక్కడ వందలాది మంది రకరకాల పనులలో నిమగ్నమై ఉన్నారు. వారందరినీ దాటుకుని ఆ ఇంటి యజమాని దగ్గరకు చేరుకునేసరికి అతనికి చాలా సమయమే పట్టింది.

ఆ పెద్దాయన దగ్గరకి వెళ్లిన కుర్రవాడు, తన బాధనంతా ఏకరవు పెట్టాడు. సంతోషపు రహస్యం ఎలాగైనా తనకు చెప్పితీరాలని పట్టుపట్టాడు. కుర్రవాడు చెప్పినదంతా పెద్దాయన శ్రద్ధగా విన్నాడు. ‘నా పని పూర్తయ్యాక నీకు సంతోషపు రహస్యాన్ని తప్పకుండా చెబుతాను. ఈలోగా నువ్వు నా భవంతిని చూసిరా. అయితే ఒక చిన్న షరతు.

ఇదిగో ఈ చెంచా ఉంది చూశావు. అందులో రెండు చుక్కల నూనె ఉంది. ఆ చెంచాని పట్టుకుని నువ్వు తిరగాలి. తిరిగి వచ్చేసరికి అందులోని నూనె ఒలికిపోకూడదు. సరేనా!’ అన్నాడు పెద్దాయన. ‘ఓస్‌ అంతే కదా!’ అనుకున్నాడు కుర్రవాడు. ఆ చెంచాని పట్టుకుని భవంతి అంతా కలియతిరిగాడు.

ఓ రెండు గంటలు ఇంట్లోని మూలమూలలా తిరిగిన తర్వాత పెద్దాయన దగ్గరకి చేరుకున్నాడు. ‘వచ్చేశావా! నా ఇల్లు ఎలా ఉంది చెప్పు. అక్కడ వంటింట్లో తగిలించి పర్షియా కర్టెన్లు చూశావా? నా తోటమాలి పదేళ్లపాటు శ్రమించి రూపొందించిన అందమైన తోటని గమనించావా? నా గ్రంథాలయంలో ఉన్న అరుదైన తాళపత్రాలను పరిశీలించావా?…’ అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశాడు.

పెద్దాయన అడిగిన ప్రశ్నలకి కుర్రవాడు చిన్నబోయాడు. ‘భవనం అంతా తిరిగాను కానీ… వాటన్నింటినీ అంత దగ్గరగా పరిశీలించలేకపోయాను. నా చేతిలోని నూనె చుక్కలు ఎక్కడ జారిపోతాయో అన్న భయంతో నిరంతరం చెంచా వంక చూసుకోవడమే సరిపోయింది,’ అంటూ సంజాయిషీ చెప్పాడు.

‘అయ్యయ్యో! ఎంత పని జరిగిపోయింది. నా ఇంటినే సరిగా చూడలేనివాడివి ఇక జీవితాన్ని ఏం చూడాలనుకుంటున్నావు. మరోసారి భవంతి అంతా కలియతిరిగి రా!’ అన్నారు పెద్దాయన. ఈ మాటతో సంబరంగా మరోసారి ఇల్లు కలియతిరగడానికి బయల్దేరాడు కుర్రవాడు.

ఈసారి ఇంట్లోని నలుమూలలూ క్షుణ్నంగా పరిశీలించాడు. అందులోని ప్రతి వస్తువులోనూ ఉన్న కళాత్మకతను ఆస్వాదించాడు. ఓ రెండుగంటల తర్వాత పెద్దాయన దగ్గరకి చిరునవ్వుతో వెళ్లి నిల్చొన్నాడు. ‘నీ వాలకం చూస్తే ఇంట్లోని ప్రతి అంగుళమూ చూసి వచ్చినట్లు ఉన్నావే!’ అన్నాడు పెద్దాయన.

‘అవునండీ!’ అంటూ ముసిముసిగా నవ్వుతూ బదులిచ్చాడు కుర్రవాడు.

‘కానీ ఈసారి చెంచాలో నూనె అంతా ఒలికిపోయింది చూశావా? జీవితం కూడా ఇంతే! దాన్ని ఆస్వాదించాలి అన్న ధ్యాసలోనే ఉంటే నీ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేవు. నీ బాధ్యతల హోరులో పడిపోతే….. నీ చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదించలేవు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడంలోనే నిజమైన సంతోషం ఉంది,’ అని చెప్పుకొచ్చాడు పెద్దాయన.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

మంచి మాటలు(28-10-2022)

శుక్రవారం :-28:10:2022

ఈ రోజు AVB మంచి మాటలు

తెల్ల కాగితం మీద ఒక చిన్న నల్లటి మరక ఉంటే .. అందరం ఆ నల్లని మరకనే చూస్తాం, కాని దాని చుట్టూ ఉన్న అనంతమైన తెలుపు ను చూడము..

మన జీవితం కూడా అంతే మన జీవితం ఎంత గొప్పగా ఉన్నా ఏదైనాచిన్న పొరపాటు జరిగితే అందరు ఆ పొరపాటు ను మత్రమే చూస్తారు.. అది మానవ సహజం 👍

జీవితం చాలా చిన్నది.. ఎంత చిన్నది అంటే కంటికి కనిపించని సూక్ష్మ జీవి (కరోనా)కి బయపడి ఇంట్లో నే దాక్కున్న పరిస్థితి.. .అందుకే ఎవరిని ఎంత చిన్న వారైనా మనకన్నా, నిర్లక్ష్యం చేయవద్దు

ఒకరు నీకు విలువిచ్చి నిన్ను ప్రతి రోజూ పలుకరిస్తున్నారంటే అర్థం వాళ్ళ చుట్టూ ఎంత మంది ఉన్నా వారి మనసు లో నీ స్థానం చాలా ప్రత్యేకమైనదని అర్థం .

జీవితంలో ఏది మీ వెనుక రాదు, నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్పా,మనం సంపాదించినది ఏది మనది కాదు, ఒక్క మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప .

మన చుట్టూ ఎంత మంది ఉన్నా సరే మన ఆలోచనలు మాత్రం మనకు ఇష్టమైన వారి చుట్టూ తిరుగుతుంటాయి ఎందుకంటే వాళ్ళ స్థానం మన మనసులో ఉంటుంది కాబట్టి .

నీతి కోసం బ్రతుకు నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది , సత్యం కోసం బ్రతుకు ధర్మం నిన్ను బ్రతికిస్తుంది , మంచి కోసం బ్రతుకు మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది .

ఒకరి మనసు గాయపరచడానికి ఒక నిమిషం చాలు,కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు , అందుకే ఒకమాట అనేముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడాలి .

✒️మీ ...ఆత్మీయ బంధువు AVB* సుబ్బారావు 💐🤝

సేకరణ

అధికారం ధనం ప్రేమ....కర్మ సిద్ధాంతం

 అధికారం ధనం ప్రేమ....కర్మ సిద్ధాంతం
ఒక వ్యక్తి కి లభించిన    అధికారం కానీ ధనం కానీ అతడిని చాలా తీవ్రం గా పరీక్షిస్తుంది.  అతడి లోని అంతర్గత గుణాలు, వ్యక్తిత్వం వెలికి వస్తాయి.
        భగవంతుడు కొన్ని ఇచ్చి పరీక్షిస్తాడు.కొన్ని దూరం చేసి పరీక్షిస్తాడు. ప్రారబ్ధ కర్మలో ఈ అధికార ధనాలు పొందాలనే ఉంది కాని, దాని వల్ల అహంకారం పొందమని కానీ, దుర్వినియోగం చేయమని కానీ లేదు కదా.
           కర్మ సిద్ధాంతానుసారం దుర్వినియోగం అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనకి లభించిన శక్తి ఒక సత్కర్మ ఫలితమే అని గ్రహించాలి.. 
        అలా లభించిన శక్తి పది మందికి ఉపయోగ పడేలా చేయక పోయినా,  
లాభం తో , స్వార్ధం తో అహంకారం తో తన స్వ ప్రయోజనానికి మాత్రమే పరిమితం చేసుకుంటే , లభించిన ఆ శక్తి ,తిరిగి ఎప్పటికి , ఏ జన్మ కి లభించదు. తిరిగి మళ్లీ ఆ శక్తి పొందాలంటే ,అంతటి కృషి శ్రమ అటువంటి కర్మ చేయ వలసిందే.. 
        అధికారం ద్వారా ఇతరులకు బాధ కలిగిస్తే, హింస పెడితే, ఆ ఆధికారం ఒక భయంకర చక్రం లా తిరిగి అతడి పైకి వస్తుంది.. తాను ఇతరులను ఎలా పీడించాడో , దుఃఖం కలిగించాడో మరచి పోయి , " దేవుడు కాపాడడా ?  అని ఒకరోజు దుఃఖిస్తాడు..
       ఇంతగా అతడు అధికారాన్ని దుర్వినియోగం చేసి , తన క్రింది వారిని బంధించి, అవమానించి, వారి అవకాశాల్ని తొక్కి పెట్టి అహంకారిస్తే, అతఫు పొందే కర్మ ఫలం చాలా దారుణంగా ఉంటుంది.
       ఎంతగా అతడు తపించినా, ఎంత ప్రతిభ నైపుణ్యం ఉన్నా , అతడి కన్నా తక్కువ ప్రతిభ ఉన్నవారే, అతడి కళ్ళ ముందు పై అధికార్లవుతారు. ఏ వేదన అతడు ఇతరులకి ఇచ్చాడో అదే వేదన కర్మ ఫలం గా వస్తూంది. ఇదే కర్మ సిద్ధాంత రహస్యం.
         ఇదే విధం గా ఎంతో ప్రేమ ని పొందినా తిరస్కరించి , అవమానించి , దూరం చేసినా,, ఇదే ఫలం. తల్లి తండ్రి. ప్రేయసీ ప్రియులు అక్క తమ్ముడు ప్రతి బంధానికి ఈ కర్మ వర్తిస్తుంది.. 
     ప్రేమ కి ద్రోహం చేస్తే , తిరిగి , తాను కోరుకున్న చోట ఆ ప్రేమ లభించక పోగా , అదే ద్రోహానికి మోసానికి గురి అవుతారు.. ప్రతి ఒక్కరు తాను ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించారో జ్ఞాపకం తెచ్చుకోరుగా..
         ప్రతి ఒక్క కర్మ స్వయం కృతమే. దీనిని తెలుసు కోకుండా భగవంతుడిని నిందిస్తారు.. అధికారం పొందగానే సర్వ విధ జ్ఞానం పొందినట్లు అనిపిస్తుంది. కొద్దీ అధికారమే సంపూర్ణం గా. వినయాన్ని. హరిస్తుంది..ప్రతి మాట. ఒక దుష్కర్మ గా మరి ఒక  శరం లా తిరిగి వస్తుందని  గ్రహించరు..
     వ్యంగ్యాలు వెటకారాలు పరుష వాక్కులు ఉత్తముడని తెలిసినా నింద లు వేస్తూ హృదయాన్ని గాయ పరుస్తూ మాట్లాడే. అహంకారులు ఎందరో. ఉన్నారు..దీనికి. కర్మ ఫలం గా. వారి. మనస్సు భవిష్యత్తు లో అతి దారుణంగా శిక్షించ బడుతుంది అనే విషయం గ్రహించరు..ఆనాడు. పరుష వాక్కులు చాలా " తప్పు ".అనే. విషయం గ్రహిస్తారు.
     అహంకారం విపరీతం అవుతుంది తన క్రింద పని చేసే వాళ్ళందరు
తెలివి తక్కువ వాళ్ళు గా కనిపిస్తారు.. తన క్రింద పనిచేసే వారికి 
కీర్తి పేరు వస్తే తమ గొప్పతనం తగ్గిపోతుందని... వారిని. ప్రతిక్షణం కించ పరుస్తూ అవమానిస్తూ మాట్లాడతారు.. ఈ. అధికారం లేకపోతే తాము ఇలా మాట్లాడ లేమనే విషయం. వారికి. గుర్తుకు. రాదు.
     చాలామంది అధికారులు  ఆత్మన్యూనత భావం (Inferiority complex ) తో 
బాధ పడతారు.  దీని వలన ఒక భజన బృందం చుట్టూ ఏర్పడుతుంది.
ఇది పతనానికి మార్గం..
       వంద యజ్ఞాలు చేసి ఇంద్ర పదవి పొందిన నహుషుడు అధికారం 
తో గర్వించి సప్త ఋషులను అవమానించాడు...ఒక సర్పమయి 
అరణ్యం లో పడి ధర్మ రాజు తో తన దీన గాధ చెప్పుకుంటాడు. 
వినయం కలిగిన అధికారులు చాలా తక్కువ..
   మీ మాట లోని శృతి  లో మీ  అహంకారం లేదా వినయం శాంతం 
సౌజన్యం వినిపిస్తాయి....పరీక్షించుకుందాము!!
డా.పి.ఎల్.ఎన్.ప్రసాద్

ఆత్మ - చైతన్యము

 ఆత్మ - చైతన్యము

ఆత్మ దేహమందు సూక్ష్మమునను
జూచి దేహమాత్మయందు
తేటపరచి యాత్మయందె
చూడ నతడె పో ఘనయోగి
విశ్వదాభిరామ వినుర వేమll
 
ఆత్మ :

దేహాత్మ, జీవాత్మ, సూత్రాత్మ, ప్రత్యగాత్మ, పరమాత్మ మొదలగు భ్రాంతి స్థితులలో అధిష్ఠానముగానున్నది ఒకే ఒక్క ఆత్మ. మొదట 'నేను'గా ఉండి, చివరకు అద్వయ బ్రహ్మమనే నిర్ణయముగా ఉండేది ఆత్మ.

ఆత్మ లక్షణము : 
మానవోపాధిలో అంతఃకరణ ప్రతిబింబమైన ఆత్మ ప్రకాశము అహం అహం అనే స్ఫురణ రూపముగా ఉండును. అహం స్ఫురణమే ఆత్మ లక్షణము.

ఆత్మ త్రివిధములు : 
ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అని త్రివిధములు  ముఖ్యము.

ఆత్మ స్వరూప పంచలక్షణములు : 
సత్‌, చిత్‌, ఆనందము, నిత్యత్వము, పరిపూర్ణము.

ఆత్మకు అర్థము : 
వేదితృ అనగా ఎరిగే ఎరుక. ఆత్మ అద్వయము గనుక, అది అందరి చేతను సాధనచే ఎరుగబడేదే. సాధకుని స్వానుభవములో అపరోక్షమై ఉన్నది. ఆత్మ విషయము కాదు. కనుక అహం బ్రహ్మ అనేది స్వానుభవ జ్ఞానమే. అది అపరోక్ష జ్ఞానమనబడును.

తెలుసుకొనవలసినది : 
1. స్వరూపము 2. ఉపాయము 3. పరమ పురుషార్థమైన మోక్షము.

ఆత్మ నిష్ఠ :

ఆత్మ నిష్ఠను సంపాదించి, దానికి చెరుపుగాని, తెంపుగాని  లేక, నిరతము ఆ నిష్ఠ కలిగి యుండుట.

కూటస్థాత్మ పర్యాయ నామములు : 
విశ్వాది జీవత్రయాధిష్ఠాన చైతన్యము, తురీయము, స్వయం శబ్దార్థము, సాక్షిమాత్రుడు, పారమార్థిక జీవుడు, త్వంపద లక్ష్యార్థుడు మొదలగునవి.

కూటస్థము :

సూక్ష్మతమము అయిన చేతనాయుక్త అణువు, అనగా చిదణువు. ఇది స్థావర జంగమాత్మకమై అంతటా ఉండును. ఆ చిదణువుతో ఉద్భాసితమయ్యే జ్యోతిర్మండలమే కూటస్థము. కూటస్థాత్మ అనగా తాను ఇంద్రియ ప్రాణ మనస్సులనెడి 24 తత్త్వముల కూటమితో కలసియుండి కూడా, వాటితో ప్రభావము చెందక, తానే వాటిని ప్రకాశింపజేయుచు, తాను మాత్రము అసంగముగా, ఎరుగ గలిగి స్వయం ప్రకాశ జ్ఞానమై  కదలక యుండుట.

ప్రత్యగాత్మ :

ప్రాణుల యొక్క హృదయములో చలించుచు అంతఃకరణ రూపములో వారి కర్మలన్నింటినీ అనుభవింపజేయు ప్రేరణ శక్తి కలదై, తాను మాత్రము సాక్షిభూతమై, అసంగమై యుండునది.

ఆత్మ కల్పితము : 
➣ ఆప్నోతి, ఆదత్తే, అత్తి అనే మూడు ధాతువులచేత ఆత్మ శబ్దమును సాధకులకు తాత్కాలిక లక్ష్యమును ఏర్పరచుటకుగాను అనృత జడ దుఃఖానుభవములకు వ్యతిరేకార్థముగా సత్‌ చిత్‌ ఆనందమనే లక్షణము కల్పించబడినది.
➣ ఆప్నోతి అనగా విషయములను కల్పించుకొనుట. ఆదత్తే అనగా ఆ విషయములను గ్రహించుచుండుట. అత్తి అనగా ఆ విషయములను మనస్సు ద్వారా, సాక్షీభూతముగా అనుభవించుచుండుట. విషయము లున్నను, లేకున్నను, ఎప్పుడూ ఉనికిగా ఉండి, ఆ ఉనికి అనుభూతముగా నున్న చైతన్యమై యుండునది. అట్టి కేవల ఉనికిని సదా సహజముగా అనుభవించుచుండు చైతన్యము యొక్క అనుభూతియే సాపేక్షముగా ఆనందము. ఇట్లు వివరించినను, అది సత్‌చిత్‌ ఆనందమనే ఒకే ఒక్క లక్షణము కలది. అదే ఆత్మ అనబడును.
➣ ఆప్నోతి, ఆదత్తే, అత్తి గానున్న అజ్ఞానమే ఆవరణ. ఆవరణ తొలగినంతనే సాక్షీరూప ఆత్మ స్వానుభవమగును. అయినను ఈ అనుభవము తటస్థ లక్షణమే యగును. తత్త్వమసి వాక్యార్ధ్థముచేత స్వరూప లక్షణాత్మ కావలెను.
ప్రజ్ఞ :

ఎరిగే ఎరుక, తెలుసుకునే తెలివి. దేహేంద్రియములనన్నిటిని నిండుకొని యున్నట్టి అద్భుత శక్తి. ప్రజ్ఞయే ప్రాణుడు, పరమాత్మయే ప్రాణుడై ప్రజ్ఞా స్వరూపుడై గోచరించుచున్నాడు.

ప్రాణుడు :

దేహేంద్రియములన్నిటియందు వ్యాపించియుండి, వాటిలో చైతన్యమును నింపి, అనగా వాటిని చైతన్యవంతము చేసి వాటి మూలకముగా నానా వ్యాపారములను చేయించుచున్న సూక్ష్మమమైన శక్తినే ప్రాణుడు అందురు. ఆ ప్రాణుడే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానమనెడి ఐదు ప్రాణ వ్యాపారములకు కారణమై ఉన్నాడు. ఆ అయిదు పేర్లతో పిలువబడుచున్నాడు. ప్రాణుడనగా ముఖ్య ప్రాణుడు, జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, సూక్ష్ముడు, సర్వ వ్యాపకుడు, పిండాండమందు ప్రత్యగాత్మ. ఆ ప్రత్యగాత్మయే పరమాత్మ కూడా.

వ్యవహారమును బట్టి ఆత్మ నామములు:
1. వికారమగుటచేత నిర్వికారాత్మ శూన్యము.
2. ఉపాదానమగుట చేత ప్రకృతి
3. విక్షేప హేతువగుటచేత మాయ
4. బృహత్‌ రూపమగుట చేత బ్రహ్మ
5. విజ్ఞాన రూపమగుటచేత విజ్ఞానము
6. కళ్యాణగుణ శీలమగుట చేత శివము
7. పూర్ణ రూపమగుటచేత పురుషుడు.
8. నియామకుడగుచేత ఈశానుడు
9. శాస్త్ర ప్రకారము పండితులచే నిర్ణయమగుటచేత సత్యము.
10. సృష్టి క్రమమునుబట్టి, సాధనల దశలనుబట్టి ఈ సత్యమునకే ఆత్మ, ఋతము, పరము, బ్రహ్మము, సత్యము అని అనేక నామములను శిష్యులకు బోధించుట కొఱకు కల్పించిరి.
జీవోపాధులలో ప్రకటించబడిన చైతన్యము:
1.స్థావరములలో సంకుచిత చైతన్యము
2. ఉద్బిజములలో ముకుళిత చైతన్యము
3. అండజములలో, జరాయుజములలో వికసిత చైతన్యము
4. మానవులలో పూర్ణ వికసిత చైతన్యము
అందువలన మానవులు బుద్ధి జీవులై, బంధ మోక్షములు తెలిసి సాధనలచేత, ఉపాసనలచేత ఆత్మ జ్ఞాన సముపార్జనకు యోగ్యులుగా ఉన్నారు.

చేతన :
1. పశు పక్ష్యాదులలో నిమ్నచేతన ఉన్నది.
2. నరులలో బుద్ధి చేతన ఉన్నది.
3. దేవతలలో దివ్యచేతన ఉన్నది.
4. గురువులలో బ్రహ్మచేతన ఉన్నది.
5. సద్గురువులలో బుద్ధి చేతన, దివ్యచేతనలు ఏక కాలములో ఉండి, ఆ రెండింటి మధ్య సమన్వయమైన సహజత్వమున్నది.
  పశుపక్ష్యాదులు సుఖమును వేరుగా గుర్తించలేవు. దేవతలకు దుఃఖము తెలియదు. అందువలన పశుపక్ష్యాదులు గాని, దేవతలు గాని మోక్షమును కోరరు. బుద్ధిజీవులైన మానవులకు సుఖదుఃఖములు రెండూ తెలుసు. దుఃఖనివృత్తికిని, శాశ్వతానంద ప్రాప్తికి ప్రయత్నించవలెనని ఇచ్ఛా ప్రయత్నములు మానవులకే ఉండును. అందువలన మానవ జన్మ ఉత్కృష్టము.

చతురాత్మా :
1. వ్యష్టిలో : 1. నేను అనే అహంకారము 2. నాది అనే చిత్తము 3. అనుభవమునకు అవసరమైన జ్ఞానము. 4. అనుభవించే మనస్సు
2. సమష్టిలో : 1. ఇచ్చాశక్తి 2. దివ్యాహము లేక అనంతాహము. 3. మహత్తు అనే జ్ఞానశక్తి. 4. మాయ అనే క్రియాశక్తి
3. విశ్వములో: 1. జీవాత్మ 2. సూత్రాత్మ 3. ప్రత్యగాత్మ 4. పరమాత్మ

శ్లో దేహోదేవాలయోప్రాక్తో | జీవోదేవస్సనాతనః
త్యజేదజ్ఞాననైర్మల్యం | సో-హం భావేన పూజయేత్‌ ||

ప్రేమామృతం videos (ప్రేమ్ నాథ్ గుప్తా గారి అనుభవాలు)

 1. *ప్రేమామృతం*
https://youtu.be/kZLhmBXGTAg
2.*ప్రేమామృతం-Part-1*
https://youtu.be/7xocNFeCyA4
3.*ప్రేమామృతం-Part-2*
https://youtu.be/g7G1ZeoN3z8
4.*ప్రేమామృతం-Part-3*
https://youtu.be/bcrfmIGPwjc
5. *ప్రేమ్ నాథ్ గుప్తా గారి అనుభవాలు*
https://youtu.be/2aMRwyrnPQA
6. *కర్మ సిద్ధాంతం by ప్రేమ్ నాథ్ గుప్తా గారు*
https://youtu.be/YE7mimfcARY
7. *కర్మ సిద్ధాంతం by ప్రేమ్ నాథ్ గుప్తా గారు*
https://youtu.be/9nFrnUXRb1Q
8.*కర్మ సిద్ధాంతం by ప్రేమ్ నాథ్ గుప్తా గారు*
https://youtu.be/ATePVOqep4g
9.*కర్మ సిద్ధాంతం by ప్రేమ్ నాథ్ గుప్తా గారు*
https://youtu.be/KlZHwEKq_4Y
10.*కర్మ సిద్ధాంతం by ప్రేమ్ నాథ్ గుప్తా గారు*
https://youtu.be/QM1uOHBa6dk
11. *సాధనే తృప్తి*- *ప్రేమ్ నాథ్ గుప్తా గారు*
https://youtu.be/EyezYuz7tzg
12. *ప్రేమ్ నాథ్ గుప్తా గారు*
https://youtu.be/Wq0Y-vSQ5WA
13. *ప్రేమామృతం*
.https://youtu.be/Wq0Y-vSQ5WA
14.*ప్రేమామృతం*
https://youtu.be/zXiGAsDrdYE.
15.*ప్రేమామృతం*
https://youtu.be/3vpRbXkfos8
16.*ప్రేమామృతం*
https://youtu.be/8EvMGP-VYes
17.*ప్రేమామృతం*
https://youtu.be/xU4-kAsmc_s
18.*ప్రేమామృతం*
https://youtu.be/bDDsxBOHMXw
19.*ప్రేమామృతం*
https://youtu.be/C-nZfXi28Yg
20.*ప్రేమామృతం*
.https://youtu.be/9bRnjt_6mao
21.*ప్రేమామృతం*
https://youtu.be/uki4KQkR6tQ
22.*ప్రేమామృతం*
https://youtu.be/PIJWUFOfFAE
23.*ప్రేమామృతం*
https://youtu.be/Tzn8Vs9SrM4
24.*ప్రేమామృతం*
https://youtu.be/jVSsm4H_gik
25 *ప్రేమామృతం*
https://youtu.be/2gByt0anfvA
26. *వాకిన్స్*అంటే? ఎవరు)*
https://youtu.be/nXT4VV_NyXU
27.*self Acceptance*
https://youtu.be/Tzn8Vs9SrM4
28.*ప్రేమ్ నాథ్ గుప్తా గారు*
https://youtu.be/aWJWnO5rCcA
29. *ప్రేమ్ నాథ్ గుప్తా గారు*
https://youtu.be/TsSTMrpTtg4
30. *సోల్ జర్నీ ఆఫ్ ప్రేమ్ నాథ్ గుప్తా గారు*
https://youtu.be/96AdtnoRklA
31. *ప్రేమ్ నాథ్ గుప్తా గారి బ్రహ్మ జ్ఞాన పలుకులు*
https://youtu.be/EZAqcJz804U

*డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్, గాడ్స్దయ చేసి ప్రతీ రోజు ఒక వీడియో చొప్పున ధ్యానం* *చేసుకోండి.బాగా వినండి.ఆచరణ ఎంతో ముఖ్యం.,*
*సమయమే సాధన, సాధన యే తృప్తి*,
🧘‍♂️🌎🧘‍♀️
*Inner journey Team works*
 🪴🪴🪴🪴🪴🪴🪴🪴

*నరం లేని నాలికను., హద్దులేని కోపాన్ని.., ఉప్పొంగే కామాన్ని., ప్రేమను అదుపులో పెట్టడం నేర్చుకోవాలి స్నేహితులారా....*

*ఓర్పు, సహనం, నిదానము, సమయస్ఫూర్తి అన్న గుణములు ప్రతి ఒక్కరికి అవసరం.....*

*అనవసరమైన గుణాల నుండి బయటపడేందుకు మరియు అవసరమైన గుణాలను అవలంబించేందుకును ప్రతి ఒక్కరూ, ప్రతిరోజు క్రమం తప్పకుండా “ధ్యానం చేయాలి” స్నేహితులారా.....*

*“ధ్యాన సాధన” ద్వారానే మనకు ఏది అవసరం ఏది అనవసరము అని గ్రహించగలుగుతాం.., ఆచరణలో పెట్టగలుగుతాము....*

*ధ్యానం చేయండి.., మీ జీవితాన్ని మీరు సస్యశ్యామలం చేసుకోండి...,*
        _________________

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 ✳ 'నేను', 'నాది' అనే భావాలను పూర్తిగా తుడిచి పెట్టుకుంటూ ఉండడమే 
-  భక్తియోగం. 

✳ సంకల్ప, వికల్పాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ మనస్సుని శుద్ధి చేసుకోవడమే 
- కర్మయోగం.

✳ బుద్ధిని సునిశితం చేసుకుంటూ, అంటే నిత్యానిత్య విచక్షణాజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ పోవడమే 
- జ్ఞాన యోగం.

✳ చిత్తవృత్తులను నిరోధించుకుంటూ కావలసినప్పుడల్లా సమాధి ప్రజ్ఞను పొందడమే 
- రాజయోగం.

వారసత్వం

 *:::::::వారసత్వం::::::::::*
     1) వారసత్వంగా వచ్చే ఆస్తి పాస్తులు,అనగా ఇళ్ళు, భూములు,నగలు, డబ్బు ఆశించవచ్చు, తీసుకోవచ్చు.పంచుకోవచ్చు.
    2)వారసత్వంగా ఆస్తే కాదు అనారోగ్యం, జబ్బులు, మేనరిజమ్స్ (ప్రవర్తనకు సంబంధించినవి) కూడా వస్తవి . కాని వద్దు అనలేము. కాని వదిలించుకోవడం మంచిది.
      3) వారసత్వం వచ్చే పలుకుబడి, పేరుప్రతిష్టలను వాడుకోకండి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటారు. వీటిని సొంతంగా సంపాదించండి.
      4) వారసత్వంగా కాదుగాని పెంపకం మూలంగా అభిప్రాయాలు, నమ్మకాలు, సాంప్రదాయాలు, సంస్కృతి,మతం విశ్వాసాలు, మొదలగునవి అలవడతాయి. అన్నింటిని కొనసాగింపక శాస్త్రీయత హేతుబద్ధత వుంటే స్వీకరించండి.
     5) తాతగారి బాంభగారి భావాలకు బద్దలు కాకండి.పాతచింతకాయ పచ్చిడి అని మిమ్మల్ని నిరాకరిస్తారు జనం.
     6) వారసత్వంగా వచ్చిన దర్పాన్ని ప్రదర్శించకండి. ప్రజాస్వామ్యంలో వున్నాం మనం.
 7) బండ్ల ఓడలౌతాయ్,ఓడలు బండ్లవతాయి. వారసత్వం కొనసాగే అవకాశం లేదు
8) ధ్యానాన్ని వారసులకు తప్పక అందించండి.

      ఇట్లు
వారసుడు లేని వారసత్వం.

నేటి మంచి మాట.

నేటి మంచి మాట.

జీవితంలో మనం ఇంకొకరి దేగ్గర ఏదైనా తీసుకోవడం కన్నా ఇంకొకరికి ఏదైనా ఇవ్వడం లోనే ఎక్కువ సంతోషం ఉంటుంది .

మనకు ఉన్నదంతా పోయినా కూడా మనం ఇంకా ధనవంతులమే/అదృష్టవంతులమే ఎందుకంటే బంగారం లాంటి సమయం ఇంకా మన చేతుల్లో ఉంది.. దానిని సద్వినియోగం చేసుకుందాం

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండడు, తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది తలదించుకుని బతికినవాడిని ధైర్యంగా తల ఎత్తుకొని బతికేలా చేస్తుంది. నవ్వినవాడిని ఏడిపిస్తుంది ఏడ్చిన వాడిని నవ్వేల చేస్తుంది కాలం చేతులో అందరం కీలుబొమ్మలమే .

మనం దూరంగా నాటిన చెట్లు పెరిగేకొద్ది దేగ్గరౌవుతాయి, దగ్గరగా ఉన్న మనుషులు . పెరిగే కొద్ది దూరమౌవుతున్నారు .

మాయమైయే గౌరవాలు, మర్యాదలు, మంటకలిసిపాయే వావి వరుసలు. చెడ్డవారు పెరిగిపోయిరి, మంచి మనుషులు తగ్గిపోయిరి

నోరు లేకుండానే మనల్ని పలకరిస్తుంది డబ్బు , కళ్ళు లేకుండానే మనల్ని శాసిస్తుంది డబ్బు , చేతులు లేకుండానే ఆదేశం ఇస్తుంది డబ్బు , కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది డబ్బు , లేని బంధాలను కలిపేస్తుంది. డబ్బు , ఉన్న బంధాలను తుడిపేస్తుంది డబ్బు , మనసు లేని డబ్బు మనిషి చేసిన డబ్బు .మనిషినే ఆడిస్తుంది.. తనకు బానిసగా మార్చుకుంటుంది

శుభోదయం చెప్తూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

సేకరణ

ఒక్కసారి నీకు నువ్వు నచ్చడం మొదలుపెడితే .....

 ఈ ప్రపంచంలో సగం సమస్యలు మనకు మనం నచ్చకపోవడం వల్లనే వస్తాయి. వాళ్లు తక్కువగా చూశారనీ, వీళ్లు తక్కువగా చూశారనీ... లేదా లైఫ్‌లో ఏదీ సాధించలేకపోతున్నామనీ రకరకాల ఆలోచనలు చేస్తూ మనల్ని మనం గిల్టీ ఫీలింగ్‌కి గురి చేసుకుంటూ ఉండడం అతి పెద్ద తప్పు. నువ్వు ఎవ్వడికీ సంజాయిషీలు చెప్పుకోవాల్సిన పనిలేదు. నీ లైఫ్ నీది. అలాగే నువ్వు ఎవరికీ నచ్చాల్సిన పనిలేదు. నువ్వేం పెళ్లి చూపుల్లో కూర్చోవట్లేదు.. ఎవరో వచ్చి నిన్ను జడ్జ్ చెయ్యడానికి! ఫస్ట్ నిన్ను నువ్వు accept చేసుకో. నీలో ఇన్‌ఫీరియారిటీనీ, ఇన్‌సెక్యూరిటీని పెంచుతున్న థాట్స్‌ని అనలైజ్ చెయ్యి. ఏం చేస్తే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ వస్తుందో కాస్త శ్రద్ధపెట్టు.

ఒక్కసారి నీకు నువ్వు నచ్చడం మొదలుపెడితే నీ బాడీ లాంగ్వేజ్‌లో, నీ ఆలోచనల్లో, నీ మాటల్లో, నీ చూపుల్లో ఓ ప్రత్యేకమైన శక్తి వస్తుంది. దాన్ని నీ చుట్టూ ఉన్న ప్రతీ ఒక్కరూ అనుభూతి చెందుతారు. నిన్ను చులకనగా చూడాలంటే భయపడతారు, ముడుచుకుపోతారు.. నిన్ను గౌరవిస్తారు. సో జస్ట్ నీపై నీకు కాన్ఫిడెన్స్ పెంచుకుంటే చాలు.. నువ్వనుకుంటున్న నీ చుట్టూ ఉన్న పదిమంది నీ దగ్గర తోక జాడించడానికి భయపడతారు.

ఎప్పుడూ నీ లైఫ్ ఇంకోడి కంట్రోల్‌లో పెట్టకు. నువ్వు ఇంకోడిని చూసి ఎమోషనలైజ్ అవుతున్నావంటే నీ లైఫ్ వాడి కంట్రోల్‌లో ఉన్నట్లే. అవతలి వాడి కోపాన్నీ, అవతలి వాడు నీ పట్ల చూపించే ద్వేషాన్నీ లైట్‌ తీస్కొని నీ పని నువ్వు బుద్ధిగా చేసుకో.

వాడెవడో ఇమెచ్యూర్డ్ ఫెలో బిహేవియర్ కూడా నిన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తే.. ఇలాంటోళ్లు వందలమంది పుట్టుకొస్తారు. ప్రతోడీ దగ్గరా బాధపడుతూ ఎదగడం ఆపేస్తావా?

నిన్ను నువ్వు ఇష్టపడు. నీ దృష్టిలో నువ్వే ప్రపంచం. అందంగా తయారవ్వు.. బాగా డ్రెస్ చేసుకో... హుందాగా మాట్లాడు... ధైర్యంగా మాట్లాడు.. కాన్ఫిడెంట్‌గా ఉండు.. నిన్ను నువ్వు ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా ఫీలవ్వు.. నిన్ను టచ్ చెయ్యడానికి కూడా ఎవరూ సాహసించరు!!

సేకరణ .మీ రామిరెడ్డి మానస సరోవరం👏

భయం - భక్తి

 *భయం - భక్తి*

మనిషి బాగుపడాలంటే భయమైనా ఉండాలి. లేకుంటే భక్తి అయినా ఉండాలని పెద్దలమాట. ఈ రెండూ లేకపోతే మనిషి జీవితం తెగిన గాలిపటంలా ఎక్కడికి వెళ్తుందో తెలియదు. మనిషి స్వేచ్ఛాజీవి తనకు నచ్చిన రీతిలో బతకాలనుకొంటాడు అలా అనుకోవడం తప్పు కాదు. ఆ స్వేచ్ఛకూ కొన్ని హద్దులుంటాయి. తన స్వేచ్ఛ వల్ల ఇతరులకు కష్టనష్టాలు కలగకూడదు. ఎవరికి ఏ విధంగా ఇబ్బందిని కలిగించని స్వేచ్ఛ మనిషికి మంచి చేస్తుంది.

పూర్వకాలంలో రాక్షసులు ఘోరతపస్సులు చేసి, ఎవరూ పొందలేని అమోఘ వరాలను పొందారు. కానీ ఏమి లాభం? వారంతా తామసగుణాలతో దేవతలను, మునులను, సాధుజనులను కష్టపెట్టారు. వారి సంపదలను బలవంతంగా దోచుకున్నారు. ఇందుకు ఉదాహరణ హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవుణ్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఏండ్ల తరబడి తపస్సు చేసి ఎన్నో వరాలను పొందాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు- 'వీటిని బుద్ధిమంతుడవై చక్కగా వినియోగించుకో ఇతరులకు హాని తలపెట్టకు' అని హెచ్చరించాడు. 
కానీ వర గర్వంతో హిరణ్యకశిపుడు దేవతలను, మాన వాళిని ఎంతగా గురిచేశాడో భాగవతం వెల్లడిస్తుంది. అతన్ని అణచడానికి సాక్షాత్తు. మహావిష్ణువే నరసింహావతారాన్ని ఎత్తవలసి వచ్చింది .

ఇలాగే రావణ, శిశుపాలాదులు సైతం గర్వాంధుడై...చివరికి హతులయ్యారు. మనిషి భయానికి లొంగుతాడు. ఇతరులు తనపై దాడిచేసి చంపు తారనే అనుమానం వచ్చినప్పుడు భయంతో వణికిపోతాడు. లేదా దుశ్చర్యలకు పాల్పడితే పాపాలు.. వెంటాడతాయని నమ్మితే తగ్గుతాడు. ఈ భయం మనిషిని విశృంకలత నుండి కట్టడి చేస్తుంది. 
రెండోది భక్తి, తన ఇష్టదేవతలపైన భక్తి ఉన్నవాడు ఆ దేవతలపైన గల భక్తితో తన ప్రవర్తనను సన్మార్గంలో ఉంచుకోవడానికి యత్నిస్తాడు. వెచ్చలపై గౌరవం ఉన్న సందర్భాలలో వాళ్ళు చెప్పినట్లు వింటాడు.

మనిషి ఏది చేసినా తనకు, తన చుట్టూ ఉన్న సమాజానికి నష్టం కలగనంతవరకు ఎవరైనా సహిస్తారు. మనిషి సంఘజీవి. సంమాన్ని కాదని బతకలేడు. కనుక సాంఘిక నీతి సూత్రాలను మనిషి తప్పక పాటించవలసిందే. లోకానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం అంటే ఏటికి ఎదురీదడమే .హద్దులు దాటితే మునిగిపోక తప్పదు. మనిషి తన ప్రవర్తనతో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని భగవద్గీత చెబుతోంది. శ్రేష్టులు ఏది ఆచరిస్తారో సామాన్యజనులూ దానినే ఆచరిస్తారు కనుక మనిషి శ్రేష్ఠంగా ఆలోచించాలి. శ్రేష్ఠంగా ఆచరించాలి. ఇదే లోకనీతి.

కొందరు ధనగర్వంతో, అధికార గర్వంతో తాము ఎవరిమాటా వినవలసిన పనిలేదని భావిస్తుంటారు. తమకు తోచినదే నీతి అనీ, తాము చేసేదే న్యాయం అనీ వితండవాదం చేస్తుంటారు. ఇలాంటివారు సమాజద్రోహులే అవుతారు కానీ, ఆదర్శప్రాయులు కాలేరు. అధికారం వస్తుంది. పోతుంది. సంపదలు వస్తాయి. పోతాయి. ఏవీ శాశ్వతం కావు. మనిషి ప్రవర్తన ఒక్కటే శాశ్వతం, మంచి పనులు చేసి చరిత్రలో శాశ్వతకీర్తిని పొందాలో, చెడుపనులతో అపకీర్తిని మూటగట్టుకొని చరిత్రలో కనుమరుగైపోవాలో తేల్చుకోవలసింది మనిషి మాత్రమే!

- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ -
సేకరణ మీరామిరెడ్డి మానస సరోవరం👏

‘అల్లసాని పెద్దన’ గారి… ప్రవరాఖ్యుని కథ

 X7. X. 1-3.   281022-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
‘అల్లసాని పెద్దన’ గారి…

              ప్రవరాఖ్యుని కథ 
                  ➖➖➖✍️
శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర (శ్రీ మార్కండేయ పురాణము) లోని కథ


 అరుణాస్పదం అనే పట్టణములో ప్రవరుడనే బ్రాహ్మణోత్తముడుండే వాడు. అతడు గృహస్థాశ్రమ ధర్మాలను తప్పుకుండా అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు. అతనికి తీర్థయాత్రలంటే చాలా మక్కువ. కానీ దేవతార్చన మాతాపితసేవ అతిథి అభ్యాగతసేవ స్వాధ్యాయము అన్ని నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయటంతో ఎక్కడికీ వెళ్ళటానికి కుదిరేది కాదు. 

భార్యాపిల్లలను చూసుకోవడం, చెట్లను పశుపక్షాదులను పోషించడం ఆహ్నికాలు తీర్చుకోవడం ఇలా ఒకదాని తరువాత ఒకటి చేస్తూ ఉండటంతో పాపం ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకి వెళ్ళలేకపోయేవాడు. తీర్థయాత్రలు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి యాత్రా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు. 

 ఒక రోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతని దగ్గరకు వచ్చాడు. ఆ సిద్ధుడు అతి చిన్న వయస్సులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకోని ప్రవరడు “స్వామీ! కర్తవ్య పాలనమే సర్వతీర్థక్షేత్ర దర్శన ఫలదాయకం అని తిలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షముగా చూడాలన్నది నా కోరిక. కాని ప్రతిదినమూ కర్తవ్య నిర్వహణతోనే గడచిపోతున్నది. నేను తీర్థయాత్రలు చేసే ఉపాయము బోధించండి” అని ప్రార్థించాడు.

ప్రవరాఖ్యుని గృహస్థ ధర్మపాలనా దీక్షకు సంతోషించి ఆ సిద్ధుడిలా అన్నాడు… 

 “నాయనా ప్రవరా! మన శాస్త్రాలలో ఇటువంటి అవసరాలకోసమే కొన్ని సిద్ధులు శక్తులు సంపాదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి. అవి ఉపయోగించి సునాయాసముగా నీవు తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు, నీ కర్తవ్యాలనూ పాటించ వచ్చు. నా వద్ద ఒక పాద లేహ్యమున్నది (పసరు). దీనిని నీ పాదాలకు పూసుకొనిన నీవు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశము చేరగలవు”. 

 మహదానందముతో ఆ పసరును ఆ సిద్ధుని వద్దనుండి స్వీకరించాడు ప్రవరుడు.

 మరునాడు ప్రవరుడు ఇంటనున్న తల్లిదండ్రులను సేవించి తన నిత్య అనుష్ఠానాలు పూర్తి చేసుకుని అందఱి అవసరాలు తీర్చి, కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాగతసేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకొని హిమాలయ పర్వతాల లోని పవిత్ర క్షేత్రాలు సుందర తీర్థ ప్రదేశాలు చూడాలని బయలుదేరాడు. 

ఆ హిమాలయాల పర్వతాల సొగసును వర్ణించడం ఆ బ్రహ్మకైనా తరమా! కోండల కోనలనుండి ప్రవహించే సెలయేళ్ళు నదుల,సరోవరాల అలల చప్పుళ్ళు, పింఛాలు విప్పి ఆధ్వనులకు ఆనంద నర్తనం చేసే నెమళ్ళు అన్ని ఆశ్చర్యముగా చూడసాగాడు ప్రవరుడు. 

 ఇలా ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్దామనుకున్న ప్రవరుడు ఊరుచేరాలని సంకల్పించుకున్నాడు. కానీ కదలలేక పోయాడు! మంచునీటిలో పాదలేపనం కరిగి పోయిన వైనం తెలుసుకున్నాడు. మొదలు నరికిన వృక్షమైపోయాడు.           “ఓ భగవంతుడా! ఇది ఎక్కడి కర్మపాశం! ఎక్కడ అరుణాస్పదం? ఎక్కడ హిమాలయ పర్వతాలు? ఆలోచనా రహితముగా రావచ్చునా? ఎంత తెలివిమాలిన పని చేశాను”! నిమిషము కనిపించక పోయినా చింతించే తల్లిదండ్రులను అనుకూలవతీ సాధ్వి అయిన అర్థాంగినీ తలుచుకుని బాధపడ్డాడు. 

 “ఆడుతూపాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియ శిష్యులు ఎంత విచారిస్తారో? అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతాయో? అగ్నిహోత్రాలు నిత్యానుష్ఠానాలు చేయలేని  ఈ దుస్థితి ఎవఱికీ రాకూడదు” అని పరిపరి విధాల వగచాడు ప్రవరుడు. 

 ఇంతలో వరూధినీ అనే గంధర్వ కన్య ప్రవరాఖ్యుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది. అనుష్ఠానాలు చేయలేక పోతానేమో అన్న దుఃఖం ఒక వైపు వరూధినీ శృంగారచేష్టలు ఒకవైపు. ఇంతలో సూర్యుడు అస్తమిస్తాడని తెలిసి సంధ్యవార్చని జీవితం వ్యర్థం అనిపించింది ప్రవరుడికి. “ఇన్నాళ్ళూ నేను చేసిన అనుష్ఠానము ఆగిపోతుందా”? అని అనుకుని భ్రాంతిచెందాడు. 

 ఇంతలో దుఃఖము వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠానాలు చేయాలనే దృఢ సంకల్పముతో అగ్నిదేవుని మనసులో తలచి “నేనే కనక నిత్యానుష్ఠాన తత్పరుడనైతే కర్తవ్య పాలనా దక్షుడనైతే ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక”! అని అనుకున్న మఱుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు. 
కర్మసాక్షి అయిన ఆ భగవంతునికి నమస్కరించి అనుష్ఠానాలు చేసుకుని ఇంటిల్ల పాదిని ఆనందపఱచాడు ప్రవరుడు. 

 ఈ కథలోని నీతులను చూద్దాం.... 

 నిత్యకర్మలను కర్తవ్యాలను మనసా వాచా కర్మణా ఆచరించిన ప్రవరుని రక్షించి అతని నిష్ఠకు అంతరాయం కలుగకుండా కాపాడినాడు భగవంతుడు. ధర్మో రక్షతి రక్షితః అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనముంటుందా? 

 గృహస్థ ధర్మాలేమిటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించినాడు. దేవతార్చన మాతాపితసేవ మానవసేవ (అతిథిసేవ) పశుపక్షాదులను వృక్షములను కాపాడటం స్వాధ్యాయము (శాస్త్ర పురాణ పఠనం) విడువకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించడం ముఖ్య కర్తవ్యాలని చూపినాడు. 

 ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం. సౌందర్యవతి అయిన వరూధినీ ప్రలోభాలను పట్టించుకోకుండా కార్యోన్ముఖుడైన ప్రవరుడు మనకు మార్గదర్శి. ✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

బృహద్రథుడు

 i.xi. 1-6.3️⃣. 281022-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                బృహద్రథుడు
                  ➖➖➖✍️

పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాకపక్షి ఉండేది.

అది ప్రతిరోజూ ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశ మార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరేది.

అంత దూరం ప్రయాణించి మిట్టమధ్యాహ్న సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తుండేది.

ఆ ఆకలి తీర్చుకోవటం కోసం అన్నపూర్ణాదేవి_మందిరం_చుట్టూ_పడిఉన్న_మెతుకులను_ఏరుకొని_తింటూ_పొట్ట_నింపుకొనేది.

ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి_చుట్టూ_ప్రదక్షిణ చేసేది.

 అలా చాలాకాలం గడిచింది.

కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది.

ఇతర పక్షులలాగా మరణానంతరం కూడా నరకయాతనలేవీ పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది.

రెండు కల్పాలపాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది.

ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగశిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది.

పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అని పేరు పెట్టారు

పెరిగి పెద్దయిన రాకుమారుడికి పెద్ద రాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు.

బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది.

భూత, భవిష్యత్తు, వర్తమానాలు ఆయన కళ్లెదుట ఎప్పుడూ కనిపిస్తుండేవి.

బృహద్రథుడు ప్రజారంజకమైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకొన్నాడు.

యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలందుకున్నాడు.

వీటన్నిటితోపాటు బృహద్రథుడికి పూర్వజన్మ_జ్ఞాపకాలు_ఉండేవి.

అతడి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి లాంటివి ఆనాడు ఆనోటా ఆనోటా ప్రజల అందరికీ చేరాయి.

గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటిశక్తి ఆయనకు ఎలా కలిగిందో తెల్సుకోవాలని ఉత్సాహపడుతుండేవారు.

అలాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒక రోజు రాజు దగ్గరకు బయలుదేరారు.

మునులందరి రాకను గమనించిన బృహద్రథుడు తాను రాజునన్న అహంకారభావాన్ని కొంచమైనా మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్లి నమస్కరించి, పూజించి, అతిథి సత్కారాలను చేసి, ఉచితాసనాలను సమర్పించి సత్కరించాడు.

యోగక్షేమపరామర్శలు అయ్యాక మునులు బృహద్రథుడికి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు.

ప్రదక్షిణ_ఫలితమే!

అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా... ‘అందులో పెద్ద రహస్యమేమీ లేదని, తాను ఆ శక్తుల సాధనకోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞయాగాలు, క్రతువులు కూడా ఏవీ లేవన్నాడు.

ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలిగింది.

వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహద్రథుడు మళ్లీ చెప్పసాగాడు...

 గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని ఆహారాన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేశానని చెప్పాడు.

ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చి పెట్టి రెండు కల్పాలపాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజయోగాన్ని కూడా కలగజేసిందన్నాడు.

తనకు లభించిన శక్తులు, భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణల ఫలితమేనని, జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మాహాత్మ్యం ఉందని బృహద్రథుడు చెప్పాడు.

కాశీ_అన్నపూర్ణావిశ్వేశ్వర_స్వామి_ఆలయ_దర్శనం!

ప్రదక్షిణ_నమస్కారాలు_ఎంతో_విలువైనవి. కాశి నగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ సూచిస్తుంది.

కాశీ వెళ్లినప్పుడు తప్పకుండా విశ్వనాథ_అన్నపూర్ణ_మందిర_ప్రదక్షిణం_చేయండి.

కాశీ మహానగరం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. కాశీలో మరణించిన కుక్క కూడా స్వర్గానికే వెళుతుందన్నది నమ్మకం.

 కాశీ మహానగరంలో ఉండే అన్నపూర్ణమ్మ తల్లి, విశ్వేశ్వరుడు నమ్మిన భక్తులకు కొంగుబంగారం లాంటివారు.✍️

                     🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀