Thursday, December 29, 2022

అసలు జీవిత పరమార్థం ఏమిటీ

 🌺అసలు జీవిత పరమార్థం ఏమిటీ🌺

🌻🏵️🌻🏵️🌻🏵️🌻🏵️🌻

నిన్ను నీవు తెలుసుకుంటే దేవుని తెలుసుకున్నట్లే!
దేవుడెక్కడ, దేవుడెక్కడ అని ప్రాకులాడటానికి ప్రయత్నించనక్కరలేదు...

నిన్ను నీవు తెలుసుకుంటే దేవుని తెలుసుకున్నట్టే! నిన్ను నీవు తెలుసుకొనకుండా దేవుడెక్కడ నీకు కనిపిస్తాడు, కనుక, దేవుని తెలుసుకోటానికి ప్రయత్నించేవారు మొట్టమొదట తమను తాము తెలుసుకోవాలి. 
నేనెవరు ఈ తత్త్వాన్నే ప్రాచీన మహర్షులందరు విచారణ సలుపుతూ వచ్చారు...

ఒకనాడు వృద్ధుడైన సోక్రటీసు ఒక బీచ్ లోపల నడుస్తున్నాడు. తన తత్త్వాన్ని తాను విచారించుకుంటూ "నేనెవరు, నేనెవరు, అనుకుంటూ పోతున్నాడు. అతడు మహాతత్వజ్ఞాని, అదే సమయంలో ఇంకొక రిటైర్డు వ్యక్తి అదే తీరం లోపల నడుచుకుంటూ వస్తున్నాడు. అతను యేదో యోచన చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సోక్రటీసు కూడను యోచన చేసుకుంటూ వస్తున్నాడు. ఒకరిని ఒకరు చూచుకోలేదు, వచ్చి ఒక్కతూరి యిద్దరు ఒకరినొకరు ఢీ కొట్టుకున్నారు. 
ఆ ఎదుటి వ్యక్తి ఎవరు మీరు అన్నాడు.
'అదే నేను తెలుసుకోవాలని కోరుతున్నాను, నేనెవరో చెప్పండి' అన్నాడు...

మహనీయులయొక్క తలంపులు ఈ విధముగా వుంటాయి. మనము 'నేను ఎవరు', అంటే ఇదే నేను అంటూ యింకా డిగ్రీలు బిరుదులను పెట్టుకుంటూ పోతుంటాము. ఈ డిగ్రీలతో బిరుదులతో మనకు యేమాత్రము ప్రయోజనము లేదు. ఏవో కొన్ని కొన్ని బిరుదులంతా తీసుకొని వాటిని ఒక డిగ్రీలుగా పెట్టుకుంటాము. కొన్ని డిప్లమోలు తీసుకుని దాన్నికూడ డిగ్రీలుగా పెట్టుకుంటాము. వీటి వలన ఏదో పదవులు ఉద్యోగాలో లభిస్తాయని మనము భ్రాంతి పడుతున్నాము. కాని, నిజమైన డిగ్రీ నీ చిత్తశుద్ధియే! అది పవిత్రమైనది... అదే జీవిత పరమార్థం..

మనం నిత్యజీవితంలో 

దేహమున్నది సేవించుట కొరకే! ధనమున్నది దానము చేయుట కొరకే! 
కానీ నేడు పరిస్థితి తారుమారైంది...
'దేహమున్నది భుజించుట కొరకే, ధనమున్నది బోగములను అనుభవించు కొరకే !' అనేలా ఉంది లోకం! 

కూరలో తగినంత ఉప్పు ఉన్నపుడే రుచిగా ఉంటుంది... ఉప్పు ఎక్కువైపోయినచో రుచి చెడిపోతుంది, కూరను తినలేము కూడా...
అలానే ఈ దేహములో శక్తి ఉన్నంత వరకూ సేవలు చేస్తుండాలి. 
ధనము అవసరము మేరకే తమకు ఉపయోగించుకోవాలి...
మిగిలినది దానధర్మాలకు, సేవలకు వినియోగించుకోవాలి. 
భగవంతుడు ఇచ్చిన సకలమూ తిరిగి భగవంతునికే  అర్పించాలి, ఇందులో స్వార్థం,సంకుచిత్వం పనికిరాదు.
దానధర్మాలు చేయడం వలన తామేమీ బిక్షకులు అయిపోరు! 
భగవంతుని ఖజానా బాగా నిండుకుని ఉంది.... ఎవరు ఎంత ఎక్కువ సేవలు చేస్తే అంతకు పది రెట్లు వారి ఖజానా నుండి నిండుతుంది. 
పరోపకార నిమిత్తం శ్రమించే వారి బాగోగులు స్వయంగా భగవంతుడే చూసుకుంటాడు. 
భయం, ఆందోళన అనవసరం, 
భగవంతుని వాక్యములు నమ్మి ఆయన చూపిన మార్గంలో నడచుకోవడమే మనం చేయవలసి పని...
అదే జీవిత పరమార్థం🙏

సర్వేజనాసుఖినోభవంతు.

No comments:

Post a Comment